Gunde Ninda Gudi Gantalu August 12th: రోహిణి గుప్పిట్లో మనోజ్.. 45 లక్షలతో సరికొత్త నాటకం.. బాలుకు అనుమానం

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 11వ తేదీ 485వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ప్రేమ పేరుతో నన్ను మోసం చేశాడని మనోజ్ మాజీ లవర్ కల్పనా అంటుంది. అందుకే అతనిపై పలు సెక్షన్ల కింద మనోజ్ పైనే కేసు పెట్టమని అంటుంది. కానీ ఆమె పర్సనల్ లాయర్ అసలు చేయడం అస్సలు వీలు పడదని అంటాడు. బ్యాంక్ స్టేట్ మెంట్ తో పాటు అన్నీ ఆధారాలు నువ్వు చీట్ చేశావని ఉన్నాయి. డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఊరుకోరు. పోలీసులు కూడా మనోజ్ కే సరోర్ట్ గా ఉన్నారని చెబుతారు. అప్పటి వరకు ఇవ్వనని మొండికేసిన కల్పనా లాయర్ మాటలకు సరే అని అంటుంది. మరోవైపు మీనా స్కూటీని పోలసులు తీసుకు రావడంతో స్టేషన్ లో టెన్షన్ ను పడుతూ ఉంటుంది. బాలు వచ్చి విడిపించేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 12వ తేదీ 486 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

పోలీస్ స్టేషన్ లో మనోజ్ మాజీ లవర్ కల్పనాకు రోహిణి చుక్కలు చూపిస్తుంది. తన భర్త మనోజ్ దగ్గర ప్రేమ పేరుతో ఆడిన నాటకానికి అడ్డుకట్ట వేస్తుంది. మనోజ్ తండ్రి సత్యం రిటైర్ మెంట్ డబ్బులను మనోజ్ నుంచి తీసుకున్నందుకు పోలీస్ స్టేషన్ లోనే కట్టాలని డిమాండ్ చేస్తుంది. ఇక కల్పానాకు కూడా ఎలాంటి దారి లేకపోవడంత డబ్బులు ఇచ్చేందుకు ఒప్పుకుంటుంది. ఇక కెనడాకు వెళ్లాక డబ్బులు పంపిస్తానని అంటుంది. కానీ పోలీసులు మాత్రం అస్సలు వెళ్లడానికి వీల్లేదు అని అంటారు. డబ్బులు ఇచ్చాకనే వెళ్లాల్సి ఉంటుందని అంటారు. ఇక మనోజ్ మాజీ లవర్ కల్పనా లయర్ కూడా డబ్బుల ఇస్తేనే పని అవుతుందని చెబుతాడు. వెంటనే సరేనని కల్పనా 40 లక్షలు తిరిగి ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. కానీ రోహిణి మాత్రం అలా కేవలం 40 లక్షల రూపాయలు తిరిగి ఇస్తే సరిపోదు అని మెళిక పెడుతుంది. మరి ఏం కావాలని కల్పనా అడుగుతుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 486 August 12th

అయితే, మనోజ్ ను మోసం చేసిన డబ్బులు తన మామయ్య రిటైర్ మెంట్ డబ్బులు అని, అందులో నుంచి ఒక్క రూపాయి కూడా వాడుకోలేదని, ఇక కల్పనా మోసం చేయడంతో తన మామయ్యకు హార్ట్ స్టంట్ కూడా పడిందని రోహిణి చెబుతుంది. ఎలాగూ తమ డబ్బులతోనే పెట్టుబడి పెట్టి కల్పనా డబ్బులు సంపాదించింది కాబట్టి వడ్డీతో సహా తిరిగి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతుంది. ఇక పోలీసులు కూడా రోహిణి చెప్పింది నిజమేనని, ఆమె అడిగిన దాంట్లో న్యాయం ఉందని అంటారు. వెంటనే డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయమని ఎస్సై ఆదేశిస్తాడు. లేదంటే కెనడాకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తారు. దీంతో వెంటనే కల్పనా మనోజ్ బ్యాంక్ అంకౌంట్ కు డబ్బులు 45 లక్షల రూపాయలు ట్రాన్స్ ఫర్ చేస్తుంది. దాంతో మనోజ్ రోహిణి ఫుల్ ఖుషి అవుతారు. డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసిన తర్వాత పోలీసులు డబ్బులు ముట్టినట్టు డాక్యుమెంట్స్ రెడీ చేసి సంతకాలు చేయిస్తారు. ఈ క్రమంలో కల్పనా పోలీస్ స్టేషన్ బయటికి వెళ్లి సంతకం చేయించడానికి చూస్తుంది.

