Gunde Ninda Gudi Gantalu August 11th: పోలీస్ స్టేషన్ లో హైడ్రామా.. మనోజ్ మాజీ లవర్ రచ్చ

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 8వ తేదీ 484వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. పోలీసులు మనోజ్ మాజీ లవర్ కల్పనాను పోలీస్ట్ స్టేషన్ కు తీసుకొని వెళ్తారు. అప్పటికే కల్పనా మనోజ్ తో ఎలాంటి సంబంధం లేదని, ఇక తను మోసం చేయడం తప్పు కాదని, మోసం పోవడం నీ తప్పు అవుతుందని అంటుంది. కానీ పోలీసులు వచ్చాక మాట మార్చేస్తుంది. నేనేం తప్పు చేయలేదని మనోజ్ తనను గదిలో బంధించి ఇలా హింసిస్తున్నారని అంటుంది. నేను వెంటనే బయటకి వెళ్లాలని చెబుతుంది. కానీ పోలీసులు మాత్రం మనోజ్ ను, రోహిణిని, కల్పనాను ముగ్గురిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తారు.

ఇక మనోజ్ కల్పనా తనను ఎలా మోసం చేసిందనే విషయాలను ఎస్సైకి పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాడు. ఆమెను ఎంతో ప్రేమించానని, పెళ్లి కూడా చేసుకొందామని అనుకున్నానని అంటాడు. ఆమె వల్లనే మా నాన్న రిటైర్ మెంట్ డబ్బులు 40 లక్షలు తీసుకొచ్చి ఇచ్చానని చెబుతాడు. ఇద్దరి మధ్య జాయింట్ అకౌంట్ లో పెట్టుకున్నామని, ఫారెన్ కు వెళ్లి సెటిల్ అవుదామంటే అలా చేశానని వివరిస్తాడు. కానీ ఆమె నా డబ్బులు తీసుకొని పారిపోయిందని, ఇప్పుడు వదిలేస్తే మళ్లీ దొరికే అవకాశం రాదని పోలీసులతో మనోజ్ అంటాడు. ఇక కల్పనా మాత్రం నా తప్పు ఏమీ లేదని, నన్నే పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, నేను డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 11వ తేదీ 485 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 485 August 11th

మనోజ్ మాజీ లవర్ కల్పనాను పోలీసులు జైలులో విచారణ చేశారు. కానీ కల్పనా ఏమాత్రం తన తప్పు లేదని వాదించింది. నన్నే మనోజ్ ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని రివర్స్లో ఆరోపణలు చేస్తుంది. నన్ను వదిలేస్తే నేను కెనడా వెళ్లిపోతానని అంటుంది. మనోజే నన్ను మోసం చేశాడు. అందుకు 40 లక్షలు మిగిలించుకున్నానని అంటుంది. అయినా నాకు మీకు మాట్లాడాలని లేదు. ఏదైనా ఉంటే మీరు మా లాయర్ దగ్గర మాట్లాడుకోండి అని పోలీసులతో చెబుతుంది. ఇక మనోజ్ మాజీ లవర్ కల్పనా కు సంబంధించిన లాయర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తాడు. కానీ అప్పటికే పోలీసులు కల్పనా చేసిన తప్పుల గురించి వివరాలు సేకరిస్తారు. అదే విషయాన్ని కల్పనా లాయర్ రాగానే చెబుతారు. మనోజ్ కు డబ్బులు ఇవ్వకపోతే పలు సెక్షన్ల కింద డబ్బులు ఇవ్వకపోతే మాత్రం కేసు ఫైల్ చేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తాడు.

