Gunde Ninda Gudi Gantalu June 6th : బాలు కోసం మీనా ఫైట్.. అదే కొంప ముంచింది

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూన్ 5వ తేదీ 438వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు, మీనాలు తమకు వచ్చిన పూల దండల ఆర్డర్ ను సకాలంలో అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఏమాత్రం ఆర్డర్ డెలివరీలో ఆలస్యం జరగకుండా చూస్తున్నారు. అందుకోసం రాత్రంతా పూల దండలను కడుతూనే ఉంటారు. ఇక మీనా, బాలుకు పెద్ద ఆర్డర్ రావడంతో అటు కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తూ ఉంటారు. తమకు తోచిన కాడికి సాయం చేస్తూ.. చేతోడుగా ఉంటారు. శృతి కూడా తనకు పూల దండలు అల్లడం రాకపోయినా మీనా దగ్గర నేర్చుకొని మరీ దండలు అళ్లెందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు బస్తీ వాళ్లు కూడా వేగంగానే దండలు అళ్లుతూ ఉంటారు.

అందరూ పని చేస్తూ ఉంటే సత్యం కబుర్లు చెబుతూ అందరిలో జోష్ నింపుతూ ఉంటారు. ఇక బాలు కూడా పూల దండలు అళ్లుతున్న మహిళలకు కావాల్సిన ఏర్పాట్లు చూస్తూ ఉంటాడు. రవి వాళ్లందరికీ వంటలు చేయడానికి సిద్ధం అవుతాడు. మనోజ్ కూడా బయటికి వెళ్లి రాత్రి భోజనానికి కావాల్సిన సరుకులను తానే స్వయం తెచ్చి ఇస్తాడు. ఇక ప్రభావతి కూడా మాటకోసారి దెప్పి పొడుస్తూ ఉన్న ఇష్టం లేకున్నా తను కూడా అందరికీ టీ కాఫీలు అందిస్తూ ఉంటుంది. ఇలా తమకు వచ్చిన పెద్ద ఆర్డర్ ను పూర్తి చేస్తూ ఉంటారు. మరోవైపు ఈ ఆర్డర్ గురించి ఫైనాన్షియర్ గుణకు తెలుస్తుంది. ఎలాగైనా చెడగొట్టాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అక్కడ ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 6వ తేదీ 439 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.?

Gunde Ninda Gudi Gantalu serial episode 439 June 6th

మీనా, బాలు ఇంట్లో దండలు అల్లే పనిలో బిజీ అయిపోయారు. అందరూ నవ్వుతూ ఇల్లంతా సందడిగా ఉండటంతో సత్యం చాలా ఆనందం వ్యక్తం చేస్తాడు. ఈ సమయంలో తన కూతురు మౌనికా కూడా ఉంటే చాలా బాగుండేదని అంటాడు. మౌనికా ఎలా ఉందో ఏంటో అని కూతురును తలుచుకుంటూ ఎమోషనల్ అవుతాడు. వెంటనే ప్రభావతి స్పందిస్తూ మౌనికా అక్కడ బాగానే ఉండి ఉంటుంది. తనను ఆ ఇంట్లో బాగానే చూసుకుంటారు. మీరేం దిగులు పడకండి. పైగా ఇప్పుడు మౌనికాకు బిజినెస్ అకౌంట్స్ కూడా చూడమని బాధ్యతలు చెప్పారంట. దీంతో ఇంక మౌనికాకు తీరిక ఎక్కడ ఉంటుంది చెప్పండి అని సత్యంకు బదులు చెప్పే ప్రయత్నం చేస్తుంది. దాంతో సత్యం కూడా అంతేలే అని అనుకుంటాడు. ఇక బాలు తన తండ్రి మౌనికా కోసం తపనపడటం చూసి వెంటనే కాల్ చేసి ఇస్తున్నానని చెబుతాడు.

ఇక బాలు తన తండ్రిని సంతోషంగా చూసేందుకు వెంటనే మౌనికాకు కాల్ చేస్తాడు. మౌనికా ఫోన్ లిప్ట్ చేయగానే బాలు చాలా స్పీడ్ గా మాట్లాడేస్తాడు. ఏం మౌనికా మేం నీకు ఏమీకానీ వాళ్లం అయిపోయామా? నీ గురించి మాకు అంతా తెలిసిపోయిందిలే అని అంటాడు. దీంతో మౌనికా కంగారు పడుతుంది. తన వదిన మీనా బాలు అన్నకు గుడిలో కలిసి విషయం చెప్పి ఉంటుందా? అని అనుకుంటూ ఉంటుంది. నా గురించి ఏం తెలిసింది అన్నయ్య అని బాలును అడగటంతో మీనాను నువ్వు గుడిలో కలిశావంట కదా? అమ్మా నాన్నలను, మా అందరినీ చూడాలని ఉందని చెప్పావంట కదా అని అడుగుతుంది. నాకు తెలుసు అమ్మా నువ్వేక్కడ ఉన్న నీ మనస్సు మాత్రం మా దగ్గరే ఉంటుంది. ఇంట్లో వాళ్లందరూ నీతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నారు. వాళ్లతో మాట్లాడు అని ముందుగా సత్యంకు బాలు ఫోన్ ఇస్తాడు.

