Gunde Ninda Gudi Gantalu June 19th : బాలు కుటుంబంలో కొత్త చిచ్చు.. మౌనికాకు ముప్పు.. రోహిణి ప్లాన్

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూన్ 18వ తేదీ 447వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మీనా బాలుకు కొత్త కారు కొనిచ్చిందనే ఆనందంలో ఇంట్లో వాళ్లందరికీ చూపిస్తాడు. అంతే కాదు మీనా గురించి గొప్పలు చెబుతాడు బాలు. దాంతో ప్రభావతి జీర్ణించుకోలేక పోతుంది. సెకండ్ హ్యాండ్ కారుకే ఇంత మురిసిపోవాలా అని దెప్పి పొడుస్తుంది. నా భార్య మలేషియా డబ్బులతో కొనివ్వలేదని, కష్టపడి పూలు అమ్మి మరీ కొనిచ్చిందని, తన శ్రమతో వచ్చిన కారు ఇదని చెబుతాడు. పైగా వెనకాల తన భార్య పేరు స్టిక్కరింగ్ వేయించానని అందరి చూపిస్తాడు.

ఇక తల్లిగా నన్ను గౌరవించలేదని ప్రభావతి బాలుపై మండిపడుతుంది. దీంతో ఇంట్లోకి వెళ్తుంది. ఇదే క్రమంలో రోహిణికి వార్నింగ్ ఇస్తుంది. పూలు అమ్ముకునే మీనానే బాలుకు కారు కొనిస్తే మలేషియాలో మీ నాన్న ఉంటున్నప్పుడు నా కొడుకు మనోజ్ కు బిజినెస్ పెట్టించలేవా అని ప్రశ్నిస్తుంది. వెంటనే మీ నాన్నతో మాట్లాడి మనోజ్ కు వ్యాపారం పెట్టించే విషయంపై మాట్లాడు అని అంటుంది. లేదంటే నీ కాపురం సవ్యంగా సాగదని హెచ్చరిస్తుంది. మరోవైపు బాలు చెల్లెలు మౌనికాను సంజూ టార్చర్ పెట్టడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోమని చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 19వ తేదీ 448 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.?

Gunde Ninda Gudi Gantalu serial episode 448 June 19th

బాలు చెల్లెలు మౌనికాను సంజూ టార్చర్ చేయడంతో చాలా బాధపడుతుంది. తన భర్త మారాలని ఓవైపు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటే మరోవైపు సంజూ మౌనికాను అవమానిస్తాడు. అమ్మవారి పూజలో ఉండగా చికెన్ బిర్యానీ తీసుకొని వచ్చి తినమని బలవంతం చేస్తాడు. మౌనికా వద్దు వద్దు అని అరవడంతో సంజూ వాళ్ల తల్లి వచ్చి అడ్డుకుంటుంది. మౌనికాకు మద్దతుగా నిలుస్తుంది. సంజూపై మండిపడుతుంది. ఓవైపు నువ్వు మారాలని నీ భార్య వ్రతం చేస్తుంటే నువ్వు ఇలాంటి హీనమైన పనులు చేస్తావా? అని గడ్డి పెడుతుంది. అయినా సంజూ మొండిగానే ప్రవర్తిస్తాడు. తన పంథాలోనే ఉంటాడు. దీంతో సంజూపై తల్లికి కోపం వచ్చి మీనాను ఇంట్లో నుంచి వెళ్లిపోమని సలహానిస్తాడు. బ్యాగ్ కూడా సర్ది ఇచ్చి మీ పుట్టింటికి వెళ్లి సంతోషంగా ఉండమని సూచిస్తుంది. ఇక సంజూ మారుతాడనే నమ్మకం నాకు లేదు. కానీ సాటి ఆడదానిగా నువ్వు ఇంత బాధను అనుభవిస్తుంటే చూస్తూ ఉండలేక పోతున్నానని సంజూ తల్లి అంటుంది.

ఇంత బాధను చూశాకా కూడా కూతురైనా, కోడలైనా నాకు ఇలానే చెప్పాలని ఉంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోయి మీ ఇంట్లో హాయిగా ఉండు. డిగ్రీ చదువుకున్నావు కదా ఏదైనా జాబ్ చేసుకొని మళ్లీ పెళ్లి చేసుకొని సంతోషంగా జీవించు అని సలహానిస్తుంది. దాంతో మౌనికా స్పందిస్తూ నా గురించి మీరు ఇంత ఆలోచిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య అని బదులిస్తుంది. కానీ నేను ఈ ఇంటిలో నుంచి వెళ్లనని చెబుతుంది. నేను ఇక్కడి నుంచి వెళ్లిన మరుక్షణమే మా అన్నయ్య బాలు ఇక్కడికి వచ్చి సంజూ ప్రాణాలు తీస్తాడని అంటుంది. అందుకే నేను ఎక్కడికి వెళ్లను. పెళ్లైన కొత్త మా అన్నయ్య కూడా మా వదిన మీనాను చాలా ఇబ్బంది పెట్టేవాడు. తాగొచ్చి గొడవ చేసే వాడు, ఇంట్లో నుంచి వెళ్లిపోమని పదేపదే అనేవారు. కానీ మా వదిన ఎంతో ఒప్పిగ్గా ఉండి మా అన్నయ్యను మార్చుకుంది. ఇప్పుడు నేను కూడా ఓపిగ్గానే ఎదురుచూస్తూ ఉంటానని బదులిస్తుంది. దాంతో తన కొడుకుపై తనకే లేని నమ్మకం భార్యగా మౌనికాకు ఉందని సంతోషిస్తుంది.

