Gunde Ninda Gudi Gantalu July 4th: రోహిణికి టెన్షన్ టెన్షన్.. బాలు రచ్చతో గుట్టు రట్టు
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూలై 3వ తేదీ 458వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మలేషియా నుంచి రోహిణి వాళ్ల నాన్న ఎప్పుడు వస్తాడా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆయన అసలు లేడని, రోహిణి చెప్పిందంతా అబద్ధమనే విషయం ఎవ్వరికీ తెలియదు. దీంతో రోహిణి ఏదీ చెబితే అది నమ్మి ఊరుకుంటారు. మరోవైపు రోహిణి అత్త ప్రభావతి మాత్రం మండిపోతుంది. ఇంకెప్పుడు వస్తాడు మీ నాన్న అంటూ రోహిణిని పదే పదే అడుగుతుంది. ఓవైపు శృతికి వాళ్ల అమ్మానాన్న కిలోల లెక్కన బంగారం వేసి తాళి మార్చే ఫంక్షన్ ను చేస్తున్నారని, మీ నాన్న కూడా బంగారం తీసుకోస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నట్టు చెబుతుంది. మీ నాన్న రాకపోతే మాత్రం నీ పరిస్థితి మరోలా ఉంటుందని రోహిణిని హెచ్చరిస్తుంది. దాంతో రోహిణి కూడా చాలా టెన్షన్ పడుతుంది. సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తుంది.
మరోవైపు బాలుతో గొడవ చేయించాలని ప్రయత్నిస్తుంది. కానీ బాలు మాత్రం ఎవ్వరితో గొడవ పడకూడదని, ఎవ్వరూ ఏమన్నా కూడా సైలెంట్ గా ఉండాలని నిర్ణయించుకుంటాడు. దాంతో శృతి వాళ్ల అమ్మ శోభ ఏర్పాటు చేసిన ఇద్దరు మనుషులు బాలుతో గొడవ పడేందుకు ఎంతగానో ప్రయత్నిస్తారు. కానీ బాలు మౌనంగా ఉంటాడు. ఇక రోహిణి ఏర్పాటు చేసిన మనిషి బాలుతో ఎంతగానో తాగించాలని ప్రయత్నించి విఫలమవుతాడు. ఇలా ఇద్దరి నుంచి వచ్చని ప్రమాదం నుంచి బాలు తప్పించుకుంటాడు. తన భార్య మీనాకు, తండ్రి సత్యంకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు. ఎంతో మౌనంగా, ఓపికగా ఉంటాడు. ఇక రోహిణి ఏర్పాటు చేసిన తాగుబోతు ఎంత బలవంతం చేసినా బాలు మందు తాగకపోవడంతో మీనా సంతోషిస్తుంది. తన మాటకు విలువ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెబుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. జూలై 4వ తేదీ 459 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.?

బాలు మందు తాగకపోవడంతో మీనా ఎంతో సంతోషిస్తుంది. ఇక మీనా బాలును తీసుకొని ఫంక్షన్ హాలు లోపలికి వెళ్తుంది. అప్పటికే బాలు ఎక్కడికి వెళ్లిపోయాడోనని తండ్రి సత్యం కంగారు పడుతాడు. ఎవ్వరికీ చెప్పకుండా ఇంటికి వెళ్లిపోయాడా అని ఆలోచిస్తాడు. ఈలోగా మీనా బాలును బయటి నుంచి తీసుకొస్తుంది. రాగానే ఎక్కడికి వెళ్లిపోయావురా అని తండ్రి సత్యం బాలును అడుగుతాడు. బయటనే ఉన్నానని చెబుతాడు. ఇంతకీ రోహిణి వాళ్ల నాన్న మలేషియా నుంచి వచ్చాడా? అని బాలు అడుగుతాడు. రాలేదని చెబుతాడు. రోహిణి పెద్ద ఫ్రాడ్ నాన్న ఆయన రాడు అన్ని కట్టుకథలు చెబుతుందని అంటాడు. నవ్వు నోరు మూయమని, మౌనంగా ఉండమని, ఇక్కడ ఫంక్షన్ కూడా అయిపోయిందని సత్యం అంటాడు. ఇక వెంటనే ఇంటికి వెళ్లిపోదాం నాన్న అని బాలు అంటాడు. ఇప్పటి వరకు ఉండి భోజనాలు చేయకుండా వెళ్లిపోతే ఎలా అని సత్యం అంటాడు. ఇంతసేపు ఓపిక పట్టినట్టుగానే ఇంకాస్తా సేపు ఓపికాగా ఉండు అందరం సవ్యంగా ఇంటికి వెళ్తామని చెబుతాడు. దాంతో బాలు కూడా సరేనని అంటాడు. ఇదిలా ఉంటే ఫంక్షన్ ఇంత ప్రశాంతంగా, సజావుగా జరిగితే ఎలా అని శృతి వాళ్ల అమ్మానాన్న అనుకుంటారు. ఏదోక గొడవ చేయాలని, అలాగైతేనే శృతిని రవిని ఆ కుటుంబానికి శాశ్వతంగా దూరం చేయొచ్చని, ఇల్లరికం తీసుకెళ్లవచ్చని అనుకుంటారు.
