Gunde Ninda Gudi Gantalu July 14th: రవిని బతిమిలాడిన బాలు.. రోహిణిని వణికిస్తున్న ప్రభావతి

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూలై 11వ తేదీ 464వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు, మీనాకు సరైన రూమ్ లేదని దాంతో హాలులోనే వాటేసుకొంటూ, ముద్దులు పెట్టుకుంటూ రచ్చ చేస్తున్నారని ప్రభావతి మండిపడుతుంది. కామాక్షితో అన్ని విషయాలు చెబుతుంది. ఎవ్వరినీ లెక్క చేయకుండా బాలు మీనా కోసం మల్లెపూలు కూడా తీసుకొని వచ్చి సిగ్గులేని పనులన్నీ చేస్తున్నారని వాపోతుంది. మొదటగా మీనా, బాలుకు బిడ్డ పుడితే మా అత్తగారి ఆస్తి మొత్తం కాజేయాలని చూస్తున్నారని అంటుంది. వెంటనే కామాక్షి స్పందిస్తూ ప్రభావతికి చురకలు పెడుతుంది. ముగ్గురు కొడుకులను సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత నీపైనే ఉందని చెబుతుంది. మీ అత్తగారి సొత్తు బాలుకు వచ్చినా ఇంకాస్తా పెంపే చేస్తాడు కానీ కాజేసే రకం కాదని అంటుంది.

మరోవైపు శృతికి ప్రభావతి ఫోన్ చేస్తుంది. దాంతో శృతి చెప్పండి ఆంటీ అని మాట్లాడుతుంది. బాగున్నావా? అమ్మ అని ప్రభావతి అంటుంది. నువ్వు త్వరగా ఇంటికి తిరిగి వచ్చేయ్యొచ్చు కదా అమ్మ అని అడుగుతుంది. ఆ బాలు ఉన్న ఇంట్లోకి నేను తిరిగి రాబోనని అంటుంది. ఇదే విషయం మాట్లాడొద్దని అంటుంది. నన్ను చూడాలని అనిపిస్తే వీడియో కాల్ చేస్తా చూసేయండని కోపంగా మాట్లాడుతుంది. దాంతో ప్రభావతికి కోపం వస్తుంది. ఫోన్ కట్ చేస్తుంది. అత్త అనే భయం, భక్తి లేకుండా ఇలా మాట్లాడుతుంది ఏంటనీ కామాక్షితో అంటుంది. ఇక కామాక్షి స్పందిస్తూ నీ కొడుకు రవి, శృతి ఇద్దరిని శాశ్వతంగా ఆ ఇంటికే ఇల్లరికంగా తీసుకు వెళ్లేందుకు శోభ, సురేంద్ర ప్లాన్ చేశారని అంటుంది. దాంతో ప్రభావతికి ఆందోళన పడుతుంది. ఆ వెంటనే బాలుతో గొడవ పెట్టుకుంటుంది. వెంటనే బాలుతో గొడవ పడుతుంది. నీవల్లనే శృతి, రవి ఇంటికి రావడం లేదని, వారిని ఎలాగైనా తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత నీపైనే ఉందని అంటుంది. ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జూలై 14వ తేదీ 465 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 465 July 14th

బాలుతో ప్రభావతి గొడవ పడుతుంది. రవి, శృతి నీవల్లనే ఇంట్లో నుంచి వెళ్లిపోయారని ప్రభావతి బాలును నిందిస్తుంది. నీ వల్ల ఇంట్లో వాళ్లకు ఎవ్వరికీ ప్రశాంతత లేకుండా పోయిందని అంటుంది. దాంతో బాలు రెచ్చిపోతాడు. నా వాళ్ల ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందుల్లేవని అంటాడు. ఈ ఇంట్లో బాలు వల్ల ఎప్పుడూ ఏదోక గొడవ జరుగుతూనే ఉందని అంటుంది ప్రభావతి. దాంతో తల్లి ప్రభావతిపై బాలు మండిపడుతాడు. నీ వల్లనే అసలు ఇంట్లో జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. నువ్వు అసలు నన్ను ఎప్పుడైనా కొడుకుగా చూశావా అని ప్రశ్నిస్తాడు. ఆ వెంటనే సత్యం స్పందిస్తూ ప్రభావతిని వాయించేస్తాడు. నీ వల్లనే ఇంట్లో ప్రశాంతత లేకుండా పోతోందని మండిపడుతాడు. ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్లతో కలకలలాడాల్సిన ఇంటిని బోసిపోయేలా చేశావని అంటాడు. ఈ ఇంట్లోనే ప్రశాంతత లేకపోవడానికి కారణం నువ్వేనని మండిపడుతాడు. కావాలంటే నువ్వే అందరినీ అడగమని అంటాడు. కానీ అందరూ ప్రభావతిని చూసి వెళ్లిపోతారు.

