Gunde Ninda Gudi Gantalu July 1st: బాలును అమాయకుడ్ని చేసి ఆడుకున్న రోహిణి.. శృతి ఫంక్షన్ లో రచ్చరచ్చ

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూన్ 30వ తేదీ 455వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శృతి తాళి మార్చే ఫంక్షన్ లో బాలు ను ఎలాగైనా గొడవపడేలా చేయాలని శృతి వాళ్ళ అమ్మ శోభ అనుకుంటుంది. అందుకు ఇద్దరు మనుషులను కూడా ఏర్పాటు చేస్తుంది. వాళ్లతో బాలు కు కోపం వచ్చేలా చేయమని, బాలు మీపై చేయి చేసుకునే వరకు విసిగిస్తూనే ఉండండి అని చెబుతోంది. ఆ తర్వాత నేను మా బంధువులపై ఎలా చేయి వేస్తారని బాలు తో గొడవ పడతానని శృతి వాళ్ళ అమ్మ ప్లాన్ చేస్తుంది. ఇక శృతి వాళ్ళ అమ్మ ఏర్పాటు చేసిన ఇద్దరు మనుషులకి బాలు ఎక్కడ కూర్చున్నాడో కూడా చూపిస్తుంది. మీనా బాలు వెనుక చైర్ లలో కూర్చోవడం చూపించే ఇక వెంటనే గొడవకు దిగమని పురమాయిస్తోంది. దాంతో ఆ మనుషులు కూడా మేము చూసుకుంటామని చెప్తారు.

ఇక వాళ్ళు వెళ్లి బాలును కావాలనే రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తారు. వెనక వరుసలో కూర్చున్న బాలు దగ్గరికి వెళ్తారు. బాలుకు ఎలాగైనా కోపం తెప్పించాలని ప్రయత్నిస్తారు. అందుకు బాలు కాలును గట్టిగా తొక్కుతారు. దాంతో బాలు నొప్పితో అరుస్తాడు. బాలు పక్కనే కూర్చున్న కామాక్షి, మరోవైపు మీనా వాళ్ళిద్దరిపై మండిపడతారు. ఇక బాలు కాలు తొక్కిన వాడిని కొట్టబోతుంటాడు. దాంతో వెంటనే మీనా అడ్డుకుంటుంది. మరోవైపు కామాక్షి కూడా బాలు కోపాన్ని తగ్గిస్తుంది. బాలు కూడా ఫంక్షన్లో ఎలాంటి గొడవ జరగవద్దు అనే ఉద్దేశంతో వాళ్లతో ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. వాళ్లు కావాలని గొడవ చేయాలని చూసినా కూడా సైలెంట్ గా ఉంటారు. ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూలై 1వ తేదీ 456 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 456 July 1st

ఇక బాలు కాలును శృతి వాళ్ల అమ్మ ఏర్పాటు చేసిన మనుషులు ప్రాణం పోయేలా తొక్కుతారు. అయినా కూడా బాలు అంత మౌనంగా ఉండడంతో వాళ్ళిద్దరు షాక్ అవుతారు. ఇక శృతి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి బాలు అసలే కోపం తెచ్చుకోవడం లేదని చెబుతారు. అప్పటికే వాళ్ళు చేసిందంతా చూసిన శృతి వాళ్ళ అమ్మ కాలు తొక్కితే ఎందుకు కోపం వస్తుందని అడుగుతుంది. దాంతో బాలు కాలు తొక్కిన వ్యక్తి శృతి వాళ్ళ అమ్మ కాలును కూడా గట్టిగా తొక్కుతాడు. దాంతో ఆమె దగ్గరగా అరుస్తుంది. మిమ్మల్ని తొక్కిన దానికంటే పది రెట్లు ఎక్కువ బలంతో తొక్కానని అయినా బాలు కావాలనే కోపాన్ని అనుచుకుంటున్నాడని చెబుతాడు. ఇంట్లో వాళ్లకి గొడవకు వెళ్లకూడదని ఒట్టు వేసుకున్నట్టు కనిపిస్తుందని చెబుతాడు. ఏదేమైనా మీరు బాలుతో కచ్చితంగా గొడవపడాల్సిందేనని శృతి వాళ్ళ అమ్మ శోభ అంటుంది.

దాంతో మరొకసారి గొడవ పడడానికి వెళ్దామని చెబుతారు. రెండవ వ్యక్తి బాలుతో గొడవ పడడానికి వెళ్తాడు. అప్పటికే బాలుకు మరొక ఫోన్ రావడంతో సిగ్నల్ సరిగా రాక చైర్ లో నుంచి లేచి నిలబడతాడు. దాంతో శృతి వాళ్ళ అమ్మ ఏర్పాటు చేసిన రెండవ వ్యక్తి బాలు వీపుపై గట్టిగా చేతితో కొడతాడు. దాంతో బాలుకు చిర్రెత్తిపోతుంది. ఎవర్రా నువ్వు ఎందుకు నన్ను కొట్టాలని ప్రయత్నించావని అడుగుతాడు. నేను మా స్నేహితుడు విష్ణు అనుకొని వెనకాల నుంచి కొట్టాను అని అంటాడు. నీ స్నేహితుడైతే మాత్రం ఇంత గట్టిగా కొడతావా రా అని బాలు కోపంతో రగిలిపోతూ ప్రశ్నిస్తాడు. ఇక మీనా కూడా ఆ మనిషిపై మండిపోతుంది.

ఇందాక నీతో వచ్చిన ఒక వ్యక్తి కూడా కాలుని తొక్కేసి పట్టనట్టుగా వెళ్ళిపోతున్నాడు. కనీసం క్షమాపణలు కూడా అడగడం లేదు. ఇప్పుడు నువ్వు వచ్చి వెనకాల నుంచి మా ఆయన్ని కొట్టి నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నావు. కనీసం సారీ చెప్పాల్సిన అవసరం కూడా లేదా అని ప్రశ్నిస్తుంది మీనా. ఇప్పుడు సారీ చెప్పకపోతే ఏం చేస్తారని ఆ వ్యక్తి అంటాడు. కావాలనే గొడవకు దిగుతున్నాడని గమనించిన బాలు సారీ చెప్పకుండా పర్వాలేదు మీరు వెళ్ళండి అని అంటాడు. అయినా ఆ వ్యక్తి బాలుతో గొడవపడాలని రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు. అయినప్పటికీ బాలు సైలెంట్ గా ఉంటాడు. బాలు స్పందించకపోవడంతో ఆ వ్యక్తి తిరిగి వెళ్ళిపోతాడు. ఇక శృతి వాళ్ళ అమ్మ బాలు తో ఎలాగైనా గొడవ పెట్టుకోవాలని వారిద్దరిని హెచ్చరిస్తుంది. మరొకసారి ప్రయత్నిస్తామని ఇద్దరు బయలుదేరుతారు. మరోవైపు బాలు తన కాలు కావాలనే తొక్కిన వ్యక్తిని, మరోవైపు తన వీపుపై కొట్టిన వ్యక్తి ఫొటోను తన ఫోన్ లో తీసుకుంటాడు. ఇక ఆ ఫొటోలను తన స్నేహితుడు రాజేష్ కు పంపంచి వాళ్ల అడ్రస్ ఎక్కడ ఉంటుందో కనుక్కోమని చెబుతాడు. వాళ్లకి తర్వాత తిరిగి ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయని అంటాడు.

ఇక మరోవైపు ప్రభావతి రోహిణి వాళ్ల నాన్న మలేషియా నుండి ఇంకెప్పుడు వస్తారని ప్రశ్నిస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందని, ఫ్లైట్ దిగగానే నానే ఫోన్ చేస్తారని చెప్తుంది. ఇలా ఇంకెంతకాలం సమాధానాలు చెబుతావని ప్రభావతి మరొకసారి రోహిణి పై మండిపడుతుంది. ఇక రోహిణి మౌనంగా ఉంటుంది. సరే త్వరగా ఫంక్షన్ కి రెడీ అవ్వమని చెప్పి వెళ్తుంది. మెడలో నగలు కూడా లేవని, తన మెడలోని చైన్ తీసి ఇస్తుంది. మీ నాన్న బంగారం తీసుకొని వస్తారు కదా వచ్చాక నా చైన్ నాకు ఇష్టం లే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు బాలుతో మందు తాగించాలని ఏర్పాటు చేసిన మనిషి కూడా వస్తాడు. అతను వచ్చి ఇప్పుడు స్వర్గానికి పంపించాల్సింది ఎవరిని అని అడుగుతాడు. పైకి పంపించడం ఏంటే చంపమని చెప్పావా? అని తన స్నేహితురాలు విద్యతో అంటుంది. స్వర్గానికి అంటే తాగిన తర్వాత అందరూ వెళ్లేది స్వర్గానికే కదా అని క్లారిటీగా చెబుతాడు. దాంతో నువ్వు ఏదైనా చేయి గానీ బాలుతో మందు తాాగిస్తే చాలు అని అంటుంది. ఆ తర్వాత బాలునే గొడవ చేస్తాడని అంటుంది. ఆ తర్వాత అతనికి బాలును చూపిస్తారు. అతను బాలుతో తాగిస్తానని హామీనిస్తాడు. ఇక రోహిణి వల్ల నాన్న ఇంకా రావడం లేదు అని ప్రభావతి మనోజ్తో చెబుతుంది. వెళ్లి విషయం ఏంటో కనుక్కోమని మనోజ్ను రోహిణి దగ్గర పంపిస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X