Gunde Ninda Gudi Gantalu June 20th : బాలుకు మరో ఘోర అవమానం.. కొడుకుపై ప్రభావతి కర్కషత్వం

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూన్ 19వ తేదీ 448వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు చెల్లి మౌనికాను ఆమె భర్త సంజూ టార్చర్ చేస్తుంటాడు. అతను మారాలని ఓవైపు మౌనికా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంది. కానీ మరోవైపు సంజూ మౌనికా పూజలకు ఆటంకం కలిగిస్తాడు. తనపై ప్రేమ ఉంటే చికెన్ బిర్యానీ తినమని బలవంతం చేస్తాడు. మౌనికా మాత్రం వద్దంటే వద్దని మౌనికా బతిమిలాడుతుంది. అయినా సంజూ వినిపించుకోడు. బలవంతం చేస్తాడు. ఆ వెంటనే సంజూ తల్లి వచ్చి అడ్డుపడుతుంది. సంజూను తిడుతుంది. ఆ తర్వాత మౌనికాను ఇంట్లో నుంచి వెళ్లిపోమని, మీ ఇంటికి వెళ్లి శాశ్వతంగా హాయిగా ఉండమని చెబుతుంది.

కానీ మౌనికా మాత్రం తను ఎక్కడికీ వెళ్లనని ఓపిగ్గా ఎదురు చూస్తుంటానని చెబుతుంది. తన భర్తను మార్చుకుంటానని అంటుంది. మరోవైపు రోహిణిపై ప్రభావతి మండిపడుతుంది. పూలు అల్లుకునే మీనానే బాలుకు కారు కొనిచ్చినప్పుడు నువ్వు మనోజ్ కోసం బిజినెస్ పెట్టించలేవా అని అడుగుతుంది. వెంటనే వ్యాపారం గురించి మాట్లాడమని అంటుంది. అలాగే శృతి వాళ్ల అమ్మ ప్రభావతి ఇంటికి వస్తుంది. శృతికి నల్లపూసలు గుచ్చే ఫంక్షన్ చేద్దామని అంటుంది. అలాగే రోహిణికి కూడా చేయిద్దామని ప్రభావతి చెబుతుంది. దాంతో రోహిణి వాళ్ల నాన్నను మలేషియా నుంచి తప్పకుండా రమ్మనమని చెబుతుంది. ఈ క్రమంలో ఏం జరిగింనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 20వ తేదీ 449 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.?

Gunde Ninda Gudi Gantalu serial episode 449 June 20th

శృతికి నల్లపూసలు గుచ్చే కార్యక్రమం పేరుతో రవిని తమ ఇంటికే పూర్తిగా తీసుకొద్దామని శృతి వాళ్ల తల్లిదండ్రులు అనుకుంటారు. ఫంక్షన్ గ్రాండ్ గా చేసి, మళ్లీ శృతి, రవిని తిరిగి వెళ్లనివ్వనని శృతి తల్లి చెబుతుంది. ఇక మరోవైపు బాలు, మీనాలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడుతుంది. అందరూ రాత్రి పడుకుంటారు. శృతి రవి, రోహిణి మనోజ్, ప్రభావతి సత్యం తమ తమ గదుల్లో పడుకుంటారు. ఇక మీనా బాలు మాత్రం హాలులో పడుకుంటారు. ఇక బాలు మీనా కోసం మల్లె పూలు, మిఠాయిలు తీసుకొని వస్తాడు. రోజంతా కష్టపడి పని చేస్తున్న మీనా కోసం తన చేతులతోనే మిఠాయి తినిపించాలని అనుకుంటాడు. కానీ ప్రభావతి, శృతి, మనోజ్ రోహిణిలు ఒకరి తర్వాత ఒకరు వరుసగా హాలులోకి వచ్చి బాలు, మీనా ఏకాంతంగా మాట్లాడుకోకుండా చేస్తారు.

