Gunde Ninda Gudi Gantalu July 25th: మౌనికతో మృగంలా ప్రవర్తించిన సంజూ.. రోహిణికి మీనా వార్నింగ్
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూలై 24వ తేదీ 473వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రవి, శృతి ఇంటికి తిరిగి రావడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. శృతి కేక్ తెచ్చి మళ్లీ కొత్తగా లైఫ్ ను స్టార్ట్ చేద్దామని ఎవ్వరూ ఏదీ మనస్సులో పెట్టుకోకూడదని చెబుతుంది. గతాన్ని మర్చిపోయి కలిసి ఉందామని అంటుంది. అందుకు అందరూ సరేనని అంటారు. కేక్ కట్ చేసి అందరూ స్వీట్లు తినిపించుకుంటారు. ఇక అదే సమయంలో మౌనికాను తీసుకొని సంజూ వస్తాడు. సత్యం, ప్రభావతి తమ కొడుకు కోడళ్లు విడిపి బాధలో ఉన్నారని, వాళ్ల బాధను చూసి సంతోషిద్దామని మౌనికాను వెంట పెట్టుకొని వస్తాడు. కానీ అక్కడ అందరూ సంతోషంగా ఉండటం చూసి సంజూ మొహం చిన్నగా మారుతుంది. మౌనికాకు మాత్రం అది నిజంగానే సర్ ప్రైజ్ గా మారింది. ఇంతంటి అవమానాన్ని తట్టుకోలేక మౌనికాకు వెళ్లిపోదాం రమ్మని పిలుస్తాడు. సత్యం, ప్రభావతి ఎంత చెప్పినా కూడా ఆగకుండా మౌనికాను తీసుకొని వెళ్లిపోతానని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తికకంగా మారింది. ఇక జూలై 25వ తేదీ 474 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?
మౌనికను తీసుకొని సంజూ తన పుట్టింటికి వస్తాడు. రవి, శృతి కలిసి ఉండటం లేదని తెలుసుకుని మౌనికాను వెంట పెట్టుకొని వెళ్లాడు. కానీ అక్కడ అందరూ హ్యాపీగా ఉండటం చూసి కంగు తింటాడు. తన ప్లాన్ మొత్తం చెడిపోయిందని అప్సెట్ అవుతాడు. ఇక మౌనికా మాత్రం సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, మీనా, రోహిణి, శృతితో కలిసి గడిపే సమయం వచ్చినందుకు ఆనంద పడుతుంది. మౌనికాను, ఆ ఇంటి కుటుంబ సభ్యులందరూ బాధపడితే చూడాలనుకున్న బాలుకు చుక్కెదురవుతుంది. ఇక మౌనికా సంతోషంగా ఉంటే చూడలేకపోతాడు. వెంటనే అక్కడి నుంచి మౌనికాను తిరిగి తీసుకెళ్లిపోవాలని ప్రయత్నిస్తాడు. కేక్ కట్ చేసి స్వీట్స్ తినిపించుకున్న తర్వాత వెంటనే వెళ్లాలని అనుకుంటాడు. దాంతో తనకు ఫోన్ వచ్చినట్టుగా నాటకం ఆడుతాడు. మౌనికా మనం వెంటనే వెళ్లాలని చెబుతాడు. ఈ రోజు మౌనికా చాలా సంతోషంగా ఉందని, ఇవ్వాళ ఒక్క రోజు ఉండనివచ్చు కదా అల్లుడు గారు అని సత్యం అడుగుతాడు. కానీ సంజూ కుదరదని చెబుతాడు. తన స్నేహితుడి వద్దకు వెళ్లాల్సి ఉందని, ఇద్దరం కలిసి వస్తామని చెప్పినట్టు సమాధానం ఇస్తాడు. ఇక అక్కడ అందరూ సంతోషంగా ఉండటంతో చూసి తట్టుకోలేకపోతాడు.

