Gunde Ninda Gudi Gantalu July 2nd: తనపై కుట్రను తెలుసుకున్న బాలు.. రోహిణిని నిలదీసిన మనోజ్
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూన్ 30వ తేదీ 455వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శృతి వాళ్ల అమ్మ పంపించిన మనుషులు తనతో కావాలనే గొడవకు దిగుతున్నారని బాలు గమనిస్తాడు. పలు మార్లు వాళ్లు బాలు కాలు తొక్కినా, వీపులో చరిచినా బాలు మౌనంగా ఉంటాడు. అయినా శృతి వాళ్ల ఏర్పాటు చేసిన మనుషులు బాలుతో ఎలాగైనా గొడవ పడాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ బాలు మాత్రం ఎంతకూ స్పందించడు. కానీ వాళ్ల ఇద్దరి ఫొటోలను మాత్రం తీసుకుంటాడు. వాళ్ల సంగతి తర్వాత చూసుకుంటానని మనస్సులో అనుకుంటాడు. అందుకే వాళ్లు మళ్లీ మళ్లీ తనతో గొడవ పడేందుకు ప్రయత్నిస్తున్నా ఓపికగా ఉంటాడు.
మరోవైపు ప్రభావతిపై రోహిణి శివ తాండవం ఆడుతుంది. ఇంకెప్పుడు మీ నాన్న మలేషియా నుంచి వస్తారని ప్ర శ్నిస్తుంది. అసలు ఎప్పుడు అడిగినా కూడా ఇప్పుడు అప్పుడు అని చెబుతున్నావ్ కానీ మనిషి మాత్రం కనిపించడం లేదు. మళ్లీ ఒకసారి ఇప్పుడు ఫోన్ చేసి నేను మాట్లాడుతాను అని అంటుంది. దాంతో రోహిణి నేను ఇప్పటికే చాలా సార్లు ఫోన్ చేశాను అని చెబుతుంది. కావాలంటే మీ ముందు కూడా ఫోన్ చేస్తానని తన పాత నెంబర్ కు కాల్ చేస్తుంది. దాంతో స్విచ్ఛాఫ్ అని వస్తుంది. ఇంకా ఫ్లైట్ లోనే ఉన్నాడేమోనని బదులిస్తుంది. ఇంకెప్పుడు వస్తాడో అంటూ ప్రభావతి రోహిణిపై చిరాకు పడుతూ వెళ్లిపోతుంది. మరోవైపు బాలుతో గొడవ చేయించాలని శృతి, శోభా ఏర్పాటు చేసిన మనుషులతో ప్రయత్నిస్తారు. ఇక జూలై 2వ తేదీ 457 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

శృతి ఫంక్షన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఓవైపు శృతికి తాళి మార్చే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని శృతి వాళ్ల తల్లిదండ్రులు అనుకుంటారు. అదే సమయంలో బాలుతో గొడవ చేయించి పూర్తిగా శృతిని, రవిని తమ ఇంట్లోనే ఉంచుకోవాలని ప్లాన్ చేశారు. దాంతో వాళ్లు ఏర్పాటు చేసిన మనుషులు ఫంక్షన్ లో గొడవ చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ బాలు మాత్రం మౌనంగా ఉంటాడు. ఇక ఎలాగైనా బాలుతో గొడవ చేయాలని శృతి వాళ్ల అమ్మ వాళ్లకి మరోసారి హెచ్చరించి చెప్పడంతో మళ్లీ గొడవ పడేందుకు ప్రయత్నిస్తారు. ఇక ఈ సారి బాలు పక్కన ఎవ్వరూ లేని సమయం కోసం ఎదురు చూస్తారు. అదే సమయంలో బాలు పక్కనే కూర్చొన్న మీనాను ప్రభావతి పిలుస్తుంది. దాంతో మీనా వెళ్లేందుకు కూర్చి లోనుంచి లేస్తుంది. అప్పడు బాలు మీనాను అస్సలు వెళ్లొద్దని చెబుతాడు. నాతో వాళ్లు కావాలనే గొడవ పడుతున్నారని, నువ్వు వెళ్లిపోతే ఏదో గొడవ జరిగిలా ఉందని మీనాతో చెబుతాడు.
