Gunde Ninda Gudi Gantalu July 28th: ప్రభావతి కుళ్లు బుద్ధికి మీనా బలి.. రోహిణితో కలిసి కుట్ర..

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూలై 25వ తేదీ 474వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మౌనికాను సంజూ టార్చర్ పెడుతాడు. అసలే మౌనికా పుట్టింటి వాళ్లను అవమానిద్దామని వెళ్లిన సంజూకు ఎదురు దెబ్బ తగులుతుంది. వాళ్ల ఇంట్లో వాళ్లందరూ సంతోషంగా ఉండటం చూసి తట్టుకోలేకపోతాడు. కానీ మౌనికా మాత్రం సంతోషంగా ఉంటుంది. ఇక ఇంటికి తిరిగి వెళ్లిన తర్వాత సంజూ మౌనికాను టార్చర్ పెడుతాడు. మీ ఇంట్లో వాళ్లను ఇకపై నేను టార్చర్ పెడుతూనే ఉంటానని, నిన్ను దారుణంగా కొడుతూనే ఉంటానని, అది చూసి మీ పుట్టింట్లో వాళ్లు కుమిలి కుమిలి చావాలని అంటుంది. అది చూసి కూడా నువ్వు ఆనందంగా ఉండాలని హెచ్చరిస్తాడు. ఇక మరోవైపు శృతి మైండ్ ను చెడగొట్టేలా రోహిణి మాట్లాడుతూ ఉంటుంది. ఫంక్షన్ లో జరిగిన గొడవను శృతి మర్చిపోయినప్పటికీ కూడా రోహిణి కావాలని గుర్తు చేస్తూ ఉంటుంది. బాలుకు, శృతికి మధ్య గొడవ పుట్టించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది.

ఇక వెంటనే మీనా స్పందిస్తుంది. రోహిణికి కౌంటర్ ఇస్తుంది. శృతి మర్చి పోయినా కూడా ఆ గొడవను నువ్వు ఎందుకు గుర్తుకు చేస్తున్నావని రోహిణిని ప్రశ్నిస్తుంది. బాలు అయినా కారు నడుపుకొని బతుకుతున్నాడు. కానీ మీ ఆయన గుడిమెట్లపై అడుక్కోని తినడం లేదు కాదు అని అంటుంది. దాంతో గుడి మెట్లపై అడుక్కు తినడం ఏంటని శృతి మీనాను ప్రశ్నిస్తుంది. ఇక వెంటనే మీనా మనోజ్ గుడి మెట్లపై ఎందుకు అడుక్కు తిన్నాడో, ఏం జరిగిందో పూర్తిగా వివరిస్తుంది. దాంతో శృతి షాక్ అవుతుంది. జాబ్ లేకపోతే గుడి మెట్ల మీద కూర్చొని అడుక్కు తినాల్సి పని ఏంటని ప్రశ్నిస్తుంది. మనోజ్ గురించి మీనా నిజం చెప్పడంతో రోహిణి అప్సెట్ అవుతుంది. అవమానంగా భావిస్తుంది. వెంటనే వాళ్ల దగ్గర నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తికకంగా మారింది. ఇక జూలై 28వ తేదీ 475 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 475 July 28th

మీనాపై ఎలాగైనా రివేంజ్ తీర్చుకోవాలని రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది. లేదంటే అత్త ప్రభావతి నుంచి తనకు టార్చర్ మొదలవుతుందని అనుకుంటుంది. ఏదైనా గొడవ జరిగితే పెద్ది చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మీనా పూల ఆర్డర్స్ ఇవ్వడానికి ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటుంది. దాంతో ప్రభావతి ఎక్కడికి అని ప్రశ్నిస్తుంది. పూల ఆర్డర్స్ ఉన్నాయి. ఇచ్చేసి వస్తానని చెబుతుంది. నీ వల్ల ఇంట్లో మొత్తం ప్రశాంతత లేకుండా పోతోంది. ఈ పూల గోలను భరించలేకపోతున్నానని అంటుంది. నీ వల్ల ఈ ఇల్లు మొత్తం వాడిపోతోందని అంటుంది. దీంతో మీనా కాసన్నీ నీళ్లు చల్లండి వికసిస్తుందని కౌంటర్ ఇచ్చి తన పనికి తను వెళ్తుంది. ఇదే సమయంలో ప్రభావతి ఇంటికి శృతి వాళ్ల అమ్మ వస్తుంది. ఆమె రావడంతో ప్రభావతి ఎంతగానో సంతోషిస్తుంది. మీరు ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని చెబుతుంది. శృతి వాళ్లు బయటకి వెళ్లారని త్వరగానే తిరిగి వస్తారని చెబుతుంది. అప్పటి వరకు మీరు టీ తాగండి అని అంటుంది.రోహిణితో శృతి వాళ్ల అమ్మకు ప్రభావతి టీ ఇప్పిస్తుంది. ఇక ఇదే సమయంలో మీనా పూల కొట్టు దగ్గరకు ఒక మహిళ వస్తుంది. బయట ఎవరు లేకపోవడంతో ఆమె నేరుగా ఇంట్లోకే వస్తుంది.

100 రూపాయాలకు పూలు ఇవ్వమని మీనాను పిలుస్తూ అడుగుతుంది. అందుకు ప్రభావతి స్పందిస్తూ మీనా ఇంట్లో లేదని మళ్లీ వచ్చి తీసుకోమని చెబుతుంది కానీ ఆమె మాత్రం మీనా ఇంట్లో లేకపోతే ఏంటీ నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా తీసుకొచ్చి ఇవ్వమని అంటుంది. పూలు ఎక్కడ పెట్టి వెళ్లిందో నాకు తెలియడం లేదని చెబుతుంది. ఫ్రీడ్జ్ లో పెట్టిందని చెప్పింది. వెళ్లి తీసి ఇవ్వు అని ఆ మహిళ ప్రభావతితో అంటుంది. ఆమె అలా మాట్లాడటంతో శృతి వాళ్ల అమ్మ శోభ ముందు ప్రభావతి చిన్నతనంగా భావిస్తుంది. చేసేదేమీ లేక తీసి పూల మూరలను కొలిచి ఇస్తుంది. దాంతో శోభ కావాలని ప్రభావతిని అవమానిస్తుంది. నీకు కూడా పూలు కొలవడం వస్తుంది కదా అని అంటుంది. ఈ పూల వ్యాపారానికి నువ్వు సరిగ్గా సెట్ అవుతావని అంటుంది. మీనాతో జతకలిస్తే ఈ వ్యాపారాన్ని పెద్దగా చేయొచ్చని ప్రభావతికి కాలిపోయేలా మాట్లాడుతుంది. కానీ ప్రభావతి మాత్రం నాకు పూల వ్యాపారం గురించి పెద్దగా తెలియదని అంటుంది. అయినా శృతి వాళ్ల అమ్మ కావాలనే పదే పదే నీకు పూల వ్యాపారం బాగా సెట్ అయ్యిందని అంటూనే ఉంటుంది. అదీగాక ఇంటి నుంచి వెళ్లే ముందు 200 రూపాయాలకు పూలు కూడా కొనుక్కొని వెళ్తుంది.

ఇక శోభ అన్న మాటలకు ప్రభావతి ఫుల్ అప్సెట్ అవుతుంది. మీనా వల్ల తనను పూలు అమ్ముకునే దాన్ని చేస్తున్నారని మండిపడుతుంది. ఇక శృతి, రవి కూడా ఇంటికి తిరిగి వస్తారు. ఈ సమయంలో శోభ వారికి కలుస్తుంది. ఇందాకనే వచ్చానని, మళ్లీ వీలైనప్పుడు తిరిగి వస్తానని చెబుతుంది. ఇక ఈ ఇంట్లో నీకు ఉండాల్సిన పనేం లేదని, నీకు ఇక్కడ ఏమాత్రం సౌకర్యం అనిపించినా వెంటనే మన ఇంటికి వచ్చేసేయ్ అని చెబుతుంది. మరోవైపు మీనా వల్ల తన పరువు పోతోందని ప్రభావతి మండిపడుతుంది. వెంటనే ఇంటి ముందు నుంచి పూల కొట్టును తొలిగించేందుకు ప్లాన్ చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదే సమయంలో రోహిణి ప్రభావతికి సలహానిస్తుంది. మున్సిపాలిటీ వారికి కంప్లైంట్ చేస్తే వారే తీసుకెళ్లిపోతారని అంటుంది. ఇక ప్రభావతి వెంటనే కంప్లైంట్ చేయమని అడుగుతుంది. రోహిణి అధికారులకు పూల కొట్టును తొలగించండి అని చెబుతుంది. మరోవైపు బాలు దగ్గరకి ఒక ముసలాయన వచ్చి సాయం కోరుతాడు. తమ ఇంట్లో కొందరు కుర్రాళ్లు అద్దెకు ఉంటూ ఇబ్బంది పెడుతున్నారని, ఖాళీ చేయమంటే తిరిగి బెదిరిస్తున్నారని వచ్చి బాలుకు చెబుతాడు. అందుకు బాలు నేను వాళ్లని బెదిరించే పని పెట్టుకోలేదు. వెళ్లి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వమని చెబుతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X