Gunde Ninda Gudi Gantalu July 7th: శృతి వర్సెస్ బాలు.. బలైపోయిన మీనా.. ఇంట్లో నుంచి గెంటేసిన ప్రభావతి

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూలై 4వ తేదీ 459వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శృతికి తాళి మార్చే ఫంక్షన్ ఘనంగా జరుగుతుంది. ఇక ఫంక్షన్ లో బాలుతో గొడవ చేయాలని శృతి వాళ్ల అమ్మానాన్న ఎంతగానో ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఇద్దరు మనుషులను పెట్టి మరీ బాలుపై గొడవకు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత భోజనాల ఏర్పాటుతో అవమానించాలని అనుకుంటారు. ఎందుకైనా మంచిదని బాలు, సత్యం తమకు ఏర్పాటు చేసిన టేబుల్ పై కూర్చోరు. తాము భోజనం చేయకుండా పిల్లలను కూర్చోబెట్టి భోజనం చేపిస్తారు. దాంతో సత్యం, బాలును అవమానించే అవకాశం చేజారి పోయిందని అనుకుంటారు. మరోవైపు రోహిణిపై ప్రభావతి నిప్పులు చెరుగుతుంది. మీ నాన్న ఇంకా రాలేదు. అసలు కూతురు మీద కొంచెమైనా ప్రేమ ఉందా, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని అంటుంది. ఇంకా రాకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నిస్తుంది. అదే నాకూ అర్థం కావడం లేదని రోహిణి బదులిస్తుంది. ఇక చేసేదేమీ లేక రోహిణిని ప్రభావతి, సత్యం ఆశీర్వదించి ఫంక్షన్ ను ముగిస్తారు.

మరోవైపు ఎలాగైనా గొడవ చేయాలని చూస్తున్న శృతి వాళ్ల అమ్మ శోభ, నాన్న సురేంద్రకు మీనా రూపంలో ఒక అవకాశం దక్కుతుంది. గుడికి వెళ్లాలని శృతిని పిలవమని ప్రభావతి మీనాకు చెబుతుంది. దీంతో మీనా శృతి గదిలోకి వెళ్తుంది. అప్పటికే శృతి, రవి బయటికి వెళ్తారు. ఇక శృతి గదిలో బెడ్ పై పూలదండ ఉంటుంది. ఆ పూలదండకు చైన్ చిక్కుకుని ఉంటుంది. అది చూసిన మీనా చైన్ ను తీసి శృతికి తిరిగి ఇవ్వాలని అనుకుంటుంది. దాంతో పూలదండ నుంచి చైన్ ను తీస్తుండగా శృతి వాళ్ల నాన్న వచ్చి చూస్తాడు. ఏం చేస్తున్నావని అడుగుతాడు. చైన్ పూలదండలో ఇర్కుక్కుందని తీస్తున్నాను అని బదులిస్తుంది. కాదు దొంగతనం చేస్తున్నావని అంటుంది. అంతే కాకుండా శృతి వాళ్ల తల్లి శోభాకు కూడా ఈ విషయాన్ని చెప్పి మీనాను దొంగతనం చేస్తోందని చెబుతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జూలై 7వ తేదీ 460 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 460 July 7th

మీనాను దొంగగా ముద్ర వేస్తారు శృతి వాళ్ల అమ్మ నాన్న. అసలే మంచి అవకాశం దొరికిందని ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకొని తమ కూతురు శృతి తిరిగి మళ్లీ వాళ్ల ఇంటికి వెళ్లకుండా చూసుకోవాలని అనుకుంటారు. అందుకు మీనాను నిందించి పెద్ద గొడవ చేయాలని నిర్ణయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే మీనాను దొంగ దొంగ అంటూ నిందిస్తారు. గట్టిగా మీనాపై అరుస్తారు. ఇలా ఫంక్షన్ లో మంచి దానిలా తిరుగుతూ చైన్ దొంగతనం చేస్తున్నావా? అని అడుగుతారు. దాంతో మీనా షాక్ అవుతుంది. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. పూలదండలో చిక్కుకున్న చైన్ ను తీసి శృతికి ఇద్దామని అనుకున్నానని అంటుంది. ఈలోగా బయట ఫంక్షన్ హాలులో నుంచి ప్రభావతి, కామాక్షి శృతి గదిలోకి వస్తారు. పెద్ద అరుస్తున్న శబ్ధం రాడంతో ఏమైందని వచ్చి అడుగుతుంది. మీ కోడలు దొంగతనం చేసిందని ప్రభావతితో చెబుతారు. చేతిలో చైన్ కూడా ఉంది చూడమని అంటారు. కావాలనే చైన్ ను దొంగలించి మంచిదానిలా నటిస్తోందని అంటారు.