అసలు కేసు ఫైల్ చేయాల్సి నా మీద కాదు అని మనోజ్ మీద ఫైల్ చేయాలని కల్పనా అంటుంది. అలా కుదరదని ఎస్సై చెబుతాడు. నువ్వు మనోజ్ ను చీట్ చేసినట్టు మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని ఎస్సై హెచ్చరిస్తాడు. ఇక లాయర్ ను కూడా మీ క్లైంట్ కు నువ్వు చెప్పుకుంటావా? లేకా కోర్టుకు తీసుకెళ్లి జడ్జీ ముందు నిలబెట్టలా అని అడుగుతాడు. ఈమె డబ్బులు తీసుకున్నట్టుగా బ్యాంక్ స్టేట్ మెంట్ ఆధారంగా ఉంది. ఇక ఆమె డబ్బులు ఇచ్చి సెటిల్ మెంట్ చేసుకుంటే మరీ మంచిందని లేదంటే, కేసు ఫైల్ చేస్తామని అంటాడు. దాంతో నీ పాస్ పోర్ట్, వీసా అన్ని నిలిపివేసే అవకాశం ఉందని, నువ్వు కెనడాకు జీవితంలో వెళ్లలేవని ఎస్సై హెచ్చరిస్తాడు. ఇక కల్పనాతో తుది నిర్ణయం ఏంటో త్వరగా చెప్పండి అని ఎస్సై అంటాడు. ఇక కల్పనాను తన పర్సనల్ లాయర్ బయటకి తీసుకెళ్లి పరిస్థితిని వివరిస్తాడు. ఇక మీరు ఎలాగైనా డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందే అని చెబుతాడు. ఇది చెప్పడానికి నేను మిమ్మల్ని పోలీస్ట్ స్టేషన్ కు పిలిపించ లేదని అంటుంది.

నన్ను ప్రేమ పేరుతో మోసం చేశాడని పలు సెక్షన్ల కింద మనోజ్ పైనే కేసు పెట్టమని అంటుంది. కానీ ఆమె లాయర్ మాత్రం అసలు చేయడం వీలు పడదని అంటాడు. పోలీసుల దగ్గర నువ్వు చీట్ చేశావని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని చెబుతాడు. ఇక నువ్వు వాళ్ల డబ్బును వారికి తిరిగి ఇవ్వాల్సిందేనని చెబుతాడు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు తిరిగి ఇవ్వడం ఎలా సాధ్యం అవుతుందని ఆలోచిస్తూ ఉంటుంది... ఇక మరోవైపు మీనా స్కూటీని ట్రాఫిక్ పోలీసులు నో పార్కింగ్ బోర్డ్ వద్ద పెట్టినందుకు పోలీస్ స్టేషన్ కు తీసుకొని వస్తారు. దాంతో మీనా పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ ను రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. తన స్కూటీని తనకు ఇవ్వమని అడుగుతుంది. కానీ ఇవ్వరు. ఇక విషయం బాలుకు తెలుస్తుంది. వెంటనే బాలు పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. మీనా కంగారు పడుతుంటే ఏం కాదని చెబుతాడు. బాలు కూడా వెళ్లి స్కూటీని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తాడు.

కానీ ఎస్సై వచ్చాక కోర్టుకు వెళ్లి ఫైన్ కట్టి స్కూటీ తీసుకెళ్లమని చెబుతాడు. అప్పటి వరకు వెయిట్ చేయమని మరోసారి కాని స్టేబుల్ తెలుపుతారు. దాంతో ఏం చేయలేక బాలు, మీనా వేచి ఉంటారు... ఇక ప్రోమోలో మాత్రం రోహిణి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. తన తండ్రి మలేషియా నుంచి 25 లక్షల డబ్బు పంపించాడని అత్త ప్రభావతికి చెబుతుంది. దీంతో అందరూ హ్యాపీగా ఖుషి అవుతారు. ఇంకా15 లక్షలు కూడా వస్తాయని అంటుంది. దాంతో బాలు అసలు మీనా నాన్న జైలులో ఉన్నాడు కదా ఇంత డబ్బు ఎలా ఇచ్చాడని ప్రశ్నిస్తాడు. తన తండ్రి జైలుకు వెళ్లడాని కంటే ముందే ఈ డబ్బులను తీసి ఉంచారని బదులిస్తుంది. అంటే జైలుకు వెళ్తాడని మీ నాన్నకు ముందే తెలుసా అని బాలు ప్రశ్నిస్తాడు. లేదంటే మనోజ్ దగ్గర 40 లక్షలు కొట్టేసిన అమ్మాయి దొరికిందా అని అడుగుతాడు. ఈ క్రమంలో తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X