Gunde Ninda Gudi Gantalu July 8th: బాలు, మీనాను ఇంట్లో ఉండనివ్వని ప్రభావతి.. అందరికీ షాక్ ఇచ్చిన సత్యం

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూలై 7వ తేదీ 460వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శృతి తాళి మార్చే ఫంక్షన్ లో ఎలాగైనా గొడవ చేయాలని చూసిన శోభ, సురేంద్రలకు మీనా పావుగా దొరుకుతుంది. దీంతో ఆమెపై దొంగతనం నింద వేస్తారు. మీనా దొంగ దొంగ అని పదే పదే బాలు ముందు అంటారు. అప్పటికే తండ్రి సత్యంపైనా, తనపైనా శృతి వాళ్ల అమ్మానాన్న ఎన్నో మాటలు మాట్లాడినా సహనంతో ఉంటాడు. కానీ మీనాను దొంగగా ముద్ర వేసి చూపిస్తుండటంతో బాలు సహించలేకపోతాడు. ఇక సురేంద్ర చెంప చెల్లుమనిపిస్తాడు. ఇంకోసారి తన భార్యను ఏదైనా కంటే సహించేది లేదని కాలర్ పట్టుకుంటాడు. అదే సమయంలో శృతి వచ్చి బాలును నెట్టేస్తుంది. తన తండ్రిపైన చేయి చేసుకోవడానికి నీకు ఎంత ధైర్యమని ప్రశ్నిస్తుంది.

మీ నాన్న ఏం చేశాడో తెలిస్తే నువ్వే కొడతావని బాలు అంటాడు. ఆయన చేసిన పనికి ఒళ్లు మండిపోతుందని అంటాడు. ఇక చైన్ సురేంద్ర మోహాన కొట్టి మీనాను తీసుకొని వెళ్తాడు. ఇక శృతికి బాలుపై తన తల్లి శోభ చెడుగా చెబుతుంది. పెద్దాయన అని చూడకుండా మీ నాన్నపై ఆ బాలు చేయి చేసుకున్నాడని అంటుంది. నీ కోసం మేం తాపత్రాయ పడి ఇంత ఖర్చు చేసి ఫంక్షన్ చేయడం తప్పా అని ప్రశ్నిస్తుంది. మాకు మీ అత్తగారింట్లో ఏమాత్రం గౌరవం ఇవ్వకపోయినా నీ కోసం మేము తలదించుకుంటున్నాం. అయినా ఇంత పెద్ద ఫంక్షన్ చేస్తే మీనాన్నపై ఇలా బాలు చేసుకుంటాడా? ఇక నువ్వు ఆ ఇంటికి వెళ్లాల్సిన పనిలేదు. నువ్వు వెళ్లకూడదని శృతితో శోభ అంటుంది. ఇక వెంటనే శృతి బాలుపై కోపంతో తన తల్లిగారి ఇంటికి వెళ్తుంది. శృతికి సర్ది చెబుదామని రవి కూడా తన వెనకాలే వెళ్తాడు. మరోవైపు తిరిగి ఇంటికి వెళ్లిన ప్రభావతి బాలుపై కోపంతో రగిలిపోతుంది. బాలు చేసిన రచ్చపై ఇంట్లో చర్చ పెడుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జూలై 8వ తేదీ 461 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 461 July 8th

శృతికి తాళి మార్చే ఫంక్షన్ లో పెద్ద గొడవ జరిగిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. సత్యం ప్రభావతి మనోజ్ రోహిణి ముందుగా తమ ఇంటికి చేరుకుంటారు. ఇక బాలు మీనా కారులో వెళ్తూ ఉంటారు. అయితే అప్పటికే ఇంటికి చేరుకున్న ప్రభావతి బాలు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఫంక్షన్ లో అతని వల్ల పెద్ద గొడవ జరిగిందని మండిపడుతుంది. అసలు బాలు ఫంక్షన్కు రాకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతుంది. బాలు వల్ల తన పరువు మొత్తం పోయిందని ప్రభావతి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇక తన భర్త సత్యంతో బాలు ప్రవర్తన పై రచ్చ చేస్తుంది. బాలు నువ్వు వెనుక వేసుకురావడం వల్లే ఇంత దాకా వచ్చిందని నిందిస్తుంది.

ప్రతి విషయంలో బాలుకు నువ్వు మద్దతు ఇవ్వడం వలన ఇలా తయారయ్యాడని ప్రభావతి నిందిస్తుంది. మరోవైపు మనోజ్ రోహిణి లు కూడా బాలు చేసింది తప్పేనని అంటారు. కానీ సత్యం మాత్రం బాలు చేసిందాంట్లో తప్పు ఏమి లేదని అందరికీ సమాధానం ఇస్తాడు. మీరందరూ అక్కడే ఉన్నారు కదా శృతి వాళ్ళ నాన్న మీ నాన్న దొంగ అని నిందిస్తూ ఉంటే మీకు తప్పని అనిపించలేదా అని తిరిగి ప్రశ్నిస్తాడు. ఏ భర్త కైనా తన భార్యను దొంగ అని ఎవరైనా నిందిస్తే కోపం వస్తుందని, కోపం రాకపోతే అతను ఆమెకు భర్తనే కాదని అంటాడు. అప్పటివరకు బాలు ఎంత సహనంతో ఉన్నారో మీరు కూడా చూశారు కదా అని అంటాడు. సురేంద్ర కావాలని రెచ్చగొట్టాడని మీనా పై నింద వేయడంతో బాలు కోపంతో చెంప పెంప పగలగొట్టాడని అంటాడు.

ఏమైనా బాలు శృతి వాళ్ళ నాన్నను కొట్టడం సరికాదని రోహిణి అభిప్రాయపడుతుంది. శృతి వాళ్ళ నాన్న ఎంత చేసినప్పటికిని ఆయన వయసుకు మర్యాద ఇవ్వాల్సిందని అంటుంది. వాళ్ళ నాన్నని బాలు కొడితే తను ఎంత బాధపడి ఉంటుందో అర్థం చేసుకోండి అని సత్యంకి చెబుతుంది. మనోజ్ కూడా బాలు చేసింది తప్పేనని అంటాడు. ఇక శృతి రవి ఇంటికి తిరిగి వస్తారో లేదోనని ప్రభావతి ఆందోళన చెందుతూ ఉంటుంది. ఇక మరోవైపు రవి ఫంక్షన్ లో ఇంత పెద్ద గొడవ జరగడానికి కారణమా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. తన అన్న బాలు తనతో చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో సత్యం రవికి కాల్ చేస్తాడు. ఏం చేస్తున్నావ్ రా? మళ్లీ అక్కడ ఏమైనా గొడవ జరిగిందా? శృతి ఎలా ఉంది ఏమంటుంది అని అడుగుతాడు.

ఇక రవి స్పందిస్తూ శృతి చాలా కోపంగా ఉంది నాన్న అని చెబుతాడు. మా అత్తయ్య మామయ్య ప్రస్తుతానికి తనను ఏమనలేదని చెబుతాడు. కానీ ఫంక్షన్ లో ఇంత పెద్ద గొడవ జరగడంతో తాను చాలా బాధపడుతున్నానని అంటాడు. అన్న బాలు ఇలా చేయడం తనకే మాత్రం నచ్చలేదని చెబుతాడు. మన వారి వల్లనే నేను ప్రతిసారి ఇలా బాధపడాల్సి వస్తుంది నాన్న అని అంటాడు. ఇక నేను తర్వాత మాట్లాడుతానని ఫోన్ కట్ చేస్తాడు. శృతి దగ్గరికి వెళ్లి ఇంటికి వెళ్దాం పద అని అంటాడు. కానీ శృతి తను ఎక్కడికి రానని, ముఖ్యంగా తన తండ్రిని కొట్టిన బాలు ఉన్న ఇంట్లోకి అస్సలు రానని అంటుంది. మరి నేను వెళ్ళిపోతాననీ రవి బ్యాగ్ సర్దుకుంటాడు. ఇక మరోవైపు బాలు మీనా తిరిగి ఇంటికి వస్తారు. వాళ్లు వచ్చి రాగానే ప్రభావతి నానా రచ్చ చేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతుంది. మా గదిలోకి అని బాలు సమాధానం ఇస్తాడు. ఇది నీ ఇల్లు కాదు ఇకపై నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదని అంటుంది. నువ్వొక్కడివే కాదు మీ నాన్న కూడా తీసుకొని వెళ్లాల్సిందే అని చెబుతుంది. ఆ తర్వాత బాలు మీనా తమ బ్యాగ్స్ సర్దుకొని బయటికి వెళ్తూ ఉంటారు. వాళ్లతో పాటు సత్యం కూడా వెళ్ళిపోతానని ప్రభావతితో చెబుతాడు. ఈ క్రమంలో అక్కడ ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X