Gunde Ninda Gudi Gantalu July 31st: రౌడీలకు మోత మోగించిన బాలు.. మీనాపై కుళ్లుకున్న రోహిణి
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూలై 30వ తేదీ 477వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. పూల కొట్టు పోయిన బాధలో మీనా ఉదయం కాస్తా ఆలస్యంగా లేస్తుంది. ఇక అప్పటికే మనోజ్, రోహిణి తమ గదిలోంచి కిందికి వస్తారు. అప్పటికే మీనా ఎలాంటి పనులు చేయకపోవడం గమనించిన ప్రభావతి కోపంతో ఊగిపోయి ఉంటుంది. ఇక రోహిణి వచ్చి తనకు కాఫీ కావాలని అడుగుతుంది. ఇంకా నాకే మీనా కాఫీ ఇవ్వలేదని చూస్తున్నానని చెబుతుంది. ఇదే సమయంలో మీనా మేడ పై నుంచి కిందికి వస్తుంది. మీనా వచ్చి రాగానే ప్రభావతి నిప్పులు చెరుగుతుంది. ఎలాగూ పూల కొట్టు లేదు కదా ఇంట్లో పనులన్నీ కాస్తా త్వరగా చేయొచ్చు కదా అని అడుగుతుంది. నాకు రాత్రి కాస్తా నిద్ర లేదని, అందుకే లేట్ అయ్యిందని చెబుతుంది. అయినా ప్రభావతి తిడుతూనే ఉంటుంది. అప్పటికే బాలు కూడా వస్తాడు. తల్లి ప్రభావతికి తిరిగి కౌంటర్ ఇస్తారు. మీనా ఇక నుంచి పని మనిషిలా పని చేయదని చెబుతాడు. ఆ వెంటనే బయటికి వెళ్లి మీనా కోసం మళ్లీ పూల కొట్టు పెట్టించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇదే సమయంలో ఒక పెద్దాయ సాయం కోసం తిరుగుతుండటంతో తమ ఇంటికి వెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాడు. అక్కడ రౌడీ మూకలు ఉండటం గమనిస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తికకంగా మారింది. ఇక జూలై 31వ తేదీ 478 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?
మీనాకు పూల కొట్టు పోయిందనే బాధలో ఉంటాడు బాలు. ఎవరో కావాల్సిన వాళ్లే ఇలా చేసి ఉంటారని రగిలిపోతాడు. ఇక మీనా సైతం తన పూల కొట్టు పోయినందుకు దిగాలుగా ఉంటుంది. బాలు మీనాను ఓదార్చుతాడు. ఎలాగైనా మీనాకు మళ్లీ పూల కొట్టును పెట్టించాలని ప్రయత్నిస్తాడు. అయితే మున్సిపల్ ఆఫీస్ కు వెళ్లి పూల కొట్టును తిరిగి తీసుకొద్దామని చూస్తాడు. కానీ అక్కడ అధికారులు మాత్రం బాలుకు పూల కొట్టును ఇవ్వరు. పైగా ఫైన్ కట్టాలని అంటాడు. దాంతో ఇక పూల కొట్టుకు బదులు మొబైల్ పూలకొట్టును ఏర్పాటు చేస్తాడు. అంటే స్కూటీకి పూల బాక్స్ ను ఏర్పాటు చేసి ఇక ఇంటింటికి వెళ్లి పూలు ఇచ్చేలా మార్గం చూస్తాడు. అయితే మొబైల్ పూల కొట్టును ఏర్పాటు చేసేందుకు బాలు దగ్గర పెద్దగా డబ్బులు ఉండవు. బాలుకు అప్పటికే కారు ఈఎంఐ ఉండటంతో స్కూటీ కొనడానికి లోన్ రాదని చెబుతారు. కానీ బాలు దగ్గర 15 వేలు మాత్రమే ఉంటాయి. మిగితా 10 వేలు అడ్జస్ట్ చేస్తే స్కూటీ వస్తుందని ఆలోచిస్తూ ఉంటాడు.

ఇదే సమయంలో ఒక పెద్దాయన బాలు దగ్గరికి 10 వేలు డబ్బులు తీసుకొని వస్తాడు. తను సమస్యల్లో ఉన్నానని, ఆ సమస్యను తీర్చితే నీకు పది వేలు ఇస్తానని చెబుతాడు. అయితే బాలు మాత్రం ఆ పెద్దాయనపైన మండి పడుతాడు. ఆ పెద్దాయన బాలు సాయం కోరుతాడు. తన ఇంట్లో కొందరు రౌడీలు కిరాయికి ఉంటూ ఖాళీ చేయమంటే చేయడం లేదని వాపోతాడు. వాళ్లను ఖాళీ చేయిస్తే ఆ ఇంటిని అమ్మేసి తన కూతురు పెళ్లి చేస్తానని చెబుతాడు. ఈ విషయంలో నాకు నువ్వే సాయం చేయాలని కోరుతాడు. నేను రౌడీని కాదని నువ్వు పోలీసుల దగ్గరకు వెళ్లి సమస్యను చెప్పుకో అని తిరిగి పంపించే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ రౌడీలు తన కూతురు పెళ్లికి అడ్డుగా మారారని, నాకు నా కూతురు పెళ్లి చేయడానికి ఉన్న ఆధారం ఆ ఇల్లు ఒక్కటే అని చెబుతాడు. నువ్వే ఎలాగైనా వచ్చి ఆ రౌడీని తరిమి కొట్టాలని కోరుతాడు. లేదంటే నా కూతురు పెళ్లి ఆగిపోతుందని బ్రతిమిలాడుతాడు.
