Gunde Ninda Gudi Gantalu July 11th: బాలును చిక్కుల్లో పెట్టిన ప్రభావతి.. రోహిణికి దినదిన గండం

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూలై 10వ తేదీ 463వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఫంక్షన్ లో బాలు శృతి వాళ్ల నాన్నను కొట్టిన గొడవ కాస్తా సర్దుమణిగింది. దీంతో ప్రభావతి ఫోకస్ మొత్తం రోహిణివైపు మళ్లింది. రోహిణిని మీ తండ్రి మలేషియా నుంచి వచ్చాడా లేదా అని ప్రశ్నిస్తుంది. దీంతో రోహిణి కంగారు పడుతుంది. అత్త ప్రభావతే కాకుండా మిగిలిన వాళ్లందరూ తన తండ్రి మలేషియా నుంచి ఎప్పుడు వస్తారని అడగటం ప్రారంభిస్తారు. దీంతో రోహిణికి ఎలా సమాధానం ఇవ్వాలో అర్థం కాదు. దాంతో వెంటనే తను ఆరోగ్యం బాలేదు అన్నట్టుగా నాటకం ఆడాలని ప్రయత్నిస్తుంది. అలా చేయడం వల్ల అందరి ఫోకస్ తన మలేషియా తండ్రి నుంచి తప్పుతుందని, తన ఆరోగ్యంపైనా ఉంటుందని అనుకుంటుంది.

ఇక తను టిఫిన్ చేస్తున్న సమయంలో అందరూ తన తండ్రి గురించి ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తుండటంతో సడెన్ గా లేచి బయటికి వెళ్లి వాంతీ చేసుకుంటుంది. దీంతో ప్రభావతి సంతోషిస్తుంది. రోహిణి తల్లి కాబోతుందని అభిప్రాయపడుతుంది. ఇక సంతోషంలో మునిగి తేలుతుంది. వెంటనే రోహిణి ఆస్పత్రికి తీసుకెళ్లి చెక్ చేయించాలని అంటుంది. మనోజ్, రోహిణి ఇద్దరు కలిసి ఆస్పత్రికి వెళ్తారు. అక్కడ రోహిణి తన స్నేహితురాలు విద్యను కలిసి జరిగిన విషయాన్ని తెలుపుతుంది. తనకు ప్రెగ్నెన్సీ లేదని తన అత్త ఓవర్ గా ఊహించుకుంటోందని చెబుతుంది. ఇక తిరిగి ఇంటికి వెళ్లి ఆస్పత్రిలో చెక్ చేయించానని, నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని రోహిణి ప్రభావతికి తెలియజేస్తుంది. దాంతో ప్రభావతి చాలా బాధపడుతుంది. ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జూలై 11వ తేదీ 464 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 464 July 11th

రోహిణి ఇంటికి తిరిగి వచ్చి తనకు పాజిటివ్ రిపోర్ట్స్ రాలేదని, అది ప్రెగ్నెన్సీ కాదని అత్త ప్రభావతితో చెబుతుంది. దీంతో ప్రభావతి అయ్యో నేను నీకే మొదటగా బిడ్డ పుట్టాలని కోరుకున్నాను. దేవుడికి ముడుపు కూడా కట్టాను అని అంటుంది. ఇక రోహిణికి ప్రెగ్నెన్సీ కన్ఫమ్ కాకపోవడంతో మనోజ్ సంతోషిస్తాడు. అప్పటికే తనకు జాబ్ లేక ఇబ్బంది పడుతుండటం, మళ్లీ బిడ్డ పుడితే నానా తిప్పలు పడాల్సి వచ్చేదని మొత్తం ఈ సమస్య నుంచి తప్పించుకున్నానని అనుకుంటాడు. మరోవైపు ప్రభావతి అప్సెట్ అవుతుంది. రోహిణికి ప్రెగ్నెన్సీ రాలేదని మరింతగా బాధపడుతుంది. ఏదేమైనా ముందుగా రోహిణికైనా బిడ్డ పుట్టాలి, లేదంటే శృతికైనా పుట్టాలి. అంతే కానీ మీనాకు మాత్రం ముందు పిల్లలు పుట్టకూడదని ప్రభావతి అందరి ముందే మీనాను అవమానిస్తుంది. దాంతో బాలుకు కోపం వస్తుంది. వెంటనే మీనాను కిచెన్ లోకి తీసుకెళ్లి నీళ్లలో ఉప్పు, నిమ్మకాయ పిండి తాగమని చెబుతాడు. దాంతో మీనాకు వాంతీ అవుతుంది.