ఇక వెంటనే మౌనిక కూడా నేను వెళ్తానులే నాన్న అని సత్యంకు బదులిస్తుంది. ఇవ్వాళ మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడే మిమ్మల్ని ఇలాంటి సమయంలో నన్ను కలిపేందుకు ఇక్కడికి వచ్చేలా చేశాడు. మీ అందరినీ కలిసినందుకు నా కడుపు నిండిపోయిందని చెబుతుంది. మళ్లీ వీలైనప్పుడు వస్తానని చెప్పి సంజూతో తిరిగి వెళ్లిపోతుంది. ఇక ఇంటికి తిరిగి వెళ్లిన తర్వాత సంజూ మౌనికాకు వార్నింగ్ ఇస్తాడు. నీకు చాలా సంతోషంగా ఉంది కదానే అని అరుస్తాడు. మీరే సంతోషంగా ఉండమని ఉన్నాను కదా అని అంటుంది. తెలుగులో ఒక సామేత ఉంది. చెడపకురా చెడేవు అని. ఇప్పటికైనా మీరు ఇలా కుట్రపూరితంగా ఆలోచించడం మానేస్తే మనం హ్యాపీగా ఉంటామని మౌనిక అంటుంది. లేదంటే ఎప్పటిలాగే మనం మధ్య మనస్ఫార్థాలు వస్తాయని అంటుంది. ఏంటే నువ్వు నాకు నీతులు చెబుతున్నావని సంజూ మౌనికా చెంప చెల్లుమనిపిస్తాడు. రేపోమాపో మీ బాలు అన్నని ఏదైనా చేస్తే నువ్వు ఇలాగే సంతోషంగా ఉంటావా? ఇకపై ఉండాలి.
మీ ఇంట్లో వాళ్లను ఏదోరకంగా ఇబ్బంది పెడుతూనే ఉంటా. ముఖ్యంగా నిన్ను ప్రతి రోజూ కొడుతూ చిత్రహింసలు పెడుతా. ఆ విషయంలో తెలుసుకొని నీ పుట్టింటి వాళ్లు కుమిలి కుమిలి ఏడవాలి. ఆ బాధతో నీ తండ్రి కూడా చావాలి. అప్పుడు కూడా నువ్వు నవ్వుతూ ఉండాలని అంటాడు. అసలు నిన్ను పెళ్లి చేసుకుంది నీ అందం చూసి కాదు, కేవలం పగతోనే, నిన్ను చిత్ర హింసలు పెట్టడానికే అని అంటాడు. దాంతో మౌనికా కన్నీళ్లు పెట్టుకుంటూ మౌనంగా ఉండిపోతోంది. మరోవైపు రోహిణికి కడుపు కాలిపోతుంటుంది. శృతి తిరిగి ఇంటికి రావడంతో ఎలాగైనా గొడవ పుట్టించాలని ప్రయత్నిస్తుంటుంది. శృతి వెళ్లి మీనా దగ్గర మాట్లాడుతున్న సమయంలో రోహిణి కూడా వెళ్లి గొడవ చేయాలని ప్రయత్నం చేస్తుంది. అసలు నువ్వు తిరిగి ఇంటికి వస్తావని అస్సలు అనుకోలేదని శృతితో అంటుంది. ఎందుకు అలా అనుకున్నావ్ నేనే మొత్తమే రానని, రావద్దని అనుకున్నావా? అని రోహిణిని శృతి తిరిగి ప్రశ్నిస్తుంది. అలా ఏం లేదని రోహిణి అంటుంది.
నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు మాత్రం నేను తిరిగి వచ్చినందుకు డిస్సాపాయింట్ అవుతూనే ఉన్నావని శృతి అంటుంది. అలా ఏం లేదు శృతి, బాలు మీ నాన్నను కొట్టాడు కదా ఆ విషయం మర్చిపోయి నువ్వు ఇంటికి రావడం కాస్తా ఆశ్చర్యంగా అనిపించిందని అంటుంది. నువ్వు ఇంటికి వచ్చావంటే మీ నాన్నను బాలు కొట్టడం సరేనని ఒప్పుకుంటున్నావా? అని రోహిణి రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. నేను బాలు చేసింది తప్పని అనడం లేదు, అలాగని మా నాన్న దీపాను దొంగ అని నిందించడం కూడా సరికాదు. ఇద్దరివైపు తప్పు ఉండటంతో ఎవరినీ సమర్థించడం లేదని చెబుతుంది. ఇక రోహిణి మాటలకు మీనా స్పందిస్తూ.. శృతి మరిచిపోయిన గొడవను గుర్తు చేసి మరీ పెద్ద సమస్య తేవాలని ప్రయత్నిస్తున్నావా? రోహిణి అని అంటుంది. మాట మాట పెరిగి రోహిణి వాళ్ల భర్త మనోజ్ గుడి మెట్లపై అడుక్కు తింటున్నాడని చెబుతుంది. కెనడా వెళ్లడం కోసం ఇంతలా దిగజారిపోవాలా? అని శృతి అంటుంది. దాంతో రోహిణికి మండి వాళ్ల దగ్గర నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు రవికి కూడా బాలు మనోజ్ గురించి చెబుతాడు. గుడి మెట్లపై అడుక్కోవాల్సిన పరిస్థితి ఏంటని రవి మనోజ్ ను కడిగేస్తాడు. ఒక ప్రోమోలో మీనా పూలకొట్టు ను తీయించేందుకు రోహిణి, ప్రభావతి కుట్ర చేస్తారు. ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











