Gunde Ninda Gudi Gantalu June 17th : మీనాపై కుల్లుకున్న ప్రభావతి.. పట్టలేని ఆనందంలో మునిగితేలుతున్న బాలు
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూన్ 16వ తేదీ 445వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ప్రభావతి పేరును రోహిణి పార్లర్ కు తీసేయడంతో షాక్ అవుతుంది. అందరి మందు మౌనంగా ఉన్నప్పటికీ తన గదిలోపలికి పిలిచి దుమ్ములేపుతుంది. పార్లర్ కు పేరు మార్చడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారే.. నా పేరు మీద పార్లర్ ఉందని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు నా పరువు ఏమైపోతుంది. వాళ్లందరికీ ఏం సమాధానం చెప్పాలని మండి పడుతుంది. నీకోసం నేను ఈ ఇంట్లో ఎంత అండగా ఉంటున్నా నువ్వు ఇలాంటి పని చేస్తావా అని ఫైర్ అవుతుంది. ఇంకేదో రోహిణి బదులివ్వబోతుంటే గొంతు కూడా నొక్కుతుంది. ఇప్పటి నుంచి ఏదైనా నిజం దాస్తే మాత్రం అస్సలు ఊరుకోనని హెచ్చరిస్తుంది.
మరోవైపు మీనా పూల దండలు అల్లడంతో వచ్చిన డబ్బులతో బాలు కోసం కారును తీసుకుంటుంది. తన భర్త బాలుకు సర్ ప్రైజ్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. త్వరగా అతన్ని రెడీ అవ్వమని చెప్పి గుడికి వెళ్దామని చెబుతుంది. బాలుకు నచ్చిన కారును సర్ ప్రైజ్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాటు చేసి గుడి దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడి రాజేష్ కారును తీసుకొని వస్తాడు. మీనా కారుకు ప్రత్యేక పూజలు చేయిస్తుంది.ఇక కారు నీకోసమే తీసుకున్నామని, ఇప్పటి నుంచి ఈ కారు నీకే సొంతమని చెబుతారు. మీనా ఇచ్చిన సర్ ప్రైజ్ కు బాలు షాక్ అవుతాడు. మౌనంగా ఉండిపోతాడు. ఈ క్రమంలో తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 17వ తేదీ 446 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.?

బాలును గుడి దగ్గరకు మీనాతో వెళ్తాడు. అప్పటికే రాజేష్ తన ఫ్రెండ్ కోసమని చెక్ చేయించిన కారుతో గుడికి వస్తాడు. ఇక కారుకు పూజ చేయించిన తర్వాత బాలుకు మీనా కారు తాళం చెవి ఇస్తుంది. అప్పటి వరకు రాజేష్ తన ఫ్రెండ్ కోసమే ఈ కారును కొన్నామని చెప్పి నమ్మిస్తాడు. అలాగే మీనాతో పూజలు కూడా చేయిస్తారు. ఎప్పుడైతే మీనా కారు తాళం బాలుకు ఇస్తుందో అప్పుడు బాలు షాక్ అవుతాడు. ఈ కారు ఎప్పుడు తీసుకున్నావని, అంత డబ్బు ఎలా సర్దివాని బాలు మీనాను అడుగుతాడు. పూల దండలు కట్టిన ఆర్డర్ తో లాభం వచ్చింది కదా, ఆ డబ్బుకు మరింత జమా చేసి ఈ కారు కొన్నానని మీనా బాలుకు వివరిస్తుంది. మీరు పాత కారును ఒక మంచి పని కోసమే అమ్మేశారని నాకు తెలుసు. పైగా ఎప్పుడూ కారులో తిరిగే మీరు ఆటోలో తిరుగుతుంటే నాకు అస్సలు బాగా అనిపించడం లేదని చెబుతుంది.
బాలుకు మీనా ఇచ్చిన సర్ ప్రైజ్ కు సంతోషంలో మునిగి తేలుతాడు. మాటలు రాక మౌనంగా నిల్చుంటాడు. మీనా తనకోసం ఇంతలా ఆలోచిస్తుందా? అని ఆశ్చర్యపోతాడు. ఎప్పుడూ గల గల మాట్లాడే బాలు మీనా సర్ ప్రైజ్ కు ఎమోషనల్ అవుతాడు. ఇక కారుకు పూజ చేయించిన తర్వాత మీనా బాలును కారు తీయండి అని చెబుతుంది. మొదటి రైడ్ కు తనే బోణీ చేస్తానని చెబుతుంది. దాంతో బాలు సరేనని చెబుతాడు. ఇక బాలుకు అందరూ శుభాకాంక్షలు చెబుతాడు. ఆ తర్వాత బాలు, మీనా కారులో ఇంటికి బయల్దేరుతాడు. వెళ్తూ వెళ్తూ ఎమోషనల్ గా మాట్లాడుకుంటారు. కారు ఎంతగానో నచ్చిందని, కానీ నాకు కారు కొనివ్వాలనే ఆలోచన నీకు ఎందుకు వచ్చిందని బాలు మీనాను అడుగుతాడు. భర్త సంతోషమే భార్యకు సంతోషమని కారు కొనాలని అనుకున్నానని అంటుంది. పైగా నాకు పూలకొట్టు పెట్టించాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది అని మీనా అడుగుతుంది.