ఇదే సమయంలో కల్పనాకు బాలు కనిపిస్తాడు. ఒక్క ఒక ల్యాండ్ సెటిల్ మెంట్ జరిగిందని, దానికి సాక్షి సంతకం కావాలని అంటుంది. ఇక బాలు విషయం తెలుసుకున్నాక సంతకం చేస్తానని అంటాడు. అంతలా భయపడాల్సింది ఏమీ లేదని కల్పనా వెంట వచ్చిన కానిస్టేబుల్ చెబుతాడు. పైగా సంతకం పెడితే వెంటనే స్కూటీని కూడా తీసుకొని వెళ్లిపోవచ్చని అంటాడు. దాంతో బాలు ఏదేమైనా ఒక మహిళకు మంచి జరుగుతుంది అనుకుంటే మాత్రం సంతకం చేస్తానని అంటాడు. వెంటనే సాక్షి సంతకం చేస్తాడు. అలాగే తన ఫోన్ నెంబర్ కూడా రాసి ఇస్తాడు. ఆ వెంటనే బాలు, మీనా ట్రాఫిక్ ఎస్సై రావడంతో వెళ్లి స్కూటీ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక ఎస్సై మాత్రం నో పార్కింగ్ ఏరియాలో స్కూటీ పెట్టినందుకు 500 రూపాయల ఫైన్ వేసి స్కూటీ ఇస్తాడు. ఇక స్కూటీని తీసుకొని మీనా, బాలు తిరిగి ఇంటికి వెళ్లిపోతుంది.

మరోవైపు మనోజ్ రోహిణి చాలా సంతోషంలో ఉంటారు. 45 లక్షలు వచ్చినందుకు ఆనంద పడుతారు. పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా మనోజ్ కన్సల్జెన్సీ ఆఫీస్ కు వెళ్తాడు. వచ్చిన డబ్బుల్లో 14 లక్షలు కట్టి కెనడా వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పటికే మనోజ్ ప్లేస్ లో మరొకరిని పంపించామని కన్సల్టెన్సీ వాళ్లు చెబుతారు. మీరు సమయానికి డబ్బులు కట్టి ఉంటే పంపించే వాళ్లం. ఇప్పుడు మీ బదులు మరొకరు ఆల్రెడీ కెనడాకు వెళ్లిపోయారు కూడానూ అని చెబుతారు. దీంతో మనోజ్ చాలా బాధపడుతాడు. ఇక ఏదేమైనా పోయిన డబ్బులు తిరిగి వచ్చినందుకు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తారు. మనకు డబ్బులు వచ్చిన సంగతి ఇంట్లో వెంటనే చెప్పాలని మనోజ్ అంటాడు. కానీ రోహిణి అడ్డుకుంటుంది. అలా చేస్తే మనకు ఒరిగేదీ ఏమీ లేదని అంటుంది. బదులుగా ఆ డబ్బులన్నీ ప్రస్తుతం మన దగ్గరే పెట్టుకుందామని అంటుంది. వాటితో బిజినెస్ చేద్దామని, వచ్చిన లాభాల్లో నుంచి తిరిగి మామ సత్యంకు తిరిగి ఇద్దామని అంటుంది.

మరీ ఈ డబ్బులు ఎక్కడివి అంటే ఏమని బదులిస్తావని మనోజ్ రోహిణిని ప్రశ్నిస్తాడు. దాంతో రోహిణి మా నాన్న మలేషియా నుంచి పంపించాడని చెబుతానని అంటుంది. ఇక ఇంటికి వెళ్లి ఇదే నాటకాన్ని ఆడుతారు. ఇంటికి వెళ్తూ వెళ్తూ సత్యం, ప్రభావతికి మంచి కొత్త బట్టలు కూడా తీసుకొని వెళ్తారు. ఇక రోహిణి మా నాన్న 25 లక్షలు పంపించాడని చెబుతుంది. దాంతో ప్రభావతి ఫుల్ ఖుషి అవుతుంది. మీ నాన్న జైలులో ఉన్నాడు కదా డబ్బులు ఎలా పంపించాడని శృతి అడుగుతుంది. ఆయన జైలుకు వెళ్లే ముందే ఈ డబ్బులు తీసి ఉంచారంట. ఇక మామయ్య ఇవ్వడం మరిచిపోయాడు. ఆయన ఫ్రెండ్ ద్వారా ఇప్పుడు పంపించారని చెబుతుంది. ఇక బాలు, శృతి, రవి ఆ డబ్బుల గురించి సందేహిస్తూ ఉంటే ప్రభావతి అడ్డుకుంటుంది. రోహిణిని పొడుగుతూ ఉంటుంది. బాలుకు మాత్రం ఆ డబ్బులపై, రోహిణిపై విపరీతమైన అనుమానం కలుగుతుంది. ఈ సందర్భంగా ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X