Gunde Ninda Gudi Gantalu July 21st: బిక్షగాడి వేషధారణలోనే ఇంటికి వచ్చిన మనోజ్.. ప్రభావతి, రోహిణి రియాక్షన్ ఇది
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూలై 18వ తేదీ 469వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శృతి డబ్బింగ్ చెప్పడానికి వెళ్లిన సమయంలో గొడవ జరుగుతుంది. డబ్బింగ్ స్టూడియోలో శృతి కంటే ముందే ఓ ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పి పర్స్ మర్చిపోతుంది. ఇంటికి వెళ్తుంది. ఇక వెంటనే మళ్లి తిరిగి వస్తుంది. వారు బాలు కాబ్ లోనే డబ్బింగ్ స్టూడియో దగ్గరికి వస్తారు. అప్పటికే శృతి డబ్బింగ్ చెప్పి బయటికి వస్తూ ఉంటుంది. లోపలికి వెళ్లి సౌండ్ ఇంజనీర్ ను నా పర్సు మర్చిపోయానని, ఇందాక డబ్బింగ్ చెప్పింది ఎవరని అడుగుతుంది. దాంతో శృతి పేరు చెబుతాడు. వెంటనే శృతి దగ్గరకు వెళ్లి పర్సు ఇవ్వమని అడుగుతారు. నా దగ్గర మీ పర్సు ఎందుకు ఉంటుంది. నేనేమైనా దొంగనా అని అంటుంది. లేదు మా పర్సు నువ్వే తీశామని శృతి బ్యాగ్ ను చెక్ చేసేందుకు ప్రయత్నిస్తారు.
అప్పటికే వాళ్ల మాటలు విని బయట కారు దగ్గర ఉన్న బాలు లోపలికి వస్తాడు. దొంగ అంటూ శృతి బ్యాగ్ ను చూడటంతో వాళ్లిద్దరి చెంపను పగలగొడుతుంది. ఇక పర్సు టీ కొట్టువాడు తీసుకున్నాడని బాలు కనిపెడుతాడు. వాళ్లతో శృతికి సారీ చెప్పిస్తాడు. ఆ తర్వాత శృతికి బుద్ధి చెబుతాడు. ఇప్పుడు నీకెలా జరిగిందో ఫంక్షన్ లో మీనాకూ అలానే జరిగిందని, మీ నాన్న నిన్ను రవిని విడదీయాలని చూస్తున్నారని, నీ కాపురాన్ని కాపాడుకునే బాధ్యత నీ చేతుల్లోనే ఉందని చెబుతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రోమోలో మనోజ్ గుడి మెట్ల దగ్గర అడ్డుకుంటూ ఉంటాడు. మీనా మనోజ్ ను చూస్తుంది. ఆశ్చర్యపోయి వెంటనే బాలుకు ఫోన్ చేస్తుంది. ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జూలై 21వ తేదీ 470 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

శృతిని తన స్టూడియో దగ్గర కలిసిన బాలు శృతికి బుద్ధి చెబుతాడు. మీ నాన్న చేసిన తప్పు వల్ల నువ్వు రవికి ఎందుకు దూరంగా ఉంటున్నావని ప్రశ్నిస్తాడు. మీ ఇద్దరిని విడదీయాలని మీ నాన్న కుట్ర చేస్తున్నాడని అందుకే ఫంక్షన్ లో పెద్ద గొడవ చేశాడని అంటుంది. ఈ గొడవల వల్ల నువ్వు రవిని అస్సలు దూరం చేసుకోవద్దని చెబుతాడు. ఎన్ని గొడవలు వచ్చినా భార్య భర్తలు అస్సలు విడిపోకూడదని వివరిస్తాడు. నాకు మీనాకు ఎన్నో గొడవలు జరిగినా కూడా కలిసి ఉంటామని, మీరు కూడా అలానే ఉండాలని అంటాడు. నువ్వు డబ్బింగ్ చెప్పి బతికినట్టే మీనా కూడా పూలు అల్లుకొని బతకగలదని అనుకొని వెళ్లిపోవచ్చు కదా అని అంటాడు. కానీ ఏనాడు కూడా మీనా అలాంటి పని చేయలేదని చెబుతాడు.
రవి, నువ్వు రాలేదని మా అమ్మ భోజనం చేయడం మానేసింది. మరోవైపు రవి ఇంటికి కూడా రాకుండా రెస్టారెంట్ లోనే ఉంటున్నాడని చెబుతాడు. అక్కడ వర్కర్లతోనే పడుకుంటున్నాడు. ఎలుకలు, బొద్దింకల మధ్య ఇబ్బంది పడుతూ ఉన్నాడు. వస్తే నీతోనే కలిసి వస్తానని రవి చెబుతున్నాడని అంటాడు. ఇక అమ్మ అస్సలు అన్నం తినడం లేదనే విషయం కూడా గుర్తుంచుకోమంటాడు. మరోవైపు మనోజ్ తన పార్కు స్నేహితుడితో కలిసి ఒక స్వామిజీ వద్దకు వెళ్తాడు. మనోజ్ కష్టాలు చెప్పడంతో వెంటనే ఆ బాబ దగ్గరకు తీసుకొని వెళ్తాడు. ఇక్కడికి ఎందుకు తీసుకోవచ్చావని మనోజ్ అడుగుతాడు. ఈ స్వామిజీ చాలా మహిమలు కలిగిన వాడని చెబుతాడు. ఏది కోరుకుంటే అదే జరుగుతుందని వివరిస్తాడు. ఇక ఇద్దరు కలిసి వెళ్లి ఆ స్వామిజీని కలుస్తారు.
