Gunde Ninda Gudi Gantalu July 23rd: మనోజ్ విషయంలో రోహిణి కీలక నిర్ణయం.. మండిపోయిన ప్రభావతి

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూలై 22వ తేదీ 471వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. గుడి మెట్లపై మనోజ్ అడుక్కుంటున్నాడనే విషయం మీనా ద్వారా బాలు తెలుసుకుంటాడు. వెంటనే వెళ్లి బాలును ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. కానీ మనోజ్ తొలుత ఇంటికి రానని చెబుతాడు. అసలు నీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందని, ఎందుకిలా చేస్తున్నావని బాలు మనోజ్ ను అడుగుతాడు. దాంతో మనోజ్ ఓపెన్ అవుతాడు. ఓ గురూజీని కలిసిన సమయంలో ఇలా గుడి మెట్ల మీద అడుక్కుంటే నాకు డబ్బుల సమస్యలు తీరిపోతాయని, నేను కెనడా వెళ్లిపోయే పరిష్కారం దొరుకుతుందని చెప్పాడని అంటాడు. అందుకే నేను అలా చేసేందుకు ఒప్పుకున్నాని అంటాడు. నేను ఈరోజు సాయంత్రం వరకు కూడా పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోవద్దని అంటాడు. అలాగైతే నేను అనుకున్నది ఫలిస్తుందని మనోజ్ చెబుతాడు.

ఇక బాలు మండిపోయి వెంటనే మనోజ్ ను అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. కానీ మనోజ్ సాయంత్రం ఇక్కడే ఉండాలని అంటాడు. దాంతో నానా తిట్లు తిట్టి కారులో ఇంటికి తీసుకెళ్లి పోతాడు. ఇక ఇంటికి వెళ్లిన తర్వాత ప్రభావతి మనోజ్ ను చూసి షాక్ అవుతుంది. ఎంతో ప్రేమగా పెంచితే ఇంత దిగజారిపోయావు ఎంట్రా అని ప్రశ్నిస్తుంది. సత్యం కూడా తన కొడుకు ఇలా చేయడం పట్ల షాక్ అవుతాడు. మనోజ్ మాత్రం సైలెంట్ గా ఉంటాడు. మరోవైపు శృతి కూడా తిరిగి రవితో కాపురానికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. బాలు ద్వారా తన తల్లిదండ్రులు చేసిన తప్పులను తెలుసుకుంటుంది. తను కూడా తొందరపడి తప్పు చేశాననిని భావిస్తుంది. మీ పెద్దల గొడవ వల్ల నేనెందుకు నా భర్తకు దూరంగా ఉండాలని అంటుంది. ఇక ఇదే తుది నిర్ణయమని తల్లి శోభ, తండ్రి సురేంద్రకు చెబుతుంది. ఈ క్రమంలో తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జూలై 23వ తేదీ 472 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 472 July 23rd

మనోజ్ ను బాలు ఇంటికి తీసుకొస్తాడు. ముష్టివాడిగా మనోజ్ ను చూసిన తర్వాత ప్రభావతి షాక్ అవుతుంది. ఎంతో గారాభంగా పెంచితే నువ్వు ఇలా చేస్తావా? అని మండి పడుతుంది. అసలు ఇలా ఎందుకు చేశావురా అని ప్రశ్నిస్తుంది. దాంతో మనోజ్ స్పందిస్తూ ఎవ్వరు డబ్బులు ఇవ్వమంటే ఇవ్వడం లేదు. కెనడాకు వెళ్లడానికి పరిష్కార మార్గం దొరుకుతుందంటే ఒక్క రోజు బిక్షగాడి అవతారం ఎత్తినట్టు చెబుతాడు. ఇక అదే సమయంలో రోహిణి పైనున్న తన గది నుంచి హాలులోకి వస్తుంది. మనోజ్ తల దాచుకుంటాడు. రోహిణి ఎవరీ బిచ్చగాడు, బయటకి పంపించాడని అంటుంది. అతను బిక్షగాడు కాదని బాలు తిప్పి మొహం చూపిస్తాడు. దాంతో మనోజ్ రోహిణికి మొహం చూపిస్తాడు. అమ్మ ఇంటి పత్రాలను తాకట్టు పెట్టనివ్వడం లేద, రోహిణి వాళ్ల నాన్నను అడిగి డబ్బులు ఇస్తుందని అనుకుంటే ఆయన ఫంక్షన్ కు రాలేదు. ఇక నాకు ఉన్న దారులు మూసుకుపోయాయి. అందుకే ఇలా చేశానని బదులిస్తాడు.