కూతురు పెళ్లి కోసం పెద్దాయన తపనపడటం చూసి బాలు మనస్సు కరిగి పోతుంది. సరేనని చెప్పి డబ్బుల కోసం కాకుండా సాయం చేయడానికి వెళ్తాడు. ఆ ఇంటికి వెళ్లే సరికి రౌడీలు ఇంట్లో మద్యం, మందు సేవిస్తూ దర్జాగా పేకాడుతూ ఉంటారు. ఇక వాళ్లను చూసిన బాలు మర్యాద ఇంట్లో నుంచి వెళ్లండి అని చెబుతాడు. కానీ వారు వినిపించుకోరు. ఆ పెద్దాయనకు ఉన్న ఒకే ఒక ఆధారం ఈ ఇల్లేనని, మీరు మరోసారి తాగితందనాలు ఆడటానికి చోటు ఉంటుందని చెబుతాడు. ఇక బాలు మాటలకు ఆ రౌడీలు కోపం తెచ్చుకుంటారు. ఇక బాలు వాళ్లకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చి వెళ్లికపోతే ఒక్కొక్కరికి బుద్ధి చెప్పాల్సి వస్తుందని అంటాడు. ఎంత చెప్పినా రౌడీలు వినకపోవడంతో తన్ని తరిమేస్తాడు. రౌడీలు వెళ్లిపోవడంతో ఆ పెద్దాయన ఫుల్ ఖుషి అవుతాడు. బాలు చాలా థ్యాంక్స్ చెబుతాడు. ఆ రౌడీలు వెళ్లకపోయి ఉంటే తన కూతురు పెళ్లి జరిగేది కాదని అంటాడు. నువ్వు చేసిన సాయానికి 10 వేలు తీసుకోమని అంటాడు. ఇదే సమయంలో కామాక్షి, ప్రభావతి అదే రోడ్డున నడుచుకుంటూ వస్తారు.
అక్కడ పెద్ద గొడవ జరగడం చూసి ఏమైందని అడుగుతారు. ఇంట్లో ఉన్న రౌడీలను తరిమించారని స్థానికులు ప్రభావతికి చెబుతారు. మరి డబ్బులు ఎందుకు ఇస్తున్నారని అంటే.. చిన్న రౌడీలను తరిమి కొట్టేందుకు, పెద్ద రౌడీలను తీసుకొని వచ్చారని చెప్పడంతో ప్రభావతి షాక్ అవుతుంది. ఇక ఆ పెద్దాయన వద్దంటున్న కూడా బాలుకు డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. బాలు డబ్బులు తీసుకోవడం ప్రభావతి చూస్తుంది. ఇక వెంటనే బాలు ఇంటికి వెళ్తాడు. స్కూటీ కొనుక్కొని, దాని పూల బాక్స్ ను ఏర్పాటు చేయించి తీసుకెళ్తాడు. ఇంట్లో వాళ్లందరినీ పిలిచి స్కూటీని చూపిస్తాడు. ఇక మీనా సంతోషిస్తుంది. అయితే సత్యం బాలును ప్రశంసిస్తాడు. ఈ సమయంలో ఛాతిపై చేయి వేస్తాడు. బాలు నొప్పితో అరుస్తాడు. రౌడీలను పంపించే సమయంలో బాలును ఒకరు కత్తితో దాడి చేస్తారు. ఆ నొప్పితోనే బాలు ఇంటికి వస్తాడు. ఇక విషయం తెలుసుకొని మీనా, సత్యం కంగారు పడుతారు. ఆ తర్వాత ప్రభావతి ఇంటికి తిరిగి వస్తుంది. వచ్చి రాగానే బాలుపై పడుతుంది. బాలు రౌడీయిజం చేసి డబ్బులు సంపాదించాడని, ఆ స్కూటీ కొన్నది ఆ డబ్బులతోనేనని, నేనే స్వయంగా చూశానని చెబుతుంది. దీంతో బాలును అందరూ నిందిస్తుంటారు. ఈ సయమంలో మళ్లీ ఆ పెద్దాయనే వచ్చి బాలు చేసిన గొప్పసాయం గురించి చెబుతాడు. దాంతో అందరికి బాలుపై ఉన్న కోపం పోతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