అందుకు బాలు నీకు పూల అల్లడం అంటే ఇష్టం కదా అని అంటాడు. సరిగా చెప్పండి అని మీనా మళ్లీ అడగటంతో నిన్ను ఎవ్వరైనా తక్కువ చేసి మాట్లాడితే నాకు అస్సలు నచ్చదని బాలు అంటాడు. నాకు మీకు మీరు తక్కువగా ఉంటే అస్సలు నచ్చదని బాలుకు మీనా బదులిస్తుంది. ఇక కారుకొన్న సంతోషంలో బాలు మీనాకు తలనిండా సరిపోయే పూలను కొనిస్తాడు. తానే స్వయంగా అలంకరిస్తాడు. అలాగే తన భార్య మీనా తన సొంతం డబ్బులతో కారు కొనిచ్చిందని తన స్నేహితులకు చెప్పాలని కార్ స్టాండ్ కు వెళ్తాడు. కానీ వాళ్లందరూ మాకు ముందే తెలుసని చెబుతారు. దాంతో బాలు ఇంకా సర్ ప్రైజ్ ఫీల్ అవుతాడు. ఆ తర్వాత కారు వెనకాల బాలులోని ఫస్ట్ లెటర్, మీనాలోని ఫస్ట్ లెటర్ తో స్టిక్కరింగ్ వేయిస్తారు. ఇక ఆ తర్వాత నేరుగా ఇంటికి వెళ్తారు.
ఇక మనోజ్ ఇంట్లోనే ఖాళీ ఉంటూ తల్లి ప్రభావతి కొంగు చుట్టూనే తిరుగుతుండటంతో సత్యం మనోజ్ ను మందలిస్తాడు. బాలును చూసి నేర్చుకోమని చెబుతుంటాడు. ఇక ప్రభావతి వచ్చి బాలును చూసి ఏం నేర్చుకోవాలని మనోజ్ కు సపోర్ట్ గా మాట్లాడుతుంది. ఇప్పటికే ఉన్న కారు అమ్మేసి, ఆటోకు వచ్చాడు. రేపూ మాపో ఆ కారు కూడా అమ్మేసి సైకిల్ కొనుకుంటాడని హేళన చేస్తుంది. ఇదే సమయంలో రోహిణి బయటి నుంచి వస్తుంది. బ్యూటీఫుల్ శారీ తీసుకొచ్చి మలేషియా నుంచి తన మామ, అత్త ప్రత్యేకంగా నీకోసం మలేషియా చీర పంపించారు అత్తయ్య అని ప్రభావతికి ఇస్తుంది. దాంతో ప్రభావతి చీరను చూసి అన్ని మర్చిపోతుంది. వెంటనే ఆ చీర కట్టుకోని ముస్తాబవుతుంది. మళ్లీ రోహిణిపై ప్రేమను కుమ్మరించడం ప్రారంభిస్తుంది.
అదే సమయంలో బాలు, మీనా ఇంటికి తిరిగి వస్తారు. బాలు ఫుల్ హ్యాపీగా కనిపిస్తాడు. దాంతో సత్యం ఏంటీ విశేషం అని అడుగుతాడు. ముందుగా అందరూ బయటికి రావాలని బాలు, మీనా చెబుతారు. దీంతో సత్యం, ప్రభావతి, మనోజ్, రోహిణి, రవి, శృతి అందరూ బయటికి వస్తారు. రాగానే మీనా తన కోసం కొన్న కారును చూపిస్తాడు. నువ్వు కారు కొన్నావా? అని ప్రభావతి షాక్ అవుతుంది. కొత్తదానిలానే ఉంది కదా అంటుంది. దాంతో బాలు అవును కొత్తదే.. నా భార్య 10 లక్షలు పెట్టి కొనిచ్చిందని అంటాడు. దీంతో మీనాను శృతి, సత్యం, రవి అభినందిస్తారు. మంచి పని చేశావని అభినందిస్తుంది. మరోవైపు పూల దండల డబ్బులు, అప్పు చేసిన డబ్బులను నేను మా ఇంటికి దోచి పెట్టలేదని, ఈ కారు కోసమే వాడానని ప్రభావతితో అంటుంది. ఇకపై మీనాను డబ్బుల విషయంలో ఒక్క మాట కూడా అనొద్దని శృతి అంటుంది. అందరూ మీనాను పొగడటంతో మీనా సంతోషిస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