ముందుగా ప్రభావతి నిద్రలోంచి మేలుకొని కిందికి వచ్చే ప్రయత్నం చేస్తుంది.దాంతో సత్యం అడ్డుకుంటాడు. అసలే బాలు మీనా వాళ్ల రూమ్ మనికి ఇచ్చి వాళ్లు హాలులో పడుకొని ఇబ్బంది పడుతున్నారని అంటాడు. ఇలాంటి సమయంలో నువ్వు కిందికి వెళ్లడం అవసరమా? అని ప్రశ్నిస్తాడు. దాంతో ప్రభావతి సత్యంవైపు గుర్రుమని చూస్తుంది. అసలు మీనా పూల కొట్టు వల్ల ఇంట్లో పనులేవీ సరిగా పట్టించుకోవడం లేదని మండిపడుతుంది. దాంతో ఇంట్లో పనులన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుందని అంటుంది. ఇప్పుడు కిందికి వెళ్లి ఇడ్లీ పిండి కలిపిందో లేదో చూసి రావాలని, గిన్నెలన్నీ శుభ్రం చేసిందో లేదో చూసి రావాలని అంటుంది. దాంతో ప్రభావతిపై సత్యం మండిపడుతాడు. ఇంట్లో పనులన్నీ రోజూ నువ్వే చేస్తున్నట్టు ఎందుకు అలా మాట్లాడుతున్నావని ప్రభావతిని తిడుతాడు సత్యం. మీనా అటు పూలకొట్టును, ఇటు ఇంట్లో పనులన్నీ చూసుకుంటోంది. అయినా నువ్వు మీనాపై మండిపడుతావేంటీ అంటూ ఫైర్ అవుతాడు. కనీసం మీనా కష్టపడి పూల దండలు అల్లిన డబ్బులతో కారును కొనిచ్చినా నువ్వు ఎందుకు ప్రశంసించలేదని అంటాడు.

అందుకు ప్రభావతి స్పందిస్తూ మీనాను లోలోపల అభినందించానని చెబుతుంది. నేను కూడా బాలుకు మీనా కారు కొనివ్వడంతో సంతోషించానని అంటుంది. సరే సరేలే అని సత్యం అంటాడు. అయితే మళ్లీ ప్రభావతి సత్యంకు పాలు తేవడం కోసమని కిందకు వెళ్తుంది. ఇదే సమయంలో బాలు, మీనా ఏకాంతంగా గడపాలని అనుకుంటారు. ఇక ప్రభావతి వాళ్లను దృష్టిలో పెట్టుకొని విజిల్ వేస్తూ కిందకి వెళ్తుంది. ఆ విజిల్ సౌండ్ విని అందరూ ఉలిక్కి పడి లేస్తారు. ఏమైందని కంగారు పడుతారు. ఇక బాలు కూడా విజిల్ సౌండ్ విని మీనాకు దూరంగా ఉంటాడు. కనీసం మీనా జడలో మల్లెపూలు పెట్టి, స్వీట్ తినిపించే సమయం కూడా లేదని బాధపడుతాడు. ప్రభావతి వచ్చి వెళ్లిన తర్వాత శృతి కూడా కిందికి దిగుతుంది. బిర్యానీ ఆర్డర్ పెట్టానని బాలు, మీనాతో చెబుతుంది. బిర్యానీ రాగానే హాలులోనే కూర్చొని తింటుంది. అదే సమయంలో ప్రభావతి కూడా కిందికి వచ్చి శృతితో కలిసి బిర్యానీ తింటుంది. రుచికరంగా ఉండటంతో పొట్టపగిలిపోయేలా తింటుంది. దాంతో రాత్రంతా అవస్థలు పడుతుంది.

ఇక మనోజ్ రోహిణి కూడా కిందికి వస్తారు. అప్పటికే బాలు మీనాకు స్వీట్ తినిపిద్దామని అనుకుంటాడు. కానీ మనోజ్ వాళ్లు కిందికి వస్తూ విజిల్ వేస్తారు. దాంతో స్వీట్ అక్కడే పెట్టి బాలు పడుకున్నట్టు నటిస్తాడు. ఇక మీనా కిచెన్ వైపు వెళ్తుంది. స్వీట్ వాసన రావడంతో మనోజ్ వెళ్లి తీసుకొని తింటాడు. అంతే కాదు రోహిణికి కూడా తినిపిస్తాడు. ఇక బాలు తన భార్య మీనా కోసం తెచ్చిన స్వీట్ ను మనోజ్ తినడంతో అప్సెట్ అవుతాడు. అసలు ఈరోజు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని అసంతృప్తిని వ్యక్తం చేస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికంగా మారింది. అయితే ప్రభావతికి శృతి వాళ్ల తల్లి ఒక కండీషన్ పెడుతుంది. శృతి నల్లపూసలు గుచ్చే ఫంక్షన్ కు బాలును రానివ్వొద్దని చెబుతుంది. ఇదే విషయాన్ని ప్రభావతి బాలుతో చెబుతుంది. కానీ శృతి మాత్రం బాలు మీనాలు ఉంటే తన ఫంక్షన్ జరుగుతుందని అంటుంది. బాలు రాని ఫంక్షన్ ను తను కూడా రానని, వాడు లేకుంటే నాకు కూడా రావాల్సిన అవసరం లేదని సత్యం అంటాడు. మరోవైపు మీనా కూడా ఆ ఫంక్షన్ ను రానని చెబుతుంది. ఈ క్రమంలో తర్వాత ఎపిసోడ్ లో ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X