Gunde Ninda Gudi Gantalu July 29th: మీనా పూల కొట్టు ధ్వంసం.. చల్లారిన ప్రభావతి కడుపు మంట

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూలై 26వ తేదీ 475వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శృతి వాళ్ల అమ్మ శోభ ప్రభావతిని దగ్గర చేసుకునేందుకు ఇంటికి వస్తుంది. ఆ సమయానికి మీనా ఇంట్లో ఉండదు. శోభా రాగానే ప్రభావతి ఆహ్వానించి మర్యాదలు చేస్తూ ఉంటుంది. ఇక శృతిని ఇంటిక పంపించినందుకు సంతోషంగా ఉందని ప్రభావతి అంటుంది. శృతి రానని మొండికేస్తే నేనే నచ్చజెప్పి పంపించానని శోభ ప్రభావతితో చెబుతుంది. ఇక ఇదే సమయంలో మీనా దగ్గర పూలు తీసుకోవడానికి ఒక మహిళ వస్తుంది. ఏకంగా ఇంట్లోకి వచ్చి డబ్బులు ఇచ్చి పూలు కొనుక్కోని వెళ్తుంది. ప్రభావతికి ఇష్టం లేకున్నా పూలు కొలిచి ఇస్తుంది.

దీంతో శోభా ప్రభావతిని అవమానిస్తుంది. నీకు పూల వ్యాపారం బాగా అబ్బిందని, నువ్వు ఇక ఈ వ్యాపారం చూసుకుంటే త్వరగానే రిచ్ అవుతావని చెబుతుంది. మీనాతో కలిసి ఈ పూల వ్యాపారం చేసుకోమని సలహానిస్తుంది. అప్పటికే పూల వ్యాపారం నచ్చని ప్రభావతిని అదే పూల వ్యాపారం చేసుకోమని చెప్పడంతో షాక్ అవుతుంది. కాస్తా అవమానంగా భావిస్తుంది. కోపంతో రగిలిపోతుంది. ఆ కోపంతో మీనా పూల కొట్టును ఇంటి ముందు లేకుండా చేయాలని నిర్ణయిస్తుంది. పైగా శృతి వాళ్ల డబ్బులిచ్చి పూల కొనుక్కొని వెళ్లడాన్ని మరీ అవమానంగా భావిస్తుంది. దీంతో రోహిణితో కలిసి పూల కొట్టు తొలగించేందుకు ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తికకంగా మారింది. ఇక జూలై 29వ తేదీ 476 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 476 July 29th

శృతి వాళ్ల అమ్మ శోభ ఇంటి వచ్చి మరీ ప్రభావతిని అవమానిస్తుంది. మీనా పూలకొట్టు వ్యాపారం బాగా సాగుతుందని, ఇక నువ్వు కూడా ఈ పూల కొట్టు వ్యాపారం చేసుకోమని, మీనాకు సాయంగా ఉండమని చెబుతుంది. నీకు పూల వ్యాపారం బాగా సెట్ అయ్యిందని శోభా ప్రభావతితో అంటుంది. దాంతో ప్రభావతి చిన్నతనంగా భావిస్తుంది. అసలు మీనా కొట్టు వల్లనే శృతి వాళ్ల అమ్మ శోభ ఇంతలా అవమానించి వెళ్తున్నదని రగిలిపోతుంది. ఇక శృతి కూడా మీనా పూల వ్యాపారంలో అత్త ప్రభావతిని సాయంగా ఉండమని చెబుతుంది. దాంతో ప్రభావతి ఇంకా రగిలిపోతుంది. శోభా, శృతి అలా అనడంతో ఆ కోపాన్ని మీనాపై చూపిస్తుంది. అది కూడా మీనా పూల కొట్టుపై ప్రభావతి కన్ను పడుతుంది. వీలైనంత త్వరగా పూల కొట్టును తొలగించాలని అనుకుంటుంది. వెంటనే రోహిణిని పిలిచి మీనా పూల కొట్టు వల్ల నా పరువు మొత్తం పోతోందని వాపోతుంది. ఎలాగైనా వెంటనే మీనా పూల కొట్టును ఇంటి ముందు నుంచి తీసివేయాలని చెబుతుంది. దాంతో రోహిణి వెంటనే ఉపాయం చెబుతుంది.

