Gunde Ninda Gudi Gantalu July 3rd: రోహిణి ఫ్రాడ్ అంటూ బాలు రచ్చ.. శృతిఫంక్షన్ లో కొత్త ట్విస్ట్

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూలై 2వ తేదీ 457వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలుతో గొడవ పెట్టుకోమని ఇద్దరు మనుషులను శృతి వాళ్ల అమ్మ పురమాయిస్తుంది. వాళ్లు బాలుతో ఫంక్షన్ లో గొడవ పడేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తారు. ఒకరు బాలు కాలును పచ్చడి అయ్యేలా తొక్కి కోపం తెప్పించే ప్రయత్నం చేస్తే మరొకరు వెనకాల వీపుపై చాచి కొడుతారు. బాలుకు కోపం కట్టలు తెంచుకుంటుంది. కానీ తండ్రి సత్యం, భార్య మీనా కోసం బాలు మౌనంగా ఉంటాడు. ఎవ్వరు ఎంతలా కోపం తెప్పించినా అస్సలు కోపం తెచ్చుకోకూడదని నిర్ణయించుకుంటాడు. అదే మాట మీద ఉంటాడు. చాలా శాంతంగా, ఆ ఫంక్షన్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని వెనకాల కూర్చొంటాడు.

ఇక రోహిణిపై అత్త ప్రభావతి నిప్పులు చెరుగుతుంది. మలేషియా నుంచి మీ నాన్న ఎప్పుడు వస్తాడని పదే పదే అడుగుతూ ఒత్తిడి పెంచుతుంది. దాంతో రోహిణి కంగారు పడుతుంది. ఇక రోహిణి కూడా తాళి మార్చే ఫంక్షన్ లో ఏదైనా పెద్ద గొడవ చేసి తనపై ఫోకస్ పడకుండా చూసుకోవాలని అనుకుంటుంది. ఇందుకు ఓ తాగుబోతును సెటప్ చేసి బాలుతో ఎలాగైనా తాగించమని చెబుతుంది. తాగితే బాలు కంట్రోల్ తప్పిపోతాడని, తన ముందు ఏదైనా తప్పు జరిగినా, ఎవ్వరైనా తన తండ్రి, భార్య మీనాను తక్కువ చేసి మాట్లాడిన అస్సలు ఊరుకోడని, దాంతో పెద్ద గొడవ చేస్తాడని ఊహించుకుంటుంది. ఇక రోహిణి ఏర్పాటు చేసిన తాగుబోతు మనిషి బాలు దగ్గరకు వెళ్లి కూర్చొంటాడు. నెమ్మదిగా మాటలు కలుపుతాడు. బాలును బయటికి తీసుకెళ్లి తాగించే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూలై 3వ తేదీ 458 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 458 July 3rd

శృతి తాళి మార్చే ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరుగుతుంది. రవి, శృతి సంప్రదాయ దుస్తుల్లో వేదికపై అందరినీ ఆకట్టుకుంటారు. ఇక ఆచారం ప్రకారం రవి శృతి మేడ తాళిని మార్చుతాడు. ఆ సమయంలో బంధువులు, అతిథులు అందరూ వారిని ఆశీర్వదిస్తారు. ఇక ఈ సమయంలో శృతి, రవిలు తమ తల్లిదండ్రులు, అత్తామామ ప్రభావతి, సత్యం దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ క్రమంలో సత్యం వారిని నిండునూరేళ్లు పిల్లాపాపలతో సంతోషంగా జీవించాలని దీవిస్తాడు. మరోవైపు ప్రభావతి, కిలోలు కిలోల బంగారం, సంపదను కలిగి ఉండాలని ఆశీర్వదిస్తుంది. ఇక శృతి వాళ్ల అమ్మానాన్న మాత్రం శృతి, రవి శాశ్వతంగా తమ ఇంటికే ఇల్లరికంగా రావాలని, ఈ ఫంక్షన్ తో అత్తగారింటితో శృతికి బంధం తెగిపోవాలని మనసులో అనుకుంటూ దీవిస్తుంది. ఇలా ఎవ్వరి ప్లాన్ లో వారు ఉంటారు. మనస్సులో పెద్ద కుట్రకు పూనుకుంటూ పైకి మాత్రం మంచి వారిలా నటిస్తూ ఉంటారు. ఆ తర్వాత కుటుంబ సమేతంగా ఫొటోలకూ ఫోజులిస్తారు.

