Gunde Ninda Gudi Gantalu July 10th: రోహిణిపై ప్రభావతి గురి.. కోడలిని గజగజ వణికించిన అత్త

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూలై 9వ తేదీ 462వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఫంక్షన్ లో గొడవ చేశాడని బాలును ప్రభావతి నిందిస్తూ ఉంటుంది. అప్పటికే అమాయకురాలైన మీనాపై శృతి వాళ్ల తల్లిదండ్రులు చైన్ దొంగ అని ముద్ర వేయడంతో రగిలిపోయిన బాలు చెంపలు వాయిస్తాడు. అప్పుడు బాలుకు సపోర్ట్ గా నిల్వని ప్రభావతి నీ వల్లనే గొడవ జరిగిందని బాలును నిందిస్తుంది. నీ వల్లనే నా కొడుకు రవి, కోడలు శృతి ఇంటికి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. వాళ్లను ఇంటికి రాకుండా చేసిన నువ్వు, నీ భార్య ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదని ప్రభావతి అంటుంది. దాంతో బాలు మీనా తమ సామన్లు సర్దుకొని వెళ్లిపోవడానికి సిద్దమవుతారు. ఇదే సమయంలో తండ్రి సత్యంను కూడా ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోతున్నాని బాలు చెబుతాడు.

నా భర్తను నానుంచి వేరు చేయాలని చూస్తున్నావారా? అని ప్రభావతి బాలుపై ఫైర్ అవుతుంది. మరి నువ్వు నా తండ్రిని నాకు దూరం చేయడం సరికాదు కదమ్మా అని తిరిగి ప్రశ్నిస్తాడు. ఇక సత్యం కూడా బాలు, మీనాలతోనే వెళ్లిపోతానని అంటాడు. దాంతో ప్రభావతి గుండె జారిపోతుంది. మీరు వెళ్లిపోతే ఎలా అండీ అని అంటుంది. మీరు వెళ్లడానికి వీల్లేదని సత్యంను బతిమిలాడుతుంది. నేను ఉండాలంటే బాలు, మీనా కూడా ఇంట్లోనే ఉంటారని చెబుతాడు. ఇక వేరే దారిలేక ప్రభావతి సరేనని బాలు, మీనాను ఇంట్లోనే ఉండమని చెబుతుంది. మరోవైపు రవి శృతి వాళ్ల ఇంట్లో నుంచి తన ఇంటికే బయల్దేరు. ఇక బాలు రోహిణి వాళ్ల నాన్న మలేషియా నుంచి వచ్చాడా? లేడా? అని సందేహిస్తాడు. విషయాన్ని వెంటనే తేల్చాలని అనుకుంటాడు. తన తల్లి ప్రభావతికి చెప్పి రోహిణిని కడిగేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జూలై 10వ తేదీ 463 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 463 July 10th

బాలు, మీనా ను ఇంట్లో ఉండనిచ్చిన ప్రభావతికి ఏమాత్రం కూడా సంతోషంగా అనిపించదు. తన కొడుకు రవి తన ఇంట్లో లేరని బాధపడుతూ ఉంటుంది. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు. ఇక బాలు ప్రభావతి కి రోహిణి వాళ్ళ నాన్న మలేషియా నుండి రాలేదని విషయాన్ని గుర్తు చేయాలని అనుకుంటాడు. ఇక అందరూ కలిసి ఉదయం టిఫిన్ చేయడం కోసం డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుంటారు. ప్రభావతి మాత్రం నేను టిఫిన్ తినను అని అలిగి హాలులోనే కూర్చుంటాను అంటుంది. చూడలేక నేను ప్రభావతి దగ్గరికి వెళ్లి టిఫిన్ చేద్దాం రండి అత్తయ్య అని పిలుస్తుంది. నువ్వంటే నన్ను పిలిచేదంటూ ఫైర్ అవుతుంది. నేను టిఫిన్ తినను అని చెబుతుంది. ఇక దాంతో వెంటనే సత్యం వచ్చి ప్రభావతిని టిఫిన్ చేయడానికి తీసుకెళ్తాడు.

