Gunde Ninda Gudi Gantalu August 14th: రోహిణి Vs మీనా.. అర్ధరాత్రి నడిరోడ్డుపై చావుబతుకుల్లో మౌనికా
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 13వ తేదీ 487వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. అసలు మీ నాన్న నీకు ఇప్పుడు డబ్బులు ఎలా పంపాడు.. ఇన్నేళ్లు పంపని డబ్బులను ఇప్పుడు పంపాలని ఎలా అనుకున్నాడు, పైగా జైలులో ఉండి కూడా ఎలా పంపించాడని బాలు రోహిణిపై ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. బాలు వెంటనే శృతి, రవి కూడా సందేహం వ్యక్తం చేస్తూనే ఉంటారు. ఇక బాలు ప్రశ్నలకు రోహిణి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. నీ వల్లనే మా నాన్నను ఎప్పుడో 40 లక్షలు అడిగానని, అవి తీసి పక్కకు పెట్టారు. ఇక ఇప్పుడు మా మామయ్య పంపించాడని చెబుతుంది. అందులో 25 లక్షలు పంపారని, ఇంకా 15 లక్షలు వస్తాయని అంటుంది.
రోహిణి సమాధానం విన్న తర్వాత బాలుకు మరో సందేహం మొదలవుతుంది. అయినా మీ నాన్న సరిగ్గా 40 లక్షలే పంపించడం ఏంటీ, ఒక వేళ మనోజ్ మాజీ లవర్ నుంచి ఈ డబ్బులను వసూల్ చేసి లేరు కదా అని రోహిణిని బాలు ప్రశ్నిస్తాడు. దాని మొహం అదెక్కడ ఉందోనని రోహిణి బదులిస్తుంది. ఇక మరోవైపు మనోజ్ బాలుకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. నా అకౌంట్ లో మిగితా రూ.15 లక్షలు పడ్డాకా అప్పుడు నీ సంగతి చెబుతానని అంటాడు. దాంతో బాలు అస్సలు వాళ్ల నాన్న నీ అకౌంట్ లో డబ్బులు వేస్తారు. రోహిణి అకౌంట్ లో వేస్తారు కదా అని ప్రశ్నిస్తాడు. దాంతో రోహిణి, మనోజ్ షాక్ అవుతారు. రోహిణి జోక్యం చేసుకొని బాలు దృష్టిని మళ్లిస్తుంది. మరోవైపు మౌనికాను సంజూ, సంజూ స్నేహితులు అందరూ దారుణంగా అవమానిస్తారు. సంజూ ఫ్రెండ్ మౌనికాతో అసభ్యంగా ప్రవర్తిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 14వ తేదీ 488 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

రోహిణి మనోజ్ పై రగిలిపోతుంది. అందరి ముందు నోటికొచ్చింది మాట్లాడి మనం దొరికిపోయేలా చేస్తున్నావని అంటాడు. అసలు నీ అకౌంట్ లో డబ్బులు ఎందుకు పడుతాయని చెప్పావని మండి పడుతుంది. నువ్వు ఇంకోసారి డబ్బుల గురించి మాట్లాడితే ఊరుకోనని హెచ్చరిస్తుంది. ముఖ్యంగా బాలు ముందు అస్సలు అజాగ్రత్తగా మాట్లాడకూడదని చెబుతుంది. నువ్వు మౌనంగా ఉంటే సరిపోతుంది. లేదంటే ఇంట్లో వాళ్లందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి చంపేస్తారు. అప్పుడు మనం దొరికిపోతాం అని అంటుంది. ఇక మనోజ్ స్పందిస్తూ అలా కావద్దంటే ఉన్న డబ్బులన్నీ మనం ఏదైనా బిజినెస్ లో పెట్టేద్దాం. అప్పుడు మనకు వీళ్ల నుంచి ప్రశ్నల పురాణం తప్పుతుంది కదా అని అంటాడు. కానీ రోహిణి డబ్బులు ఖర్చు చేయడానికి ఒప్పుకోదు. డబ్బులు ఎప్పుడు ఏ బిజినెస్ మీద పెట్టాలో నాకు తెలుసని, నేను చెప్పే వరకు నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని అంటుంది. అందుకు మనోజ్ సరేనని అంటాడు. ఇక బాలు నోరును ఎలా మూయించాలో నాకు బాగా తెలుసు, ఆ మీనాకు గట్టిగా వార్నింగ్ ఇస్తే సరిపోతుందని అంటుంది.