ఇక రోహిణిని మరోసారి ప్రభావతి మీ నాన్న ఇంకెప్పుడు వస్తాడని అడుగుతుంది. ఆయన రాకపోతే నీ పరిస్థితి అస్సలు బాగుండదని హెచ్చరిస్తుంది. మరోవైపు మనోజ్ కూడా రోహిణిని అంకుల్ ఎప్పుడు వస్తున్నాడని అడుగుతూనే ఉంటారు. అప్పటికే శృతికి తాళి మార్చే ఫంక్షన్ పూర్తి కావడంతో ఇక రోహిణిని వేదికపై కూర్చోబెడుతారు. ఇక అందరూ రోహిణి వాళ్ల నాన్న ఇంకెప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక బాలు ఎప్పుడు వచ్చి గొడవ చేస్తాడా అని రోహిణి ఎదురు చూస్తుంది. అప్పటికే తను ఏర్పాటు చేసిన మనిషి బాలును బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడాన్ని చూసి కాస్తా ప్రశాంతంగా ఉంటుంది. కానీ త్వరగా పెద్ద గొడవ జరిగితే దాంతో తప్పించుకోవాలని చూస్తూ ఉంటుంది. మరోవైపు ప్రభావతి మాత్రం రోహిణి వాళ్ల ఇంకా రాకపోవడంతో పట్టలేని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. రోహిణి మనస్సులో ఏముందో పూర్తిగా తెలుసుకోమని మనోజ్ తో కూడా చెప్పి అడిగిస్తుంది. మనోజ్ రోహిణిని అడిగితే నువ్వు కూడా మీ అమ్మలాగే అనుమానిస్తున్నావా? అని తిరిగి ప్రశ్నించి నోరు మూయిస్తుంది. ఇండియా వరకు వచ్చిన వారికి ఈ ఫంక్షన్ కు రావడం తెలియదా? అని బదులిస్తుంది.

మరోవైపు రోహిణిని వేదికపై కూర్చోబెట్టి ఫంక్షన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. శృతి ఒంటి నిండా నగలు వేసుకోవడం చూసిన ప్రభావతి రోహిణి బోసి మెడతో కనిపించడం అవమానంగా భావిస్తుంది. అప్పటికే మలేషియా నుంచి రోహిణి వాళ్ల నాన్న వస్తున్నాడని, కిలోల్లో బంగారం తీసుకు వస్తున్నారని గొప్పలు చెబుతుంది. రోహిణి వాళ్ల నాన్న రాలేడనే నిజం తెలియక గొప్పలకు పోతుంది. ఇక చివరిగా రోహిణితో మాట్లాడుతూ మీనాన్న ఇంకెప్పుడు వస్తారు? మీ నాన్న రాకపోతే మాత్రం ఇంటికి వెళ్లాక నీకు నాచేతిలో చావే అంటుంది. అందరి ముందు నా పరువు తీస్తున్నావ్. వస్తే వస్తాడని, లేదంటే లేదని చెప్పాలి. ఇలా వస్తాడు వస్తాడు అని చెప్పి అందరి ముందు నన్ను తలదించుకునేలా చేస్తున్నావని మండిపడుతుంది. ఫోన్ కలవడం లేదని, ఎంత ప్రయత్నించినా కాల్ కలవడం లేదని, అసలేం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని రోహిణి అత్త ప్రభావతికి బదులిస్తుంది.

ఇంకోవైపు రోహిణి ఏర్పాటు చేసిన తాగుబోతు మనిషి బాలుతో మందు తాగించాలని శత విధాలు ప్రయత్నిస్తాడు. బయటికి తీసుకెళ్లి కారు పార్కింగ్ దగ్గర ఏర్పాటు చేసిన మందు సిట్టింగ్ దగ్గరకు తీసుకెళ్తాడు. అన్ని మాయమాటలు చెప్పి బాలుతో మందు తాగించే ప్రయత్నం చేస్తాడు. కానీ బాలు మాత్రం అస్సలు తాగడు. అతనితో తాగినట్టుగా నటిస్తాడు. మొదటి పెగ్ తీసుకొని అలానే చేతిలో పట్టుకుంటాడు. నెమ్మదిగా ముచ్చట్లు పెడుతూ అతనితోనే మొత్తం మందు తాగిపిస్తాడు. చివరి పెగ్ కూడా అతనితోనే తాగిస్తాడు. వేరే ప్లేస్ అయితే తాగే వాడిని కానీ, ఈ ఫంక్షన్ లో తాగలేనని, ఇవ్వాళ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తాగనని నా భార్యకు మాట ఇచ్చానని చెబుతాడు. ఇక నేను తాగితే నిజాలు మాట్లాడతానని, దాంతో గొడవలు జరిగే ప్రమాదం ఉందని అంటాడు. పైగా నా భార్యకు నచ్చని పనిని నేను చేయనని చెబుతాడు. అప్పటికే బాలు కోసం అంతటా మీనా వెతుకుతూ కారు పార్కింగ్ దగ్గరకు వెళ్తుంది. ఇక బాలు చెప్పిన మాటలు కూడా విని సంతోషిస్తుంది. బాలును పిలవగానే వస్తాడు. తనకోసం మందు తాగకపోవడంతో భర్త బాలును హగ్ చేసుకొని థ్యాంక్స్ చెబుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X