అందుకు మీనా స్సందిస్తూ ఇప్పుడు నేను అత్త ప్రభావతి దగ్గరకు వెళ్లకపోతే మళ్లీ ఫీలవుతుందని, ఒక్కసారి అలా వెళ్లి ఇలా వచ్చేస్తానని అంటుంది. కానీ బాలు అస్సలు వెళ్లడానికి వీల్లేదని, నువ్వు ఉంటే ఎలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్త పడే అవకాశం ఉందని అంటాడు. నేను వెళ్లి కలిసి వెంటనే వచ్చేస్తానని మీనా బాలుతో చెబుతుంది. నేను అత్తయ్య దగ్గరికి వెళ్లిన నా కళ్లు మాత్రం మీ మీదనే ఉంటాయని నచ్చ చెబుతుంది. దాంతో బాలు సరేనని మీనా పంపిస్తుంది. ఇక బాలు ఒంటరిగా కనిపించడంతో శృతి వాళ్ల అమ్మ ఏర్పాటు చేసిన మనుషులు బాలు దగ్గరికి మరోసారి కాలు తొక్కేందుకు వస్తుంటారు. అది గమనించిన బాలు తన కాళ్లను దగ్గరికి పెట్టుకుంటాడు. అదే సమయంలో తండ్రి సత్యం అటు వైపు రావడంతో ఇక వాళ్లను తన పక్కనే కూర్చోమని అడుగుతాడు. వాళ్లు ఏమైందని అడిగినా ఏమీ లేదని చెప్పి సైలెంట్ గా ఉంటాడు. ఇక ఆ రౌడీలు సత్యం ఉండటంతో పక్కకు వెళ్లి పోతారు. ఇక ప్రభావతి మళ్లీ వచ్చి సత్యాన్ని తీసుకెళ్లిపోతుంది.
ఆ తర్వాత బాలుకు మరో సమస్య వస్తుంది. రోహిణి ఏర్పాటు చేసిన తాగుబోతు వ్యక్తి బాలు దగ్గరకు వస్తాడు. బాలు పక్కన కూర్చి ఖాళీగా ఉండటంతో దానిలో కూర్చొంటాడు. ఇక ముందుగా ప్లాన్ ప్రకారమే బాలుతో మాటలు కలుపుతాడు. బాలు బాగున్నావా? అని అడుగుతాడు. ఇంతకీ నువ్వు ఎవ్వరని బాలు అతన్ని అడుగుతాడు. నువ్వు నాకు బార్ షాప్ లో అమ్లేట్ కొనిచ్చావు బాబు, అప్పుడే మర్చిపోయావా? అని మాటలు కలుపుతాడు. ఇక బాలు నాకు గుర్తుకు లేదని చెబుతాడు. నువ్వు మర్చిపోయినా నాకు బాగా గుర్తుకుంది. నీ రుణం తీర్చుకునే సమయం వచ్చిందని బయటకి వెళ్దామని అంటాడు. బయట మంచి సెటప్ ఉందని, వస్తే నీకు మజా ఉంటుందని చెప్పి బయటకి తీసుకెళ్తాడు. మరోవైపు బాలు నాకు అస్సలు వద్దని, నేను రానంటే రానని చెబుతాడు. కానీ ఆ మనిషి మత్రం బాలును బలవంతంగా బయటకి తీసుకెళ్తాడు.
మరోవైపు రోహిణి వాళ్ల నాన్న మలేషియా నుంచి ఇంకెప్పుడు వస్తాడోనని ప్రభావతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇన్నాళ్లు వాళ్ల నాన్న గురించి చెప్పడమే గానీ మనిషిని మాత్రం చూపించడం లేదని అంటుంది. మళ్లీ వెళ్లి అసలు మీ నాన్న వస్తున్నాడా? లేడా అని అడుగుదామని అనుకుంటుంది. కానీ అదే సమయంలో వృతి వాళ్ల అమ్మ వచ్చి ప్రభావతిని హెచ్చరిస్తుంది. రోహిణికి ముందు ఫంక్షన్ జరిపిద్దామని అంటుంది. వెళ్లి రోహిణిని తీసుకురండి అని చెబుతుంది. సరేనని ప్రభావతి సమాధానం చెబుతుంది. రోహిణి కోసం మా కూతురు శృతి ఫంక్షన్ ను ఆపడం ఏంటని ప్రశ్నిస్తుంది. దాంతో ఇక ముందుగా శృతికే ఫంక్షన్ కానిద్దామని ప్రభావతి అంటుంది. మరీ రోహిణి ఫీల్ అవుతుందేమో చూడండి అని అంటుంది. ఏం ఫీలవ్వదని ప్రభావతి బదులిస్తుంది. ఇక మనోజ్ పై ప్రభావతి మండిపడుతుంది. మీ మామ ఎక్కడున్నాడో తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నిస్తుంది. ఇక మనోజ్ రోహిణి దగ్గరకు వెళ్లి అంకుల్ వచ్చే ఫ్లైట్ టికెట్స్ డిటెయిట్స్ ఇవ్వమని అడుగుతాడు. దాంతో రోహిణి కొత్త అనుమానిస్తున్నావ్ ఏంటీ మనోజ్ అంటూ మాట్లాడుతూ మనోజ్ నోరు మూయిస్తుంది. మరోవైపు బాలు గొడవ చేస్తేనే తను తప్పించుకునే అవకాశం ఉందని అనుకుంటుంది. ఈ క్రమంలో తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











