Gunde Ninda Gudi Gantalu August 4th: కొత్త జీవితంపై మనోజ్ ఆశలు.. బాలుకు షాకిచ్చిన మాజీ లవర్

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 1వ తేదీ 479వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఏదైనా మీరు రక్తం చిందించి కొనిచ్చిన స్కూటీ నాకు అస్సలు వద్దని చెబుతుంది. దాంతో బాలు కూడా మీనా కష్ట పడి కొనిచ్చిన కారును కూడా తీసుకోనని, రేపటి నుంచి మళ్లీ ఆటోనే తోలుకుంటానని అంటాడు. ఇక ఉదయం లేచే వరకు మీనా స్కూటీని ముస్తాబు చేసి, మొబైల్ పూల షాప్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇక బాలు లేవగానే ముస్తాబు చేసిన స్కూటీని చూసి షాక్ అవుతాడు. కోపం పోయినట్టేనా అని మీనాను అడుగుతాడు. మీరు ఇంకోసారి ఎవరి జోలికి వెళ్లనని చెప్పి మాటిస్తేనే స్కూటీని తీసుకుంటానని చెబుతుంది. దీంతో బాలు ఒట్టేసి మరీ మీనాకు మాట ఇస్తాడు. ఆ తర్వాత అందరినీ పిలిచి మొబైల్ పూల షాప్ ను ప్రారంభిస్తారు. ఇక సత్యం, రవి, శృతి అందరూ మీనాకు శుభాకాంక్షలు తెలుపుతుంది. మీనా ఇక ఇంటింటికి తిరిగి పూల ఆర్డర్లను ఇస్తుంది.

ఇక రోహిణి ప్రభావతి కుళ్లుకుంటారు. తాము ఒకటి అనుకుంటే అక్కడ ఇంకోంటి జరిగిందని బాధపడుతారు. మీనా ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతారు. మరోవైపు మనోజ్ దిగాలుగా కూర్చొని ఉంటాడు. తన కెరీర్ ఎటు కాకుండా పోయిందని, బాలుకు మీనా.. మీనాకు బాలు ఎంతగానో సహకరించు కుంటున్నారని అంటాడు. కానీ నువ్వు డబ్బుల విషయంలో మీనా నాన్న సపోర్ట్ ఇస్తే బాగుండని అంటాడు. దాంతో రోహిణి నువ్వు కూడా మా నాన్న గురించి అడగటం మానేయమంటాడు. మరోవైపు 40 లక్షలు ఎత్తుకెళ్లిన కల్పన కెనడా అడ్రెస్ గురించి ఆరా తీయడం ప్రారంభిస్తారు. కానీ ఆమె ఇండియాలో బాలు కారులోనే తిరుగుతూ ఉంటుంది. ఇక నెక్ట్స్ ఎపిసోడ్ లో ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఆగస్టు 4వ తేదీ 480 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 480 August 4th

మీనాకు బాలు మొబైల్ ఫ్లవర్ షాప్ ఏర్పాటు చేస్తాడు. ఇందు కోసం మీనాకు స్కూటీని కొనుగోలు చేసి, దానికి పూల డబ్బాను ఏర్పాటు చేసి మొబైల్ షాప్ గా మార్చేస్తాడు. దాంతో మీనా సంతోషిస్తుంది. ఇక మీనా ఆ మొబైల్ ఫ్లవర్ షాప్ ను అందరికీ చూపిస్తూ ఉంటుంది. తనకు కూడా వ్యాపారాన్ని ప్రారంభిస్తుంది. ఇక ఇంటింటికి వెళ్లి అందరికీ పూలు ఇస్తూ తన మొబైల్ పూల షాప్ ను ప్రచారం చేస్తుంది. బాలు తన కోసం ఇలా మొబైల్ షాప్ ను ఏర్పాటు చేసిన విషయాన్ని అందరికీ చెబుతూ సంతోషిస్తుంది. అలాగే ఆ స్కూటీ వేసుకొని తన సొంత ఇంటికి వెళ్తుంది. తన తల్లి, చెల్లికి స్కూటీని చూపిస్తుంది. తన బాలు ఈ మొబైల్ షాప్ ను ఏర్పాటు చేయించి ఇచ్చాడని అంటుంది. తన ఇంట్లో వాళ్లతో పాటు ఇరుగు పొగురు వాళ్లకు కూడా చెబుతూ ఉంటుంది. ఇక మీనా రాక రాక ఇంటికి వచ్చినందుకు మీనా పట్ల సంతోషిస్తారు.

ఇక మీనా కూడా తన పూల కొట్టును మున్సిపల్ సిబ్బంది తొలగించారని ఇంట్లో వాళ్లకు చెబుతుంది. ఎవరో కన్ను గిట్టని వాళ్లు ఇలా చేసి ఉంటారని అంటుంది. మీనా మాటలతో తల్లి, చెల్లెలు కూడా షాక్ అవుతారు. ఎవరు ఇలా చేశారో తెలిసిందా అని మీనాను ప్రశ్నిస్తారు. కానీ మీనా తెలియలేదని చెబుతుంది. ఇక పూల కొట్టు పోవడంతో బాలు ఇలా మొబైల్ ఫ్లవర్ షాప్ ను ఏర్పాటు చేశాడని వివరిస్తుంది. అయితే తమ్ముడు శివ మాత్రం ఆ బండిపై అసభ్యంగా మాట్లాడుతాడు. దాంతో మీనాకు కోపం వస్తుంది. తమ్ముడు శివపై మండి పడుతుంది. ఇంకోసారి ఆ బండి గురించి, బాలు గురించి మాట్లాడితే మాత్రం అస్సలు సహించేది లేదని, ఇంకోసారి ఇటు వైపు కూడా రాబోనని చెబుతుంది. అసలు నవ్వు కాలేజీ కైనా వెళ్తున్నావా? లేదా? అని ప్రశ్నిస్తుంది. ఇక చికెన్ తెస్తాను తిని వెళ్లు అక్క అని శివ అడుగుతాడు. కానీ మీనా మాత్రం తినని చెబుతుంది. అసలు బాలుకు నువ్వు విలువ ఇచ్చిన రోజే ఈ ఇంట్లో భోజనం తింటానని అంటుంది.

మరోవైపు మనోజ్, రోహిణి ఇద్దరు కలిసి కన్సల్టెన్సీ కి వెళ్తాడు. అక్కడికి వెళ్లి మనోజ్ ను 40 లక్షలకు మోసం చేసిన అమ్మాయి కల్పనా గురించి ఆరా తీస్తారు. కానీ అక్కడ కన్సల్టెన్సీ లో ఉన్న ఆఫీసర్ అలా వివరాలు చెప్పలేమని, గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత మాపై ఉందని అంటారు. ఇక కల్పనా వాళ్ల అమ్మమ్మ చనిపోయిందని అబద్ధం చెబుతారు. అయినా కూడా సమాచారం ఇవ్వడం కుదరని బదులిస్తారు. మెయిన్ బ్రాంచ్ లోనే సంప్రదించాలని అంటారు. దాంతో వాళ్లు వెనుదిరిగి పోతారు. ఇక ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వెళ్తారు. కల్పనాకు తెసిసిన స్నేహితుల గురించి ఆరా తీసినా కూడా ఫలితం ఉండదు. ఇక ఓవైపు మనోజ్ రోహిణి ఇద్దరు కల్పనా కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ కల్పానా కెనడా నుంచి హైదరాబాద్ కు తిరిగి వస్తుంది. హైదరాబాద్ కు రావడమే కాదు ఏకంగా బాలు క్యాబ్ నే బుక్ చేసుకొని సిటీలో తిరుగుతూ ఉంటుంది. తను పనులను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.

ఇక కల్పనాతో బాలు మాట్లాడుతూ ఆమె వివరాలన్నీ తెలుసుకుంటాడు. కానీ బాలుకు కల్పనానే మనోజ్ ను మోసం చేసిన అమ్మాయి అనే సంగతి తెలియదు. ఇక ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి వెళ్తున్నారు? కెనడా వెళ్లాడానికి ఎంత ఖర్చు? అనే విషయాలన్ని తెలుసుకుంటాడు. అందుకు కల్పనా సమాధానం ఇస్తుంది. తను కెనడాకు 10 లక్షల ఖర్చుతో వెళ్లానని చెబుతుంది. ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసమని ఇవ్వాలే వచ్చానని చెబుతుంది. మరోవైపు రోహిణిని ఒక్కపూట దీక్ష చేయాలని ప్రభావతి సూచిస్తుంది. మీ నాన్న కోసం 21 రోజులు ఉపవాస దీక్ష చేయాలని, అందుకు అందరం కలిసి ఇప్పుడే గుడికి వెళ్లాలని అంటుంది. ఇక బాలును కూడా గుడికి రమ్మని అంటారు. బాలు కల్పనా పర్మిషన్ తీసుకొని 5 నిమిషాల్లో వస్తానని కారు తీసుకొని గుడి దగ్గరకు వెళ్తాడు. అక్కడ కల్పనా మనోజ్ ను చూస్తుంది. ఇక మనోజ్ కల్పనాను చూస్తాడా? లేదా? అన్నది తర్వాతి ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X