మరోవైపు తాము ఏర్పాటు చేసిన మనుషులు ఎంత గొడవ చేద్దామని ప్రయత్నించినా బాలు కోపం తెచ్చుకోవడం లేదని అనుకుంటారు. మీనా చెప్పినట్టుగా బాలు వింటున్నాడని, అందుకే మౌనంగా ఉంటున్నాడని అంటారు. అయితే బాలుకు కోపం తెప్పించే ప్లాన్ కాకుండా బాలు ఎంతగానో ఇష్టపడే తన తండ్రి, ప్రేమించే భార్య మీనాపై నిందలు వేస్తే గొడవ చేస్తాడని అనుకుంటారు. అందుకు ముందుగా వాళ్లకు భోజనాలు ఏర్పాటు చేయించి, అన్ని రకాల వంటలు వడ్డించి, తినే సమయానికి ఈ టేబుల్ వీఐపీల కోసం ఏర్పాటు చేసిందని చెప్పి అవమానించాలని, దాంతో బాలుకు కోపం వస్తుందని గొడవ చేస్తాడని ప్లాన్ చేస్తారు. ఆ వెంటనే బాలుతో గొడవ పడటానికి ఏర్పాటు చేసిన ఇద్దరు మనుషులతో సత్యం, బాలును భోజనానికి పిలిపిస్తుంది. అందరి కంటే ముందే తమను భోజనాలకు రమ్మని పిలవడంతో బాలు సందేహం వ్యక్తం చేస్తాడు. ఇక సత్యం కూడా అనుమానిస్తాడు.
ఎందుకైనా మంచిదని బాలు, సత్యం తమకు ఏర్పాటు చేసిన టేబుల్ పై భోజనం చేయకుండా పిల్లలను కూర్చోబెట్టి భోజనం చేపిస్తాడరు. స్వయంగా వారే వడ్డిస్తారు. దాంతో మీరు ఇలా చేశారేంటని సత్యం, బాలును శృతి వాళ్ల అమ్మ శోభ అంటుంది. పిల్లల ఆకలి ముఖ్యం కదా, మనం ఆకలికి తట్టుకోగలం, మేం తరువాత తింటాములే అని చెబుతుంది. దాంతో వాళ్ల ప్లాన్ ఫెయిల్ అయ్యిందని బాధపడుతారు. ఎలాగైనా గొడవ చేయాలని, ఎక్కడ సరైన అవకాశం దొరుకుతుందా? అని ఎదురు చూస్తూ ఉంటారు. మరోవైపు రోహిణిని ప్రభావతి పక్కకు తీసుకెళ్లి ఫంక్షన్ కూడా అయిపోయింది మీ నాన్న ఇంకా రాలేదు. అసలు ఆయనకు కూతురు మీద కొంచెమైనా ప్రేమ ఉందా, ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని అంటుంది. అసలు ఇంకా రాకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నిస్తుంది. అదే నాకూ అర్థం కావడం లేదని రోహిణి బదులిస్తుంది. ఇక చేసేదేమీ లేక రోహిణిని ప్రభావతి, సత్యం ఆశీర్వదించి ఫంక్షన్ ను ముగిస్తారు.
మరోవైపు ఎలాగైనా గొడవ చేయాలని చూస్తున్న శృతి వాళ్ల అమ్మ శోభ, నాన్న సురేంద్రకు మీనా రూపంలో ఒక అవకాశం కలుగుతుంది. శృతి, రవి భోజనం చేయడానికని బయటికి వెళ్తారు. అయితే శృతి పూల దండ తీసి బెడ్ పై పెట్టి వెళ్తుంది. ఆ పూలదండతో పాటు చైన్ కూడా వస్తుంది. అది చూసిన మీనా చైన్ ను పూల దండ నుంచి తీసి మళ్లీ శృతికి తిరిగి ఇవ్వాలని అనుకుంటుంది. పూలదండ నుంచి చైన్ ను తీస్తుండగా శృతి వాళ్ల నాన్న వచ్చి చూస్తాడు. ఇక అప్పటికే గొడవ చేయాలని చూస్తున్న సురేంద్ర మీనా చైనా దొంగతనం చేస్తుందని నింద వేస్తాడు. తన భార్య శోభను పిలిచి మీనా దొంగతనం చేస్తుందని అంటాడు. దీంతో మీనాను దొంగదొంగ అంటూ నిందిస్తారు. ఇక ఆ తర్వాత ఎపిసోడ్ లో మీనాపై, సత్యంపై శృతి వాళ్ల అమ్మానాన్న చాలా నీచంగా మాట్లాడుతారు. మీనాను దొంగ అని పదేపదే అనడంతో బాలు శృతి వాళ్ల నాన్న సురేంద్ర చెంప పగలగొడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











