Gunde Ninda Gudi Gantalu August 6th: రోహిణికి చిక్కిన మనోజ్ మాజీ లవర్.. సరైన బుద్ధి చెప్పిన బాలు

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 5వ తేదీ 481వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రోహిణికి అత్త ప్రభావతి చుక్కలు చూపిస్తోంది. తన తండ్రి మలేషియా జైలుకు వెళ్లిపోయాడని రోహిణితో ప్రత్యేక పూజలు చేయించేందుకు ఏర్పాట్లు చేయిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే రోహిణితో పాటు కుటుంబం మొత్తాన్ని గుడికి తీసుకెళ్తుంది. కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో రోహిణికి దీక్ష ఇప్పిస్తుంది. అయ్యగారు చెప్పినట్టుగా రోహిణితో అన్ని చేయిస్తుంటుంది. రోహిణికి ఇష్టం లేకపోయినా అన్ని అత్త ప్రభావతి చెప్పినట్టుగానే చేస్తుంది. ముందుగా రోహిణి అభ్యంగనస్నానం చేస్తుంది. ఆ తడి బట్టలతోనే దేవుడికి దర్శనం చేయిస్తుంది. గుంజీలు కూడా తీయిస్తుంది. అంతే కాదు రోహిణితో పొర్లు దండాలు పెట్టిస్తుంది.

ఇక బాలు కూడా గుడి దగ్గరకు వస్తాడు. కల్పనా బాలు కారులో కూర్చొంటుంది. బాలు గుడిలోకి వచ్చి చూసే సరికి రోహిణి నీరసంగా కనిపిస్తుంది. వాళ్ల నాన్న జైలు లో నుంచి తిరిగి రావాలంటే లాయర్ ను మాట్లాడితే సరిపోతుంది కదా.. పార్లరమ్మను ఎందుకు ఇలా కష్టపెడుతున్నారని ప్రభావతిని ప్రశ్నిస్తాడు. నీకేం తెలియదు నువ్వు నోరుమూసుకోమని ప్రభావతి బాలుపై విరుచుకు పడుతుంది. కానీ తండ్రి సత్యం స్పందిస్తూ దైవానుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యం అవుతుందని చెబుతాడు. మరోవైపు మనోజ్ కు ఫోన్ రావడంతో బయటికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. ఇదే సమయంలో కారులో ఉన్న మనోజ్ మాజీ లవర్ కల్పనా బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. కానీ గుడి దగ్గర మనోజ్ ను చూసి షాక్ అవుతుంది. వెంటనే వెళ్లి కారులోపల కూర్చొంటుంది. ఇక మనోజ్ ఆమెను చూశాడా? లేడా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 6వ తేదీ 482 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 482 August 6th

మనోజ్ ఫోన్ మాట్లాడుతూ కారు చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. కారు అద్దంలోనూ తన హెయిర్ స్టైల్ ను సరిచేసుకుంటాడు గానీ, కారులో ఉన్న కల్పనాను మాత్రం చూడడు. ఇక కల్పనా మాత్రం మనోజ్ ఎక్కడ తనను చూస్తాడోనని, కారులో వంగి కూర్చొంటుంది. తన మొహం కనబడకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది. ఇక వెంటనే బాలుకు ఫోన్ చేసి తిరిగి రమ్మని అంటుంది. ఇక బాలు కూడా పూజా కార్యక్రమాలు పూర్తి కాకముందే నేను వెళ్లిపోతున్నానని చెబుతాడు. కారులో ఫారెన్ అమ్మాయి వెయిట్ చేస్తూ ఉందని చెప్పి వెళ్లిపోతాడు. ఇక బాలు గుడి మెట్లు దిగుతుండగా మనోజ్ ఎదురవుతాడు. నాకు బోర్ కొడుతుంది. నేనూ నీతోపాటు వస్తాను అని అంటాడు. కానీ బాలు తీసుకొని వెళ్లేందుకు ఇష్టపడడు. దాంతో మనోజ్ మళ్లి తిరిగి గుడిలోపలికే వెళ్లిపోతాడు. ఇక బాలు కల్పనాను తీసుకొని గుడి దగ్గర నుంచి వెళ్తాడు.

