Gunde Ninda Gudi Gantalu July 24th: బాలు దెబ్బ అదుర్స్.. మౌనికా భర్తకు సాలిడ్ కౌంటర్

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూలై 23వ తేదీ 472వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలుకు మనోజ్ గురించి నిజం తెలియడంతో షాక్ అవుతాడు. గుడిమెట్ల పై మనోజ్ ఆడుకోవడం చూసి తట్టుకోలేకపోతున్నాడు. ఎన్నోసార్లు మనోజ్ ను బాలు ఆట పట్టించినప్పటికీ అలా బిచ్చగాడు విషయంలో కనిపించేసరికి ఎమోషనల్ అవుతాడు. వెంటనే ఇంటికి తీసుకెళ్తాడు. బిచ్చగాడు విషయంలో మనోజ్ ను చూసిన తల్లి ప్రభావతి, తండ్రి సత్యం షాక్ అవుతారు. నిన్ను ఇంత ప్రేమగా పెంచితే నువ్వు చేసే పని ఇదా అంటూ చురకలు పడతారు. రోహిణి కూడా మనోజ్ చెంప చెల్లుమనిపిస్తుంది. కెనడా వెళ్లడం కోసం మరి ఇంత దిగజారాలా అని మండిపడుతుంది. ఏదైనా ఒక ప్రత్యామ్నాయం చూద్దామని చెబుతుంది. ఇంకోసారి ఇలాంటి పని మాత్రం చేయకని హెచ్చరిస్తుంది. మనోజ్ కూడా అందుకు సరేనని ఒప్పుకుంటాడు. మరోవైపు శృతి వాళ్ళ అమ్మానాన్నతో గొడవ పడుతుంది. మీరు చేసిన పనికి నేను చులకన అయ్యానని మండిపడుతోంది. మీనా ఎలాంటిదో నాకు తెలుసు అని అంటుంది. బాలు కూడా ఎవరిపై అనవసరంగా చేయి చేసుకోబోడని చెబుతుంది.

నేను వెంటనే అత్తగారింటికి వెళ్తానని తల్లిదండ్రులతో చెబుతుంది. ఆ వెంటనే బాలును, రవిని పిలిపిస్తుంది. వాళ్ళిద్దరు ఇంటికి వస్తారు. శృతి వాళ్ళ నాన్న సురేంద్ర మాత్రం శృతిని పంపించడానికి ఒప్పుకోరు. దాంతో శృతి మళ్లీ తన తండ్రి పై ఫైర్ అవుతుంది. నా భర్తతో నన్ను విడదీసే హక్కు మీకు లేదని, ఈ ఇంట్లో కూడా ఉండే రైట్స్ నాకు లేవని చెబుతోంది. బాలూనే మాయమాటలు చెప్పి నా కూతుర్ని మోసం చేస్తున్నాడని సురేంద్ర అంటాడు. దాంతో శృతి ఇలా మాట్లాడే ఫంక్షన్ లో చెంప దెబ్బలు తిన్నావని గడ్డి పెడుతుంది. ఇంకోసారి బాలు గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోనని హెచ్చరిస్తుంది. వాళ్లు ఎలాంటి వారో నన్ను ఎంత బాగా చూసుకుంటారో నాకు మాత్రమే తెలుసని అంటుంది. ఇక శృతి వినకపోవడంతో వాళ్ల అమ్మ శోభ సరే నీకు నచ్చినట్టుగానే మీ అత్త వాళ్ల ఇంటికి వెళ్లమని అంటుంది. ఆ తర్వాత రవితో కలిసి అత్తగారింటికి వస్తుంది. శృతి రవి తిరిగి వచ్చిన సందర్భంగా ఇంట్లో కేక్ కట్ చేస్తూ ఉంటారు. ఇంకోవైపు మౌనిక భర్త సంజు భాను కుటుంబాన్ని అవమానించాలని అనుకుంటాడు. నీకో సర్ప్రైజ్ ఉందని చెప్పి మౌనికను పుట్టింటికి తీసుకెళ్తాడు. అక్కడ అందరూ సంతోషంగా ఉండడం చూసి షాక్ అవుతాడు. ఈ క్రమంలో తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జూలై 24వ తేదీ 473 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 473 July 24th

శృతి రవిని బాలు తిరిగి ఇంటికి తీసుకువస్తాడు. వాళ్ళిద్దరూ ఇంటికి తిరిగి రాగానే సత్యం ప్రభావతి ఎంతో సంతోషిస్తారు. కొడుకు కోడలు మళ్లీ ఇంటికి తిరిగి రావడంతో పట్టలేని ఆనందంలో మునిగిపోతాయి. మళ్లీ శృతి ఇంటికి తిరిగి రాదేమోనని, శృతి రాకపోతే రవి కూడా ఇంటికి రాడేమోనని ఎంతగానో బెంగ పెట్టుకున్నానని ప్రభావతి శృతి తో అంటుంది. కానీ రవి బిర్యానీ పంపించడంతో ఎలాగైనా త్వరలోనే ఇంటికి వస్తారని అనుకున్నానని చెబుతుంది. ఇక రోహిణి మాత్రం శృతి ఇంటికి రావడంతో కంగారు పడుతుంది. శృతి ఇంటికి వచ్చిన సందర్భంగా ప్రభావతి మళ్లీ తన తండ్రిని గుర్తు చేస్తూ హింస పెడుతుందని మనసులో అనుకుంటుంది. వెంటనే మళ్ళీ నిప్పు పెట్టాలని అనుకుంటుంది. ఇంకా శృతి తో గొడవ పెంచేలా మాట్లాడుతుంది. ఆరోజు ఫంక్షన్ లో మీ నాన్నను బాలు ఎంతగానో అవమానించాడు కదా, ఇంతలోనే మర్చిపోయావా అని గుర్తు చేస్తుంది. నేను మర్చిపోవడం వల్ల నీకేమైనా నష్టమా అని శృతి తిరిగి ప్రశ్నిస్తుంది.

ఎలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఆలోచించాలనే విషయాలను నాకు మీనా నేర్పిందని చెబుతోంది. ఇకపై ఎవరు కూడా గతాన్ని గుర్తు పెట్టుకోవద్దని కోరుతుంది. ఈరోజు నుంచి మళ్లీ కొత్తగా లైఫ్ ని స్టార్ట్ చేద్దామని అంటుంది. అందుకోసమే కేక్ కూడా తీసుకోవచ్చానని చెబుతోంది. ఆ కేక్ పై హ్యాపీ ఫ్యామిలీ అని కూడా రాయిస్తుంది. దాంతో ప్రభావతి సత్యం సంతోషిస్తారు. ఇకపై ఎప్పుడూ మనమందరం ఇలానే కలిసి ఉండాలని సత్యం సూచిస్తాడు. దానికి అందరూ సరే అని అంటారు. ఇక కేక్ కట్ చేసి అందరం తినిపించుకుందామని శృతి అంటుంది. భార్యాభర్తలు అందరూ తినిపించు కుందామని చెబుతోంది. దాంతో ప్రభావతి సత్యం కూడా సరదాగా కేక్ తినిపించుకుంటారు. అటు బాలు మీనా, మనోజ్ రోహిణి, రవి శృతి కూడా కేక్ తినిపించుకుంటారు. అందరూ నవ్వుతూ ఉండడంతో ఇల్లు మొత్తం సంతోషంతో వెలిగిపోతుంది. ఇక మరోవైపు మౌనికను కారులో సంజు తీసుకు వస్తూ ఉంటాడు. ఎక్కడికి అని ఎంత అడిగినా కూడా మౌనికకు సంజు చెప్పాడు. మౌనిక ఒత్తిడి చేయడంతో మీ పుట్టింటికి అని చెబుతాడు.

మీ అన్న రవి మీ వదిన శృతి ఇప్పుడు ఇంట్లో లేరని తెలిసింది. వాళ్లు లేకపోవడంతో ఇంట్లో వాళ్ళందరూ శోకసంద్రంలో నిండిపోయారని, అందుకే మనం వెళ్లి వాళ్ళ బాధను ప్రత్యక్షంగా చూసి ఆనందిద్దామని అంటాడు. దాంతో మౌనిక చాలా బాధపడుతుంది. నేను రాను అని అంటుంది. మా వాళ్ళు బాధపడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేనని చెబుతుంది. నాకు అదే కావాలని అంటాడు. ఇక మౌనికను బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్తాడు. కానీ అక్కడ అందరూ సంతోషంగా ఉండటం చూసి సంజు షాక్ అవుతాడు. ఏదేమైనా సమయానికి మౌనిక కూడా వచ్చిందని ప్రభావతి సత్యం బాలు మీనా రవి శృతి సంతోషిస్తారు. వాళ్లని కూడా కేక్ తినిపించుకోండి అని చెబుతారు. ఈ క్రమంలో సంజు కేక్ కట్ చేస్తానని అంటాడు. కేక్ పై శృతి రాయించిన హ్యాపీ ఫ్యామిలీ ని ముక్కలుగా కట్ చేస్తూ ఉంటాడు. అది గమనించిన బాలు మా ఫ్యామిలీని ఎవరు ముక్కలు చేయలేరని, అలా కట్ చేయడానికి నేను కాదు చాక్ అని పరోక్షంగా హెచ్చరిస్తాడు. అవమానిద్దామని వెళ్లిన సంజుకు అవమానం జరగడంతో వెంటనే వెళ్ళిపోదామని మౌనికతో అంటాడు. మౌనికను ఈరోజు ఉండనివ్వమని ఇంట్లో అడిగినా కూడా లేదు వెళ్లాలని చెబుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ కి వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X