Gunde Ninda Gudi Gantalu July 22nd: మనోజ్ తాట తీసిన ప్రభావతి.. రవితో కాపురానికి వచ్చిన శృతి

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూలై 21వ తేదీ 470వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మనోజ్ కు ఇంట్లో డబ్బులు ఇవ్వకపోవడంతో పార్కుకు వెళ్లి బాధపడుతాడు. అక్కడికి తన పార్క్ స్నేహితుడు వస్తాడు. నీకు డబ్బులు కావాలంటే పరిష్కారం చూపించే స్వామీజీ ఒకరు ఉన్నారని చెబుతాడు. వెళ్లి కలిస్తే ఏదోక పరిష్కారం చెబుతాడని నమ్మిస్తాడు. వెళ్లి స్వామీజీని కలవడంతో
ఒక రోజు మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు గుడి మెట్ల మీద కూర్చొని అడుక్కోవాలని మనోజ్ కు చెబుతాడు. ఆ రోజు మొత్తం రోజంతా ఎలాంటి ఆహారం తినకూడదని అంటాడు. అలా చేస్తే నువ్వు అడుక్కునే స్థాయి నుంచి నిన్ను అందరూ అడుక్కునే స్థాయికి వస్తావని చెబుతాడు. దీంతో ఒక్కరోజే కదా అని అడుక్కునేందుకు సిద్ధమవుతాడు. దాంతో తన స్నేహితుడి సాయం తీసుకుని బిచ్చగాడి వేషధారణలోకి మారిపోతాడు.

గుడి దగ్గరకు వెళ్లి మెట్లపై కూర్చొని అడుక్కు తినడం ప్రారంభిస్తాడు. కంపు కొట్టే బట్టల్లో, అడుక్కునే వాళ్ల మధ్య కూర్చొవడానికి చాలా ఇబ్బంది పడుతాడు. కానీ వాళ్లు బిచ్చగాళ్లైనా తినే తిండి, తాగే నీళ్ల గురించి తెలుసుకొని షాక్ అవుతాడు. ఇక ఎలా అడుక్కువాళ్లో కూడా వాళ్లే మనోజ్ కు నేర్పిస్తారు. దాంతో మనోజ్ గుడి మెట్లపై కూర్చొని అడుక్కోవడం ప్రారంభిస్తాడు. ఇక అదే సమయంలో మీనా దేవుడి దర్శనం కోసమని అదే గుడికి వెళ్తుంది. ఇక బిచ్చగాళ్లకు చిల్లర వేస్తూ ఉంటుంది. మీనాను మనోజ్ చూసి షాక్ అవుతాడు. దాక్కునే ప్రయత్నం చేస్తాడు. కానీ మీనా గుర్తు పడుతుంది. ఇదేం పని అని ప్రశ్నిస్తుంది. ఇంట్లో వాళ్లకి తెలిస్తే ఏం బాగుండదని చెబుతుంది. వెంటనే అక్కడి నుంచి పైకి లే అని అంటుంది. కానీ మనోజ్ వినడు. ఇక మీనా వెంటనే బాలుకు ఫోన్ చేసి గుడి దగ్గరకు రమ్మని చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. జూలై 22వ తేదీ 471 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 471 July 22nd

మనోజ్ గుడి మెట్లపై అడుక్కోవడాన్ని మీనా బాలుకు చెబుతుంది. కానీ బాలు అస్సలు నమ్మడు. ఎవరిని చూసి ఎవరని అనుకుంటుందోనని బాలు అభిప్రాయపడుతాడు. కానీ మీనా మాత్రం బాలుకు గట్టిగా చెబుతుంది. నువ్వు వెంటనే గుడి దగ్గరకు రమ్మని చెబుతుంది. ఆలస్యమైతే మనోజ్ మళ్లీ వెళ్లిపోయేలా ఉన్నాడని, అక్కడి నుంచి లేమని ఎంత చెప్పిన వినడం లేదని మీనా బాలుకు వివరిస్తుంది. ఇక వెంటనే బాలు గుడి మెట్ల దగ్గరకు వెళ్లి మీనాను కలుస్తాడు. అసలు నువ్వు చూసింది మనోజ్ నేనా ఎవరినైనా చూసి కన్ ఫ్యూజ్ అయ్యావా? అని ప్రశ్నిస్తాడు. లేదు నేను చూసింది కచ్చితంగా మనోజ్ నే అని మీనా చెబుతుంది. దాంతో వెంటనే మనోజ్ అడుక్కునే దగ్గరకు తీసుకెళ్తుంది. అక్కడ బాలు మనోజ్ ను చూసి షాక్ అవుతాడు. కానీ మనోజ్ మాత్రం తను మనోజ్ కాదనట్టుగా నటిస్తాడు. అసలు బాలు, మీనా ఎవరో తెలియదన్నట్టుగా నటిస్తూ ఉంటాడు.