అందరూ ప్రభావతిని దూషించడంతో బాధపడుతుంది. నా వల్ల పెద్దగా జరిగినా నష్టం ఏంటని అనుకుంటుంది. మరోవైపు శృతి వాళ్ల తల్లిదండ్రులతో షాకింగ్ గా మాట్లాడుతుంది. ఫంక్షన్ లో జరిగిన గొడవ తర్వాత శృతి వాళ్ల అమ్మ ఇంట్లోనే ఉంటుంది. ఇక అక్కడి నుంచే తన స్టూడియోకు వెళ్తూ డబ్బింగ్ చెబుతుంది. అయితే శృతి వాళ్ల అమ్మనాన్న మాత్రం శృతిని ఇంట్లోనే ఉండమని అంటారు. ఉద్యోగం చేయాల్సిన అవసరం నీకు లేదని అంటారు. కానీ శృతి మాత్రం ఏదో ఫంక్షన్ లో జరిగిన గొడవకు నేను ఎందుకు ఉద్యోగం మానేయాలి. నేను ఉద్యోగం చేస్తాను. అది నాకు ఇష్టం. ఈ విషయంలో మీరు ఎలాంటి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అంటుంది. ఆ వెంటనే డబ్బింగ్ స్టూడియోకు వెళ్తుంది. అక్కడ సీన్ కు డబ్బింగ్ చెబుతూ ఉంటుంది. తను చెప్పే డైలాగ్స్ తో రవి గుర్తుకు వస్తాడు. రవితో తన కాపురం దూరమవుతుందా? అని సందేహంలో ఉంటుంది. ఇక ఇదే సమయంలో మీనా శృతిని కలిసేందుకు డబ్బింగ్ స్టూడియోకు వస్తుంది.

మీనా స్టూడియోకు వచ్చిన సంగతి తెలుసుకొని వెళ్లి కలుస్తుంది. మీనాను చూసి ఏమాత్రం మాట్లాడదు. దాంతో మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ వెంటనే శృతి కోపం తగ్గించుకుని ఏమైందని అడుగుతుంది. ఎందుకు ఏడుస్తున్నావ్ మీనా అని అడుగుతుంది. ఎవరైనా ఏమైనా అన్నారా? వారి పేరు చెప్పు చాలు అని అంటుంది. దాంతో వెంటనే మీనా ఎవ్వరూ నన్ను ఏమనలేదని చెబుతుంది. మరి ఎందుకు ఏడుస్తున్నావని అంటుంది. నువ్వు, రవి ఎందుకు దూరంగా ఉంటున్నారని అంటుంది. మీరిద్దరు ఎందుకు మన ఇంటికి రావడం లేదని అడుగుతుంది. దానికి సమాధానం మీ ఆయన బాలు దగ్గరనే ఉందని శృతి చెబుతాడు. మా నాన్నను కొట్టిన రౌడీల ఇంటికి నేను రానని చెబుతుంది. బాలు చేసిన తప్పును నేను క్షమించనని అంటుంది. అసలు అక్కడ ఏం జరిగిందో తెలియక నువ్వు మా ఆయనను అపార్థం చేసుకుంటున్నావని మీనా అంటుంది. లేదు బాలు ఏం చేశాడో తెలుసుకోవడం కాదు.. నా కళ్లతో నేనే స్వయంగా చూశాను అంటుంది శృతి.

ఇక మీనా స్పందిస్తూ అసలు గొడవ జరిగింది బాలు వల్ల కాదని చెబుతుంది. మీ అమ్మానాన్నలు నన్ను దొంగగా ప్రచారం చేశారు. నీ గదిలో పూలమాలతో పడిపోయి ఉన్న బంగారం గొలుసును తీసి నీకు ఇద్దామని అనుకున్నాను. కానీ మీ నాన్న, అమ్మ నన్ను దొంగను చేశాను. ఇలా దొంగతనం చేసుకొని బతికే బదులు అడుక్కొని తినవచ్చు కదా అవమానించారు. అప్పటికే నా భర్త బాలు మౌనంగానే ఉన్నాడు. అసలు నీ ఫంక్షన్ లో తన వల్ల ఎలాంటి గొడవ జరగకూడదని, ఫంక్షన్ లో ఓ మూలకు కూర్చొన్నాడు. మౌనవ్రతం చేశాడు. కానీ మీ నాన్న హద్దులు దాటి మాట్లాడతంతో బాలుకు ఆవేశం వచ్చింది. అప్పటికీ బాలు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ నన్ను, నా కుటుంబం దొంగలను చేయడంతో ఆవేశం పట్టలేక చేయిచేసుకున్నాడని అంటుంది. మా వల్ల మీ కాపురాన్ని పాడుచేసుకోవద్దని సూచిస్తుంది. రవిని తీసుకొని ఇంటికి రమ్మని చెబుతుంది. అన్ని ఆలోచించి రవిని తన దగ్గరికి రప్పించుకోవాలని అనుకుంటుంది శృతి. మరోవైపు బాలు వెళ్లి రవిని కలుస్తాడు. ఇంటికి రమ్మని అంటాడు. నువ్వు రెస్టారెంట్ లో ఉండాల్సిన అవసరం లేదని చెబుతాడు. నీకోసం అమ్మానాన్న అందరూ ఎదురు చూస్తున్నారని, మీ మామ సురేంద్ర ఉచ్చులో పడొద్దని సూచిస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు శృతి కొత్త నాటకం మొదలు పెడుతుంది. తన తండ్రిని మలేషియా పోలీసులు అరెస్ట్ చేశారని, మటన్ కొట్టు మాణిక్యం(తన మలేషియా మేనమామగా నటించిన వ్యక్తి)తో చెప్పిస్తుంది. దాంతో కథ మరోవైపు మలుపు తిప్పుకోనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X