మరోవైపు రోహిణికి ప్రభావతి చుక్కలు చూపిస్తుంది. ఒక పూజ తర్వాత మరో పూజ చేయిస్తూ వస్తుంటుంది. రోహిణికి మాత్రం ఒంట్లో ఏమాత్రం ఓపిక లేకపోయినా కూడా అత్త ప్రభావతి చెప్పినట్టుగా చేస్తుంది. మరోవైపు మీనా, రవి, శృతి, సత్యం ఇక చేసిన పూజలు చాలు రోహిణిని వదిలేయ్ అని చెప్పినా కూడా ప్రభావతి ఊరుకోదు. ఇంకో కార్యక్రమం ఉందని, దాంతర్వాత అందరం ఇంటికి వెళ్దామని అంటుంది. ఇంకేంటని రోహిణి నోరు తెరుస్తుంది. మీనా వదిలేయమని, తను ఇక కింద పడిపోతుందని చెబుతుంది. నువ్వు నోరు మూయమని ప్రభావతి మండి పడుతుంది. ఇంకా చేయాల్సిన పని కేవలం అర్చన మాత్రమే అని చెప్పి పూజారి దగ్గరకు తీసుకెళ్తుంది. ఇక రోహిణి వాళ్ల తండ్రి మలేషియా జైలు నుంచి ఇంటికి రావాలని ఆయన పేరు మీద అర్చన చేయిస్తుంది. ఈ సమయంలో పూజారి రోహిణి వాళ్ల నాన్న పేరు ఏంటని ప్రశ్నిస్తాడు. అందుకు రోహిణి ఏం పేరు చెప్పాలని కంగారు పడుతుంది. ఇక తన అసలు తండ్రి చనిపోయిన రాజమౌళి పేరును చెబుతుంది. రాశి, నక్షత్యం అడిగితే మీనా రాశి, జేష్ట్య నక్షత్రం అని చెబుతుంది.

కానీ పూజారి మాత్రం ఆపేరుకు అాలాంటి రాశి, నక్షత్రం రాదు కదా అని అంటాడు. పక్కనే ఉన్న మీనా తులరాశి, చిత్త నక్షత్రం వస్తుంది కదా పూజారి అని అంటుంది. దాంతో రోహిణి వెంటనే అవునవును అదే రాశి, నక్షత్రం అని చెబుతుంది. నాకు బాగా తలతిరుగుతుందని, అందుకే అలా తప్పు చెప్పానని అంటుంది. ఇక పూజారి ఆయన పేరుపై అర్చన చేస్తాడు. ఆ తర్వాత అందరూ తిరిగి ఇంటికి వస్తారు. దీంతో రోహిణికి ప్రభావతి కొత్త నియమాలు పెడుతుంది. సాత్విక భోజనం మాత్రమే తినాలని, అది కూడా నువ్వే వంట చేసుకొని తినాలని అంటుంది. మరోవైపు ఇంట్లో అంట్లు కూడా తోమాలని చెబుతుంది. నాకు వంట రాదు కదా అని రోహిణి చెప్పినప్పటికీ దగ్గరుండి చేయిస్తుంది. మరోవైపు రోహిణి, మనోజ్ ఒక్క దగ్గర పడుకోకూడదని, రోహిణి నేలపై పడుకోవాలని కూడా చెబుతుంది.

అంతే కాదు ఇంటి ముందు ముగ్గు కూడా రోహిణితోనే వేయించాలని ప్రయత్నిస్తుంది. ఇంట్లో రిలాక్స్ అవుతున్న రోహిణిని బయటికి తీసుకొచ్చి ముగ్గు వేయమని చెబుతుంది. ఇలా చేస్తేనే మీ నాన్న జైలు నుంచి క్షేమంగా తిరిగి వస్తాడని చెబుతూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న బాలు నా భార్య మీనా సరిగా ముగ్గు వేయడం లేదా అని అంటాడు. అదో పెద్ద ముగ్గా అని హేళన చేస్తుంది. ఏదేమైనా రోహిణి వాళ్ల ఇంటికి తిరిగి వచ్చే వరకు రోహిణినే ఇంటి ముందు ముగ్గు వేయాలని అంటుంది. దాంతో రోహిణి షాక్ అవుతుంది. ఇక ప్రోమోలో బాలు మనోజ్ మాజీ లవర్ కల్పనాను రోహిణి పని చేస్తున్న పార్లర్ కు తీసుకెళ్తాడు. పార్లర్ లోనికి వెళ్లిన కల్పనాను రోహిణి చూసి షాక్ అవుతుంది. వెంటనే మనోజ్ కు ఫోన్ చేసి రమ్మని పిలుస్తుంది. మనోజ్ వచ్చిన వెంటనే కల్పనా గొంతు నులిమేస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది మున్ముందు తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X