ఇక రోహిణి వెంటనే మీనా దగ్గరకు వెళ్లి బాలు గురించి మాట్లాడుతుంది. నీ భర్త బాలును నోరు అదుపులో పెట్టుకోమని హెచ్చరిస్తుంది. మా పర్సనల్ విషయాల్లో మాట్లాడాల్సిన అవసరం ఆయనకు ఏముందని ప్రశ్నిస్తుంది. మాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తే ఏంటీ? ఎందుకు అంతలా మాపై సందేహంగా మాట్లాడుతున్నాడు. ఇకపై బాలు మా వ్యక్తిగత విషయాల్లో కలుగజేసుకోకుండా నువ్వే చూసుకోవాలని రోహిణి మీనాతో అంటుంది. ఇక మీనా స్పందిస్తూ ఏదో తోడబుట్టిన చనువుతో అడిగాడు. అయిన మామయ్య దగ్గర తీసుకున్న 40 లక్షల గురించే కదా అడిగింది. ఆ మాత్రం ఎవ్వరైనా అడుగుతారు కదా అని మీనా తిరిగి ప్రశ్నిస్తుంది. మామయ్య దగ్గర తీసుకున్న డబ్బులను ఎలా తిరిగి ఇవ్వాలో మాకు బాగా తెలుసు. మేం ఆ విషయం చూసుకుంటామని చెబుతుంది. ఇకపై మీరు మా విషయంలో జోక్యం చేసుకోవద్దని అంటుంది. దాంతో మీనాకు మండి పోతుంది. ఇక నేను నా భర్త బాలుకు స్కూటీ కొనిచ్చినప్పుడు మీరందరూ నాపై ఎందుకు అనుమానం వ్యక్తం చేశారు. అసలు నువ్వు కూడా ఎందుకు ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపించావని అడుగుతుంది. అది నా తప్పే. ఇకపై మీరు మా విషయంలో, మేం మీ విషయంలో జోక్యం చేసుకోం అని చెబుతుంది.
ఆ వెంటనే మీనా బాలు దగ్గరకు వెళ్లి అసలు నువ్వు వాళ్ల విషయాల్లో ఎందుకు దూరుతున్నావని ప్రశ్నిస్తుంది. కోపంగా అడుగుతుంది. దాంతో బాలు మంచి కోసమే అడుగుతున్నాను కదా అని అంటాడు. నువ్వు వాళ్లను అడగటం ఆ తర్వాత వాళ్లు నను వేధించడం బాగానే సరిపోతుందని అంటుంది. ఇకపై నువ్వు వాళ్లను ఏమాత్రం అడగటానికి వీల్లేదు. నేను అస్సలు ఊరుకోనని హెచ్చరిస్తుంది. బాలు కూడా సరేనని అంటాడు. ఇక మౌనికాకు సంజూ అందరి ముందు చెంప పగిలేలా కొడుతాడు. మౌనికాను సంజూ స్నేహితుడు ఒకరు తనతో డ్యాన్స్ చేయమని, కలిసిపోమని అసభ్యంగా మాట్లాడుతాడు. దీంతో మౌనికాకు మండిపోతుంది. వెంటనే అతని చెంపలు వాయిస్తుంది.
ఇక సంజూ విషయం తెలుసుకోకుండా మానికానే కొట్టి పంపిస్తాడు. ఆ బాధలో మౌనికా నడిరోడ్డుపై వాహనాలకు ఎదురుగా నడుచుకుంటూ వెళ్తుంది. అదే సమయంలో మీనా పూల ఆర్డర్ కు వెళ్తూ మౌనికాకు చూసి కాపాడుతుంది. అసలు ఏం జరిగిందని ప్రశ్నిస్తుంది. ఇక మౌనికా బాధను తట్టుకోలేక సంజూతో తనకు నరకం కనిపిస్తోందని చెబుతూ బాధపడుతుంది. బోరున విలపిస్తుంది. పార్టీ పేరుతో తనను ఎలా అవమానించారో వివరిస్తుంది. ఇక మీనా రగిలిపోతుంది. వాడి అంతు నేను చూస్తాను. నువ్వు నాతో ఇంటికి రమ్మని చెబుతుంది. కానీ మౌనికా రానని అంటుంది. బాలు అన్నయ్యను నువ్వు ఎలా మార్చుకున్నావో సంజూను కూడా నేను మార్చుకుంటానని చెబుతుంది. ఇక ఇదే ఆఖరి అవకాశం అని మీనా చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications










