Gunde Ninda Gudi Gantalu June 30th : బాలుకు టెన్షన్.. రోహిణి, శోభా కుట్రలో ట్విస్ట్

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూన్ 27వ తేదీ 454వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలుపై కుట్ర సాధించేందుకు ఓవైపు రోహిణి, మరోవైపు శృతి వాళ్ల అమ్మ శోభ కూడా బాలును ఇరికించాలని ప్రయత్నిస్తారు. అందుకోసం రౌడీలను కూడా ఏర్పాటు చేస్తారు. కానీ అప్పటికే బాలు ఫంక్షన్ లో ఎలాంటి గొడవ పడొద్దని, అసలు ఎవ్వరితోనూ మాట్లాడాల్సిన పని లేదని అనుకుంటాడు. ఫంక్షన్ లోనూ అందరి కంటే వెనకాల మీనాతో కలిసి కూర్చొంటారు. అయినా కూడా రోహిణి, శోభా బాలుపై ఎలాగైనా రౌడీలతో లొల్లి చేయించాలని ప్రయత్నిస్తారు. అందుకు ఎవరి ప్లాన్స్ లో వారు ఉంటారు.

మరోవైపు ఫంక్షన్ కు బంధువులు అందరూ వస్తారు. ఇక శృతి వాళ్ల తండ్రి సురేంద్ర బాలు తండ్రి సత్యంను అవమానించాలని, దాంతో గొడవ చేయాలని ప్రయత్నిస్తాడు. సురేంద్ర తన స్నేహితుడిని పిలిచి సత్యంను అవమానిస్తాడు. కావాలనే సత్యం పక్కన కూర్చోబెట్టి సత్యంకు తన కాలు తాకిస్తూ అవమాన పడేలా చేస్తాడు. దాంతో సత్యం బాధపడుతాడు. సురేంద్ర కావాలనే ఇలా అవమానిస్తున్నాడని, తనను రెచ్చగొట్టి గొడవ జరిపించాలని చూస్తున్నాడని గమనిస్తాడు. దాంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పక్కకు వెళ్లి గొడవ పడకుండా జాగ్రత్త పడుతాడు. ఇక మరోవైపు బాలుపైనా కొందరు దుండలు దాడి చేసే ప్రయత్నం చేస్తారు. దాంతో బాలు ఎలా స్పందించాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 30వ తేదీ 455 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 455 June 30th

శృతికి తాళి మార్చే ఫంక్షన్ ఉండటంతో వాళ్ల అమ్మ శోభా గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తుంది. తాళి మార్చే ఫంక్షన్ ద్వారా రవిని, శృతిని శాశ్వతంగా తమ ఇంటికి తీసుకొచ్చుకోవాలని ప్లాన్ చేస్తుంది. అందుకు శృతి వాళ్ల అమ్మ ఎలాగైనా ఫంక్షన్ లో ప్రభావతి, సత్యంను అవమానించి, వారిపై శృతికి మనస్సు మారేలా చేయాలని శోభా అనుకుంటుంది. ముందుగా బాలుతో ఎలాగైనా గొడవ చేయించాలని ప్రయత్నిస్తుంది. అందుకు రౌడీలను కూడా పెట్టి బాలును కొట్టించాలని అనుకుంటుంది. ఇదెలా ఉంటే ప్రస్తుతం బాలు శృతికి తాళి మార్చే ఫంక్షన్ లో మౌనంగా ఉంటాడు. ఎవ్వరితోనూ గొడవ పడొద్దని అనుకుంటాడు. అందుకే సైలెంట్ గా ఉంటాడు. ఎవ్వరూ మాట్లాడినా అస్సలు మాట్లాడడు. తెలిసిన వారు వచ్చి పలకరించినా ఏమాత్రం మాట్లాడడు. కేవలం సైగలతోనే సమాధానాలు ఇస్తాడు.

ఇక మరోవైపు శృతి తన తాళి మార్చే ఫంక్షన్ కోసమని అందంగా మస్తాబవుతుంది. తన తల్లి కొనిచ్చిన బంగారు నగలన్నీ ఒంటిపై ధరిస్తుంది. దేవతలా ముస్తాబు అవుతుంది. తన పెళ్లి కోసం శృతి వాళ్ల అమ్మ శోభా, సురేంద్ర చేయించిన నగలను పెట్టుకుంటుంది. ఒంటి నిండా బంగారు నగలను ధరించి అందంగా మెరుస్తుంది. శృతిని చూసిన వాళ్లు అందరూ మెచ్చుకుంటారు. తన స్నేహితులు కూడా తన ప్రకాశవంతమైన సౌందర్యానికి ఆకర్షితులవుతారు. ఇక ఫంక్షన్ కోసమని శృతి తనకు నచ్చిన సారీని కట్టుకుంటుంది. దీంతో వాళ్ల అమ్మ శోభ వచ్చి ఈ చీర ఎందుకు కట్టుకున్నావని అడుగుతుంది. అసలు ఇంత పెద్ద ఫంక్షన్ లో నువ్వు ఇలాంటి చీర కట్టుకుంటే ఏం బాగుంటుందని అభిప్రాయపడుతుంది. దీంతో తను కొనుక్కొచ్చిన చీరను మాత్రమే కట్టుకోవాలని చెబుతుంది. ఇక వెళ్లి తను తెచ్చిన చీరను తీసుకొచ్చేందుకు వెళ్తుంది. అలాగే పూల దండను తీసుకొని వస్తుంది.

మరోవైపు ప్రభావతి కూడా ఆచారం ప్రకారం శృతి అత్తవారు తెచ్చి ఇచ్చిన చీరను మాత్రమే కట్టుకోవడం పద్ధతి అని చెబుతుంది. అందుకు ఆమె తెచ్చిన చీరనే కట్టుకోవాలని తను కొనుక్కొచ్చిన చీరను తీసుకుని శృతి గదిలోకి వెళ్తుంది. అప్పటికే శృతి వాళ్ల అమ్మ శోభ కాస్ల్టీ పట్టు చీర పట్టుకొని శృతి గదిలోకి వెళ్తుంది. అది ముందుగానే బాలు, మీనా, కామాక్షి గమనిస్తారు. ఇక అదే సమయంలో ప్రభావతి కూడా ఆ గదిలోకి చీర, పూల దండ పట్టుకొని వెళ్లే ప్రయత్నం చేస్తుంది. దాంతో కామాక్షి వెళ్లి అడ్డుకుంటుంది. లోపలికి శృతి వాళ్ల అమ్మ చీర పట్టుకొని వెళ్లిందని చెబుతుంది. మనం తెచ్చిన చీరను కట్టుకోవడానికి శోభ ఇష్ట పడటం లేదని, వారి స్థాయికి తగ్గ చీరను కట్టించాలని అనుకుంటున్నారని ప్రభావతితో చెబుతుంది. ఎంత ఉన్న వారైనా ఆచారం ఆచారమే కదా అని ప్రభావతి అంటుంది. అలా తమకు ఇష్టమొచ్చినట్టు చేస్తే ఊరుకునేది లేదని అంటుంది. శృతి తప్పకుండా తను తెచ్చిన చీరనే కట్టుకోవాలని మొండికేస్తుంది.

ఇక ప్రభావతి లోపలికి తను తీసుకొచ్చిన చీర, పూల దండ పట్టుకొని వెళ్తుంది. అప్పటికే అక్కడ శృతి వాళ్ల అమ్మ ఖరీదైన పట్టుచీరతో పాటు పూల దండను తీసుకొని వచ్చి శృతిని కట్టుకోమని చెబుతుంది. దాంతో ప్రభావతి అందేంటీ ఆచారం ప్రకారం తాము తీసుకొచ్చిన చీరనే కట్టుకోవాలి కదా అని ప్రభావతి అంటుంది. అమ్మ శృతి నువ్వు ఈ చీరనే కట్టుకోవాలని తను తీసుకొచ్చిన చీరను ఇస్తుంది. కానీ శృతి వాళ్ల అమ్మ మాత్రం ఇంత పెద్ద ఫంక్షన్ లో నా కూతురు ఇంత సాదాసీదా చీరకట్టుకుంటే మా పరువు ఏమైపోతుందని అంటుంది. ఇంత ఖర్చు చేసి చేస్తున్న ఫంక్షన్ లో నా కూతురు సింపుల్ గా కనిపించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదని శృతి వాళ్ల అమ్మ తన అభిప్రాయాన్ని తెలుపుతుంది. మేం తీసుకొచ్చిన చీర కూడా ఖరీదైనదేనని ప్రభావతి సమాధానం ఇస్తుంది. ఈ విషయంలో నేను అస్సలు తగ్గను అని శోభ, ప్రభావతి ఇద్దరూ మొండికేస్తారు. ఎక్కువ గొడవ చేస్తే మా రవిని తీసుకెళ్లిపోతామని ప్రభావతి హెచ్చరిస్తుంది. మరోవైపు శృతి కూడా అత్త ప్రభావతికే సపోర్ట్ గా ఉంటుంది. దీంతో శృతి జోక్యం చేసుకుని మీరిద్దరూ గొడవ పడాల్సిన పనిలేదు. ఆ రెండు సారీల్లో ఏది కట్టుకోవాలో నేను డిసైడ్ చేస్తానని అంటుంది. అత్త ప్రభావతి తెచ్చిన చీర సాఫ్ట్ గా ఉంది కాబట్టి ఆ చీరకట్టుకుంటానని, తన తల్లి శోభ తెచ్చిన పూల దండ, నగలు ధరిస్తానని చెబుతుంది. దీంతో ఇద్దరూ కాంప్రమైజ్ అవుతారు. ఆ విధంగానే ముస్తాబై శృతి బయటికి వస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X