Gunde Ninda Gudi Gantalu August 1st: మనోజ్ కు రోహిణి చివాట్లు.. ప్రభావతి టార్చర్ కు కొత్త ప్లాన్
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూలై 31వ తేదీ 478వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కూతురు పెళ్లి కోసం ఇల్లు అమ్మాలని, కానీ ఆ ఇంట్లో రౌడీలు తిష్టవేసి కదలడం లేదని బాలుకు ఓ పెద్దాయన మొర పెట్టుకుంటాడు. దాంతో వెళ్లి వాళ్లను తన్ని తరిమేస్తాడు. ఆ సంగతి ప్రభావతి, కామాక్షి ఇద్దరు కలిసి చూస్తారు. ఇరుగు పొరుగు వాళ్లంతా బాలును కూడా రౌడీనే అనుకోవడంతో అప్సెట్ అవుతుంది. ఇక బాలుకు ఆ పెద్దాయ వద్దని చెప్పినా కూడా డబ్బులు ఇస్తాడు. బాలు అస్సలు తీసుకోనని చెప్పి పెద్దాయన ప్రేమ కోసం తీసుకుంటాడు. ఆ డబ్బులతో మీనాకు మొబైల్ పూల షాపును రెడీ చేయించి ఇంటికి తీసుకెళ్తాడు. అందరినీ బయటికి పిలిపించి చూపిస్తాడు. అందరూ సంతోషిస్తారు. ఇదే సమయంలో బాలు ఛాతిపై అయిన గాయం బయట పడుతుంది. ఆ గాయం ఎలా అయ్యిందని, ఇప్పటికిప్పుడు నీకు స్కూటీ కొనడానికి డబ్బులు ఎలా వచ్చాయని ఇంట్లో వాళ్లందరూ ప్రశ్నిస్తూ ఉంటారు. బాలు మౌనంగా ఉంటాడు. అదే సమయంలో ప్రభావతి వచ్చి రౌడీయిజం చేసి సంపాదించాడని అంటుంది. ఆ వెంటనే ఆ పెద్దాయన వచ్చి బాలు గురించి చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇక ఆగస్టు 1వ తేదీ 479 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?
మీనా పూల కొట్టు పోయిందనే బాధ నుంచి త్వరగా బయటకి రావాలని బాలు ఒక ప్లాన్ చేస్తాడు. ఇంటి ముందు ఏర్పాటు చేయించిన పూల కొట్టును ఎవరో కావాలని తీయించేస్తే మీనా చాలా బాధ పడుతుందని తన స్నేహితులతో చెప్పుకుంటారు. దీంతో మీనాకు ఎలాగైనా మళ్లీ పని కల్పించాలని అనుకుంటాడు బాలు. అందుకు మీనా కోసం మొబైల్ పూల షాపును ఏర్పాటు చేస్తాడు. అందుకు కోసం సెకండ్ హ్యాండ్ లో ఒక స్కూటీని కొనుగోలు చేస్తాడు. ఈ స్కూటీని తీసుకునే సమయంలో తనకు ఇంకా 10 వేలు రూపాయలు తక్కువ పడుతుంది. దీంతో స్కూటీ కొనుక్కోవడాన్ని వాయిదా వేస్తాడు. కానీ ఇదే సమయంలో బాలు దగ్గరకు ఒక పెద్దాయన వచ్చి సాయం కోరుతాడు. తన ఇంట్లో కొందరు రౌడీలు వచ్చి ఉన్నారని, ఆ ఇంటిని అమ్మేద్దామంటే అసలు వెళ్లడం లేదని బాలుతో చెబుతాడు. వెంటనే నువ్వు వచ్చి ఆ రౌడీలను పంపించాలని కోరుతాడు. మొదట బాలు నేను రాను అని చెబుతాడు.

కానీ ఆ పెద్దాయన కూతురి పెళ్లి ఆగిపోయేలా ఉందని, ఆ ఇంటిని అమ్మకపోతే పెళ్లి ఆగిపోతుందని బాలుకు మొరపెట్టుకుంటాడు. కూతురు పెళ్లి అని చెప్పడంతో బాలు ఎమోషనల్ అవుతాడు. వెంటనే వెళ్లి ఆ పెద్దాయనకు సాయం చేస్తాడు. ఆ ఇంట్లో తిష్ట వేసిన రౌడీలను తన్ని తరిమేస్తాడు. ఇక ఆ పెద్దాయన బాలుకు అభిమానం కొద్ది 10 వేలు ఇస్తాడు. ఆ డబ్బులు తీసుకోవడం ప్రభావతి చూస్తుంది. రౌడీలను తరిమి కొట్టాడని తెలుసుకుంటుంది. ఇక బాలు ఆ డబ్బులతో స్కూటీని కొనుక్కోని, ఆ స్కూటీ వెనకాల పూల డబ్బాను ఏర్పాటు చేయిస్తాడు. మీనాకు మొబైల్ పూల షాప్ ను ఏర్పాటు చేయిస్తాడు. ఆ మొబైల్ పూల కొట్టుకు 'పూలగంప' అనే పేరు పెడుతాడు. ఇక ఇంటికి తీసుకొచ్చి అందరికీ చెబుతాడు. అయితే ఈ స్కూటీని ఎలా కొనుగోలు చేశావని, అంత డబ్బులు ఎలా వచ్చాయని అందరూ అడుగుతారు. ఇక ఇంటికి తిరిగి వచ్చిన ప్రభావతి రౌడీయిజం చేసి డబ్బులు సంపాదించాడని అంటుంది. దాంతో ఇంట్లో వాళ్లందరూ బాలుపై మండి పడుతారు.