పూల కొట్టు పెట్టిన సమయంలో బాలు ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి మున్సిపల్ ఆఫీసర్స్ కు ఫోన్ చేసి వెంటనే ఫిర్యాదు చేస్తే వాళ్లే తొలగిస్తారని చెబుతుంది. దాంతో సరేనని వెంటనే కంప్లైట్ చేస్తారు. ఇక ఆ రోజే మున్సిపల్ అధికారులు, సిబ్బంది వచ్చి ఆ పూల కొట్టును తొలగించే ప్రయత్నం చేస్తారు. అంతుకు ముందే కామాక్షి ప్రభావతి ఇంటికి వస్తుంది. శృతి వాళ్ల అమ్మ శోభా వచ్చి అవమానించడాన్ని పదే పదే గుర్తుకు చేసి ప్రభావతికి కోపం తెప్పిస్తుంది. దీంతో మళ్లీ ఆ కోపాన్ని మొత్తం మీనా పూలకొట్టుపై చూపిస్తుంది. ఆ పూల కొట్టు సర్వనాశనం అయిపోవాలని శపిస్తుంది. ఆ వెంటనే రోహిణి వచ్చి మున్సిపల్ సిబ్బంది వచ్చి పూల కొట్టును తొలగిస్తున్నారని చెబుతుంది. ఇక ప్రభావతి సంబర పడుతూ వెళ్లి చూస్తుంది. కామాక్షి మాత్రం షాక్ అవుతుంది. అసలు ప్రభావతి నోటి వెంట అలా మాట వచ్చిందో లేదో ఇలా మున్సిపల్ సిబ్బంది వచ్చి పూల కొట్టును తొలించడం ఏంటని సందేహిస్తుంది. ఇక వీళ్లే ఏదో చేసి ఉంటారని సందేహిస్తుంది.

మరోవైపు అధికారులు పూలకొట్టును తొలగిస్తూ ఉంటే ప్రభావతి, రోహిణి చూస్తూ సంబర పడుతారు. అనుకున్నట్టుగానే మీనా పూల కొట్టును తీయించేస్తున్నామని సంతోషిస్తారు. ఇక కామాక్షి వచ్చి అధికారులు, సిబ్బందిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అసలు ఎందుకు పూల కొట్టును తొలగిస్తున్నారని అడుగుతుంది. దాంతో చుట్టు పక్కల వాళ్లు కంప్లైంట్ ఇచ్చారని, పూల దండలు రోడ్లపైనే పడేయటంతో అందరికీ ఇబ్బందిగా ఉందని ఫిర్యాదు వచ్చిందని చెబుతారు సిబ్బంది. అందుకే తొలగిస్తున్నామని, ఏధైనా ఉంటే మున్సిపల్ ఆఫీస్ కు వచ్చి చూసుకోండి అని చెప్పి పూల కొట్టును ఎత్తే ప్రయత్నం చేస్తారు. ఇదే సమయంలో మీనా ఆటోలో ఇంటికి తిరిగి వస్తుంది. తన పూల కొట్టును తీసేయడాన్ని చూసి కంగారు పడుతుంది. అదే సమయంలో సత్యం కూడా ఇంటికి తిరిగి వస్తాడు.

పూల కొట్టును తొలగిస్తున్న సిబ్బందిని అడ్డుకుంటారు. అసలు ఈ చిన్న పూల కొట్టును తొలగించమని ఎవరు కంప్లైంట్ ఇచ్చి ఉంటారని ప్రశ్నిస్తారు. ఇక కామాక్షి బండ బూతులు తిడుతుంది. ఎవరో కావాల్సిన వారే ఇలాంటి పని చేసి ఉంటారని మండి పడుతుంది. వాళ్ల కాళ్లు, చేతులు విరిగిపోవాలని, వాళ్లకు సర్వరోగాలు రావాలని శపిస్తుంది. ఇక మీనా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే కామాక్షినే ఓదార్చుతుంది. కంప్లైంట్ ఇచ్చిన వాళ్లను ఎలాగైనా కనిపెడుతానని అంటుంది. మరోవైపు ప్రభావతి, రోహిణిపై తనకు సందేహం వస్తుంది. దాంతో ఇంక నాలుగు మాటలు ఎక్కువగానే తిడుతుంది. ఇక మీనా వెంటనే విషయాన్ని బాలుకు చెబుతుంది. బాలు వచ్చి పూల కొట్టును ఎలా తొలగిస్తారని, అసలు కంప్లైంట్ చేసింది ఎవరై ఉంటారని ఆరా తీసే ప్రయత్నం చేస్తాడు. ఇక ఎలాగైనా వారిని కనుక్కుంటానని అంటాడు. బయటి వాళ్లు అయ్యి ఉండరు బాలు, ఇంట్లో వాళ్లే అయ్యి ఉంటారు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అని కామాక్షి చెబుతుంది. ఎవరైనా వాళ్లను కనిపెడుతానని అంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X