Gunde Ninda Gudi Gantalu July 16th: రోహిణి కొత్త నాటకం.. కోడలుకు చుక్కలు చూపించిన ప్రభావతి

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూలై 15వ తేదీ 465వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రవి, శృతి ఇంటికి తిరిగి రావడం లేదని ప్రభావతి బాలుపై నిప్పులు చెరుగుతుంది. బాలు వల్లనే వాళ్లిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఫంక్షన్ లో అందరూ బాధపడ్డారని ప్రభావతి బాలును నిందిస్తుంది. ఇక రవి, శృతిని తిరిగి ఇంటికి తీసుకు రావాల్సిన బాధ్యత నీపైనే ఉందని బాలును హెచ్చరిస్తుంది. నువ్వు ఆ సురేంద్ర కాళ్లు మొక్కైనా సరే నువ్వు శృతి, రవిని తిరిగి ఇంటికి తీసుకురావాలని అంటుంది. దాంతో బాలు వెంటనే రవిని కలిసేందుకు వెళ్లి ఇంటికి రమ్మని అడుగుతాడు. అటు మీనా కూడా శృతి దగ్గరకు వెళ్లి జరిగిన సంగతి అంత వివరిస్తుంది. ఇద్దరూ కలిసి ఇంటికి రావాలని చెబుతారు. ఇక శృతి, రవి కూడా కలిసిపోతారు. అయితే ప్రభావతి మాత్రం రవి ఇంటికి రావడం లేదని బాధపడుతుంది. ఇక భోజనం చేయడం మానేస్తుంది.

సత్యం, మనోజ్, రోహిణి, మీనా ప్రభావతిని తినమని ఎంత బ్రతిమిలాడిన తినని మారం చేస్తుంది. తన కొడుకు రవి ఇంటికి తిరిగి వచ్చే వరకు ఎలాంటి చెబుతారు. చాలా సేపు ప్రభావతితో తినిపించేందుకు ప్రయత్నిస్తారు. కానీ ప్రభావతి మాత్రం తన కొడుకు రవి వచ్చే వరకు తినే సమస్యే లేదని స్పష్టం చేస్తుంది. ప్రభావతి తినకపోవడంతో సత్యం కూడా తినడం మానేస్తాడు. దాంతో రోహిణి, మనోజ్ కూడా తినకుండా సైలెంట్ గా వెళ్లిపోతారు. ఇక బాలును మీనా తిననివ్వదు. అత్తయ్యను తినిపించేలా ఏదోకటి ప్లాన్ చేయమని మీనా అంటుంది. దాంతో బాలు బయటికి వెళ్లి బిర్యానీ తెస్తాడు. అందరిని తినమని అంటాడు. ఇక ప్రభావతిని కూడా పిలిచి తిను అమ్మ అని అంటాడు. అమ్మ ప్రభావతి కోసం రవి స్వయంగా చేసి పంపించాడని చెబుతాడు. దాంతో ప్రభావతి వెంటనే వెళ్లి బిర్యానీ తింటుంది. ఇక మరోవైపు తింటూ ఉండగానే ప్రభావతికి రోహిణి వాళ్ల నాన్న గుర్తుకు వస్తాడు. మీ నాన్న ఇంకెప్పుడు వస్తాడని, అసలు ఫ్లైట్ ఎక్కిన ఆయనకు ఏం జరిగిందని అడుగుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. జూలై 16వ తేదీ 467 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 467 July 16th

రోహిణి గదిలోకి ప్రభావతి వెళ్తుంది. ఇక తన తండ్రి మలేషియా నుంచి ఎప్పుడు వస్తాడని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ కోడలు రోహిణిని వణికిస్తుంది. మీ నాన్న ఫంక్షన్ రోజు ఎక్కిన ఫ్లైట్ ఇంకా ఆకాశంలోనే గ్రద్దలాగా తిరుగుతుందా? అని ప్రశ్నిస్తుంది. అసలు మీ నాన్నకు నీ మీద ప్రేమ ఉందా? వస్తానని చెప్పి ఇలా చివరికి మోసం చేశాడు. ఆయనకు కూతురు మీద ఇంతనైనా బాధ్యత ఉందా అని ప్రశ్నిస్తుంది. మీ నాన్న రాకపోతే మాత్రం నీ స్థాయి ఏంటో నీకు తెలిసి వచ్చేలా చేస్తానని భయపెడుతుంది. ఇంకెన్నాళ్లు మీ నాన్న బిజీగా ఉంటారు. ఆయన ఏమన్నా మలేషియాను ఏలుతున్నాడా? అసలు ఫోన్ మాట్లాడటానికి కూడా సమయం ఉండటం లేదా ఏంటీ అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి రోహిణిని గజ గజ వణికిస్తుంది. అసలు మీ నాన్న గనుక రాకపోతే నీకు కాపురానికి ఏమాత్రం గౌరవం దక్కదని హెచ్చరిస్తుంది. దీంతో రోహిణి లోలోపల కంగారు పడుతుంది. అత్త రోహిణి రోజురోజుకు ఒత్తిడి పెంచుతుండటంతో సతమతమౌతుంది.

ప్రభావతి అంతలా అరుస్తుండటంతో రోహిణి సున్నితంగానే బదులిస్తుంది. అసలు మా నాన్న ఎందుకు రావడం లేదో నాకు అర్థం కావడం లేదు. మా అమ్మ చనిపోయిన తర్వాత నాన్నతో కలిసి ఉండలేకపోయాను. ఆయన మరో పెళ్లి చేసుకోవడంతో ఇక కోపంలో ఆయనకు దూరంగా ఉంటున్నాను. ఆ తర్వాత నుంచి పెద్దగా ఆయన్ని పట్టించుకోవడం లేదని రోహిణి బదులిస్తుంది. ఇప్పుడిప్పుడే మీ కోసమే మళ్లీ మా నాన్నపై కోపాన్ని తగ్గించుకుంటానని ప్రభావతికి చెబుతుంది. దాంతో ప్రభావతి ఇంకా మండిపోతుంది. అసలు నువ్వు చెప్నేవన్నీ నిజమేనా అని సందేహిస్తుంది. పార్లర్ విషయంలో అబద్దాలు చెప్పినట్టుగానే ఇప్పుడు మీ నాన్న విషయంలోనూ అబద్ధాలు చెబుతున్నావా? అని అడుగుతుంది. అసలు నీకు నాన్న ఉన్నాడా? లేడా? మనోజ్ కు అత్తగారి కుటుంబం అంటూ ఉందా? లేదా అని నానా మాటలు అంటుంది. దాంతో రోహిణి వణికిపోతుంది. తన అత్త ప్రభావతికి అసలు విషయాలు తెలిసి పోతున్నాయని అనుకుంటుంది. ఇక వెంటనే తన మలేషియా తండ్రి డ్రామాకు ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటుంది.

ఇక వెంటనే తన స్నేహితురాలు విద్య దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్ని చెబుతుంది. తన అత్త ప్రభావతి నిప్పులు కక్కుతోందని అంటుంది. వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని, ఏదైనా సలహా ఇవ్వమని అడుగుతుంది. ఇవన్నీ భరించే కంటే సైలెంట్ గా ఏదైనా దేశం వెళ్లిపోమని అంటుంది. లేదంటే ఇంట్లో నిజం చెప్పి క్షమించమని అడుగు అని సలహానిస్తుంది. ఈ రెండు కాకుంటే మలేషియా తండ్రిలాగా మరో జూనియర్ ఆర్టిస్ట్ ను తీసుకొచ్చి మీ ఇంట్లో వాళ్లకు చూపిద్దామని అంటుంది. అవన్నీ సెట్ అవ్వవవని రోహిణి అంటుంది. మా అత్త ప్రభావతి మా నాన్న కోసమే చూడం లేదని ఆయన తెచ్చే బంగారం, నగలు, నగదు కట్టల కోసం చూస్తుందని చెబుతుంది. దీనికి పరిష్కారం మటన్ కొట్టు మాణిక్యం రీఎంట్రీతోనే ఉందని ఒక ప్లాన్ చెబుతుంది. వెంటనే మాణిక్యంను తమ ఇంటికి మళ్లీ రప్పించి రోహిణి వాళ్ల నాన్నను మలేషియా పోలీసులు అరెస్ట్ చేశారని, బిజినెస్ లో స్నేహితులు మోసం చేసి ఆ కేసును మీ నాన్నపై తోసేసరి చెబుతుంది. ఆయన నిర్దోషని తేలే వరకు ఆస్తులను కూడా ఇవ్వబోరని, ఇక ఆయన ఎప్పుడు బయటికి వస్తారనేది కూడా స్పష్టంగా తెలియడం లేదని చెబుతాడు. దాంతో ప్రభావతి, సత్యం, బాలు అందరూ షాక్ అవుతారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X