ఇక అదే సమయంలో బాలు సాయం తీసుకున్న పెద్దాయన ఇంటికి వస్తాడు. చేతిలో తన కూతురు పెళ్లి పత్రికలను తీసుకొని వస్తాడు. బాలు చేసిన సాయాన్ని ఇంట్లో వాళ్లందరికీ చెబుతాడు. బాలు చేసిన సాయం వల్ల తనకు మంచి జరిగిందని, ఆయన డబ్బులు ఇస్తున్న కూడా తీసుకోలేదని చెబుతాడు. ఒక చెల్లి పెళ్లి కోసం అన్నయ్య డబ్బులకు ఇస్తున్నానని చెప్పి ఇచ్చానని అంటాడు. దాంతో సత్యం ఇంట్లో వాళ్లందరిపై మండి పడుతాడు. బాలుపై అందరూ విమర్శలు చేశారు. కానీ బాలు సంఘ సేవ చేశాడు. అది అర్థం చేసుకోకుండా ఊరికే బాలుపై అరిచారని ఫైర్ అవుతాడు. ఇక ఆ పెద్దాయన పెళ్లి పత్రికను సత్యం, ప్రభావతికి ఇచ్చి వెళ్లిపోతాడు. మరోవైపు మీనా బాలుపై కోపంగా ఉంటుంది. బాలు కొనిచ్చిన స్కూటీని తీసుకోనని అంటుంది. దాంతో బాలుకు కోపం వస్తుంది. ఎందుకు అని అడుగుతాడు. మీరు రక్తం చిందించి కొనాల్సిన అవసరం ఏం లేదు. అయినా నేను కొనివ్వమని అడగలేదు కదా. ఎందుకు అంత సాహసం చేసి కొనిచ్చారని అంటుంది. ఇక బాలు నేను సాహసం చేయలేదు సాయం చేశానని చెబుతాడు.
ఏదైనా మీరు రక్తం చిందించి కొనిచ్చిన స్కూటీ నాకు అస్సలు వద్దని చెబుతుంది. దాంతో బాలు కూడా మీనా కష్ట పడి కొనిచ్చిన కారును కూడా తీసుకోనని, రేపటి నుంచి మళ్లీ ఆటోనే తోలుకుంటానని అంటాడు. ఇక ఉదయం లేచే వరకు మీనా స్కూటీని ముస్తాబు చేసి, మొబైల్ పూల షాప్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇక బాలు లేవగానే ముస్తాబు చేసిన స్కూటీని చూసి షాక్ అవుతాడు. కోపం పోయినట్టేనా అని మీనాను అడుగుతాడు. మీరు ఇంకోసారి ఎవరి జోలికి వెళ్లనని చెప్పి మాటిస్తేనే స్కూటీని తీసుకుంటానని చెబుతుంది. దీంతో బాలు ఒట్టేసి మరీ మీనాకు మాట ఇస్తాడు. ఆ తర్వాత అందరినీ పిలిచి మొబైల్ పూల షాప్ ను ప్రారంభిస్తారు. ఇక సత్యం, రవి, శృతి అందరూ మీనాకు శుభాకాంక్షలు తెలుపుతుంది. మీనా ఇక ఇంటింటికి తిరిగి పూల ఆర్డర్లను ఇస్తుంది.
ఇక రోహిణి ప్రభావతి కుళ్లుకుంటారు. తాము ఒకటి అనుకుంటే అక్కడ ఇంకోంటి జరిగిందని బాధపడుతారు. మీనా ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతారు. మరోవైపు మనోజ్ దిగాలుగా కూర్చొని ఉంటాడు. తన కెరీర్ ఎటు కాకుండా పోయిందని, బాలుకు మీనా.. మీనాకు బాలు ఎంతగానో సహకరించుకుంటున్నారని అంటాడు. కానీ నువ్వు డబ్బుల విషయంలో మీనా నాన్న సపోర్ట్ ఇస్తే బాగుండని అంటాడు. దాంతో రోహిణి నువ్వు కూడా మా నాన్న గురించి అడగటం మానేయమంటాడు. మరోవైపు 40 లక్షలు ఎత్తుకెళ్లిన కల్పన కెనడా అడ్రెస్ గురించి ఆరా తీయడం ప్రారంభిస్తారు. కానీ ఆమె ఇండియాలో బాలు కారులోనే తిరుగుతూ ఉంటుంది. ఇక నెక్ట్స్ ఎపిసోడ్ లో ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications










