Gunde Ninda Gudi Gantalu August 13th: రోహిణిపై బాలు సందేహం.. అందరి ముందు నిలదీత

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 12వ తేదీ 486వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రోహిణి మనోజ్ లను ప్రభావతి కొండెక్కిస్తుంది. మనోజ్ మాజీ లవర్ కల్పనా తిరిగి ఇచ్చిన డబ్బులతో రోహిణి సరికొత్త నాటకం ఆడుతుంది. ఆ 45 లక్షల్లో 25 లక్షల రూపాయలు తన తండ్రి మలేషియా నుంచి పంపించాడని ఇంట్లో వాళ్లకు చెబుతుంది. తన తండ్రి మలేషియా నుంచి 25 లక్షలు పంపించాడని రోహిణి చెప్పడంతోనే ప్రభావతి ఉప్పొంగి పోతుంది. నేను చేసిన పూజలు, వ్రతాలు అన్నీ ఫలించాయని అంటుంది. దేవుడు కరుణించి రోహిణికి వాళ్ల నాన్న నుంచి డబ్బులు వచ్చేలా చేశాడని అంటుంది. ఇక జైలు లో ఉన్న మీ నాన్న డబ్బులు ఎలా పంపించాడని అందరూ ప్రశ్నిస్తారు. అందుకు రోహిణి ఆయన జైలుకు వెళ్లే ముందే నా కోసం డబ్బులు తీసి ఉంచారంట. ఇక మా మామయ్యకు ఇవ్వమని ఎప్పుడో చెప్పారంట కూడా. కానీ ఆయనే మర్చిపోయారు. ఇక ఇప్పుడు మా మామయ్య వాళ్ల స్నేహితుడితో పంపించారని సమాధానం చెబుతుంది. ఇంత సడెన్ గా డబ్బులు రావడంతో బాలు, శృతి సందేహం వ్యక్తం చేస్తారు. ఆగస్టు 13వ తేదీ 487 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

రోహిణి చెప్పిన మాటలను బాలు అస్సలు నమ్మబోడు. జైలులో ఉన్న వ్యక్తి డబ్బులు పంపించడం ఏంటని సందేహిస్తాడు. ఇక అసలు ఆయన డబ్బులు ఎందుకు ఇవ్వాలని అనుకున్నాడని, అది కూడా 25 లక్షలు అని రోహిణిని బాలు ప్రశ్నిస్తాడు. దాంతో రోహిణి ఇలా బదులిస్తుంది. మీరు ప్రతిసారి మనోజ్ ను పనిలేని వాడని, తిని కూర్చొనే వాడని అంటున్నారు. ముఖ్యంగా నువ్వు అనే మాటలకు నేను సమాధానం చెప్పాలని అనుకున్నానని బాలుతో రోహిణి అంటుంది. మీరు పోరు పడలేకనే మా నాన్నను ఎప్పుడో డబ్బులు అడిగాను. అది కూడా మనోజ్ ను 40 లక్షలు మింగిన వాడు అని అన్నారు కాబట్టి నేను కూడా మా నాన్నను 40 లక్షల రూపాయలు ఇవ్వమని అడిగాడు. అందుకు ఆయన ఏర్పాటు చేస్తానని అప్పుడు చెప్పారు. ఇప్పుడు 25 లక్షలు ఇచ్చారు. మళ్లీ 15 లక్షలు అకౌంట్ లో పడుతాయని పూర్తిగా కట్టుకధను చెబుతుంది. అయినా కూడా నమ్మడానికి బాలు మనస్సు అస్సలు ఒప్పుకోదు. ఇక ప్రభావతి కలుగజేసుకొని రోహిణి, మనోజ్ ను ఒక్క మాట అన్నా కూడా సహించేది లేదని అంటుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 487 August 13th

ప్రభావతి మాటలతో బాలుకు ఇంకా కోపం వస్తుంది. అసలు ఆ డబ్బులు అడిగింది. మాకు తిరిగి ఇవ్వడానికే కదా అని బాలు రోహిణిని ప్రశ్నిస్తాడు. వచ్చిన దాంట్లో నాకు, రవి కూడా వాటాలు పంచండి. అది మా నాన్న కష్టం చేసిన సొమ్ము. అందరికీ వర్తిస్తుందని అంటాడు. అది నిజమే కదా అని రవి, శృతి అంటారు. దీంతో రోహిణి స్పందిస్తూ మనోజ్ కు ఇప్పుడీ డబ్బులతో మంచి బిజినెస్ పెట్టించి వచ్చిన లాభాల్లో మామయ్య ఇచ్చిన 40 లక్షలు బాకీ తీర్చేస్తామని అంటుంది. ఇక అందుకు ప్రభావతి, సత్యం కూడా సంతోషిస్తారు. ఇక మరోవైపు ప్రభావతి మీనాపై మండి పడుతుంది. రోహిణి లాగా తన పుట్టింటి నుంచి ఏం తిరిగి రావడం లేదని మాట మాటకు బాధపెట్టేలా మాట్లాడుతూ ఉంటుంది. దాంతో మీనా ఫైర్ అవుతుంది. మా ఆయనకు పుట్టింటి వాళ్ల డబ్బుపై ఆశ లేదని, ఒకరి మోచేతి నీళ్లు తాగి బతకాల్సిన అవసరం ఆయనకు అంతకంటే లేదని అంటుంది. వెంటనే బాలు మీనాకు సపోర్ట్ చేస్తాడు. మీనా కష్టపడి నాకు కారు కొనిచ్చింది. నేను కష్టపడి మీనాకు స్కూటీ కొనిచ్చాను. మాకు ఇది సరిపోతుందని బాలు అంటాడు.

