Gunde Ninda Gudi Gantalu August 5th: మనోజ్ లైఫ్ లో సరికొత్త ట్విస్ట్.. తెలియకుండానే సాయం చేసిన బాలు
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 4వ తేదీ 480వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మనోజ్, రోహిణి ఇద్దరు కలిసి కన్సల్టెన్సీ ఆఫీస్ కు వెళ్తారు. గతంలో కల్పనా కోసం ఎక్కడైతే మనోజ్ ఫ్లైట్ బుక్ చెయించాడో అక్కడికి వెళ్తారు. తనను 40 లక్షలకు మోసం చేసిన కల్పనా అడ్రస్ కనుక్కోవాలని ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే ఆమె ఫొటోను ఆఫీస్ లో చూపిస్తాడు. మరోవైపు రోహిణి కూడా కల్పనాను చూస్తుంది. కానీ అక్కడ కన్సల్టెన్సీ లో అలా వివరాలు చెప్పలేమని అంటారు. క్లైంట్స్ ప్రైవసీ బాధ్యత తమపై ఉందని చెబుతారు. కల్పనా వాళ్ల అమ్మమ్మ చనిపోయిందని అబద్ధం చెప్పినా కూడా వాళ్లు వివరాలు ఇవ్వబోరు. మీకు వివరాలు కావాలంటే మెయిన్ బ్రాంచ్ లోనే సంప్రదించాలని సూచిస్తుంది.
ఇక వాళ్లకు ఏం చేయాలో అర్థం కాదు. మిగిలిన స్నేహితులను సంప్రదించినా ఫలితం ఉండబోదని అనుకుంటారు. మరోవైపు కల్పనా ఇండియా తిరిగి వస్తుంది. పోయి పోయి బాలు క్యాబ్ నే బుక్ చేసుకుంటుంది. ఇండియా ల్యాండ్ కొనుగోలు చేశానని, దాని రిజిస్ట్రేషన్ పని మీద వచ్చినట్టు చెబుతుంది. ఇక ప్రభావతి రోహిణితో ప్రత్యేక పూజలు చేయాలించాలని చూస్తుంది. దాంతో అందరినీ గుడి రమ్మని చెబుతుంది. బాలుకు కూడా ఫోన్ చేసి వెంటనే గుడి దగ్గరకు రమ్మని మీనాతో చెప్పిస్తుంది. మీనా పిలవడంతో బాలు కూడా సరేనని గుడి దగ్గరకు వస్తానని అంటాడు. కారులో ఉన్న కల్పనా దగ్గర గుడి దగ్గరకు వెళ్లేందుకు అనుమతి తీసుకుంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఆగస్టు 5వ తేదీ 480 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

రోహిణి వాళ్ల తండ్రి జైలు నుంచి త్వరగా తిరిగి రావాలని ప్రభావతి ముందుగానే చెప్పినట్టుగా అందరినీ గుడికి తీసుకెళ్తుంది. ప్రభావతి, సత్యం, మనోజ్, రవి, రోహిణి, శృతి, మీనా అందరు కలిసి గుడి వెళ్తారు. ఇక రోహిణికి అస్సలు ఈ పూజలు అంటే ఇష్టం ఉండదు. మనోజ్ తో రోహిణి నాకు ఇవన్నీ ఇష్టం లేదని చెబుతుంది. కానీ మనోజ్ కూడా తన తల్లి ప్రభావతికే సపోర్ట్ చేస్తారు. మా అమ్మ మీ నాన్న గురించి ఎంత బాగా ఆలోచిస్తుందో చూశావు కదా. నువ్వు సైలెంట్ గా మా అమ్మ చెప్పినట్టుగా విను అని చెబుతాడు. అసలు మీ అమ్మ మా నాన్న క్షేమం కోసం ఇవన్నీ చేయడం లేదని, కేవలం ఆస్తుల కసమే ఇదంతా చేస్తోందని అనుకుంటుంది. ఇక ప్రభావతి పిలవడంతో త్వరగా గుడిలోనికి వెళ్తుంది. ఆ తర్వాత పూజారిని కలుస్తారు. ఇక పూజారి చేయాల్సిన పూజా నియమాలను, పాటించాల్సిన నియమాలను చెబుతాడు.
