Gunde Ninda Gudi Gantalu June 25th : ప్రభావతిపై చిర్రెత్తిపోయిన మీనా.. బాలు వల్ల రచ్చ రచ్చ
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూన్ 23వ తేదీ 449వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శృతి తాళి మార్చే ఫంక్షన్ను ఘనంగా చేయాలని వాళ్ల అమ్మ ఏర్పాట్లు చేస్తుంటుంది. ఈ క్రమంలో ప్రభావతి వాళ్లను కూడా రావాలని చెబుతుంది. కానీ బాలును మాత్రం తీసుకురావద్దని కండిషన్ పెడుతుంది. ఆ కండిషన్ కు ప్రభావతి సరేనని అంటుంది. కానీ బాలు రాకపోతే నేను కూడా రానని సత్యం ముందుకేస్తాడు. నా భర్త రాని చోటుకు నేను కూడా రానని మీనా అందరి ముందు తన నిర్ణయాన్ని చెబుతుంది. అప్పటికే శృతి రవి బయట నుంచి తిరిగి వస్తారు. ఎక్కడికి రాను అని చెబుతున్నారని అడుగుతుంది. నాతో మీనా మీ ఫంక్షన్ కి రాలేకపోతున్నామని అంటుంది. మీ అమ్మ గారే బాలుని వద్దని చెప్పారని అంటుంది. మా అమ్మతో నేను మాట్లాడతాను కానీ అందరూ తప్పకుండా ఫంక్షన్ కి రావాల్సిందేనని శృతి పట్టుబడుతుంది.
ఇక బాలు వస్తున్నాడని ప్రభావతి శృతి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్తుంది. బాలు వచ్చిన మాకు అభ్యంతరం లేదు కానీ, ఏదైనా గొడవ చేస్తే మాత్రం బాధ్యత మొత్తం మీరే వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తుంది. బాలు నోరు మెదపకుండా చూసుకునే బాధ్యత నాదని ప్రభావతి హామీ ఇస్తుంది. ఇక మరోవైపు రోహిణి తాలుమర్చే ఫంక్షన్ను కూడా అదే రోజు చేస్తానని ప్రభావతి చెప్పడంతో కంగారుపడుతుంది. తన తండ్రిని ఎలా తీసుకురావాలని ఆందోళన చెందుతుంది. ముందుగా ఫంక్షన్ కు కావలసిన డబ్బులను ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. వెంటనే వాళ్ల సొంత అమ్మ సుగుణమ్మకు ఫోన్ చేసి డబ్బులు అడుగుతుంది. సరేనని చెప్పి ఆమె అరెంజ్ చేస్తానని చెబుతుంది. ఇక జూన్ 23వ తేదీ 451 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

శృతికి తాళి మార్చే ఫంక్షన్ వాళ్ల రోహిణికి టెన్షన్ మొదలవుతుంది. తనకు కూడా తాళి మార్చే ఫంక్షన్ ను చేయాలని ప్రభావతి రోహిణిని అంటుంది. ఇక వెంటనే మీ నాన్నను కూడా మలేషియా నుంచి రమ్మనమని చెబుతుంది. దాంతో రోహిణి కంగారు పడుతుంది. ఈసారి ఎలాగైనా మీనాన్న మలేషియా నుంచి రావాల్సిందేనని, లేదంటే నీ కాపురానికే ఎసరు పడుతుందని హెచ్చరించడంతో ఎలాగైనా ఈ సమస్య నుంచి తప్పించుకోవాలని చూస్తుంది. దాంతో వాళ్ల సొంత అమ్మ సుగుణమ్మకు ఫోన్ చేసి తన పరిస్థితిని వివరిస్తుంది. తాళి మార్చే ఫంక్షన్ చేస్తున్నారని, అందుకు డబ్బులు కావాలని అడుగుతుంది. దాంతో సుగుణమ్మ తన దగ్గర ఉన్న ఒక నగను అమ్మి డబ్బులు ఏర్పాటు చేస్తానని అంటుంది. ఆ వెంటనే నగ అమ్మేసి లక్షల రూపాయల నగదు ఏర్పాటు చేస్తుంది. ఆ డబ్బును రోహిణికి ఇవ్వడానికి పార్లర్ కు వస్తుంది. అప్పటికే రోహిణిని తాళి మార్చే ఫంక్షన్ లో ఫోకస్ తనపై కాకుండా బాలుపై మళ్లించేందుకు ప్రయత్నిస్తుంది. అందుకోసం రౌడీలను పెట్టి గొడవ చేయిస్తానని అనుకుంటుంది.
