Gunde Ninda Gudi Gantalu August 8th: పోలీస్ స్టేషన్ లో మనోజ్, రోహిణి రచ్చ.. మీనా కోసం వెళితే ఇరుక్కుపోయిన బాలు
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 8వ తేదీ 483వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. టిఫిన్ తినడం కోసం మనోజ్, రోహిణి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు. మనోజ్, రోహిణి తమకు ఫుల్ ఆకలి వేస్తుందని పూరీ కూర కావడంతో ఇంకా తినాలని ఉందని కూర్చొంటారు. త్వరత్వరగా ప్లేట్స్ తీసుకొని వడ్డించుకుంటారు. అయితే బాలు మాత్రం వారిని తినకుండా అడ్డుకుని షాక్ ఇస్తాడు. వాళ్లు తింటే అపచారం జరుగుతుంది అని చెబుతాడు. ఎలాగని అందరూ అడుతారు. ఇలా రోహిణి దీక్షకు సంబంధించిన నియమాలను పాటించక పోవడంతో అపచారం జరుగుతుందని అంటాడు. ఆమె ఉప్పు కారం తింటే రోహిణి వాళ్ల నాన్న మలేషియా జైలు నుంచి తిరిగి రావడం కష్టమేనని అంటాడు.
ఆయన జైలు నుంచి రావాలని దీక్ష చేపట్టిన రెండో రోజే ఇలా వదిలి పెట్టడం సరికాదని అంటాడు బాలు. వెంటనే నువ్వు ఉప్పు కారం వంటకాలను అస్సలు తినకూడదు అని చెప్పి రోహిణి చేతిలోని ప్లేట్ లో ఉన్న పూరీలను తిరిగి తీసుకుంటాడు. అలాగే మనోజ్ ను కూడాతి తినకుండా చేస్తాడు. భార్య దీక్షలో భర్త కూడా పాలు పంచుకోవాలని మనోజ్ ను తినకుండా ఆపుతాడు. వారిద్దరి ప్లేట్స్ లోని పూరీలను తీసుకుంటాడు. ఇక మరోవైపు మనోజ్ మాజీ లవర్ కల్పనా ఫోన్ చేయడంతో కారు తీసుకొని వెళ్తాడు బాలు. ఇంకోవైపు మౌనికాను సంజూ టార్చర్ చేస్తూ ఉంటాడు. తన పుట్టిన రోజుని ఎంతో ప్రేమగా మౌనికా సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటే సంజూ మాత్రం మౌనికాను బాధ పెట్టాలని చూస్తాడు. అందుకు ఒక ప్లాన్ కూడా చేస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 8వ తేదీ 484 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

ఇక బాలు తనకు ఫారెన్ కస్టమర్ కాల్ చేస్తుందని ఇంట్లో గబగబా తిని బయటికి వెళ్తాడు. వెళ్లి మనోజ్ మాజీ లవర్, ఫారెన్ కస్టమర్ కల్పనాను పికప్ చేసుకుంటాడు. ఇక కల్పనా కారులో కూర్చొని తన స్నేహితురాలికి ఫోన్ చేస్తుంది. తాము ఇండియాలోకి వచ్చినప్పుడు రెగ్యులర్ గా వెళ్లే బ్యూటీ పార్లర్ ఉందా అని అడుగుతుంది. ఆమె లేదు అని సమాధానం ఇస్తుంది. ఇక ఆ మాటలు విన్న బాలు వెంటనే కల్పనాకు సలహానిస్తాడు. తనకు తెలిసిన బ్యూటీ పార్లర్ ఒకటి ఉందని, అక్కడ బాగా చేస్తారని తెలుపుతాడు. మీరు ఓకే అంటే అక్కడికి తీసుకు వెళ్తానని అంటాడు. దాంతో కల్పనా ఎక్కడైతే ఏంటీ తీసుకెళ్లు అని అంటుంది. దాంతో బాలు నేరుగా క్యాబ్ ను రోహిణి వాళ్ల పార్లర్ దగ్గరకు తీసుకు వెళ్తాడు. ఇక కల్పనా పార్లర్ లోనికి వెళ్తుంది. అక్కడ కల్పనాను చూసి రోహిణి షాక్ అవుతుంది. ఆమె కోసమే వెతుకుతూ ఉంటే కల్పనానే ఎదురొచ్చింది ఏంటనీ ఆశ్చర్యపోతుంది.
