Gunde Ninda Gudi Gantalu July 30th: బాలు ఉగ్రరూపం.. మీనా కోసం కీలక నిర్ణయం

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూలై 27వ తేదీ 476వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మీనా పూలకొట్టును అధికారులు తొలగిస్తూ ఉంటారు. కానీ ప్రభావతి, రోహిణి మాత్రం చూస్తూ ఉంటారు. ఇక అదే సమయంలో మీనా ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది. తన పూల కొట్టును మున్సిపల్ సిబ్బంది తొలగించడాన్ని చూసి ఆందోళన పడుతుంది. వెంటనే వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. మీనా వెనకాలే మామ సత్యం కూడా వస్తాడు. మున్సిపల్ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. అయినా సిబ్బంది వినిపించుకోరు. ఎవరో మీపై కంప్లైంట్ ఇచ్చారని అందుకే బండిని తీసేస్తున్నామని చెబుతారు. ఏదైనా ఉంటే మున్సిపల్ ఆఫీస్ దగ్గరకు వచ్చి మాట్లాడుకోండి అని సూచిస్తారు.

ఇక ఈ విషయాన్ని మీనా బాలుకు ఫోన్ చేసి చెబుతుంది. బాలు వెంటనే వచ్చి జరిగిన విషయం పట్ల తీవ్ర ఆగ్రహానికి గురవుతాడు. ఎవరో కావాలని చేసి ఉంటారని మండిపోతాడు. ఇదే సమయంలో తల్లి ప్రభావతి, వదిన రోహిణి మనం ఎప్పటికీ తెలుసుకోలేమని అంటుంది. ఫిర్యాదు చేసిన వారి పేర్లను మున్సిపల్ అధికారులు గోప్యంగా ఉంచుతారని, అస్సలు బయటికి చెప్పబోరని అంటుంది. ఎప్పటికైనా పూల కొట్టు తీయించేయడానికి కారణం ఎవరనేది కనుక్కుంటానని, ఆ తర్వాత వాళ్ల అంతు చూస్తానని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తికకంగా మారింది. ఇక జూలై 30వ తేదీ 477 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 477 July 30th

మీనా పూలకొట్టును తొలగించినందుకు బాలు అప్సెట్ అవుతాడు. అసలు ఆ చిన్న పూల కొట్టుపై ఎవరి కన్ను పడిందోనని రగిలిపోతాడు. ఇక కామాక్షి నాకు ఇంట్లో వాళ్లపైనే అనుమానం ఉందని చెబుతుంది. మీనాక్షి ఆ మాట అనగానే ప్రభావతి, రోహిణి భుజాలు తడుముకుంటారు. వాళ్లు ఇంట్లో వాళ్లైనా, బయటి వాళ్లైనా సాక్ష్యాధారాలతో దొరికిన సమయం మాత్రం అస్సలు ఊరుకునేది లేదని అంటాడు బాలు. ఇక మీనా ఎంతో బాధ పడుతుండటంతో ఊరుకోమని చెబుతాడు. పూల కొట్టు పోయిందనే బాధలో మీనా భోజనం చేయకుండా అలాగే ఉంటుంది. మేడపై ఒక్కతే కూర్చొని పుట్టెడు శోకంతో కుమిలి పోతుంది. తన బాధను బాలు చూడలేకపోతాడు. వెంటనే మీనా దగ్గరకు భఓజనం తీసుకొని వెళ్లి తినిపించి ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. దాంతో మీనా ఏమాత్రం కన్నీళ్లను ఆపుకోదు. తన పూల కొట్టును తలుచుకునే ఏడుస్తూ ఉంటుంది. అసలు మన పూల కొట్టు ఏం చేసిందండి అంటూ బాలుతో అంటుంది. సమాజంలో కొందరు అలాగే ఉంటారని అంటాడు బాలు. వారందరినీ పట్టించుకుంటే మన జీవితం ముందుకు వెళ్లదు.

