Gunde Ninda Gudi Gantalu July 17th: మలేషియా నాటకానికి రోహిణి ఫుల్ స్టాప్.. మీనాను బలి చేసిన ప్రభావతి
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూలై 16వ తేదీ 467వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ప్రభావతి రోహిణిపై నిప్పులు కక్కుతుంది. నువ్వు చెప్నేవన్నీ వింటున్నానని ఏదీ పడితే అది చెప్పి నమ్మిస్తున్నావా? అని అంటుంది. అసలు నువ్వు మీ నాన్న విషయంలో చెప్పినవన్నీ నిజమేనా అని సందేహిస్తుంది. పార్లర్ పేరు మార్చేసినట్టు, అమ్మేసినట్టు చెప్పకుండా దాచిన తీరులానే ఇప్పుడు మీ నాన్న విషయంలోనూ అబద్దాలు చెబుతున్నావా? అని ప్రశ్నిస్తుంది. దాంతో రోహిణి అలా ఏం లేదని అంటుంది. అసలు మా నాన్న ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అస్సలు అర్థం కావడం లేదని అంటుంది. మీ కోసమే మా నాన్నపై కోపం కూడా తగ్గాంచుకున్నాను. కానీ ఆయన ఇలా రాకుండా నన్ను ఎందుకు భాదపెడుతున్నారనేది అర్థం కావడం లేదని తెలుపుతుంది.
ఇదే సమయంలో మటన్ కొట్టు మాణిక్యం ద్వారా సమస్యను పరిష్కరించాలని అనుకుంటుంది. ఇక మళ్లీ ఆయన రీఎంట్రీతోనే పరిష్కారం ఉందని ప్లాన్ చేస్తుంది. ఆ వెంటనే మాణిక్యంను తమ ఇంటికి మళ్లీ రప్పించి రోహిణి వాళ్ల నాన్నను మలేషియా పోలీసులు అరెస్ట్ చేశారని, బిజినెస్ లో స్నేహితులు మోసం చేసి ఆ కేసును మీ నాన్నపై తోసేసారని చెప్పిస్తుంది. రోహిణి చెప్పినట్టుగానే మాణిక్యం ఇంటికి వస్తాడు. ప్రభావతితో పాటు ఇంట్లో వాళ్లందరికీ అసలు విషయం చెప్పేస్తాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. ఇక రోహిణి వాళ్ల నాన్న మలేషియాలో ఎందుకు అరెస్ట్ అయ్యారంటూ ప్రశ్నిస్తూ ఉంటార. ఇన్వెస్టర్లు కేసు పెట్టారని, పార్ట్ నర్స్ మోసం చేశారని చెబుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. జూలై 17వ తేదీ 468 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

ప్రభావతి తన కోడలు రోహిణి విషయంలో చాలా సీరియస్ అవుతుంది. మీ నాన్న ఇంకెప్పుడు వస్తాడని పదే పదే అడగటంతో రోహిణి కంగారు పడుతుంది. ఎలాగైనా తన అత్త నుంచి తప్పించుకోవాలని అనుకుంటుంది. ఇక వెంటనే మలేషియా తండ్రి గురించి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్లాన్ చేస్తుంది. ఓవైపు ప్రభావతి పదే పదే మలేషియా నుంచి మీ నాన్న ఎప్పుడు వస్తాడని ప్రశ్నల మీద ప్రశ్నలు, నానా మాటలు అంటూ ఉంటే తీసుకోలేక పోతుంది. దీంతో వెంటనే మటన్ కొట్టే మాణిక్యం ను మళ్లీ రంగంలోకి దింపుతుంది. అతన్ని తీసుకొని వచ్చి తన తండ్రి మలేషియాలో అరెస్ట్ అయ్యాడని చెబుతాడు. దాంతో ప్రభావతి, సత్యం, బాలు, మీనా, మనోజ్ అందరూ షాక్ అవుతారు. అసలు ఆయన ఎందుకు అరెస్ట్ అయ్యారని ప్రశ్నిస్తారు. ఫంక్షన్ కు బయల్దేరిన ఆయన ఎప్పుడు తిరిగి వస్తారనేది చూస్తూ ఉన్న సమయంలో ఇలాంటి ట్విస్ట్ ఏంటని అందరూ షాక్ అవుతారు.
