Gunde Ninda Gudi Gantalu July 15th: రోహిణికి నిద్రపట్టకుండా చేస్తున్న ప్రభావతి.. బాలు దెబ్బకు రవి, శృతి సెట్
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూలై 14వ తేదీ 465వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శృతి, రవి ఇంటికి రావడం లేదని, వారు రాకపోవడానికి అసలు కారణం బాలునే అంటూ ప్రభావతి బాలుపై మండి పడుతుంది. వాళ్లను ఎలాగైనా తిరిగి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నీదేని అంటుంది. లేదంటే అస్సలు ఊరుకునేది లేదని చెబుతుంది. ఇక బాలు స్పందిస్తూ తల్లి ప్రభావతిపై ఫైర్ అవుతాడు. అసలు గొడవలన్నీ నీతోనే అవుతున్నాయని అంటాడు. ముగ్గురు కొడుకులను సమానం చూడటం లేదని, ఏనాడైనా నన్ను కన్న కొడుకులా చూశావా? అని ప్రశ్నిస్తాడు. నా భార్య మీనాపైనా ప్రతి విషయానికి చిరాకు పడుతూ బాధపెడుతున్నావని మండిపడుతాడు. ఇక వెంటనే మీనాను తీసుకొని తన గదిలోకి వెళ్తాడు.
ఇక మీనా బాలును శాంత పరుస్తుంది. తప్పు మన వల్లనే జరిగింది కాబట్టి. మనమే శృతి, రవిలను ఇంటికి తిరిగి తీసుకు వచ్చే బాధ్యతను తీసుకుందామని అంటుంది. దాంతో వెంటనే మొదట మీనా శృతి దగ్గరకు వెళ్తుంది. శృతి డబ్బింగ్ స్టూడియోకు వెళ్లడంతో అక్కడికి వెళ్లి మాట్లాడుతుంది. నువ్వు, రవి ఇంటికి రండి అని చెబుతుంది. రౌడీలు ఉండే ఇంటికి మేము రాబోమని మీనా అంటుంది. దాంతో వెంటనే మీనా అసలు వాళ్ల తండ్రి ఏం చేశాడో, ఎలా నిందించాడో, ఎందుకు బాలు శృతి తండ్రిని కొట్టాడో పూర్తిగా వివరిస్తుంది. మరోవైపు బాలు రవి రెస్టారెంట్ కు వెళ్లి ఇంటి రమ్మని బతిమిలాడుతాడు. మీ మామ, అత్తలు నిన్ను తప్పుదోవ పట్టిస్తున్నారని చెబుతాడు. వెంటనే ఇంటికి రమ్మని అంటాడు. ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జూలై 15వ తేదీ 466 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

మనోజ్ ను తండ్రి సత్యం నిలదీస్తాడు. ఉదయం తన గదిలో నుంచి హాలులోకి రోహిణితో కలిసి వస్తాడు. మీనా ఇంకా ఏం వంట చేయలేదా అని అడుగుతాడు. దాంతో తండ్రి సత్యం రేయ్ ఎప్పుడూ తిండి గురించి ఆలోచించడమేనా, టైమ్ కు సరిగా అన్ని అయిపోవాల్సిందేనా దేనికీ ఓర్చుకోలేవా అని అంటాడు. దాంతో మనోజ్ అవును నాన్నా బాగా ఆకలి వేస్తుందని అంటాడు. ఇక సత్యం మండిపోతాడు. ఇంత వయస్సు వచ్చినా నువ్వు ఇంకా జాబ్ చేయకుండా ఇంట్లోనే ఉంటున్నావు. ఇదేం బాగా లేదని చెబుతాడు. కెనడా జాబ్ కోసమే వెయిట్ చేస్తున్నాను నాన్న అని చెబుతాడు. అదే సమయంలో బాలు కూడా వచ్చి మనోజ్ కు కౌంటర్ ఇస్తాడు. 14 లక్షలు కట్టి నువ్వు బాస్ కే జీతం ఇచ్చే జాబ్ చేయాలని అనుకుంటున్నావా? అని అంటాడు. అసలు నీకు ఇంట్లో నుంచి చిల్లి గవ్వ కూడా ఇచ్చే సమస్యే లేదని అంటాడు. ఇప్పటికే లక్షలు లక్షలు మింగేసి మా నోట్లో మట్టి కొట్టావని గుర్తు చేస్తాడు.