ఇక అందరూ కలిసి భోజనం చేసేందుకు డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తారు. అప్పుడు ప్రభావతి అందరినీ వదిలేసి కేవలం రోహిణి, మనోజ్ లకే ప్రత్యేకంగా భోజనాలు వడ్డిస్తుంది. వారిద్దరికి చేరో రెండు బాయిల్డ్ ఎగ్స్ పెడుతుంది. బాలు, రవి, శృతి చూసి షాక్ అవుతారు. ఇక బాలు వెంటనే ఈరోజు రోహిణి గుడ్డు తినకూడదని అడ్డుకుంటాడు. ఇంకా దీక్ష పూర్తి కాలేదు అని గుర్తు చేస్తాడు. డబ్బులు వచ్చాయి కదా అని ప్రభావతి అంటుంది. అసలు దీక్ష డబ్బుల కోసం రోహిణి వాళ్ల నాన్న మలేషియా జైలు నుంచి క్షేమంగా తిరిగి రావడం కోసమని అంటుంది. ఆ వాళ్ల నాన్న తిరిగి రావాల్సిన అసవరం లేదా? ఆయనకు ఏమైన పోయిన పర్లేదు, మనకు డబ్బులు వస్తే సరిపోతుందా? అని బాలు ప్రశ్నిస్తాడు. దీక్షకు భంగం కలిగితే ఆయనకు ఇంకేదైనా ప్రమాదం జరగవచ్చు. అలాంటిది జరగకూడదంటే రోహిణి, మనోజ్ ఇద్దరూ గుడ్డు తినకూడదు. పైగా వాళ్లిద్దరూ చేసుకున్న స్వయం పాకమే తినాలని చెప్పి, వాళ్ల పేట్స్ లో ఉన్న బాయిల్డ్ ఎగ్స్ ను తీసేస్తాడు. తలా ఒకటి వేస్తాడు. ఇక ప్రభావతి కూడా చేసేదేమీ లేక చూస్తూ కూర్చొంటుంది.

బాలు మాటలకు మనోజ్ కౌంటర్ ఇవ్వబోతాడు. మిగితా 15 లక్షల రూపాయలు నా అకౌంట్ లో పడ్డాక అప్పుడు నీ సంగతి చెబుతానని అంటాడు. ఇక వెంటనే బాలు పట్టేస్తాడు. అసలు మీనా వాళ్ల నాన్న డబ్బులు పంపిస్తే రోహిణికి పంపించాలి కదా, అసలు ఆయన నీ అకౌంట్ లో డబ్బులు ఎందుకు వేస్తానని చెప్పాడు. అది కూడా సరిగ్గా 40 లక్షలే ఎందుకు తిరిగి వస్తుందని? మళ్లీ ప్రశ్నిస్తాడు. కొంపతీసి నీ పాత లవర్ దొరికి 40 లక్షలు తిరిగి ఇవ్వలేదు కదా అని అంటాడు. దాంతో రోహిణి, మనోజ్ గుండె గుబేల్ అంటుంది. అలాంటిది ఏమీ లేదని చెబుతారు. నా అకౌంట్ లో ట్యాక్స్ కట్ అవుతుందని మనోజ్ అకౌంట్ లోకి కొట్టమని చెప్పానని అంటుంది. నీది బిజినెస్ అకౌంట్ ఏమీ కాదు కదా? ట్యాక్స్ ఎలా కట్ అవుతుందని శృతి కూడా ప్రశ్నిస్తుంది. ఏం సమాధానం చెప్పాలో తెలియక రోహిణి చిరాకు పడుతుంది. అసలు ఏంటీ మీరు డబ్బులు లేకపోతే లేవంటారు, ఇస్తారు ఇలా అంటారు అని మండి పడుతుంది. దాంతో టాపిక్ డైవర్ట్ అవుతుంది.

ఇక బాలు ఎలాగైనా ఆ డబ్బుల వెనకాల ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటాడు. ఇదే విషయం మీనాతోనూ చర్చిస్తాడు. ఎప్పుడు కనిపించని, వినిపించని రోహిణి వాళ్ల నాన్న నుంచి డబ్బులు రావడం ఏంటని సందేహిస్తాడు. పార్లరమ్మ, మనోజ్ ఏదో దాపరికం చేస్తున్నారని, త్వరలోనే కనిపెడుతానని అంటాడు. మరోవైపు మౌనికాను సంజూ తన బర్త్ డే పార్టీకి తీసుకెళ్తాడు. అక్కడ అమ్మాయిలతో రాసుకొని పూసుకొని సరదా చేస్తాడు. పైగా తన ఫ్రెండ్స్ ముందుకు మౌనికాను పల్లెటూరు మొద్దు అని అవమానిస్తాడు. అంతే కాదు తన స్నేహితుడిని మౌనికాతో అసభ్యంగా ప్రవర్తించేలా చేస్తాడు. దాంతో మౌనికా సంజూ ఫ్రెండ్ ను చెంప పగిలేలా కొడుతుంది. అందుకు సంజూ మౌనికా చెంపపై కొడతాడు. ఇక గుండె ముక్కలైన మౌనికా రోడ్డుపై ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో మీనా చూసి ఏమైందని అడుగుతుంది. సంజూ వల్ల నరకం చూస్తున్నానని చెబుతుంది. ఇక మీనా వెంటనే బాలుకు చెప్పి సంజూ అంతు చూస్తానని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X