ఇక మలేషియా మేనమామగా వచ్చిన మాణిక్యం రోహిణి తండ్రి మలేషియాలో అరెస్ట్ అయ్యాడని, ఇప్పట్లో బయటికి వచ్చే సమస్య లేదని అంటాడు. మన లాయర్లు రోహిణి వాళ్ల నాన్నను బయటికి తీసుకొచ్చేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారని చెబుతాడు. కానీ అప్పటి వరకు మనం ఏం చేసే పరిస్థితి లేదని అంటాడు. ఇక ప్రభావతి స్పందిస్తూ మనోజ్ రోహిణిని ఇద్దరిని మలేషియాకు వెళ్లమని చెబుతుంది. వెంటనే వాళ్ల నాన్నను విడిపించి, ఆస్తులను తిరిగి తీసుకోండి అని అంటుంది. దాంతో మాణిక్యం స్పందిస్తూ అందుకు కూడా అవకాశం లేదని చెబుతాడు. అసలు రోహిణి వాళ్ల నాన్నకు సంబంధించిన వాళ్లు ఎవ్వరు కనిపించినా కూడా ఏమాత్రం వదలబోరని అంటాడు. వెళ్తే మనోజ్ ను కూడా జైలులో వేస్తారని హెచ్చరిస్తాడు. అంటే ఇక ఆయన బయటికి రాడా అని ప్రభావతి కంగారు పడుతుంది. వస్తాడు కానీ ఇప్పట్లో అది జరిగే పరిస్థితి లేదని అంటాడు. ఇక వెంటనే రోహిణి తను ఎంతగానో బాధపడుతున్నట్టుగా నటించి ఏడ్చుకుంటూ పైన తన గదిలోకి వెళ్లిపోతుంది.
ఆ తర్వాత బాలు అసలు రోహిణి చెప్పింది అంతా నిజమేనా, వాళ్ల మేనమామ చెప్పింది నిజమేనా అని సందేహిస్తూ ఉంటాడు. ఇక రోహిణి వాళ్ల నాన్న ఎప్పుడూ తిరిగి వస్తారో లేదోనని ప్రభావతి టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు రోహిణి విషయంలో తను అనుకున్నది అస్సలు జరగడం లేదని కోపంలో ఉంటుంది. ఇదే సమయంలో మీనా ప్రభాతికి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. దాంతో ప్రభావతి ఆ కాఫీని విసిరేస్తుంది. దాంతో మీనా బాధపడుతుంది. ఎందుకు అలా చేశావంటూ ప్రశ్నిస్తుంది. అసలు ఇందులో నా పొరపాటు ఏం ఉందని మీనా ప్రభావతిని ప్రశ్నిస్తుంది. అందుకు వెంటనే ప్రభావతి స్పందిస్తూ మీనాపై నిప్పులు చెరుగుతుంది. అన్నింటికి నువ్వే కారణమని అంటుంది. అసలు నువ్వు ఈ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నుంచి ఏమాత్రం మంచి జరగడం లేదని నిందిస్తుంది. నువ్వు కాలు పెట్టినప్పటి నుంచి ఈ ఇంట్లో ప్రశాంతత లేకపోతుందని అంటుంది.
నువ్వు అసలు ఆ చైన్ తీసి ఉండకపోతే అసలు ఈ గొడవ జరిగేదే కాదని అంటుంది. వాడిని రెచ్చ గొట్టి శృతి వాళ్ల నాన్న సురేంద్రను కొట్టేలా చేశావని అంటుంది. మొత్తం నీ వల్లనే జరిగిందని, శృతిని ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం ఎవ్వరు కూడా చేయడం లేదని మండిపడుతుంది. మరి మీరు ఏం చేస్తున్నారని మీనా ప్రభావతిని ప్రశ్నిస్తుంది. నేను ఇప్పటికే శృతిని కలిసి ఇంటికి రమ్మని చెప్పాను, మీరు చేయాల్సిన పని నేను చేశానని అంటుంది. ఇంటికి తిరిగి రమ్మని చెప్పానని అంటుంది. ఏదేమైనా నువ్వు ఇంట్లో వాళ్లందరినీ పంపించే వరకు అస్సలు మనశ్శాంతిగా ఉండవని ప్రభావతి మీనాను నిందిస్తుంది. ఇక బాలు ఫైర్ అవుతాడు. మరోవైపు రోహిణికి దినేష్ వార్నింగ్ ఇస్తాడు. తనకు పెళ్లి కుదిరిందని, వెంటనే డబ్బులు అరెంజ్ చేయమని అంటాడు. పార్లర్ కు వెళ్లి రచ్చ చేస్తాడు. అదే సమయంలో మనోజ్ కూడా పార్లర్ కు వెళ్తాడు. మనోజ్ ను చూసి రోహిణి దినేష్ కండీషన్స్ కు ఒప్పుకొని బయటికి పంపిస్తుంది. ఇక మనోజ్ వచ్చి రోహిణిని 14 లక్షలు ఇవ్వమని అడుగుతాడు. కెనడాకు వెళ్దామని అంటాడు. నా దగ్గర లేవని, మీ ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి తీసుకోమని చెబుతుంది. దాంతో వెంటనే మనోజ్ వెళ్లి ప్రభావతి, సత్యంను ఇంటిని తాకట్టు పెట్టబోతున్నట్టు చెబుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











