Gunde Ninda Gudi Gantalu June 24th : మొండికేసిన ప్రభావతి.. తగ్గేదేలే అంటూ బాలు కౌంటర్
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూన్ 23వ తేదీ 449వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ప్రభావతి అర్ధరాత్రి బిర్యానీ తిని అవస్థలు పడుతుంది. రాత్రంతా నిద్రపోదు. ఇంట్లో మొత్తం అటూ ఇటూ తిరుగుతుంది. బాలు మీనా పడుకున్న హాలులోకి వెళ్లి అవస్థలు పడుతూ ఉంటుంది. ఇక నిద్ర చెడిపోవడంతో బాలు, మీనా మేలుకొనే ఉంటారు. ప్రభావతి అరుపు తట్టుకోలేక మీనా ఏమైందని అడుగుతుంది. దాంతో తన కడుపులోని బాధను మీనాపై వెల్లగక్కుతుంది. ఇక ఛాతిలో నొప్పి అంటూ, గ్యాస్ తో భరించలేకపోతున్నానని మొత్తుకుంటుంది. ఆస్పత్రికి తీసుకెళ్దామని మీనా అంటుంది. కానీ బాలు వద్దని అంటారు. ఓవైపు ప్రభావతి అవస్థలు పడుతుంటే మరోవైపు కామాక్షి, బాలు, రవి, మనోజ్, సత్యం ఓ ఆటాడుకుంటారు.
చివరికి బాలు ప్రభావతిపైకి రోకలితో కొట్టడానికి సడెన్ గా వెళ్తాడు. భయంతో ప్రభావతి పరుగులు తీయడంతో గ్యాస్ వెళ్లిపోతుంది. దాంతో ఛాతినొప్పి కూడా పోయిందని ప్రభావతి సంతోషిస్తుంది. ఇక మరోవైపు శృతికి నల్లపూసలు గుచ్చే కార్యక్రమాన్ని చేయించాలని ఆమె తల్లి ఇంటికి వస్తుంది. ఫంక్షన్ ను చాలా గ్రాండ్ గా చేస్తున్నామని చెబుతుంది. పెద్ద వాళ్లు, బిజినెస్ పర్సన్లు, గొప్పింటి వాళ్లు హాజరవుతారని, అందుకు బాలును మాత్రం ఫంక్షన్ కు రానివ్వొద్దని కండీషన్ పెడుతుంది. దాంతో ప్రభావతి సరేనని ఒప్పుకుంటుంది. ఇదే విషయాన్ని సత్యంతో చర్చిస్తుంది. ఇక సత్యం ఎలా స్పందించాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత ఏం జరిగింనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 23వ తేదీ 450 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

శృతికి తాళి మార్చే ఫంక్షన్ ను గ్రాండ్ గా నిర్వహించబోతున్నామని శృతి తల్లి ప్రభావతితో చెబుతుంది. కానీ బాలును మాత్రం రావొద్దని కండీషన్ పెడుతుంది. బాలు వస్తే మాత్రం అస్సలు సహించబోమని, ఫంక్షన్ లో ఏదో రకంగా గొడవ చేస్తాడని అంటుంది. అందుకే బాలును రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మీదేనని ప్రభావతితో శృతి వాళ్ల అమ్మ అంటుంది. అందుకు ప్రభావతి కూడా సరేనని అంటుంది. ఇక ఇదే విషయాన్ని భర్త సత్యంతో చెబుతుంది. ఇందాక శృతి వాళ్ల అమ్మ వచ్చి వెళ్లిందని అంటుంది. శృతికి తాళి మార్చే ఫంక్షన్ ను చేద్దామని చెప్పిందని, కానీ బాలు ను మాత్రం రావొద్దని అనిందని ప్రభావతి సత్యంతో అంటుంది. బాలు వస్తే ఊరికే గొడవ చేస్తాడని, పోయినసారి మీ రిటైర్ మెంట్ ఫంక్షన్ లో ఎలాంటి గొడవ జరిగిందో మీకు తెలుసు కదా అని ప్రభావతి భర్త సత్యంతో అంటుంది.దాంతో సత్యం ఫైర్ అవుతాడు. బాలు గొడవ చేసింది నన్ను వాళ్లు అమానించినందుకే ఊరికే ఏం గొడవ చేయలేదనేది నీకు తెలియదా? అని ప్రభావతిని తిరిగి ప్రశ్నిస్తాడు.