అయినా నీకు డబ్బులు ఇచ్చేందుకు మీ మలేషియా మామయ్య ఉన్నాడు కదా అని అంటాడు. అది జరిగే రోజు ఎలాగూ జరుగుతుందిలే అని అంటాడు. అది జరగదని చెప్పురా, ఎన్నటికీ అవ్వమని పని అది అని చెబుతాడు. ఇక వెంటనే మీనా టిఫిన్ చేద్దామని అందరినీ పిలుస్తుంది. బాలు, మనోజ్, రోహిణి, సత్యం వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తినడానికి సిద్ధం అవుతారు. ఈ సమయంలో ప్రభావతి లేకపోవడంతో బాలు సందేహిస్తాడు. అసలు అమ్మ ఎక్కడికి వెళ్లింది మీనా అని అడుగుతాడు. గదిలోనే ఉందని, టిఫిన్ కు రమ్మంటే ఏం చెప్పకుండా మొహం మీదనే తలుపు వేసిందని చెబుతుంది. దాంతో ఏమైందోలే అని తినడానికి సిద్ధం అవుతారు. అదే సమయంలో ప్రభావతి వచ్చి తింటారా బాగా తినండి. నా కొడుకు కోడలును ఇంట్లో నుంచి వెళ్లగొట్టి మీరు మాత్రం ప్రశాంతంగా కడుపు నిండా తినండి అంటూ కోపంగా మాట్లాడుతుంది. దాంతో బాలు, మనోజ్ నువ్వు కూడా వచ్చి తినమని అంటారు. కానీ ప్రభావతి మాత్రం నేను నా కొడుకు రవి ఇంటికి తిరిగి వచ్చే వరకు పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోబోనని అంటుంది.
దాంతో సత్యం, మనోజ్, రోహిణి, మీనా ప్రభావతిని తినమని చెబుతారు. చాలా సేపు ప్రభావతితో తినిపించేందుకు ప్రయత్నిస్తారు. కానీ ప్రభావతి మాత్రం తన కొడుకు రవి వచ్చే వరకు తినే సమస్యే లేదని స్పష్టం చేస్తుంది. ప్రభావతి తినకపోవడంతో సత్యం కూడా తినడం మానేస్తాడు. దాంతో రోహిణి, మనోజ్ కూడా తినకుండా సైలెంట్ గా వెళ్లిపోతారు. ఇక బాలును మీనా తిననివ్వదు. అత్తయ్యను తినిపించేలా ఏదోకటి ప్లాన్ చేయమని మీనా అంటుంది. దాంతో బాలు బయటికి వెళ్లి బిర్యానీ తెస్తాడు. అప్పటికే మనోజ్ ఆకలితో అలమటిస్తాడు. ఇక బాలు బిర్యానీ తీసుకొచ్చానని అందరం తిందామని పిలుస్తాడు. అప్పుడు కూడా ప్రభావతి తినని మారం చేస్తుంది. దీంతో మిగితా వాళ్లు కూడా తినడానికి ఒప్పుకోరు. దీంతో బాలు నిజం చెబుతున్నానని అంటాడు. అసలు ఈ బిర్యానీ నేను కొనుక్కోని వచ్చింది కాదని చెబుతాడు.
రవి రెస్టారెంట్ కు వెళ్లి అమ్మ అన్నం తినడం లేదని, నీకోసమే ఆలోచించుకుంటూ బాధపడుతుందని వాడికి చెప్పానని అంటాడు. దాంతో వెంటనే వాడే స్వయంగా అమ్మతో పాటు ఇంట్లో వాళ్లందరికీ బిర్యానీ వండి పంపించాడని చెబుతాడు. ఇప్పుడైనా తిందామని ప్రభావతితో అంటాడు. అంత ప్రేమ ఉంటే వాడే స్వయంగా తీసుకోని రావచ్చు కదా అని అంటుంది. ఇక సత్యం జోక్యం చేసుకొని వాడు వచ్చే సమయంలో వస్తాడులే ఇక మనం తిందామని అంటాడు. దాంతో ప్రభావతి మాత్రం నా కొడుకు వచ్చే వరకు నేను అస్సలు తినని అంటుంది. వెంటనే బాలు మనం తిందామని, మొత్తం తినేసి అమ్మ కూడా తిన్నదని రవితో చెబుదామని అంటాడు. దాంతో షాక్ అయిన ప్రభావతి నా కొడుకు రవి నా కోసం పంపించిన బిర్యానీ తినకపోతే ఎలా అని తింటుంది. ఈ సమయంలోనే మరోసారి రోహిణిపై వాళ్ల నాన్న టాపిక్ వస్తుంది. ఇంకా మీ నాన్న ఎక్కిన ఫ్లైట్ గద్దలాగా ఆకాశంలోనే తిరుగుతుందా అని అడుగుతుంది. దాంతో రోహిణి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉంటుంది. ఇక ప్రోమోలో రోహిణి మళ్లీ కొత్త నాటకం ప్రారంభించింది. మటన్ కొట్టే మాణిక్యాన్ని రంగంలోకి దింపి తన తండ్రి మలేషియాలో అరెస్ట్ అయినట్టు చెప్పిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications










