Gunde Ninda Gudi Gantalu June 27th : బాలుపై రౌడీలతో దాడి.. రోహిణి, శోభ కుట్రకు బలి

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూన్ 26వ తేదీ 453వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శృతికి తాళి మార్చే ఫంక్షన్ ఉండటంతో శృతి వాళ్ల అమ్మ గ్రాండ్ ఫంక్షన్ కు ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు సత్యం, ప్రభావతి కూడా తమ కోడలు తాళి మార్చే ఫంక్షన్ కోసం అందరినీ ఆహ్వానిస్తూ ఉంటారు. ఈ క్రమంలో మౌనికాను, వాళ్ల అత్తగారిని కూడా పిలుస్తారు. కానీ వాళ్లు రాకపోగా మౌనికాతో కూడా రామని చెప్పిస్తారు. తన భర్త సంజూ, మామకు భయపడుతూ మౌనికా తల్లిదండ్రులు సత్యం, ప్రభావతితో చాలా కఠినంగా మాట్లాడుతుంది. దాంతో ప్రభావతి తన కూతురు మౌనికా చాలా మారిపోయిందని బాధపడుతుంది. సత్యం సర్ది చెబుతాడు. ఇక తన తల్లిదండ్రులతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడినందుకు మౌనికా చాలా బాధపడుతుంది.

మరోవైపు తన భర్త సంజూ మాత్రం మౌనికాపై చేయి చేసుకుంటాడు. కొత్తగా మా ఇంటిపై ప్రేమను కుమ్మరిస్తున్నావేంటే అని మండిపడుతాడు. కొత్తగా ప్రేమను వలకబోయడం ఏంటనీ అంటాడు. కొత్తగా ప్రేమ వలకబోయడం ఏం లేదని అంటుంది. మీకు నచ్చని పనని చేయడం నాకూ నచ్చదని చెబుతుంది. మన ఇంటి వాళ్లపై నాకూ బాధ్యత ఉంటుంది కదా అని అంటుంది. దాంతో సంజూ మన ఇల్లు ఏంటనీ మండిపోతాడు. మీరు నా మెడలో తాళి కట్టినప్పుడే ఈ ఇల్లు నాది అయిపోయిందని అంటుంది మౌనికా.. దాంతో సంజూ మౌనికా గొంతుపట్టుకొని గట్టిగా నొక్కుతాడు. తల్లి సువర్ణ వచ్చి అడ్డుకుంటుంది. మరోవైపు శృతి, రోహిణి తాళి మార్చే ఫంక్షన్ కు అందరూ కలిసి ఫంక్షన్ హాలు కు వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 27వ తేదీ 454 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 454 June 27th

శృతికి తాళి మార్చే ఫంక్షన్ ను వాళ్ల అమ్మ శోభ, తండ్రి సురేంద్ర ఘనంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తారు. మరోవైపు రోహిణికి కూడా తాళి మార్చే ఫంక్షన్ ను కూడా జరిపిస్తామని ప్రభావతి అంటుంది. దాంతో శృతి వాళ్ల అమ్మనాన్న కూడా రోహిణి తాళి మార్చే కార్యక్రమాన్ని తామే జరిపించేందుకు ఒప్పుకుంటారు. ఇక శృతి, రోహిణిని తీసుకొని ప్రభావతి, సత్యం ఫంక్షన్ హాలుకు వెళ్తారు. అలాగే రవి, మనోజ్ తోపాటు బాలు, మీనా కూడా వెళ్తారు. ఇలా ఇంటిల్లిపాది ఆ ఫంక్షన్ కు వెళ్తారు. అయితే ఫంక్షన్ లో ఎలాంటి గొడవ చేయొద్దని ముందుగానే బాలు దగ్గర మీనా మాట తీసుకుంటుంది. అలాగే బాలు కూడా తన తండ్రిని, భార్య మీనాను మాత్రం ఎవరైనా అవమానిస్తే అస్సలు ఊరుకోనని అంటాడు. తను కూడా ఫంక్షన్ కు వస్తానని బాలు నిర్ణయించుకొని ఉంటాడు. దాంతో కుటుంబంతో కలిసి ఫంక్షన్ హాలుకు వెళ్తారు. అక్కడ అప్పటికే శృతి కోసం వాళ్ల తల్లిదండ్రులు శోభ, సురేంద్ర ఎదురు చూస్తూ ఉంటారు.