ఇక అందరూ టిఫిన్ తినడానికి కూర్చుంటారు. బాలు మీనా ను అమ్మ అలకావతికి టిఫిన్ పెట్టమని అంటాడు. దాంతో ప్రభావతి ఫైర్ అవుతుంది. నాతో నువ్వు అసలు మాట్లాడకని , నీ వల్లనే నా కొడుకు రవి, కోడలు శృతి మీ ఇంటికి రాకుండా దూరంగా ఉన్నారని మండిపడుతుంది. ఇంకా రోహిణి వాళ్ళ నాన్న మలేషియా నుంచి రానిదే మంచిది అయిందని అంటుంది. ఆయన వచ్చి ఉంటే ఈ గొడవ చూసి వెంటనే తిరిగి వెళ్ళిపోయేవాడని అంటుంది. అవును అసలు మీ నాన్న వచ్చాడా రాలేదా అని రోహిణిని ప్రభావతి ప్రశ్నిస్తుంది. దాంతో రోహిణి కంగారు పడుతుంది. ప్రభావతి తో పాటు మామ సత్యం కూడా మీ నాన్న ఎక్కడ అని ప్రశ్నిస్తాడు. మరోవైపు బాలు కూడా మీ నాన్న గురించి చెప్పమని ప్రశ్నిస్తూ ఉంటాడు. మీనా కూడా రోహిణి కంగారు పడకుండా ఏం జరిగిందో చెప్పమని అంటుంది. ఇలా అందరూ ఒకేసారి తన తండ్రి మలేషియా నుంచి వచ్చాడా లేదా అని ప్రశ్నించడంతో రోహిణి కంగారు పడుతుంది.

వాళ్లందరికీ, ముఖ్యంగా అత్తయ్య ప్రభావతికి ఎలా సమాధానం చెప్పాలని ఆందోళన పడుతుంది. ఇక వెంటనే తన ఆరోగ్యం బాలేదనే సీన్ క్రియేట్ చేయాలనుకుంటుంది. అందుకోసం తనకు వాంతి వచ్చినట్లుగా డైనింగ్ టేబుల్ నుంచి సడన్ లేచి వెళ్తుంది. దీంతో అందరూ మీనా వెనకాల వెళ్తారు. ఏమైందని అడుగుతూ ఉంటారు. రోహిణి ఏం సమాధానం చెప్పక ముందే ప్రభావతి రోహిణి ప్రెగ్నెంట్ అయిందని అభిప్రాయపడింది. ఇక కొన్ని లక్షణాలను అడిగి తెలుసుకుంటుంది. అందుకు రోహిణి కూడా అవునని చెబుతోంది. దీంతో ప్రభావతి ఉప్పొంగి పోతుంది. తన కోడలు రోహిణి తల్లి కాబోతుందని సంతోషంగా చెబుతోంది. ఇంకా వెంటనే రోహిణి ఆసుపత్రికి తీసుకువెళ్లి టెస్ట్ చేయించామని మనోజ్ కు చెబుతోంది. మనోజ్ వెంటనే రోహిణిని తీసుకుని ఆసుపత్రికి అని వెళ్తాడు.

దారి మధ్యలో రోహిణి స్నేహితురాలు విద్య రోహిణి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. రోహిణి రాగానే శుభాకాంక్షలు చెబుతుంది. మనోజ్ కు కూడా కంగ్రాట్స్ చెబుతుంది. ఇక మనోజ్ మాత్రం తనకు ఇప్పుడే పిల్లలు వద్దని అంటాడు. ఇప్పుడిప్పుడే ఇద్దరం ఎదుగుతూ ఉన్నామని అంతలోనే పిల్లలు అంటే కష్టమని అంటాడు. అసలే నాకు జాబు లేదని, పైగా పిల్లాడు పుడితే ఆర్థికంగా చాలా భారం అవుతుందని మనోజ్ అభిప్రాయపడతాడు. రోహిణి స్పందిస్తూ నువ్వు ఆ టెన్షన్ ఏం తీసుకోకని చెప్పి, ఆమెకు తెలిసిన కంపెనీలో మనోజ్ ను ఇంటర్వ్యూకి పంపిస్తుంది. ఇక తనకు ప్రెగ్నెన్సీ లేదని, తన తండ్రి మలేషియా నుంచి ఎప్పుడు వస్తాడని అందరూ ఒత్తిడి చేయడంతో అబద్ధం చెప్పినట్టుగా విద్యతో చెబుతుంది. ఇక తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళి తన ప్రెగ్నెన్సీ లేదని చెబుతుంది. దాంతో ప్రభావతి ఫుల్ అప్సెట్ అవుతుంది. మళ్లీ ప్రభావతి ఫోకస్ బాలో పైకి షిఫ్ట్ అవుతుంది. రవి నీ ఇంటికి తీసుకురావాల్సిన బాధ్యత నీదేనా అని ప్రభావతి కండిషన్ పెడుతుంది. ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X