Gunde Ninda Gudi Gantalu August 7th: పోలీస్ స్టేషన్ కు బాలు మీనా.. రోహిణి మనోజ్ కూడా

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 6వ తేదీ 482వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రోహిణితో ప్రభావతి పూజలు చేయిస్తుంది. తన తండ్రి మలేషియా జైలు లో నుంచి త్వరగా తిరిగి రావాలనే ఇలాంటి పూజలన్నీ చేయిస్తున్నానని చెబుతుంది. ఇక రోహిణి ఇష్టం లేకపోయినా అత్త ప్రభావతి చెప్పినట్లుగా చేస్తుంటుంది. ఈ క్రమంలో రోహిణితో పొర్లు దండాలు పెట్టిస్తుంది. ప్రత్యేక పూజలు చేయిస్తుంది. ఆ తర్వాత పూజారి దగ్గరకు వెళ్లి రోహిణి తండ్రి పేరుపై అర్చన చేయించుతుంది. ఈ సమయంలో పూజారి రోహిణి వాళ్ల నాన్న గోత్రం, పేరు చెప్పమని అడుగుతాడు. అందుకు రోహిణి వెంటనే తన తండ్రి పేరు చెప్పడంలో తడబడుతుంది.

రోహిణి తన తండ్రి పేరును వెంటనే చెప్పలేకపోవడంతో ప్రభావతి, సత్యం, రవి, శృతి షాక్ అవుతారు. సత్యం మాత్రం ఇంత వరకు పేరు తెలియని వియ్యంకుడు దొరికాడని అంటాడు. దాంతో వెంటనే రోహిణి నాకు తల తిరుుతుంది అందుకే వెంటనే చెప్పలేకపోయనని అంటుంది. రామజౌళి, జేష్ట్య నక్షత్రం అని చెబుతుంది. ఆ పేరుకు ఆ నక్షత్రం రాదు కదా అని పూజారి అంటాడు. మీనా స్పందిస్తూ తుల రాశి, చిత్త నక్షత్రం వస్తుంది కదా అయ్యగారు అని అంటుంది. దాంతో పూజారి అవునని చెబుతాడు. ఇక తన మాట సరి చేసుకుంటూ అవును అదే నక్షత్రం అని చెబుతుంది. ఇక ఇంటికి వెళ్లిన తర్వాత రోహిణి వంటలన్నీ తానే స్వయంగా చేసుకోవాలని నియమం పెడుతుంది. ప్రతి పని నువ్వు చేయాలని అంటుంది. ఈ క్రమంలో తర్వాత ఏం జరిగందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఆగస్టు 7వ తేదీ 483 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 483 August 7th

రోహిణితో ప్రభావతి దీక్ష సంబంధించిన నియమాలను పాటించేలా చేస్తుంది. ఇక స్వయంగా ఉప్పు, కారంలేని వంటకాలను తయారు చేసుకుని తినడం నేర్పిస్తుంది. ఇక ఉదయం మీనా ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటే ప్రభావతి అడ్డుకుంటుంది. నువ్వు ముగ్గు వేయకని చెబుతుంది. దాంతో మీనా అలాగే ఆగిపోతుంది. ఇక ప్రభావతి వెళ్లి పడుకున్న రోహిణిని బయటికి తీసుకు వస్తుంది. ఇంకా ఫ్రెష్ కూడా కానీ రోహిణితో ఇంటి ముందు చుక్కల ముగ్గు వేయించాలని ప్రయత్నిస్తుంది. ఇక బాలు, సత్యం ఉండి మీనా సరిగానే ముగ్గు పెడుతుంది కదా, మళ్లీ రోహిణితో ముగ్గు వేయించడం దేనికని అడుగుతారు. దీక్షలో ఉన్న రోహిణి నియమం తప్పకూడదని అంటుంది. అలా తప్పితే జైలు లో ఉన్న తన తండ్రి తిరిగి క్షేమంగా బయటికి రాలేరని అంటుంది. అందుకోసం రోహిణినే స్వయంగా ముగ్గు పెట్టాలని పట్టు పట్టుకొని కూర్చొంటుంది. ఇక చేసేదీ ఏమీ లేక రోహిణి ముగ్గు పెట్టేందుకు ఒప్పుకుంటుంది.