ప్రభావతి ఇక రోహిణికి నూతన పట్టు వస్త్రాలు ధరింపజేస్తుంది. సంప్రదాయ దుస్తుల్లో దేవుడిని దర్శించుకోమని చెబుతుంది. అయితే అంత కంటే ముందు అభ్యంగ స్నానం చేయాలని చెబుతుంది. చల్లటి నీళ్లతో స్నానం చేయిస్తుంది. అలాగే తడి బట్టలతో దేవుడిని దర్శించుకోవాలని చెబుతుంది. అందరూ కలిసి దేవుడికి దండం పెట్టుకుంటారు. ఆ తర్వాత రోహిణితో ప్రభావతి 11 గుంజీలు కూడా తీయిస్తుంది. ఇక ఈ పూజా కార్యక్రమం అయిపోయిందా? అని రోహిణి అంటుంది. కానీ ప్రభావతి మాత్రం ఇంకా అవలేదని అంటుంది. చేయాల్సిన అతి ముఖ్యమైన కార్యక్రమంలో మరొకటి ఉందని చెబుతుంది. ఇక ఇదే సమయంలో బాలు కూడా గుడి దగ్గరకు వస్తాడు. కారులో కల్పనా ఉండటంతో ఆమెను కూడా గుడిలోకి రమ్మని అంటాడు. కానీ ఆమె తను నాన్ వెజ్ తిన్నానని చెప్పి కారులోనే ఉంటానని చెబుతుంది. ఇక బాలు ఒక్కడే గుడిలోకి వెళ్తాడు.
అక్కడ రోహిణిని చూసి బాలు షాక్ అవుతాడు. అసలు ఈ ఫూజలు ఎందుకు చేయిస్తున్నారని ప్రశ్నిస్తాడు. తన తండ్రి మలేషియాలో ఇబ్బందులు పడుతున్నాడని ఇక్కడ రోహిణిని కష్టాలు పెడుతున్నారా? అని అంటాడు. ఆయన మలేషియా జైలు నుంచి తిరిగి బయటికి రావాలంటే మంచి లాయర్ ను పట్టుకుంటే సరిపోతుంది కదా అందుకు దేవుడిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అంటాడు. దైవానుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమేనని సత్యం చెబుతాడు. ఇక ఆ తర్వాత రోహిణితో ప్రభావతి పొర్లు దండాలు పెట్టిస్తుంది. ఇలా ఒక్క రోజు చేస్తే సరిపోతుందా అని ప్రభావతి అడుగుతుంది. లేదు 21 రోజుల పాటు ప్రతి రోజు ఒకసారి చేయాల్సి ఉంటుందని చెబుతుంది. దాంతో రోహిణి షాక్ అవుతుంది. ఇక మరోవైపు రోహిణి పొర్లు దండాలు పెడుతుంటే బాలుకు పాపం అనిపిస్తుంది. ఆస్తి కోసమే ఇలా చేస్తున్నావు కదా అని తల్లి ప్రభావతిని అడుగుతాడు.
తండ్రి సత్యం స్పందిస్తూ మీ అమ్మ ఏ పనిచేసినా దాని వెనకాల ఎంత పరమార్థం ఉంటుందో అందరికీ తెలిసిందే కదా అని అంటాడు. అందుకు బాలు ఆస్తుల కోసమే కదా అని బదులిస్తాడు. ఇదే సమయంలో మనోజ్ కు ఫోన్ కాల్ వచ్చి గుడి బయటికి వెళ్తాడు. బయట అటూ ఇటు తిరుగుతూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక కారులో కూర్చొన్న మనోజ్ మాజీ లవర్ కల్పనా కూడా కారు నుంచి బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. మనోజ్ ను ముందుగా కల్పనా చూస్తుంది. వెంటనే కారులో కూర్చొంటుంది. బాలుకు ఫోన్ చేసి త్వరగా రమ్మని పిలుస్తుంది. అయితే మనోజ్ మాత్రం కారు చుట్టూనే తిరుగుతాడు కానీ, కారులో ఎవరున్నారనేది గమనించడు. దాంతో ఆమె తప్పించుకుంటుంది. ఇక ప్రోమోలో మాత్రం కల్పనా మేకప్ చేయించుకుంటానంటే బాలు సరాసరి రోహిణి పనిచేస్తున్న పార్లర్ కే తీసుకెళ్తాడు. అప్పటికే కల్పనాను ఫొటోలో చూసిన రోహిణి షాక్ అవుతుంది. ఆమె కూర్చొబెట్టి వెంటనే మనోజ్ కు ఫోన్ చేస్తుంది. మనోజ్ వచ్చి కల్పనా గొంతు పట్టుకుంటాడు. నీ వల్ల నేను లక్షలు మింగిన వాడిలా మిగిలిపోయానని ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











