Gunde Ninda Gudi Gantalu June 16th : కన్నెర్రజేసిన ప్రభావతి.. రోహిణి బతుకు బస్టాండ్ పాలు
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూన్ 13వ తేదీ 444వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలుకు తెలియకుండా కారు కొనివ్వడానికి మీనా చాలా ప్రయత్నం చేస్తుంటుంది. డబ్బులు అరెంజ్ కావడంతో వెంటనే వెళ్లి కారు కన్సల్టెన్సీ లోనూ కట్టేస్తుంది. ఒకసారి బాలును కూడా తీసుకొచ్చి కారును చూపించమని రాజేష్ ను మీనా సాయం కోరుతుంది. ఇక ప్రభావతి మీనాపై బుసలు కొడుతుంది. ఎందుకు అప్పు తీసుకుందని, ఎలాగైనా తెలుసుకోవాలని అనుకుంటుంది. మీనా తిరిగి ఇంటికి రాగానే అందరినీ పిలిచి నిలదీస్తుంది. మీనా పెద్ద తప్పు చేసిందనేంతలా నానా రచ్చ చేస్తుంది. అసలు అప్పు చేసిన డబ్బుతో ఏం చేశావని నిలదీస్తుంది. అందుకు మీనా నేను ఇప్పుడే సమాధానం చెప్పలేనని, మున్ముందు మీకే తెలుస్తుందని అంటుంది.
ఇదిలా ఉంటే.. ప్రభావతి మీనాను నిలదీస్తున్న సమయంలోనే మనోజ్, రోహిణిలు ఇంటికి తిరిగి వస్తారు. వచ్చి రాగానే శుభవార్త అంటూ హంగామా చేస్తాడు. రోహిణి తన పార్లర్ కు అమ్మ ప్రభావతి పేరును తీసివేసిందని, పార్లర్ ను పెద్ద కంపెనీతో కలిపిందని చెబుతాడు. ఇప్పుడు పార్లర్ పేరు మారింది గానీ.. ఇకపై నుంచి బోలెడన్నీ డబ్బులు వస్తాయని సంతోష పడుతూ ప్రభావతికి చెబుతాడు. దాంతో ప్రభావతి షాక్ అవుతుంది. కానీ మీనా ఎదురుగానే ఉండటంతో రోహిణి ఏమనకుండా మౌనంగా ఉంటుంది. నువ్వు ఏం చేసినా ఆలోచించే చేస్తావని చెప్పి తన గదిలోకి వెళ్తుంది. ఈ క్రమంలో తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 16వ తేదీ 445 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.?

రోహిణి పార్లర్ కు ప్రభావతి పేరును తీసేయడంతో అంతా షాక్ అవుతారు. ప్రభావతి కూడా చాలా షాక్ అవుతుంది. కానీ హాలులోనే మనోజ్ ఈ విషయాన్ని చెప్పడంతో కంగు తింటుంది. ఇక మీనాపై నిప్పులు చెరగటం మానేసి తన గదిలోకి వెళ్తుంది. రోహిణిని తన గదిలోకి రమ్మని చెబుతుంది. మీనా ప్రభావతి తీరుకు మండిపడుతుంది. రోహిణి అంత పెద్ద తప్పు చేసినా పల్లెత్తు మాట అనడం లేదని, మనల్ని అయితే నానా రచ్చ చేస్తుందని బాలుతో మీనా అంటుంది. అందుకు బాలు స్పందిస్తూ నీకు మా అమ్మ ప్రభావతి గురించి సరిగా తెలియదు. తుఫాన్ వచ్చే ముందు ఇలానే ఉంటుంది అని బదులిస్తాడు. ఇక సత్యంతో బాలు కోపం చేస్తాడు. రోహిణి బ్యూటీ పార్లర్ గుట్టును ఎప్పుడో బయట పెడుదాం నాన్న అంటే వినలేదు. ఇప్పుడు చూడు ఎంత తెలివిగా తప్పించుకుందో అని బాలు తండ్రి సత్యంతో అంటాడు. మనం చెప్పందే మంచి జరిగింది. ఎలాంటి గొడవలు కాలేదు అని బాలుకు సమాధానం చెబుతుడు. ఇక బాలు కూడా సరేలే అని మౌనంగా ఉంటాడు.
ఇక ప్రభావతి కోపంతో ఊగిపొతూ ఉంటుంది. పార్లర్ కు పేరు తీసేసి ఇంతవరకు తనకు చెప్పకపోవడంతో కోపం కట్టలు తెంచుకుంటుంది. రోహిణి కూడా భయపడుకుంటూనే ప్రభావతి దగ్గరికి వస్తుంది. రోహిణి రాగానే ప్రభావతి నిపులు కక్కుతుంది. నీ వల్ల నా పరువు మొత్తం పోయింది అని మండిపడుతుంది. పార్లర్ కు పేరు మార్చడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారే.. నా పేరు మీద పార్లర్ ఉందని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు పార్లర్ కు నీ పేరు తీసేశారని తెలిస్తే నా పరువు ఏమైపోతుంది. వాళ్లందరికీ నేను ఏం సమాధానం చెప్పాలి. అసలు నువ్వు నా చెప్పకుండానే ఎందుకు పార్లర్ పేరు మార్చేశావు అని ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. నీకోసం నేను ఈ ఇంట్లో ఎంత అండగా నిలుస్తున్నానో నీకు తెలుస్తుందా? నేను లేకుండా నువ్వు ఈ ఇంట్లో నిలవగలవా? అని ప్రశ్నిస్తుంది. నువ్వు బాగుండాలని నా ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి మరీ నీకు పార్లర్ పెట్టించాను. కానీ నువ్వు నీ పార్లర్ లో జుట్టు కత్తిరించి బయట పడేసినంత ఈజీగా పేరును తీసేసి పడేశావని ఫైర్ అవుతుంది.
పార్లర్ కోసం తాకట్టు పెట్టిన డబ్బులను మా మలేషియా నాన్న దగ్గర అడిగి ఇచ్చాను కదా అత్తయ్య అని రోహిణి బదులిస్తుంది. దీంతో ప్రభావతి మరింతగా మండిపడుతుంది. రోహిణి గొంతు పట్టుకొని తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. అసలు మీ నాన్నను ఒక్కసారైనా చూపించావా? నువ్వు ఏం చేసినా నమ్ముతానని అనుకుంటున్నావా, వెర్రి దానిలా కనిపిస్తున్నానా అని ఫైర్ అవుతుంది. నీకోసం ఎంతో తాపత్రాయ పడినా నువ్వు మాత్రం అందరి ముందు నా పరువు తీశావు. బాలు నన్ను నిందితురాలిగా బోనులో నిలబెట్టాడు. మీనానేమో పూలకొట్టుకు నా పేరే ఉంచుతానని చెబుతోంది. నువ్వేమో నాకు తెలియకుండానే పార్లర్ పేరు మార్చేశావు అని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇక మళ్లీ ఇలాంటి పని చేయనని రోహిణి బ్రతిమిలాడటంతో ప్రభావతి వదిలేస్తుంది.ఇదొక్కటేనా ఇంకా ఏదైనా నిజం దాచావా? అని ప్రభావతి రోహిణిని అడుగుతుంది.
అందుకు రోహిణి ఇంకేమీ దాచలేదని చెబుతుంది. ఇక వెంటనే కిందికి వెళిపోతుంది. కేవలం పార్లర్ కు పేరు తీసేసినందుకే ఇంతలా రచ్చ చేస్తుందంటే.. ఇక తనకు ఇదివరకే పెళ్లైందని తెలిస్తే, ఒక కొడుకు కూడా ఉన్నాడని తెలిస్తే తాండవం ఆడేస్తుందని జంకుతుంది. ఇకపై ప్రభావతితో చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటుంది. మరోవైపు మీనా బాలు కోసం కారును తీసుకుంది. బాలుకు సర్ ప్రైజ్ ఇవ్వడానికి గుడికి వెళ్దామని చెబుతుంది. అంతకంటే ముందే కారు కన్సల్జెన్సీలో తనకోసమని తెలియకుండా కారును చూపించే ఏర్పాట్లు చేస్తుంది. బాలుకూ నచ్చిందని తెలిసిన తర్వాత గుడికి తీసుకెళ్లి సర్ ప్రైజ్ ఇస్తుంది. అయ్యగారుతో పూజ చేయించి కారు తాళాలు చేతిలో పెట్టే వరకు ఆ కారు బాలుదే అనే విషయాన్ని చెప్పదు. ఎట్టకేళలకు బాలుకు మీనా సర్ ప్రైజ్ ఇస్తుంది. ఇంత డబ్బు ఎలా కట్టావని మీనాను బాలు అడుగుతాడు. మాలలు కట్టిన ఆర్డర్ మీరు ఇప్పించిందే కాబట్టి ఆ డబ్బులను కూడా మీకోసమే ఖర్చు పెట్టాను అని చెబుతుంది. దాంతో బాలు మౌనంగా ఉండిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