ఇక సత్యం, ప్రభావతి తమ కొడుకులు, కోడళ్లతో ఫంక్షన్ హాలు రావడాన్ని శృతి వాళ్ల అమ్మనాన్నలు గమనిస్తారు. అప్పటికే తమ కూతురు సత్యం ఇంటి కోడలిగా ఆ చిన్న ఇంట్లో ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతుంటారు. దీంతో ఈ తాళి మార్చే ఫంక్షన్ ద్వారా పెద్ద గొడవ చేయాలని ప్లాన్ చేస్తారు. అందుకు బాలును టార్గెట్ చేస్తాడు. ముక్కు మీదనే కోపం ఉన్న బాలు అయితేనే తమ ప్లాన్ కు సరిగ్గా సరిపోతాడని భావిస్తాడు. అందుకు బాలుతో గొడవ పడమని ఇద్దరు మనుషులను కూడా ఏర్పాటు చేస్తారు. మరోవైపు రోహిణి కూడా అత్త ప్రభావతి నుంచి తప్పించుకోవడానికి బాలును అడ్డం పెట్టుకొని పెద్ద గొడవ చేయాలని భావిస్తుంది. తన తండ్రిని మలేషియా నుంచి రప్పించమని, ఫంక్షన్ కు ఇంకెప్పుడొస్తారని అత్త ప్రభావతి ఒత్తిడి పెంచుతుండటంతో రోహిణి కంగారు పడుతుంది. బాలుతో గొడవ చేయిస్తేనే తన సమస్య నుంచి బయట పడుతుందని భావిస్తుంది.

అందుకు బాలుతో మందు తాగించేందుకు ఒక మనిషిని కూడా ఏర్పాటు చేయిస్తుంది. ఎలాగైనా బాలు మందు తాగేలా చేయమని చెబుతుంది. మరోవైపు శృతి వాళ్ల నాన్న సురేంద్ర తన స్నేహితుడిగా పిలిచిన ఓ వ్యక్తితో బాలు తండ్రి సత్యంను అవమానిస్తాడు. ఫంక్షన్ కు హాజరై ముందు వరుసలో కూర్చొన్న సత్యం పక్కనే తన స్నేహితుడిని కూర్చోబెడుతాడు. ఇక సత్యాన్ని అవమానించేలా, గొడవ చేసేలా తన స్నేహితుడిని కాలు మీద కాలు వేసుకోమని చెబుతాడు. ఆ కాలుతో సత్యం కాలును తాకమని తర్వాత ఏదైనా గొడవ జరిగితే నేను చూసుకుంటానని శృతి వాళ్ల నాన్న సురేంద్ర పురమాయిస్తాడు. దాంతో అతను సురేంద్ర చెప్పినట్టుగా చేస్తాడు. సత్యం చిర్రెత్తిపోతాడు. సురేంద్ర కావాలనే తనను అవమానిస్తున్నాడని, ఈ విషయం బాలుకు తెలిస్తే అస్సలు ఊరుకోడని, పెద్ద గొడవ జరుగుతుందని మౌనంగా ఉంటాడు. తనే ముందు వరుసలో నుంచి లేచి బయటకి వెళ్లిపోతాడు.

మరోవైపు బాలు ఫంక్షన్ పూర్తయ్యే వరకు అస్సలు నోరు తెరిచి మాట్లాడను అని నిర్ణయించుకుంటాడు. ఎవ్వరు ఏమన్నా కూడా తనకు సంబంధం లేనట్టుగా ఉంటానని ఫంక్షన్ హాలులో వెనక వరుసలో కూర్చొంటాడు. బాలుతో పాటే మీనా కూడా వెనక వరుసలో కూర్చొంటుంది. ఇక ప్రభావతి రోహిణి దగ్గరకు వెళ్లి మీ నాన్న ఎప్పుడు వస్తాడని అడుగుతుంది. మలేషియా నుంచి అప్పుడు వస్తున్నాడు, ఇప్పుడు వస్తున్నాడని చెప్పడమే గానీ అస్సలు మనిషి మాత్రం కనిపించడం లేదని మండిపడుతుంది. కనీసం ఫోన్ చేసి ఇవ్వమని అంటుంది. దాంతో రోహిణి వేరే నంబర్ కు కాల్ చేసి కలవడం లేదని చెబుతుంది. దాంతో ఇక మనకు అంత టైమ్ లేదని నవ్వు త్వరగా రెడీ అవ్వమని చెప్పి వెళ్తుంది. ఆ వెంటనే రోహిణి ఏర్పాటు చేసిన మనుషుల కోసం ఎదురు చూస్తుంది. మరోవైపు శృతి వాళ్ల అమ్మ కూడా తను ఏర్పాటు చేసిన రౌడీల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక ఒకరికొకరు తెలియకుండా ముగ్గురు బాలుపై రౌడీలతో దాడి చేయించి పెద్ద గొడవ చేయించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X