Gunde Ninda Gudi Gantalu June 26th : బాలుపై దుండగుల దాడి.. అయోమయంలో మీనా, సత్యం

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూన్ 25వ తేదీ 453వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రోహిణికి ప్రభావతి షాక్ ఇస్తుంది. శృతికి తాళి మార్చే ఫంక్షన్ ఉండటంతో ఇక రోహిణికి కూడా తాళి మార్చే ఫంక్షన్ చేస్తామని అంటుంది. అందుకు వెంటనే తన తండ్రిని మలేషియా నుంచి రమ్మనమని చెబుతుంది. దాంతో రోహిణికి టెన్షన్ మొదలవుతుంది. ముందుగా తన తండ్రిని తీసుకు రాలేని కాబట్టి కనీసం డబ్బులైనా అరెంజ్ చేద్దామని అనుకుంటుంది. అందుకు తన తల్లి సుగుణమ్మకు ఫోన్ చేస్తుంది. వెంటనే తనకు 1లక్ష రూపాయలు కావాలని అడుగుతుంది. మళ్లీ తనకు డబ్బులు వచ్చాక అరెంజ్ చేస్తానని చెబుతుంది. దాంతో ఆమె తన దగ్గరున్న నగలు అమ్మి మరి డబ్బులు సర్దుబాటు చేస్తుంది.

ఇక తన తండ్రి విషయంలో ప్రభావతి గానీ, ఇంకెవ్వరూ అడగకుండా ఫోకస్ మొత్తం బాలు పైకి షిఫ్ట్ చేస్తానని అంటుంది. ఫంక్షన్ లో గొడవ చేసేందుకు మనుషులను కూడా ఏర్పాటు చేశానని అంటుంది. దాంతో తనకు అసలైన సమస్య తప్పుతుంది. మరోవైపు డబ్బులు తీసుకొని తన తల్లి సుగుణమ్మ రోహిణి పార్లర్ దగ్గరకు వెళ్తుంది. తను అరెంజ్ చేసిన డబ్బులను తీసుకొచ్చి ఇస్తుంది. అదే సమయంలో ప్రభావతి పార్లర్ దగ్గరకు వస్తుంది. దాంతో రోహిణి కంగారు పడుతుంది. తన తల్లిని చూస్తుందేమోనని భయపడుతుంది. ఇక వెంటనే సుగుణమ్మకు మేకప్ వేసి గుర్తుపట్టకుండా చేస్తుంది. ఆ తర్వాత ప్రభావతిని పంపిస్తుంది. ఇక ఆ తర్వాత సత్యం, ప్రభావతి మౌనికా వాళ్ల ఇంటికి వెళ్తారు. అక్కడ ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 23వ తేదీ 453 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 453 June 26th

శృతి, రోహిణికి తాళి మార్చే ఫంక్షన్ ఉండటంతో సత్యం, ప్రభావతి ఇద్దరూ కలిసి తమ కూతురు మౌనికా ఇంటికి వెళ్తారు. అక్కడ మౌనికా భర్త సంజూ, మామ ఇద్దరూ కనిపిస్తారు. దీంతో సత్యం, ప్రభావతి వారిని పలకరిస్తారు. కానీ తండ్రి కొడుకులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. మీరు ఉన్నారో లేదో అనుకుంటూనే వస్తున్నామని ప్రభావతి అంటుంది. దాంతో మౌనికా వాళ్ల మామ అలా రావడం ఎందుకు ఈసారి ఉన్నామో లేదో తెలుసుకునే రండి. అనవసరంగా ముందే రాకండి, కనీసం ఫోనైనా చేసి రండి అని గుర్రుగా మాట్లాడుతాడు. దాంతో సత్యం, ప్రభావతి బాధపడుతారు. ఇక వాళ్లు ఏమన్నా కూడా వెళ్లి సోఫాపై కూర్చొంటారు. ఎంత మంచిగా మాట్లాడాలని ప్రయత్నించినా కూడా సూటి పోటు మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇక మౌనికా రాగానే ప్రేమగా దగ్గరకు తీసుకుంటారు. ఎందుకు వచ్చారని అడగటంతో తమ ఇంట్లో రెండు ఫంక్షన్లు ఉన్నాయని, మీరందరూ హాజరు కావాలని ఆహ్వానిస్తారు.