ఇక మీనా కన్నీళ్లు పెట్టుకుంటూ శృతి గది నుంచి బయటికి వెళ్తుంది. అప్పటికే గొడవను గమనించి అటు వైపు వస్తున్న బాలు దగ్గరకు వెళ్తుంది. బాలు ముందు రోదిస్తుంది. మీనా ఏడ్వటం చూసి సత్యం, సత్యం వాళ్ల స్నేహితుడు అంతా షాక్ అవుతారు. ఇక మనోజ్, రోహిణి కూడా ఏమైందో తెలియక అలాగే చూస్తున్నారు. తాము ఏర్పాటు చేసిన తాగుబోతు వల్ల ఏదైనా గొడవ జరిగిందా? అని సందేహిస్తారు. కానీ సీన్ మొత్తం మీనాపై నడుస్తుండటం తమకు మంచిదే అయ్యిందిలే అని అనుకుంటారు. ఇక మీనాను శృతి వాళ్ల అమ్మ, నాన్న పదే పదే దొంగ దొంగ అంటూ నిందిస్తారు. మీనా మంచిదానిలా నటించి ఫంక్షన్ లో ప్రతి మూల వెతుకుతోందని, పోయిపోయి నా కూతురు చైన్ ను దొంగతనం చేయాలని చూసిందని నింద వేస్తాడు. దాంతో నా భార్య మీనా అలాంటి పని అస్సలు చేయదని బాలు అంటాడు. అలాగే సత్యం కూడా మా ఇంటి కోడలు దొంగతనం చేయదని నిజాయితీగలది అని సమర్దిస్తూ వస్తాడు.

అసలు ఏం జరిగిందని పూర్తిగా తెలుసుకునేందుకు బాలు మీనాను ప్రశ్నిస్తాడు. దాంతో మీనా శృతి గదిలో జరిగిన విషయాన్ని చెబుతుంది. పూల దండలో ఇరుక్కున్న దండను తిరిగి మళ్లీ శృతికి ఇద్దామని అనుకున్నాను. కానీ ఈయన నన్ను దొంగ అని అంటున్నారని బదులిస్తుంది మీనా. నువ్వు దొంగవి కాకపోతే మంచిదానివా? నీ కుటుంబంలో తమ్ముడు శివ కూడా బైక్ దొంగలించిన వాడే కదా. మీదంతా దొంగతనం చేసే కుటుంబమే. అలాగే బాలు జైలుకు వెళ్లి వచ్చాడు. సంపాదించే చేతకాక కారు కూడా అమ్మేసుకున్నాడు. అందుకే మీనా ఇలా దొంగతనాలకు పాల్పడుతోంది. మరోవైపు శృతి వాళ్ల అమ్మ శోభ కూడా మీనాను దొంగ దొంగ అంటూ నిందిస్తుంది. సహనం నశించిన బాలును శృతి వాళ్ల నాన్నను చెంప పగిలిపోయేలా కొడతాడు. అందే సమయంలో శృతి వస్తుంది. బాలును అడ్డుకుంటుంది. నా కళ్ల ముందే మా నాన్నను కొడుతావా? అని అంటుంది. ఇక శృతి వాళ్లతల్లి శోభ బాలుపై, ఆ కుటుంబంపై శృతికి చెడుగా చెబుతుంది. నువ్వు ఇక ఆ ఇంటికి వెళ్లడానికి వీల్లేదని చెబుతారు. దాంతో శృతి తల్లిదండ్రులతో పుట్టింటికి వెళ్తుంది. మరోవైపు బాలు మీనాను తీసుకొని ఇంటికి వెళ్తాడు. అయితే ఇంటికి వెళ్లిన తర్వాత బాలు, మీనాలను ప్రభావతి ఇంట్లో నుంచి వెళ్లిపోమని చెబుతుంది. మా తప్పు ఏముందని మీనా అడిగితే, నా చిన్న కోడలు, కొడుకు మీ వాళ్ల ఈ ఇంటికి దూరం అయ్యారని, మీరూ వెళ్లిపోవాలని అంటుంది. దాంతో వారి సామాన్లు తీసుకొని బయటికి బయల్దేరుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X