నేను ఈ ఇంట్లోకి మాత్రం రాగలిగాను కానీ, ఈ ఇంట్లో మా అమ్మ ప్రేమను ఏమాత్రం నోచుచోలేకపోతున్నాను. కొన్ని అంతే మార్చలేమని అంటాడు. కానీ మా నానమ్మ చెప్పినట్టు సముద్రంలో ఎగసిపడే అలలే మనకు ఆదర్శమని మీనాలో ధైర్యం నింపుతాడు. మన జీవితంలోనూ ఎన్ని సార్లు కింద పడ్డా పైకి లేస్తూనే ఉండాలని అంటాడు. ఇప్పటికే నాకు కారు పోయి, ఆటో, ఆటో పోయి మళ్లీ కారు వచ్చింది. అలాగే నీకు కూడా ఏదోరూపంలో పూల వ్యాపారం నడుస్తూనే ఉంటుందని, దానికి నేను హామీనిస్తున్నానని చెప్పి భోజనం తినిపిస్తాడు. ఇక పూల కొట్టును కోల్పోయినందుకు మీనా, బాలు చాలా బాధపడుతారు. రాత్రి నిద్ర కూడా పోలేరు. ఇక ఉదయం మీనా కాస్తా పొద్దుపోయి లేస్తుంది. దీంతో మీనాపై ప్రభావతి మండి పడుతుంది. ఎక్కడి పనులు అక్కడే ఉండటం చూసి చిర్రుబుర్రులాడుతుంది.

ఇక మనోజ్, రోహిణి కిందికి వచ్చి కాఫీ ఇవ్వమని ప్రభావతిని అడుగుతారు. ఇంకా నాకే ఆ మీనా కాఫీ ఇవ్వలేదని రోహిణితో అంటుంది. ఇదే సమయంలో మీనా బిల్డింగ్ పై నుంచి కిందికి వస్తుంది. ఇక ప్రభావతి మాటల తుటాలు పేల్చుతుంది. నిన్నటి వరకు పూల వ్యాపారం ఉండేది. ఇప్పుడు ఏ పనిపాట లేదు కదా. ఎందుకు ఉదయమే లేచి ఇంటి పనులు అన్నీ చేయలేదని ప్రశ్నిస్తుంది. నేను ఒక్క దాన్నే చేయాలని ఏమీ లేదు కదా? రోహిణికి కూడా కాఫీ పెట్టుకోవచ్చు కదా అని తిరిగి ప్రశ్నిస్తుంది. ఎవ్వరి పనులు వారే చేసుకుంటూ నువ్వు కాలు మీద కాలేసుకొని కూర్చొని తింటావా? అని ఎగతాళి చేస్తుంది. ఇక వెనకాలే బాలు వస్తాడు. నా భార్య మీనాను ఎందుకు దూషిస్తున్నారని ప్రశ్నిస్తారు. ఎలాంటి తప్పు చేయని నా భార్యపై మాటలు అంటే అస్సలు ఊరుకోనని హెచ్చరిస్తాడు. ఇకపై మీనా ఇంట్లో పనులు చేయదని, ఎవరి పనులు వారే చేసుకోవాలని అంటాడు. అవసరమైతే పని మనిషిని పెట్టుకోమని చెబుతాడు బాలు. అవసరం లేదని రోహిణి బాలుపై అరుస్తుంది. మేం బయటికి వెళ్లి కాఫీ తాగుతామని అంటుంది.

మరోవైపు బాలు మీనా విషయంలో చాలా బాధపడుతాడు. మీనాకు పూల కొట్టు పోవడంతో మళ్లీ పని మనిషిలాగానే చూస్తున్నారని ఆవేదన చెందుతాడు. ఎలాగైనా మీనాకు మరో వ్యాపారం ఏర్పాటు చేయాలని అనుకుంటాడు. ఇక ఇదే సమయంలో తన స్నేహితుడు రాజేష్ దగ్గరకు వెళ్తాడు. ఇంటి దగ్గర జరిగిన సంగతి అంతా చెబుతాడు. మున్సిపల్ అధికారులు బండి కావాలంటే ఫైన్ కట్టి తీసుకొని వెళ్లమని అంటున్నారు. కానీ బండి తీసుకెళ్లినా ఇప్పుడు ఇంటి దగ్గర ఏర్పాటు చేయలేనని బాలు చెబుతాడు. దాంతో మొబైల్ పూల బండి ఏర్పాటు చేయమని సలహానిస్తాడు. ఇక వెంటనే బాలు వెళ్లి ఒక స్కూటీ కొనేందుకు ప్రయత్నిస్తాడు. అక్కడ కట్టాల్సిన డబ్బుల్లో 10 వేలు తగ్గుతుంది. ఇక ఆ డబ్బు సర్దుకున్నాకనే తీసుకుంటానని అనుకుంటాడు. ఇక అదే సమయంలో తన ఇంట్లో రౌడీలను ఖాళీ చేయించమని తిరుగుతున్న పెద్దాయన పదివేలు పట్టుకొని వస్తాడు. రౌడీలను వెళ్లగొట్టి ఈ డబ్బులు తీసుకోమని చెబుతాడు. నేను రౌడీయిజం చేయమని అడగటం లేదని అంటాడు. తన కూతురి పెళ్లికి సాయం చేయమని కోరుతాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X