కానీ రోహిణికి ముగ్గు పెట్టడం రాదు. చుక్కలన్నీ అడ్డదిడ్డంగా వేస్తూ ఉంటుంది. దీంతో రోహిణిని వదిలేయమని అందరూ చెబుతున్న వినదు. చివరికి రోహిణితోనే ముగ్గు వేయిస్తుంది. ఇదెలా ఉంటే.. ఇక మీనా అందరి కోసం పూరీ కూర చేస్తుంది. దాంతో అందరూ టిఫిన్ చేయడానికి వస్తారు. ముందుగా రవి-శృతి, ప్రభావతి సత్యం, తింటూ ఉంటారు. పూరీ కూర అద్భుతంగా ఉందని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. ఇదే సమయంలో బాలు వచ్చి పూరీ కూర అనడంతో మూడు పూరీలు ప్లేట్ లో వేసుకొని తినబోతాడు. దీంతో ప్రభావతి కసురుకుంటుంది. వెంటనే బాలు ప్లేట్ లో నుంచి రెండు పూరీలను లాగేసుకుంటుంది. దాంతో బాలు చాలా బాధ పడుతాడు. మీనాతో పాటు అందరూ షాక్ అవుతారు. మొత్తం నువ్వే తింటే మనోజ్ రోహిణి ఏం తింటారని అడుగుతుంది. నువ్వు ఎలాగైనా బండి కొట్ల మీద తినే వాడివే కదా అని బాధ పెడుతుంది. ఇక బాలు ఎలాగైనా ప్రభావతి అమ్మకు బుద్ధి చెప్పాలని అనుకుంటాడు.

మనోజ్, రోహిణి టిఫిన్ తినడం కోసం డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు. పూరీ కూర కావడంతో మనోజ్, రోహిణి ఫుల్ ఆకలి వేస్తుందని తినడానిక కూర్చొంటారు. ప్లేట్స్ తీసుకొని త్వరత్వరగా వడ్డించుకుంటారు. ఇక బాలు వారిని తినకుండా అడ్డుకుంటాడు. ఇంట్లో అపచారం జరుగుతుందని అంటాడు. రోహిణి నియమం పాటించకుండా తినకుండా ఇలా ఉప్పు కారం తింటే వాళ్ల నాన్న మలేషియా జైలులోనే మగ్గిపోతాడని ప్రభావతికి గుర్తు చేస్తాడు. అసలు ఆయన కోసం చేపట్టిన దీక్షను రెండో రోజే వదిలి పెడుతారా? అని ప్రశ్నిస్తాడు. అందుకని నువ్వు ఉప్పు కారం ఉన్న వంటకాలు తినకూడదని రోహిణి ప్లేట్ లోని పూరీలను తీసుకుంటాడు. అలాగే భర్త కూడా భార్య దీక్షలో పాటు పంచుకోవాలని మనోజ్ ను కూడా తినకుండా చేస్తాడు. ఆ తర్వాత కల్పనా ఫోన్ చేయడంతో పిక్ చేసుకోవడానికి వెళ్తాడు. ఆమె ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి వెళ్తుంది. అదే ఆఫీస్ కు మనోజ్, రోహిణి వచ్చి తన గురించి ఎంక్వైరీ చేశారని అక్కడ ఉన్న ఆఫీసర్ చెబుతుంది. దాంతో నా గురించి ఎలాంటి వివరాలు ఎవ్వరికీ చెప్పకూడదని అంటుంది.

మరోవైపు మౌనికా ఫుల్ సంతోషంగా ఉంటుంది. తన భర్త సంజూ పుట్టిన రోజు కావడంతో సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తుంది. సంజూ ఇంటికి తిరిగి రాగానే విష్ చేస్తుంది. దేవుడి దగ్గరకు తీసుకెళ్లి హారతీ ఇస్తుంది. బొట్టు పెడుతుంది. అలాగే కేక్ కట్ చేయించి బర్త్ డే శుభాకాంక్షలు చెబుతుంది. ఇక సంజూ మౌనికాపై రగిలిపోతాడు. ఎంత చిరాకు పడినా తనపై ప్రేమ చూపిస్తూనే ఉందని అనుకుంటాడు. ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటాడు. తన ఫ్రెండ్స్ తో సాయంత్రం పార్టీ ఉన్నదని చెప్పి బయటికి వెళ్దామని అంటాడు. ఇక ప్రోమోలో మీనా స్కూటీని ట్రాఫిక్ పోలీసులు తీసుకెళ్లి పోతారు. విషయం తెలుసుకొని బాలు పోలీస్ స్టేషన్ కు వస్తాడు. మరోవైపు రోహిణి, మనోజ్, కల్పనా ముగ్గురు కూడా పోలీసుల కారులో వస్తారు. ఈ సందర్భంగా ఏం జరిగి ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X