Gunde Ninda Gudi Gantalu June 18th : మీనాను ఆకాశానికి ఎత్తేసిన బాలు.. రోహిణికి ప్రభావతి వార్నింగ్
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూన్ 17వ తేదీ 446వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలుకు మీనా సర్ ప్రైజ్ ఇస్తుంది. కారును తన కోసమే తీసుకున్నానని చెప్పి కారు తాళం ఇస్తుంది. దాంతో బాలు చాలా సంతోషం వ్యక్తం చేస్తాడు. మీనా తన గురించి ఇంతలా ఆలోచిస్తుండటంతో ఆనందంలో మునిగితేలుతాడు. ఆ తర్వాత మీనాను కారులో ఎక్కించుకొని ట్రిప్ కు వెళ్తాడు. తన భార్య మీనా కారు కొనిచ్చిందని తనకు తెలిసిన వారు, మిత్రులకు చెబుతాడు. ఆ తర్వాత బాలు మీనా కొత్త కారుతో తిరిగి ఇంటికి వెళ్తారు.
బాలు, మీనా ఇంటికి వెళ్లే సరికి హాలులోనే కుటుంబ సభ్యులందరూ ఉంటారు. ఇక బాలు మీనా వెళ్లి ఇంట్లో వాళ్లకు గుడ్ న్యూస్ అంటూ సర్ ప్రైజ్ చేస్తారు. అందరినీ ఒకసారి బయటకి రమ్మని అంటారు. అందరూ బయటికి రావడంతో కొత్త కారును చూపిస్తాడు బాలు. తన భర్త మీనా కొనిచ్చిందని బాలు గర్వంగా చెబుతాడు. అన్ని డబ్బులు ఎక్కడివి అని మీనాను ప్రశ్నిస్తారు. పూల దండలు అమ్మగా వచ్చిన డబ్బులతోపాటు కొంత అప్పు తీసుకొని కారు కొన్నానని చెబుతుంది. బాలు ఇచ్చిన సర్ ప్రైజ్ కు అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 18వ తేదీ 447 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.?

మీనా బాలుకు కారు సర్ ప్రైజ్ గా గిఫ్ట్ ఇవ్వడంతో ఇంట్లో వాళ్లందరూ ఫుల్ షాక్ అవుతారు. ముఖ్యంగా ప్రభావతి తట్టుకోలేకపోతుంది. మీనా ఇంత గొప్ప పనిచేయడాన్ని జీర్ణించుకోలేక పోతుంది. అందరూ మీనాను పొగుడుతూ ఉంటే ప్రభావతి మాత్రం మూతి ముడుచుకుంటూ కూర్చొంటుంది. ఇక సత్యం మీనాను పొగుడుతూ ఉంటారు. బాలును సరిగ్గా అర్థం చేసుకున్నావని చెబుతాడు. మరోవైపు బాలు కారు వెనకాల వేయించిన స్టిక్కరింగ్ ను ఇంట్లో వాళ్లందరికీ చూపిస్తాడు. తన కారు వెనకాల బీ.ఎం అని స్టిక్కరింగ్ వేయించానని అందరికీ చూపిస్తాడు. దాని అర్థం కూడా వివరిస్తాడు. బీ అంటే బాలు అని, ఎం అంటే మీనా అని వివరిస్తాడు. నా భార్య నా కోసం కష్టపడి కారు కొనిచ్చినందుకు ఇలా గుర్తుండిపోయేలా, అందరికి తెలిసేలా స్టిక్కరింగ్ వేయించినట్టు బాలు అందరికీ చెబుతాడు.
బాలు మీనాను గొప్ప చేసి మాట్లాడుతుంటే ప్రభావతి కుళ్లుకుంటుంది.అంత గొప్పేమీ ఉందని మండిపడుతుంది. ముష్టి సెకండ్ హ్యాండ్ కారు కొన్నందుకే పెద్ద విమానం కొనిచ్చినట్టు పొంగిపోతున్నారంటూ దెప్పి పొడుస్తుంది. దాంతో సత్యం ప్రభావతిని నోరు మూసుకోమని అంటాడు. అయినా ప్రభావతి మాట్లాడుతూనే ఉంటుంది. ఎవ్వరైనా కొత్త కారు, వాహనాలు కొంటే అమ్మ దీవెన అని రాయించుకుంటారని అంటుంది. బాలు విషయంలో అమ్మ దీవెన ఎక్కడుందని ప్రభావతిపై సత్యం ఫైర్ అవుతాడు. అన్నీ తిట్లు, శాపనార్థాలు, అసూయ తప్ప ఇంకేమీ ఇచ్చావని సత్యం ప్రశ్నిస్తాడు. దాంతో ప్రభావతి కోపంతో ఇంట్లోకి వెళ్లిపోతుంది. ఆమె వెళ్లడమే కాకుండా మనోజ్ రోహిణి కూడా ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఇక బాలు కూడా పాత కారుకు సంబంధించిన టూల్ కిట్ తీసుకొచ్చి ఈ కారులో పెట్టాలని ఇంటి లోపలికి వెళ్తాడు.
ఇక మీనా బయటనే ఉంటడంతో సత్యం మాట్లాడుతాడు. కోడలు మీనా చేసిన పనికి చాలా సంతోషిస్తాడు. తన మనస్సులోని మాటను చెప్పుకుంటూ ఆనందిస్తాడు. ఒక తండ్రిగా నేను చేయాల్సిన పనిని నువ్వు చేశావు అని మీనాను అభినందిస్తాడు సత్యం. ఇన్నాళ్లు బాలు విషయంలో చాలా బాధగా ఉండేది. బాలును నేను తప్ప ఇంకెవ్వరూ మనిషిలాగా చూసే వాళ్లు కాదు. అందరూ వాడి పైపై కోపాన్నే చూసే వారు గానీ, లోపల ఉన్న ప్రేమను మాత్రం ఎవ్వరూ గుర్తించే వారు కాదని మీనాతో అంటాడు. మళ్లీ బాలును నువ్వు పూర్తిగా అర్థం చేసుకున్నావు మీనా అని సంతోషిస్తాడు. ఇక నా మనస్సుల్లో ఉన్న బాధ మొత్తం దిగి పోయిందని చెబుతాడు. ఇకపై బాలు, నువ్వు ఇలాగే సంతోషంగా ఉండాలమ్మ అని దీవిస్తాడు.
మరోవైపు రోహిణిని అత్త ప్రభావతి చెడుగుడు ఆడుతుంటుంది. రోహిణి గదిలోకి ప్రభావతి వెళ్లి తలుపులు మూసేస్తుంది. ఇక రోహిణిపై మండిపడుతుంది. అప్పటికే ప్రభావతిని చూసిన రోహిణి ఝల్లుమంటుంది. మళ్లీ తన గురించి ఏం తెలిసిందోనని భయపడుతుంది. ప్రభావతి మాట్లాడుతూ ఇవ్వాళ నీ మలేషియా వ్యవహరం ఏంటో తెలుసుకుందామని వచ్చానని అంటుంది. చందమామను చూపించి గోరు ముద్దలు తినిపిస్తున్నావా? అంటూ రోహిణిపై మండిపడుతుంది. ఇవ్వాళ మీ నాన్నతో మాట్లాడాల్సిందేనని అంటుంది. ఆయన ఎన్ని సంవత్సరాలుగా బిజీగా ఉంటారని, కనీసం 1, 2కూడా వెళ్లడం మానేశారా? తినడం లేదా? ఎంత పెద్ద బిజినెస్ మెన్ అయినా ఆయన ఫోన్ ఆయన దగ్గరనే ఉంటుంది కదా అని అంటుంది. నేను ఇప్పుడే మీ నాన్నతో మాట్లాడాలని ఒత్తిడి పెంచుతుంది.
కానీ రోహిణి మాత్రం ఇప్పుడు అవ్వదు అని ప్రభావతికి సమాధానం ఇస్తుంది. సరే మీ మేనమామకు ఫోన్ చేసి ఇవ్వమని అంటుంది. ఆయన కూడా బిజీగానే ఉంటుంది. ఇంతగా బిజీగా ఉండే వాళ్లను నేనెక్కడ చూడలేదని అంటుంది. పూలు అమ్ముకునే మీనా తన భర్త కోసం కారు కొనిచ్చింది. కనీసం నువ్వు నీ భర్తకు బిజినెస్ పెట్టించలేవా? అని అడుగుతుంది. వెంటనే ఈ వ్యాపారం గురించి అడగమని, లేదంటే నీ కాపురానికి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తుంది. రోహిణి కూడా తప్పకుండా మాట్లాడుతానని చెబుతుంది. రోజురోజుకు సమస్య జఠిలమౌవుతుందని అనుకుంటుంది రోహిణి. మరోవైపు మౌనికా ఉపవాసంలో ఉండగా భర్త సంజూ చికెన్ బిర్యానీ తీసుకొచ్చి తినిపించాలని ప్రయత్నిస్తాడు. తనపై ప్రేమ ఉంటే తినమని ఒత్తిడి చేస్తాడు. ఇక సంజూ వాళ్ల తల్లి వచ్చి అడ్డుకుంటుంది. సంజూపై కోపం చేస్తుంది. ఆ తర్వాత మౌనికా బ్యాగ్ తీసుకొచ్చి ఈ నరకం నుంచి శాశ్వతంగా వెళ్లిపోమని చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