రోహిణికి, శృతి తాళి మార్చే ఫంక్షన్ ను చేస్తున్నామని, మీరందరూ తప్పకుండా హాజరు కావాలని అంటుంది. శృతి అంటే నాతో ఎంగేజ్ మెంట్ అయ్యి క్యాన్సిల్ చేసుకుంది కదా ఆమెనే కదా అని సంజూ దెప్పి పొడుస్తాడు. దాంతో సంజూ తండ్రి అవునని అంటాడు. అయినా కూడా సత్యం, ప్రభావతి సైలెంట్ గానే ఉంటారు. మౌనికాతో పాటు అందరూ రావాలని కోరుతారు. కానీ మౌనికాను భర్త సంజూ, మామ బెదిరిస్తారు. దాంతో మౌనికా మేం రామబోమని చెబుతుంది. సడెన్ గా మౌనికా అలా అనడంతో ప్రభావతి, సత్యం కంగారు పడుతారు. వాళ్లు రాకపోతే అక్కడ ఫంక్షన్ ఏం ఆగదు కదా అని మౌనికా కఠినంగా మాట్లాడుతుంది. దీంతో సత్యం, ప్రభావతి మౌనం తిరిగి బయటికి వెళ్లిపోతారు. ఇక బయటికి వెళ్లిన తర్వాత ప్రభావతి మండిపడుతుంది. అసలు మన మౌనికా పూర్తిగా మారిపోయిందని అంటుంది. మన కూతురిలా అస్సలు మాట్లాడటం లేదని కోపం చేస్తుంది. ఇక సత్యం ప్రభావతిని కూల్ చేసి తిరిగి ఇంటికి తీసుకెళ్తారు.

మరోవైపు తన తల్లిదండ్రులు సత్యం, ప్రభావతికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు బాధపడుతుంది. తన పుట్టింట్లో జరుగుతున్న ఫంక్షన్ కు వెళ్లలేకపోతున్నానని కిచెన్ దగ్గర కూర్చొని ఏడుసతూ ఉంటుంది. ఆ వెనకాలే సంజూ వచ్చి మౌనికాను మళ్లి ఇబ్బంది పెడుతాడు. అలా మీ అమ్మనాన్నకు వ్యతిరేకంగా మాట్లాడి మా ఇంటిపై కపట ప్రేమను వొలకబోస్తున్నావా? అని సంజూ అంటాడు. నీ నాటకాలన్నీ నాకు తెలుసే అని మౌనికాను తిడుతాడు. మీకు నచ్చని పనిని నేనెందుకు చేస్తానని, మీకు నచ్చలేదు కాబట్టే నేను రానని చెప్పానని అంటుంది. శృతి వల్ల మీకు అవమానం జరిగింది కాబట్టే నాకు కూడా వెళ్లాలని లేదని చెబుతుంది. మా ఇంటి మీద నీ ప్రేమ ఎందుకే అని సంజూ అంటాడు. మీరు నా మెడలో తాళి కట్టినప్పుడే ఇది నా ఇల్లు కూడా అయ్యిందని మౌనికా బదులిస్తుంది. దాంతో సంజూ కోపంతో ఊగిపోతాడు. ఎదురు సమాధానం ఇస్తున్నావేంటీ మౌనికా గొంతు పట్టుకొని నులుముతాడు. అదే సమయంలో సంజూ తల్లి సువర్ణ వచ్చి మౌనినాను కాపాడుతుంది. సంజూ చెంప చెల్లుమనిపిస్తుంది. మౌనికాను ఇంట్లోకి తీసుకెళ్తుంది.

ఇక శృతి, రోహిణి తాళి మార్చే ఫంక్షన్ ఉంటడంతో అందరూ షాపింగ్ చేసి వస్తారు. రాత్రి హాలులో కూర్చొని శృతి, రోహిణి, అత్త ప్రభావతి ఏఏ చీర కట్టుకోవాలో చూసుకుంటారు. మ్యాజింగ్ గాసులు, జ్యూయెల్లరీ కూడా సెలెక్ట్ చేసుకుంటారు. ఇక అక్కడే ఉన్న మీనాకు మాత్రం కొత్త చీరను ఇవ్వరు. మార్నింగ్ అందరూ రెడీ అయ్యి ఫంక్షన్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉంటారు. ప్రభావతి, శృతి పట్టు చీరల్లో మెరిసిపోతారు. ఇక మీనా సాదా చీరకట్టులో ఉంటుంది. దాంతో బాలు బయటికి వెళ్లి కొత్త చీర కొనిస్తాడు. ఇదే చీరలో ఫంక్షన్ కు రావాలని అంటాడు. మీనా కూడా సరేనని తన భర్త బాలు తీసుకొచ్చిన చీర కట్టుకొని వస్తుంది. ఇక అందరూ కలిసి ఫంక్షన్ హాలుకు వెళ్తారు. అక్కడ శృతి వాళ్ల అమ్మ, నాన్నలు వీరికి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. శృతి వాళ్ల నాన్నకు ప్రభావతి, సత్యం, బాలు అంటే అస్సలు నచ్చకపోయినా నమస్కారం పెట్టి మరీ పలకరిస్తాడు. అందరూ ఫంక్షన్ హాలు లోపలికి వెళ్తారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X