మరోవైపు మీనా బాలుకు కారు కొనిచ్చినందుకు రోహిణి కుల్లుకుంటుంది. మీనా వంట చేస్తుంటే వెళ్లి బాలుకు నువ్వు నిజంగానే కారు కొనిచ్చావా? అని ప్రశ్నిస్తుంది. అందుకు మీనా అవునని చెబుతుంది. అంతా డబ్బు నీకు ఎలా వచ్చిందని, సెకండ్ హ్యాండ్ కారు కొనాలన్న కనీసం 3 లక్షలు కావాలి కదా అంతా డబ్బు నీకు ఎక్కడిదని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంది. మొత్తం ఒకేసారి కట్టలేదని, కొంత ఈఎంఐలో కడతామని అంటుంది. అయినా నువ్వు బాలుకు కారు ఎందుకు కొనివ్వాలని అనుకున్నావని అడుగుతుంది. బాలు నువ్వు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు కదా. కారు కొనివ్వాలని ఎందుకు అనుకున్నావని అడుగుతుంది. దాంతో మీనా చిరాకు పడుతుంది. ఎందుకు కారు కొనివ్వకూడదా? అని తిరిగి ప్రశ్నిస్తుంది. అలా అని కాదు నువ్వు బాలుకు కారు కొనివ్వడంతో నాకు సమస్యగా మారింది. అత్తయ్య నన్ను మనోజ్ కోసం ఏమైనా చేయమని అంటుందని చెబుతుంది.

ఇదే సమయంలో శృతి కిచెన్ దగ్గరకు వస్తుంది. అప్పటికే రోహిణి మాటలను వింటుంది. ఎందుకు నువ్వు మీనాపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నావని అడుగుతుంది. దేనికైనా కొన్ని హద్దులు ఉంటాయని అంటుంది. బాలు, మీనా మధ్య భార్యభర్తల అనుబంధం ఉంటుంది. అలాంటప్పుడు వారి మధ్య గొడవలు, ప్రేమలు కూడా సహజమని, బాలుకు మీనా కారు కొనివ్వడంతో నీకు జలసీగా ఉందని నాకు తెలుస్తోందని రోహిణిపై శృతి మండిపడుతుంది. ఇకపై ఇలాంటి ప్రశ్నలు వేయకని మీనాకు సపోర్ట్ గా మాట్లాడుతుంది. ఆ తర్వాత డబ్బింగ్ చెప్పడానికి స్టూడియోకు వెళ్లిపోతుంది.

ఎవ్వరూ ఊహించని విధంగా ప్రభావతి ఇంటికి శృతి తల్లి వస్తుంది. పెళ్లైనప్పటి నుంచి శృతి పసుపుతాడుతోనే తిరుగుతుంది. కనీసం మీరు కూడా నల్లపూసలు గుచ్చి బంగారు తాడు చేయించడం లేదని ప్రభావతితో అంటుంది. అందుకే మేం ఒక నిర్ణయం తీసుకున్నామని చెబుతుంది. శృతికి పూస్తెలు గుచ్చే ఫంక్షన్ ను పెద్దగా చేయాలని అనుకుంటున్నట్టుగా తెలిపింది. అందుకు అన్ని తామే పూర్తి చేస్తామని అంటుంది. ఇక ప్రభావతి సంతోషిస్తూ శృతితో పాటు రోహిణికి కూడా నల్లపూసలు గుచ్చే కార్యక్రమాన్ని చేయిద్దామని అంటుంది. పెద్ద కోడలికి కాకుండా చిన్న కోడలికి చేయించలేము కదా అని అంటుంది. దాంతో ఆమె కూడా సరేనని ఇంటికి వెళ్లిపోతోంది. ఇక తన భర్త, శృతి తండ్రితో రవిని శాశ్వతంగా తమ ఇంటికే తీసుకొచ్చే ప్లాన్ చేశానని, అందుకు ఈ ఫంక్షన్ ను గ్రాండ్ గా చేయాలని అంటుంది. మరోవైపు రోహిణి వాళ్ల నాన్న మాలేషియా నుంచి వెంటనే రమ్మనమని ప్రభావతి చెబుతుంది. లేదంటే పరిస్థితి వేరేలా ఉంటుందని హెచ్చరిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నెక్ట్స్ ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X