వెంటనే కల్పానాను రిసీవ్ చేసుకుంటుంది. ఇక కల్పనా తనకు ఫేషియల్, ఐబ్రోస్, పెడిగ్రీ వంటివి చేయాలని చెబుతుంది. దాంతో రోహిణి తప్పకుండా చేస్తాం మేడమ్ అని బదులిస్తుంది. మీరు రిలాక్డ్స్ గా కూర్చుండని చెప్పి బయటికి వెళ్తుంది. బాలుకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని అడుగుతుంది. దాంతో బాలు నేను ఒక ఫైనాన్షియర్ దగ్గర ఉన్నానని, కెనడా వెళ్లడానికి డబ్బులు ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నానని చెబుతాడు. దాంతో రోహిణి అదేం అవసరం లేదు. నీకు డబ్బులు ఇవ్వడానికి ఒకరు వచ్చారు. నువ్వు వెంటనే పార్లర్ దగ్గరకు రమ్మని చెబుతుంది. ఎవరనీ మనోజ్ అడుగుతాడు. నీ మాజీ లవర్ అని చెబుతుంది. దాంతో మనోజ్ షాక్ అవుతాడు. వెంటనే వస్తున్నానని అక్కడికి చేరుకుంటాడు. ఇక మనోజ్ రాగానే కల్పనాపై మండి పడుతాడు. నిన్ను ఎంతో ప్రేమించి, ఎంతగానో నమ్మితే నన్ను మోసం చేస్తావా? పైగా 40 లక్షలు ఎత్తుకొని పోతావా? అని ప్రశ్నిస్తాడు.
మోసపోవడం నీ తప్పు దానికి నేనేం చేయలేను. అయినా నువ్వు నాతో ఆరు నెలలు కాపురం చేశావు కదా. దానికి డబ్బులకు చెల్లు అని అంటుంది. ఇక వెంటనే బాలు కల్పనా మెడ పట్టుకొని నులుముతాడు. నిన్ను నమ్మితే మోసం చేసిందే గాక పైగా నన్నే మోసపోయానని అంటావా. నీ వల్ల మా ఇంట్లో నేను మోసగాడిలా మిగిలిపోయాను. లక్షలు మింగిన వాడిగా ముద్ర పడింది. నువ్వు డబ్బులు ఇచ్చే వరకు వదిలే ప్రసక్తే లేదు అని మనోజ్ కల్పనాతో అంటాడు. వెంటనే రోహిణి పోలీసులకు ఫోన్ చేయమని అంటుంది. ఆల్రెడీ కేసు పెట్టానని, ఇప్పుడు ఆ అమ్మాయి దొరికిందని పోలీసులకు సమాచారం ఇచ్చానని అంటాడు. అంతలోనే పోలీసులు కూడా వస్తారు. వచ్చి వారిందరినీ స్టేషన్ కు తరలిస్తారు. ఇక మనోజ్ మాజీ లవర్ కల్పనా మాత్రం తన తప్పును ఒప్పుకోదు.
అసలు నేను ఎవరినీ మోసం చేయలేదు. నన్నే మనోజ్ పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. ఇప్పుడు వేరే పెళ్లి చేసుకున్నాడు. మీ ముందే ఆధారం కూడా ఉందని షాక్ ఇస్తుంది. దాంతో పోలీసులు ఆ అమ్మాయి నీ దగ్గర 40 లక్షలు తీసుకుందని తెలిపేందుకు సాక్ష్యాధారాలు ఉన్నాయా? అని పోలీసులు ప్రశ్నిస్తారు. అందుకు మనోజ్ జాయింట్ అకౌంట్ నుంచి ఆమె డ్రా చేసిన డబ్బులే అని చెబుతుంది. ఇక పోలీసులు వెంటనే కల్పనాను ఆ డబ్బులు కట్టాలని అంటారు. మరోవైపు మీనా తన స్కూటీని ఇవ్వమని కానిస్టేబుల్ ను బతిమిలాడుతుంది. బాలుకు కూడా విషయం చెబుతుంది. బాలు వెంటనే బయల్దేరి వస్తాడు. అయితే మీనా పోలీస్ స్టేషన్ లోనే ఉన్న మనోజ్, రోహిణిని చూడదు. ఇక ప్రోమోలో కల్పనా 40 లక్షలు ఇస్తానని బాలుతో సాక్షి సంతకం చేయిస్తుంది. ఇలా 40 లక్షల వ్యవహారంలో బాలును తెలియకుండా ఇరికిస్తారు. ఈ సందర్భంగా ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











