Gunde Ninda Gudi Gantalu July 9th: సామాన్లు సర్దుకొని వెళ్లిపోయిన బాలు, మీనా.. రవి జీవితం గందరోగళం
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూలై 8వ తేదీ 461వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శృతి ఫంక్షన్ లో మీనాకు ఘోర అవమానం జరుగుతుంది. అప్పటికే బాలుతో గొడవ చేయాలని చూసిన శృతి వాళ్ల అమ్మానాన్నకు బాలు భార్య మీనా దొరుకుతుంది. మీనా శృతి వాళ్ల నాన్న మీనాపై దొంగతనం నింద వేస్తాడు. శృతి చైన్ ను దొంగలిస్తుందని మీనాపై శృతి వాళ్ల నాన్న సురేంద్ర నింద వేస్తాడు. కావాలని గొడవను పెద్దది చేస్తాడు. ఇక విషయం బాలుకు తెలియడంతో చిర్రెత్తిపోతాడు. మీనాను పదే పదే దొంగ దొంగ అంటుండటంతో బాలుకు పట్టలేని కోపం వస్తుంది. దాంతో వెంటనే శృతి వాళ్ల నాన్న సురేంద్రను బాలు చెంప పగిలేలా కొడుతాడు. అదే సమయంలో శృతి రెస్టారెంట్ కు వెళ్లి తిరిగి వస్తుంది. తన తండ్రిని బాలు కొట్టడం చూసి కోపం తెచ్చుకుంటుంది. బాలును వెనక్కి నెట్టేసి తన తండ్రికి సపోర్ట్ గా నిలుస్తుంది.
అప్పటి వరకు తన తండ్రి సురేంద్ర ఎంత రచ్చ చేశాడో తెలియని శృతి బాలును తప్పుగా అనుకుంటుంది. మీనాపై సురేంద్ర దొంగతనం నింద వేశాడని శృతికి తెలియదు. దీంతో బాలుపై ఫైర్ అవుతుంది. నా కళ్ల ముందే మా నాన్నను ఎలా కొడుతావని ప్రశ్నిస్తుంది. నేను అత్తవారింటికి రానని తన తల్లిదండ్రులతో కలిసి వెళ్తుంది. ఆమె వెంటనే రవి వెళ్తాడు. ఇక సురేంద్రకు వార్నింగ్ ఇచ్చి బాలు మీనాను తీసుకొని ఇంటికి వెళ్తాడు. మరోవైపు బాలు, మీనా ఇంటికి వచ్చిన తర్వాత ప్రభావతి నానా రచ్చ చేస్తుంది. తన కొడుకు రవి, శృతిలను ఇంటికి రానివ్వకుండా చేసిన బాలు తన ఇంట్లో ఉండడానికి వీల్లేదని అంటుంది. దాంతో బాలు, మీనా ప్రభావతిని ఎందుకని ప్రశ్నిస్తారు. ఇక సత్యం కూడా బాలుకు సపోర్ట్ గా ఉంటాడు. నేను కూడా వాళ్లతోనే వెళ్లిపోతాను మరి అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జూలై 9వ తేదీ 462 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

ఫంక్షన్ నుంచి తిరిగి వచ్చాక ప్రభావతి ఇంట్లో నానా రచ్చ చేస్తుంది. తప్పు మొత్తం బాలుదే అని, మీనా బాలును రెచ్చగొట్టేలా చేసిందని మరింత తప్పుగా అర్థం చేసుకుంటుంది. బాలు, మీనా ఇంటికి తిరిగి వచ్చాక నానా మాటలు అంటుంది. నీవల్లనే ఫంక్షన్ మొత్తం నాశనమైందని అంటుంది. నేను అప్పటికే చెప్పాను ఈ తాగుబోతోడు ఫంక్షన్ కు వద్దని, కానీ వాడులేకపోతే నేను రానూ అంటూ పెద్ద హడావుడి చేశారు మీరు అంటూ భర్త సత్యంపై మండి పడుతుంది. ఇక సత్యం స్పందిస్తూ అసలు దాంట్లో బాలు తప్పు ఏముందని తిరిగి ప్రశ్నిస్తాడు. ఆ సురేంద్రనే మన ఇంటి కోడలిని అవమానించాడు. అలా అవమానిస్తే ఏ ఇంటి వారు ఊరుకోరు. మీరంతా సైలెంట్ గా ఉన్నా కూడా బాలు తన భార్యకు సపోర్ట్ గా మాట్లాడాడు. పదే పదే దొంగ దొంగ అంటుంటే ఎవ్వరు మాత్రం సహించరు. ఆ సురేంద్రనే కావాలని రెచ్చగొట్టాడు. అందుకని ఆయన వయస్సుకు కూడా మర్యాద ఇవ్వకుండా బాలు చేయి చేసుకుంటాడా? అని ప్రభావతి ప్రశ్నిస్తుంది. దాంతో సత్యం మౌనంగా ఉంటాడు.
ఇక మరోవైపు తన కొడుకు రవి, శృతిలు తిరిగి మళ్లీ ఈ ఇంటికి వస్తారో రారో అర్థం కావడం లేదని అంటుంది. వాళ్లు లేని ఈ ఇంట్లో బాలు, మీనా కూడా ఉండటానికి వీల్లేదని ప్రభావతి నిర్ణయిస్తుంది. నా కొడుకు కోడలు ఈ ఇంటికి దూరం చేసిన మీరిద్దరు ఈ ఇంట్లో ఉండటానికి అస్సలు అనుమతించనని అంటుంది. వాళ్లిద్దరు నీకు కొడుకు కోడలైతే మరీ మేం ఇద్దరం ఎవ్వరమని బాలు ప్రశ్నిస్తాడు. దాంతో వెంటనే ప్రభావతి నువ్వు ఎవ్వరైనా ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదంటే వీల్లేదని చెబుతుంది. ఇప్పటికిప్పుడు వాళ్లని ఇంట్లో నుంచి వెళ్లిపోమంటే ఎక్కడికి వెళ్తారు ప్రభావతి అని సత్యం అడుగుతాడు. ఎక్కడికైనా వెళ్లనివ్వు అని అంటుంది. ఆ మాటలు విన్నాక బాలుకు రోషం వస్తుంది. మీనాను తన గదిలోకి తీసుకెళ్లి బట్టలు అన్నీ సర్దుకుందామని చెబుతాడు. బట్టలను సర్దుకొని వెళ్లిపోదామని నిర్ణయించుకుంటాడు. ఇక తమ గదిలోకి వెళ్లి బట్టలన్నీ బ్యాగ్ లో సర్దుతాడు. ఆవేశపడకండి అంటూ, ఎప్పటికి నీకు అత్తయ్యకు ఉండే గొడవనే కదా ఇది అని మీనా చెప్పే ప్రయత్నం చేసినా బాలు మాత్రం అస్సలు ఆగడు. మనం వెళ్లిపోవాల్సిందేనని అంటాడు. బ్యాగ్ లు సర్దుతూ ఉంటాడు. మీనా కూడా తన దుస్తులను సర్దుకుంటుంది.
మరోవైపు రవికి శృతి మధ్య గొడవ జరుగుతుంది. ఫంక్షన్ లో జరిగిన గొడవ పక్కన పెట్టి మన ఇంటికి వెళ్లిపోదామని రవి శృతితో అంటాడు. కానీ శృతి నేను రాను అని చెబుతుంది. మా నాన్నను కొట్టిన మీ అన్న బాలు ఆ ఇంట్లో ఉన్నంత వరకు నేను రానని అంటుంది. కావాలంటే నువ్వు వెళ్లు.. నేను నిన్ను ఆపబోనని చెబుతుంది. ఇక రవి కోపంలో తన బ్యాగ్ తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు. హాల్ లోకి రాగానే అత్త శోభా కాఫీ తాగుదువు రా బాబు అంటుంది. రాత్రినుంచి ఏం తినలేదు కదా భోజనం చేయమను అని సురేంద్ర అంటాడు. ఇప్పుడు నేను ఏం తినే పరిస్థితిలో లేనని రవి చెబుతాడు. ఫంక్షన్ లో జరిగి గొడవ వల్లనే అప్సెట్ అయ్యాడని శోభ అంటుంది. విలువలేని వాళ్లు ఇంట్లో ఉంటే ఇలానే జరుగుతుందని సురేంద్ర అంటాడు. అసలు గొడవ స్టార్ట్ అయ్యింది మామయ్య వల్లనే అంట కదా.
మామయ్య మర్యాదగా మాట్లాడి ఉంటే అంతా బాగా ఉండేదని అంటాడు రవి. అయినా మీ అన్నయ్య బాలు చేయి చేసుకోవడం సరికాదు కదా అని శోభ అంటుంది. మరోవైపు బాలు మీనా వెళ్లిపోతూ తన తండ్రి సత్యంను కూడా తీసుకొని వెళ్తామంటారు. సత్యం కూడా నేనూ వెళ్లిపోతానని అంటాడు. ప్రభావతి ఒప్పుకోదు. నన్ను ఆపే హక్కు నీకు లేదని ప్రభావతిని సత్యం అంటాడు. ఇక ప్రభావతి సత్యంను వెళ్లొద్దని బాలు, మీనాను ఇంట్లోనే ఉండమని చెబుతుంది. ఇక కోపంతో తన గదిలోకి వెళ్తుంది. రాత్రి పడుకునే ముందు బాలుకు రోహిణి వాళ్ల నాన్న రాలేదనే విషయం ఆలోచనకు వస్తుంది. వెంటనే వాళ్లమ్మకు గుర్తు చేయాలని అనుకుంటాడు. కానీ తెల్లవారి టిఫిన్ చేసే సమయంలో ఇదే టాపిక్ వస్తుంది. మీ నాన్న ఎక్కడ రోహిణి అని ప్రభావతి అడుగుతుంది. మిగిలిన వారందరూ అడుగుతారు. అందుకు రోహిణి ఎలా సమాధానం ఇచ్చిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతోంది.


Click it and Unblock the Notifications