ఆ స్వామిజీని వెళ్లి కలవడంతో మనోజ్ గురించి ఉన్నది ఉన్నట్టుగా చెబుతాడు. మనోజ్ స్వామిజీ మాట్లాడానికంటే ముందే ఎక్కువగా మాట్లాడి స్వామిజీకి కోపం తెప్పిస్తాడు. దీంతో ఆ స్వామిజీ మనోజ్ గురించి పూర్తిగా చెప్పి నోరు మూయిస్తాడు. నువ్వు జాబ్ లేక ఇబ్బంది పడుతున్నావని, నీకు విదేశానికి వెళ్లే అవకాశం వచ్చినా.. డబ్బులు లేక ఆగిపోతున్నావని చెబుతాడు. దాంతో మనోజ్ ఆశ్చర్యపోతాడు. స్వామిజీ ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పాడని షాక్ అవుతాడు. ఇక స్వామిజీ చెప్పినట్టుగా వినేందుకు ఒప్పుకుంటాడు. పరిష్కార మార్గం చూపించమని అడుగుతాడు. అందుకు స్వామిజీ ఊహించని విధంగా పరిష్కార మార్గం చెబుతాడు. అందుకు నువ్వు తప్పనిసరిగా ఒప్పుకోవాలని అంటాడు.
నీకు దేవుడిపై భక్తి ఉందని, కానీ ఎక్కువగా చదువుకున్నాననే అహం ఎక్కువైందని అంటాడు. అందుకే నువ్వు అడుకునే స్థాయిలో ఉన్నాయని అంటాడు. అడుక్కునే స్థాయి నుంచి, నిన్నే అందరూ అడుక్కునే స్థాయికి నువ్వు రావాలంటే ఇక పని చేయాలని చెబుతాడు. నువ్వు కూడా ఈ గుడి దగ్గర ఒక రోజు మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు గుడి మెట్ల మీద కూర్చొని అడుక్కోవాలని చెబుతాడు. ఇక ఎలాంటి ఆహార పదార్థాలు కూడా తినొద్దని షరత్ కూడా విధిస్తాడు. అందుకు మనోజ్ సందిగ్ధంలో ఉంటూనే సరే అని చెబుతాడు. ఇక వెంటనే తన స్నేహితుడు మనోజ్ ను బిచ్చగాడిలా వేషధారణ మార్చి గుడి మెట్లపై కూర్చొని అడుక్కుతినమని చెప్పి వెళ్లిపోతాడు. అదే గుడికి మీనా వస్తుంది. మనోజ్ ను చూస్తుంది. మనోజ్ మొహం దాచుకునే ప్రయత్నం చేస్తాడు. గొంతు మార్చి కూడా మాట్లాడుతాడు. కానీ మీనా బాలులా తిట్టడంతో ఓపెన్ అవుతాడు.
మీరు ముందు అడుక్కోవడం మానేసి పక్కకు రండి అంటూ ఎంత చెప్పినా మనోజ్ రానంటాడు. మీనా వెంటనే బాలుకు ఫోన్ చేస్తుంది. మనోజ్ విషయాన్ని బాలుకు చెబుతుంది. మీ అన్న గుడి మెట్ల మీద కూర్చొని అడుక్కుంటున్నాడని అంటుంది. దాంతో బాలు తొలుత నమ్మబోడు ఎంత కోపం ఉన్న అన్నను అలా అనడం కరెక్ట్ కాదు కదా అని అంటాడు. నిజంగానే మీ అన్న గుడి మెట్ల మీద అడుక్కుంటున్నాడని మీనా చెబుతుంది. ఏంటీ ఇది నిజమేనా నేను వెంటనే అక్కడికి వస్తున్నానని బయల్దేరుతాడు. ఇక మీనా తనను చూసిందని మనోజ్ కంగారు పడుతూ ఉంటాడు. ఇక ప్రోమోలో.. బాలు వెంటనే గుడి దగ్గరకు వస్తాడు. గుడి మెట్లపై అడుక్కుంటున్న మనోజ్ ను ఇంటికి తీసుకొని వెళ్తాడు. మనోజ్ ను బిక్షగాడి వేషధారణలో చూసి ప్రభావతి షాక్ అవుతుంది. ఎందుకిలా చేశావని ప్రశిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