దాంతో బాలు హడావుడి చేస్తాడు. తన భ్యార మీనానే ముందు తల్లి కాబోతోందని సందడి సందడి చేస్తాడు. ఇక నానమ్మ సుశీలకు ఫోన్ చేసి ఆస్తి మొత్తం తనకు పుట్టే పేరు మీదనే రాయమని చెప్పు అంటూ సంతోషపడుతున్నట్టు నటిస్తాడు. అయితే మీనా తిరిగి వచ్చి తనకు ప్రెగ్నెన్సీ లేదు. ఏం లేదని చెబుతుంది. అత్తయ్య ప్రభావతిని ఆట పట్టించేందుకు బాలు ఇలా చేశాడని చెబతుంది. ప్రభావతికి కోపం కట్టలు తెంచుకుంటుంది. మరోవైపు ప్రభావతి కామాక్షిని తన గదిలోనికి తీసుకెళ్తుంది. బాలు, మీనాలపై తన అక్కసు వెల్లగక్కుతుంది. బాలు మీనాలతో తనకు చాలా ఇబ్బందిగా ఉందని చెబుతుంది. మీనాను బాలు నెత్తిలో పెట్టుకొని తిరుగుతున్నాడని అంటుంది. ఇక మీనా కూడా బాలుగాడికి వంతపాడుతూ మిమ్మల్ని చిత్ర హింస పెడుతున్నారని అంటుంది. వాళ్ల వల్ల తనకు మనశ్శాంతి లేకుండా పోయిందని వదిన కామాక్షితో చెప్పుకుంటుంది.

బాలు, మీనాకు సరైన రూమ్ లేకపోవడంతో హాలులోనే వాటేసుకొంటూ, ముద్దులు పెట్టుకుంటూ రచ్చ చేస్తున్నారని చెబుతుంది. ఎవ్వరినీ లేకచేయకుండా బాలు మీనా కోసం మల్లెపూలు కూడా తీసుకొని వచ్చి సిగ్గులేని పనులన్నీ చేస్తున్నారని అంటుంది. మొదటగా వాడికే బిడ్డ పుడితే మా అత్తగారి ఆస్తి మొత్తం కాజేయాలని చూస్తున్నాడని కామాక్షికి చెబుతూ ఉంటుంది. దీంతో కామాక్షి ప్రభావతికి చురకలు పెడుతుంది. ముగ్గురు కొడుకులను సమానంగా చూసుకోవాలని చెబుతుంది. ఒకరిని ఎక్కువ మరొకరని తక్కువగా చూసే బుద్ధిని మానుకోమని చెబుతుంది. మీ అత్తగారి సొత్తు బాలుకు వచ్చినా ఇంకాస్తా పెంపే చేస్తాడులే అని అంటుంది. మరోవైపు రవి కూడా తనతో ఫోన్ మాట్లాడటం లేదని ప్రభావతి కామాక్షికి చెబుతూ ఉంటుంది. దీంతో ప్రభావతి వెంటనే శృతితోనైనా మాట్లాడుదామని ఫోన్ చేస్తుంది.

ఇక శృతి ప్రభావతి ఫోన్ ను లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. చెప్పండి ఆంటీ అని అడుగుతుంది. బాగున్నావా? అమ్మ అని అడగటంతో ఎన్ని రోజులు కాలేదు కదా మీరు బాగున్నారా అని అడగటానికి అత్తయ్య అంటుంది. నాకు చాలా రోజులుగానే ఉందని ప్రభావతి చెబుతుంది. దీంతో వెంటనే రవి, శృతి ఉన్న ఫొటోను వాట్సాప్ లో పంపించానని, వీలైనప్పుడుల్లా చూసుకోండని శృతి చెబుతుంది. ఇక నువ్వు మన ఇంటికి రావచ్చు కదా అమ్మ అని ప్రభావతి అడుగుతుంది. మా నాన్నను కొట్టిన బాలు ఆ ఇంట్లో ఉంటే నేను రానని చెబుతుంది. ఫోన్ కట్ చేస్తుంది. శృతి ఏమన్నదో కామాక్షికి చెబుతుంది. ఇక కామాక్షి నీ కొడుకు రవి, శృతి ఇద్దరిని శాశ్వతంగా ఆ ఇంటికే ఇల్లరికంగా తీసుకు వెళ్లేందుకు శోభ, సురేంద్ర ప్లాన్ చేశారని కామాక్షి ప్రభావతితో అంటుంది. దాంతో ప్రభావతి షాక్ అవుతుంది. మరోవైపు రవి పేరు మీద పర్సల్ వస్తుంది. దాంతో రవిని ఇంటికి తీసుకురావాలని ప్రభావతి బాలుకు కండీషన్ పెడుతుంది. మరోవైపు మళ్లీ రోహిణిని మీ నాన్న ఇంకెక్కడ ఉన్నాడని, గాల్లోనే ఆయన విమానం గ్రద్ధలాగా తిరుగుతుందా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X