సత్యం మాట్లాడుతూ మౌనికా బాగున్నావా? అని అడుగుతాడు. ఇక్కడ అందరూ ఉన్నారు. నువ్వు కూడా ఉంటే మంచిగా ఉండేదని అంటాడు. కానీ వీలు పడటం లేదని మౌనికా చెబుతుంది. సరేలే అని అంటాడు సత్యం. ఇక సత్యం మాట్లాడిన తర్వాత ఫోన్ ను ప్రభావతికి ఇస్తాడు. ప్రభావతి తన కూతురుతో మాట్లాడి సంతోషం వ్యక్తం చేస్తుంది. ఆ తర్వాత వెంటనే రవి కూడా మాట్లాడుతాడు. దీంతో తన పుట్టింటి వాళ్లు అందరూ తనతో మాట్లాడంతో మౌనికా సంతోష పడుతుంది. ఇక మళ్లీ అందరూ పూలు అల్లే పనిలో నిమగ్నం అవుతారు. ఇక రవి తను ప్రత్యేకంగా వండిన కిచిడిని తీసుకొచ్చి అందరి ముందు పెడుతాడు. అందరం భోజనం చేద్దామని అంటాడు. అందరికీ ప్లేట్ లో కిచిడి వడ్డించి సర్వ్ చేస్తాడు. అయితే మనోజ్, రోహిణి మాత్రం మాకు వద్దని అంటారు.

మేం ఆర్డర్ పెట్టుకుంటామని, మాకు కిచిడి నచ్చదని చెబుతారు. పర్లేదు అన్నయ్య బాగుంటుంది ఒక్కసారి తిను చూడమని మనోజ్ ను రవి అడిగినా వద్దని చెబుతాడు. దాంతో వాళ్లని వదలిసి ఇంట్లో వాళ్లందరూ, బస్తీ మహిళలకు వడ్డిస్తాడు. అందరూ కడుపు నిండా భోజనం చేస్తారు. మనోజ్ రోహిణిలకు ఇంకా ఆర్డర్ రాకపోవడంతో ఆకలితో బిక్కు బిక్కుమని చూస్తారు. ఇక చేసేదేమీ లేక కిచిడి తిందామని మనోజ్ కిచెన్ లోకి వెళ్తాడు. వాసన అదిరిపోయిందని, ఇంక రుచి ఎలా ఉంటుందో చూడాలని ప్లేట్ లో కిచిడి పెట్టుకుంటాడు. ఇంకా తినడం మొదలు పెడుతాడు. చాలా బాగుందని ఇష్టంగా తింటాడు. ఇదే సమయంలో రోహిణి కూడా ఆకలి బాగా వేస్తుందని వచ్చి కిచెన్ లోనే తింటుంది. వీరిద్దరూ కిచెన్ లో దొంగచాటుగా తినడాన్ని బాలు చూస్తాడు. ఓ లుక్కేసి వెళ్లిపోతాడు.

కిచిడి బాగుండటంతో అందరూ రవిని పొగుడుతారు. త్వరలో మంచి రెస్టారెంట్ ను ప్రారంభించు అని సలహానిచ్చారు. ఇదే క్రమంలో మీనా వాళ్ల చెల్లి సుమతి రవికి షేక్ హ్యాండ్ ఇచ్చి కిచిడి రుచి అదిరిపోయిందని చెబుతుంది. దాంతో ప్రభావతికి మండుతుంది. శృతిని పక్కకి తీసుకెళ్లి ఆ సుమతి రవితో క్లోజ్ గా ఉంటుందని చెబుతుంది. సుమతిని తిట్టించాలని అనుకుంటుంది. కానీ శృతి హాలులోకి వచ్చి ప్రభావతి పరువునే తీస్తుంది. అత్తమ్మను రవి, సుమతి మాట్లాడుకోవడం తప్పుగా కనిపించిందంట అని అందరి ముందు చెప్పి పరువు తీస్తుంది. ఈరోజుల్లో అమ్మాయి అబ్బాయి మాట్లాడటం సహజమని బుద్ధి చెబుతుంది. ఇక సత్యం ప్రభావతిని ఇంట్లోకి తీసుకెళ్లి క్లాస్ పీకుతాడు. ఇదిలా ఉంటే మరోవైపు గుణకు శివ ద్వారా తన అక్క మీనాకు 500 పూల దండల ఆర్డర్ వచ్చిందని తెలుస్తుంది. దీంతో ఎలాగైనా ఆ దండలు కార్యక్రమానికి అందకుండా మనవాళ్లను పంపించి అడుకోమని చెబుతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X