Gunde Ninda Gudi Gantalu June 21st : బాలు గుండె ముక్కలు చేసిన ప్రభావతి.. కన్నీళ్లు పెట్టుకున్న మీనా

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూన్ 20వ తేదీ 449వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు, మీనాలకు సెపరేట్ గది లేకపోవడంతో హాలులోనే పడుకుంటారు. దీంతో వాళ్లకి ఏకాంత సమయం దొరకదు. కనీసం మీనాకు బాలు ప్రేమగా స్వీట్ కూడా తినిపించడం కష్టమవుతుంది. మీనాతో మనస్సు విప్పి మాట్లాడుదామనుకుంటే రాత్రిపూట కూడా అందరితో తలనొప్పిగా మారుతుంది. మరోవైపు ప్రభావతి కూడా కావాలని బాలు మీనాను పదే పదే డిస్టబ్ చేస్తుంది. పలు మార్లు తమ గదిలోంచి హాలులోకి వచ్చి బాలు, మీనాకు నిద్రలేకుండా చేస్తారు. ఇక ప్రభావతి కిందికి వచ్చి మీనాపై మండిపడుతుంది. పూల కొట్టుపై ఉన్న ధ్యాస ఇంటి పనులపై లేదని అంటుంది. ఇంట్లో పనులన్నీ పూర్తి చేశావా? గిన్నెలు అన్నీ క్లీన్ చేశావా? అని మీనాపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది.

దాంతో బాలు ప్రభావతిపై ఫైర్ అవుతాడు. నా భార్యనే అన్నీ పనులు చేయాలా? మిగితా వాళ్లు కూడా ఉన్నారు కదా, మీనానే ఎందుకు పని మనిషిలా అని పనులు చేయాలా అని ప్రశ్నిస్తాడు. దీంతో ప్రభావతి స్పందిస్తూ రోహిణి, శృతి జాబ్ చేస్తుంటారు. అందుకే వాళ్లకు ఇంట్లో పనులు చేయడం తెలియదు. కాబట్టి మీనాకు చెబుతున్నానని అంటాడు. ఇక మీనా కూడా నేను చేస్తానులే, ఇప్పటి వరకు అన్ని పనులు పూర్తి చేశానని ప్రభావతితో చెబుతుంది. తన భర్త బాలును కూడా శాంత పరిచి ఘర్షణ పడకుండా చూసుకుంటుంది. ఇక ఆ తర్వాత శృతి బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని రాత్రి 12 గంటలకు హాలులోనే కూర్చొని తింటుంది. ప్రభావతి కూడా వచ్చి మిడ్ నైట్ బిర్యానీ తింటుంది. మరోవైపు రోహిణి, మనోజ్ కిందికి వచ్చి మీనాకోసం బాలు తీసుకొచ్చి స్వీట్స్ ను తింటారు. ఇలా రాత్రంతా బాలు, మీనాకు నిద్ర లేకుండా చేస్తారు. దీంతో బాలు చాలా అప్సెట్ అవుతాడు. మరోవైపు శృతికి నల్ల పూసలు గుచ్చే ఫంక్షన్ గురించి ఇంట్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు జరిగాయనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతోంది. ఇక జూన్ 21వ తేదీ 450 ఎపిసోడ్ లో ఏం జరిగి ఉంటుదంటే.?

Gunde Ninda Gudi Gantalu serial episode 450 June 21st

బాలు, మీనాలు హాలులో పడుకోవడం పట్ల ఎవ్వరికీ జాలి కలగదు. కనీసం వారిని ప్రశాంతంగా కూడా పడుకోనివ్వరు. సత్యం మాత్రం బాలు, మీనా హాలులో పడుకుంటారని తెలిసి వారికి ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా మెదులుతారు. ఇదెలా ఉంటే.. బాలు ఇంటికి శృతి వాళ్ల అమ్మగారు వస్తారు. శృతికి నల్లపూసలు గుచ్చే ఫంక్షన్ ను గ్రాండ్ గా చేయాలని అనుకుంటున్నట్టుగా చెబుతుంది. దాంతో ప్రభావతి చాలా సంతోషిస్తుంది. వాళ్లకు శృతి ఒక్కగాను ఒక్క కూతురు కావడంతో ఆస్తి మొత్తం శృతి పేరు మీద రాస్తరేమోనని ఆశపడుతుంది. మనస్సులో గాల్లో మెడలు కట్టేలా మాట్లాడుకుంటుంది. శృతికి నల్లపూసలు గుచ్చే కార్యక్రమం చేయడంతో పాటు ఆ ఇంటి పెద్ద కోడలు రోహిణికి కూడా నల్ల పూసలు గుచ్చే కార్యక్రమాన్ని చేద్దామని అంటుంది. సంప్రదాయం ప్రకారం పెద్ద కోడలికి చేయకుండా చిన్న కోడలికి చేయడం సరికాదని అభిప్రాయపడుతుంది.