ఇదే సమయంలో మీనా కిచెన్ నుంచి వస్తుంది. ఏమైందని అడుగుతుంది. శృతి తాళి మార్చే ఫంక్షన్ కు బాలును రావొద్దని అన్నారంట. అదే విషయాన్ని మీ అత్త ప్రభావతి చెబుతోందని సత్యం అంటాడు. మా ఆయనకు గొడవ పడటమే పనినా ఊరికే ఆయనపై నిందలు వేయడం మానుకుంటే మంచిందని మీనా అంటుంది. దాంతో ప్రభావతి స్పందిస్తూ శృతి వాళ్ల అమ్మగారు గొప్పింటి వారు వాళ్లు చేయబోయే ఈ ఫంక్షన్ కు వస్తారు. అక్కడ బాలు ఏదైనా గొడవ చేస్తే వాళ్ల పరువు పోతుంది కదా అని ప్రభావతి అంటుంది. దాంతో సత్యం మండి పడుతాడు. అదే సమయంలో బాలు తిరిగి ఇంటికి వస్తాడు. ప్రభావతి పరువు అని మాట్లాడటం విని ఏంటీ నాన్న అమ్మ పరువు గురించి మాట్లాడుతుందని అంటాడు. దాంతో వెంటనే మీనా స్పందించి శృతికి తాళి మార్చే ఫంక్షన్ ను చేస్తున్నారని, అందుకు మిమ్మల్ని రావద్దని శృతి వాళ్ల అమ్మగారు చెప్పారంట. అదే విషయాన్ని అత్తయ్య చెబుతున్నారని బాలుకు వివరిస్తుంది. దీంతో బాలు అప్సెట్ అవుతుంది. ఏదేమైనా బాలు రావడానికి వీల్లేదని ప్రభావతి తెగేసి చెబుతుంది.
దాంతో సత్యం స్పందిస్తూ సరే బాలు రాడులే అని అంటాడు. దాంతో బాలు కూడా సరే నాన్న నేను కూడా ఆ ఫంక్షన్ కు రానని ఒప్పుకుంటాడు. కానీ బాలు రావొద్దని చెప్పిన ఫంక్షన్ కు నేను కూడా రానని అంటాడు సత్యం. ఆ వెంటనే మీనా కూడా నా భర్తను పిలవని ఫంక్షన్ కు నేనైతే అస్సలు వెళ్లనని అంటుంది. ఇక సత్యం ఈ ఇంట్లో నుంచి కేవలం రవి శృతి మాత్రమే వెళ్తారు. ఇంకెవ్వరు వెళ్లడానికి వీల్లేదని సత్యం అంటాడు. అదే సమయం రవి, శృతి కూడా ఇంటికి తిరిగి వస్తారు. ఎక్కడికి వెళ్ల కూడదని అనుకుంటున్నారని అడుగుతారు. దాంతో మీనా జరిగిన విషయాన్ని చెబుతుంది. బాలు మీ అమ్మగారు నీ ఫంక్షన్ కు రావొద్దని చెప్పారని చెబుతుంది. దాంతో మా అమ్మకు ఏంటీ ప్రాబ్లం, ఇంతకీ అత్తమ్మకి ఏంటీ సమస్య అని అడుగుతుంది. నేను మా అమ్మతో మాట్లాడుతాను. మా ఫంక్షన్ లో బాలు, మీనా తప్పకుండా ఉండాలని అంటుంది. అందరూ రావాల్సిందే మామయ్య అని సత్యంతో అనడంతో సరే అందరం కలిసి వెళ్దామని సత్యం ఒప్పుకుంటాడు.
ఇక బాలు రావొద్దని చెప్పిన వినడం లేదని, ఫంక్షన్ కు అందరం వస్తున్నామని ప్రభావతి శృతి వాళ్ల అమ్మకు ఫోన్ చేసి చెబుతుంది. దాంతో ఆమె కూడా సరేనని అంటుంది. ఏదైనా గొడవ జరిగే బాధ్యత మీదేనని అంటుంది. అందుకు బాలు నోరు మెదపకుండా చూసుకుంటానని చెబుతుంది ప్రభావతి. మరోవైపు రోహిణికి టెన్షన్ మొదలవుతుంది. శృతితో తనకు కూడా తాళి మార్చే ఫంక్షన్ ను చేస్తామని, రోహిణి వాళ్ల తండ్రిని మలేషియా నుంచి రమ్మనని ప్రభావతి అనడంతో కంగారు పడుతుంది. లేని తండ్రిని ఎక్కడి నుంచి తీసుకురావాలని అనుకుంటుంది. ఇక ముందుగా కొంత డబ్బైతే అరెంజ్ చేసుకుంటూ ఉంటుంది. అందుకు తన అసలు తల్లికి ఫోన్ చేసి లక్ష రూపాయలు అడుగుతుంది. ఆమె తన నగ అమ్మి ఇస్తానని చెబుతుంది. ముందు ఈ సమస్య నుంచి మాత్రం బయట పడాలని చూస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