మనోజ్ మాటలకు ప్రభావతి రెచ్చిపోతుంది. ఇంకోసారి ఇంటి పత్రాలు తాకట్టు పెట్టాలనే ఆలోచన నీకు వస్తే ఇలాగే బయటికి పంపిస్తాను. అప్పుడు అడుక్కుంటూ జీవితాంతం తినాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది. మరోవైపు రోహిణి మనోజ్ చేసిన పనికి బాధ పడుతుంది. అసలు నువ్వు ఇలాంటి పని చేయడం ఏంటని ప్రశ్నిస్తుంది. అస్సలు ఊహించలేదని అంటుంది. నువ్వు అనుకున్నది అవుతుంది, నువ్వు కచ్చితంగా కెనడాకు వెళ్తావు అని చెబుతుంది. ఆ తర్వాత మనోజ్ ను తన బెడ్ రూమ్ లోకి తీసుకెళ్తుంది. డోర్ లాక్ వేసిన తర్వాత మనోజ్ ను గుర్రున చూస్తుంది. చెంప చెల్లుమనిపిస్తుంది. నిన్ను చూస్తుంటే సిగ్గుగా ఉందని అంటుంది. అసలు నువ్వు ఇలా చేయడం వల్ల బాలు, మీనాల ముందు నా పరువు ఎంత పోయిందే తెలుస్తోందా? అని ప్రశ్నిస్తుంది. ఈ కష్టమేదో చిన్న ఉద్యోగమైనా చేసుకొని బతకొచ్చు కదా. మీనా, బాలు డబ్బులు లేకపోతే కష్టపడి కారు కొనుకున్నారు. వాళ్లు నిన్ను తిట్టడంలో తప్పేలేదని అంటుంది. అసలు నన్ను ఎవ్వరు పట్టించుకోవడం లేదని మనోజ్ రోహిణితో అంటాడు. ఎవరు పట్టించుకోకపోవడం కాదు. అందరూ నిన్నే బాగా చూసుకుంటున్నారు. అది నీకే అర్థం కావడం లేదని రోహణి చెబుతుంది. ఇక కెనడాకు వెళ్లేందుకు వేరే మార్గం చూద్దామని, తొందరపడి ఇలాంటి పనులు చేయకని చెబుతుంది.

మరోవైపు బాలు శృతి వాళ్ల ఇంటికి వెళ్తాడు. అక్కడ వాళ్ల నాన్న నువ్వెందుకు వచ్చావని అడుగుతాడు. నేను రాలేదని డబ్ డమ్మనే పిలిచిందని చెబుతాడు. మా అత్తగారింటికి వెళ్లాలని నా తమ్ముడు భార్య పిలిస్తే వచ్చానని బదులిస్తాడు బాలు. అది నేను నమ్మనని అంటాడు. అదే సమయంలో రవి కూడా వస్తాడు. అన్నయ్య మళ్లీ ఏం గొడవ చేస్తున్నావని అడుగుతాడు. నేనేం గొడవ చేయడం లేదని, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతాడు. శృతి రమ్మంటే వచ్చానని బదులిస్తాడు. నేనూ అందుకే వచ్చానని బాలు చెబుతాడు. ఇక నా కూతురుకు ఏదో మాయమాటలు చెప్పావని బాలుపై సురేంద్ర ఫైర్ అవుతాడు. కానీ శృతి అడ్డుకుంటుంది. తొందరపడే ఆరోజు ఫంక్షన్ లో బాలుతో చెంప దెబ్బతిన్నారని అంటుంది. నా భర్తతో నేను వెళ్లాలని నిర్ణయించుకున్నాను. వెళ్తున్నానని వెళ్తుంది.

ఇంటికి తిరిగి వెళ్లడంతో ప్రభావతి, సత్యం, మీనా సంతోషించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేస్తారు. అయితే అప్పటికే మౌనికాను సంజూ త్వరగా రెడీ అవ్వమని అంటాడు. నీకు ఒక సర్ ప్రైజ్ ఉందని చెబుతాడు. ఎక్కడికి వెళ్తున్నామని ఎన్నిసార్లు అడిగినా సంజూ చెప్పడు. నేరుగా మౌనికా పుట్టింటికి తీసుకెళ్తాడు. తను ఒక ఉద్దేశంతో అక్కడికి వెళ్తే.. ఇక అక్కడ అందరూ కేక్ కట్ చేస్తూ సంతోషంగా కనిపిస్తారు. దాంతో సంజూ మొహం వాడిపోతుంది. గమనించిన బాలు సంజూ తోనూ కేక్ కట్ చేయిస్తాడు. మా కుటుంబాన్ని ఎవ్వరు విడదీయలేరని పరోక్షంగా హెచ్చరిస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X