ఇక బాలు మనోజ్ పై కోపం చేస్తాడు.దొరబాబులా ఉండే నువ్వు ఇలా గుడి మెట్ల మీద కూర్చొని అడుక్కోవడం దేనికీ అని అంటాడు. మరీ ఏం చేయాలని మనోజ్ తిరిగి ప్రశ్నిస్తాడు. ఎవర్ని అడిగినా నాకు డబ్బులు ఇవ్వడం లేదని చెబుతాడు. అమ్మని అడిగితే ఇవ్వను అనింది.. రోహిణి వాళ్ల నాన్నను అడటం లేదు. అందుకని స్వామిజీ చెప్పినట్టు చేయాలని నిర్ణయించుకున్నానని చెబుతాడు. నువ్వు ఇలా చేయడం ఏమాత్రం బాగలేదని బాలు అంటాడు. అందుకు బాలు ఒక్క రోజే కదా ఇంకొన్ని గంటలు అయితే స్వామిజీ చెప్పింది పూర్తవుతుందని అంటాడు. కానీ బాలు మనోజ్ ను వెళ్లినివ్వకుండా అడ్డుకుంటాడు. కారులోకి ఎక్కించి నేరుగా ఇంటికి తీసుకెళ్తాడు. ఇక ఇంటి దగ్గరకు వెళ్లిన తర్వాత మనోజ్ కారులోంచి దిగడానికి ఇష్టపడడు. అమ్మ ప్రభావతి, భార్య రోహిణి చూస్తే ఏమనుకుంటారోనని భయపడుతాడు.

ఇక బాలునే మనోజ్ కు ధైర్యం చెప్పి మరీ ఇంట్లోకి తీసుకొని వెళ్తాడు. మనోజ్ కూడా ఆ అడుక్కునే బట్టల్లోనే ఇంట్లోకి వెళ్తాడు. తలపై గుడ్డ కప్పుకొని మొహం దాచుకుంటాడు. అప్పటికే హాలులో కూర్చొన్న సత్యం, ప్రభావతి మనోజ్ ను గుర్తుకు పట్టక ఈ అడుక్కునే వాడిని ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చారని బాలు, మీనాను ప్రశ్నిస్తారు. వీడి దగ్గర మొత్తం మురికి కంపు వాసన వస్తుందని వెంటనే బయటికి పంపించండని చెబుతుంది. ఏదైనా సద్ది అన్నం ఉంటే ఆ గేట్ అవతా పెట్టి రమ్మని మీనాకు ప్రభావతి సూచిస్తుంది. ఇక ప్రభావతి మాటలకు మనోజ్ షాక్ అవుతాడు. అమ్మా.. అమ్మా.. అంటూ పిలుస్తూ ఉంటాడు. నువ్వు ఇంకోసారి అలా పిలిస్తే బాగుండదని హెచ్చరిస్తుంది. ఇక మనోజ్ తలపై నుంచి గుడ్డ తీయడంతో మనోజ్ ను చూసి షాక్ అవుతుంది. అసలు నీకు ఇలాంటి పరిస్థితి ఏంట్రా అని ప్రశ్నిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది చూడాలి.

మరోవైపు రవిని పూర్తిగా తమ ఇంట్లోనే ఉంచుకోవాలని శృతి వాళ్ల అమ్మ శోభ, తండ్రి సురేంద్ర ప్లాన్ చేస్తారు. ఫంక్షన్ లో తాము అనుకున్నట్టుగానే అంతా జరిగినా రవి మాత్రం వెళ్లి ఆ రెస్టారెంట్ లో ఉంటున్నాడు. వెంటనే తీసుకొని రావాలని అనుకుంటారు. ఈలోగా శృతి డబ్బింగ్ స్టూడియో నుంచి తిరిగి ఇంటికి వస్తుంది. అక్కడ తనపై దొంగతనం ఆరోపణ వేసిన ఘటనను చెబుతుంది. ఇక బాలు వచ్చి కాపాడాడని అంటుంది. ఇదంతా బాలు ప్లానే అయ్యి ఉంటుందని తండ్రి అనడంతో శృతి మండి పడుతుంది. బాలు మంచి వాడేనని, కారణం లేకుండా ఎవరిపైనా చేయి చేసుకోడని చెబుతుంది. ఇక మీనా కూడా దొంగ కాదని, తన గురించి నాకు పూర్తిగా తెలుసని అంటుంది. నేను తిరిగి మా ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెబుతుంది. నేను అస్సలు వెళ్లనివ్వనని తండ్రి అనడంతో మీ గొడవకు నన్ను, రవిని ఎందుకు బలి చేస్తున్నారని అంటుంది. ఇక ప్రోమోలో బాలు శృతి వాళ్ల ఇంటికి రవితో వస్తాడు. సురేంద్ర బాలును నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతాడు. నేను రాలేదు. నా తమ్ముడి భార్య క్యాబ్ తీసుకొని రమ్మని చెప్పిందని అంటాడు. వాళ్ల అత్తగారింటికి తీసుకెళ్లడం కోసం వచ్చానని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తర్వాతి ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X