బాలు కోపంతో వాళ్లను కొడుతాడు. దాంతో ఫోకస్ మొత్తం బాలు పైకి షిఫ్ట్ అవుతుంది. ఫంక్షన్ లో గొడవ చేసినందుకు బాలును అందరూ నిందిస్తున్నారు. ఆ గొడవలోంచి తను తప్పించుకోవచ్చని ప్లాన్ వేస్తుంది. ఈ విషయాన్ని మొత్తం తన స్నేహితురాలు విద్యతో చెబుతుంది. విద్య విని ఊరుకుంటుంది. ఇక రోహిణి తన పనిలో నిమగ్నమౌతుంది. అదే సమయంలో రోహిణి సొంత తల్లి సుగుణమ్మ డబ్బులు తీసుకొని పార్లర్ కు వస్తుంది. రోహిణిని రిసెప్షనిస్ట్ చెప్పడంతో టెన్షన్ పడుతుంది. వెంటనే సుగుణమ్మను పార్లర్ లోని గదిలోకి తీసుకెళ్తుంది. నాకు చెప్పకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మ.. అసలు ఇక్కడ పరిస్థితేం బాగా లేదని కంగారు పడుతుంది. ఇక సుగుణమ్మ డబ్బులు ఇవ్వడం కోసం వచ్చానని చెబుతుంది. వెంటనే లక్ష రూపాయల నగదు ఇస్తుంది. ఇక నువ్వు త్వరగా వెళ్లిపో నేను మళ్లి మాట్లాడుతాను. ఫంక్షన్ కు సంబంధించిన ఫొటోలను పంపిస్తాను చూడమని రోహిణి చెబుతుంది. సుగుణమ్మను పంపించడాని కంటే ముందే పార్లర్ కు ప్రభావతి వస్తుంది. ఆ విషయం తెలుసుకున్న రోహిణి గుండె గుబేల్ మంటుంది.
రిసెప్షనిస్ట్ తో తన అత్తను అక్కడే ఉంచమని చెబుతుంది. ఇక సుగుణమ్మకు మేకప్ వేసి కస్టమర్ లాగా కూర్చోబెడుతుంది. ఇక ప్రభావతి వెయిట్ చేసి చేసి తనే లోపలికి వస్తుంది. రాగానే నేనే వస్తున్నాను కదా అత్తయ్య, కస్టమర్స్ ఉండటం వల్ల రాలేక పోయానని అంటుంది. సరే సరేనని చెబుతుంది. తాళి మార్చే ఫంక్షన్ కోసమని షాపింగ్ కు వెళ్లాను. ఇదే దారిలో వెళ్తూ నిన్ను కలిసి మసాజ్ చేయించుకొని వెళ్దామని వచ్చాను అని చెబుతుంది. ఆ వెంటనే మలేషియా నుంచి మీ నాన్న వస్తున్నాడా? అని అడుగుతుంది ప్రభావతి. దాంతో రోహిణి వస్తున్నాడని చెబుతుంది. ఫంక్షన్ కోసమని ముందుగా 1లక్ష రూపాయలు పంపించాడని కూడా చెప్పి, తన తల్లి సుగుణమ్మ తెచ్చి ఇచ్చిన డబ్బును ఇస్తుంది. ఆ డబ్బు చూసి ప్రభావతి మురిసిపోతుంది. ఇక ఆ తర్వాత పార్లర్ నుంచి ఇంటికి వెళ్తుంది.
మరోవైపు తాళి మార్చే ఫంక్షన్ కు మౌనికాను పిలవాలని ప్రభావతి, సత్యం అనుకుంటారు. కానీ ఫంక్షన్ శృతిది కాబట్టి శృతి వాళ్ల అమ్మగారు వెళ్లి పిలిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతారు. ఏదేమైనా సత్యం, ప్రభావతి ఇద్దరూ కలిసి మౌనికా అత్తవారి ఇంటికి వెళ్తారు. దీంతో మౌనికా మామ, భర్త సంజూ వారిని హీనంగా చూస్తారు. ప్రతి మాటకు బాధపడేలా బదులిస్తారు. అయినా ప్రభావతి, సత్యం ఓర్చుకుంటారు. తమ కూతురు లేదా అని వారిని అడుగుతారు. మౌనికా కోసం ఎదురు చూస్తుంటారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది వేచి చూడాలి. ఇక ప్రోమోలో మాత్రం పగ తీర్చుకోవడానికి శృతి వాళ్ల, మరోవైపు తన సమస్య నుంచి తప్పించుకోవడానికి రోహిణి బాలును పావుగా వాడుకుంటున్నారు. బాలుతో ఫంక్షన్ లో రచ్చ రచ్చ చేయించి, నిందించాలని వ్యూహం రచించారు. ఈ క్రమంలో తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