దాంతో శృతి వాళ్ల అమ్మ సరేనని అంటుంది. ఇక ఫంక్షన్ ను అన్నీ ఏర్పాట్లు చేస్తామని చెప్పి వెళ్లిపోతుంది. ఇక రోహిణిని కూడా మలేషియా నుంచి వాళ్ల నాన్న తర్వగా రమ్మని చెప్పు అని ప్రభావతి అంటుంది. ఈసారి మాత్రం ఎలాగైనా రావాల్సిందేనని ఆదేశిస్తుంది. ఇన్నేళ్లుగా ఒక్కసారి కూడా మీ నాన్న రాకుండా ఉంటే ఎలాగని, ఆయన రాకపోతే ఇదేదో తేల్చుకునే వ్యవహారమే అవుతుందని హెచ్చరిస్తుంది. దీంతో రోహిణి ఆందోళన పడుతుంది. తన మెడ చుట్టు ఉచ్చు బిగుస్తుందని కంగారు పడుతుంది. ఎలాగైనా ఈ సమస్య నుంచి బయట పడాలని ఆలోచిస్తుంది. తన స్నేహితురాలు విద్యను సలహాలు అడుగుతుంది. మటన్ కొట్టు మాణిక్యం లాగానే మరో జూనియర్ ఆర్టిస్ట్ ను దింపుదామా? అని అంటుంది. వాళ్ల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ఇంకేదైనా ప్లాన్ చేయాలని అంటుంది. లేదంటే తన అత్త ప్రభావతి ముందు పరువు పోతుంది. ఇప్పటికే పార్లర్ కు పేరు తీసేయడంతో చుక్కులు చూపిస్తోందని తన స్నేహితురాలికి చెబుకుంటుంది.

ఇక మరోవైపు శృతి వాళ్ల అమ్మ, నాన్న నిర్వహించే కార్యక్రమానికి బాలును రావొద్దని కండీషన్ పెడుతారు. బాలు వస్తే తన కూతురు శృతికి నల్లపూసలు గుచ్చే ఫంక్షన్ సజావుగా సాగదని శృతి వాళ్ల అమ్మ ప్రభావతితో అంటుంది. అప్పటికే బాలుపై పీకల దాకా కోపం ఉన్న ప్రభావతి సరేనని మాట ఇస్తుంది. బాలును ఫంక్షన్ లో లేకుండా చూసుకుంటానని హామీనిస్తుంది. ఇక అదే విషయాన్ని ఇంట్లో సత్యంతో చర్చిస్తుంది. బాలు ఉంటే శృతి ఫంక్షన్ ను ఆటంకమని వాళ్ల తల్లిదండ్రులు భావిస్తున్నారని చెబుతుంది. అందుకు బాలు రావడానికి వీల్లేదని చెబుతుంది. దాంతో సత్యం ఫైర్ అవుతాడు. తన కొడుకును వద్దన్న ఫంక్షన్ కు నేను కూడా రావడం లేదని చెబుతాడు. ఇక మీనా కూడా తన భర్తను అవమానించిన ఫంక్షన్ కు నేను మాత్రం ఎలా వస్తానని, మానుకుంటున్నానని చెబుతుంది.

ఇలా ఇంట్లో చర్చ జరుగుతున్న సమయంలో రవి, శృతి తమ ఆఫీసుల నుంచి తిరిగి ఇంటికి వస్తారు. బాలును తన ఫంక్షన్ లో ఉండొద్దని విషయం తెలుసుకొని శృతి బాధపడుతుంది. తనకు నల్లపూసలు గుచ్చే ఫంక్షన్ లో బాలు మీనా తప్పకుండా ఉండాలని, తన తల్లిదండ్రులు స్పెషల్ గా చెబుతానని శృతి అంటుంది. కానీ ప్రభావతి మాత్రం అందుకు ఒప్పుకోదు. ఇక బాలు కూడా ఫంక్షన్ కు దూరంగానే ఉంటానని అంటాడు. కానీ తండ్రి సత్యం కోసం వెళ్లేందుకు ఒప్పుకుంటాడు. మరోవైపు రవి, శృతిలను ఇకపై శాశ్వతంగా ఈ ఇంటికి దూరం చేయాలని భావిస్తారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తారు. మరోవైపు రోహిణి కూడా ఫంక్షన్ విషయంలో చాలా కంగారు పడుతుంది. తనకు ఇప్పుడే ఫంక్షన్ వద్దని చెప్పే ప్రయత్నం చేస్తుందని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నెక్ట్స్ ఎపిసోడ్ లో ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X