Gunde Ninda Gudi Gantalu August 15th: బాలుకు చావుదెబ్బ.. మళ్లీ చిక్కుల్లో పడ్డ రోహిణి

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 14వ తేదీ 488వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రోహిణి వాళ్ల నాన్న డబ్బులు ఇచ్చాడని చెప్పడంతో బాలు, శృతి, రవి పలు విధాలుగా అనుమానం వ్యక్తం చేస్తారు. ఈ క్రమంలో బాలు రోహిణి, మనోజ్ లపై సందేహం వ్యక్తం చేస్తారు. అసలు ఇప్పుడిప్పు మీ నాన్న ఎందుకు డబ్బులు పంపించాడని అంటాడు. సరిగ్గా 40 లక్షలు పంపించడం ఏంటని డౌట్ పడుతాడు. ఒకవేళ మీకు రోహిణి మాజీ లవర్ గానీ దొరికిందా అని ప్రశ్నిస్తాడు. కానీ రోహిణి అలాంటిది ఏం లేదని అంటుంది. నీ పోరు పడలేకనే మా నాన్నను డబ్బులు అడిగానని తెలుపుతుంది. అప్పుడు అడిగితేనే ఇప్పుడు పంపించారని అంటుంది. ప్రస్తుతం 25 లక్షలు ఇచ్చారని, మళ్లీ 15 లక్షల రూపాయలు ఇస్తారని వివరిస్తుంది. ఆ తర్వాత కూడా బాలు పలు సందేహాలు చేస్తూనే ఉంటాడు. రోహిణి మాత్రం సమాధానం చెప్పకుండా తప్పించుకుంటుంది.

ఆ వెంటనే మీనాతో విషయాన్ని చెప్పి బాలు నోరు మూయించమని అంటుంది. మా విషయాల్లో మీరు, మీ విషయాల్లో మేము అస్సలు జోక్యం చేసుకోకూడదని చెబుతుంది. ఇంకోసారి బాలు మనోజ్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏమాత్రం సహించలేను అని అంటుంది. దాంతో మీనా సరేనని చెబుతుంది. ఇక మరోవైపు మౌనికాను సంజూ బర్త్ డే పార్టీకి అని తీసుకొని వెళ్లి దారుణంగా అవమానిస్తాడు. తన స్నేహితులతోనూ అవమానించేలా చేస్తాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపో అని చెబుతాడు. దాంతో మౌనికా రోడ్డుపై స్పృహ లేకుండా నడుచుకుంటూ వెళ్తుంది. వాహనాలు గుద్ది చనిపోయే పరిస్థితి నుంచి మీనా కాపాడుతుంది. ఏమైందని విషయం తెలుసుకుంటుంది. వెంటనే మన ఇంటికి వచ్చేయ్ అని చెబుతుంది. బాలుతో చెప్పి సంజూ సంగతి చెబుతానని అంటుంది. కానీ మౌనికా వద్దని అంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 15వ తేదీ 489 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 489 August 15th

మీనా మౌనికా విషయంలో కంగారు పడుతూ ఉంటుంది. అసలు అర్ధరాత్రి నడిరోడ్డుపై మౌనికా అలా అనాథలా కనిపించడంతో బాధ పడుతుంది. వాహనాల మధ్య అలా తిరుగుతూ ఉంటే వెంటనే రక్షిస్తుంది. అసలు సంజూ నిన్ను ఇంతలా టార్చర్ పెడుతూ ఉంటే ఎందుకు భరిస్తూ ఉన్నావని అంటుంది. ఇక నిన్ను తిరిగి పంపించే సమస్యే లేదని అంటుంది. మీ అన్నయ్య బాలుకు చెప్పి సంజూ సంగతి చూస్తానని భరోసా వ్యక్తం చేస్తుంది. కానీ మౌనికా మాత్రం వద్దు అని చెబుతుంది. సంజూ సంగతి నేనే చూసుకుంటానని చెబుతుంది మౌనికా. నువ్వు అన్నయ్య బాలును ఎలాగైతే మార్చుకున్నావో నేను తప్పకుండా సంజూను మంచిగా మార్చుకుంటానని మౌనికా చెబుతుంది. కేవలం ఆయనకు అన్నయ్య బాలుపైనే కోపం, మన కుటుంబం మీద కోసం అంతే గానీ నా మీద ఎలాంటి కోపం లేదు. వాళ్లందరి కోపాన్ని నా మీద చూపిస్తున్నారు అంతే. ఎలాగైనా ఆయన్ని మార్చేస్తాను అని మౌనికా చెబుతుంది. ఇక మరోసారి ఇది రిపీట్ అయితే మాత్రం నేను ఊరుకోనని, నిన్ను ఇంటికి తీసుకు రమ్మని మీ అన్నయ్యకు చెబుతానని అంటుంది. దానికి సరేనని మౌనికా చెబుతుంది.

ఇక సంజూ ఫుల్ గా డ్రింక్ చేసి ఇంటికి తిరిగి వస్తాడు. అప్పటికీ ఇంకా మౌనికా ఇంట్లో లేకపోవడంతో మౌనికా తన పుట్టింటికి వెళ్లిపోయి ఉంటుందని సంతోషం వ్యక్తం చేస్తాడు. పార్టీలో అవమానించిన తీరుకు ఇంటిల్లిపాది ఏడుస్తూ కూర్చొని ఉంటారని అనుకుంటాడు. కానీ అదే సమయంలో మౌనికా ఇంటికి తిరిగి వస్తుంది. మౌనికాను చూసిన సంజూ మళ్లి రగిలిపోతాడు. నువ్వు ఇంటికి ఎందుకు తిరిగి వచ్చావే అని ప్రశ్నిస్తాడు. వెంటనే ఇంట్లో నుంచి వెళ్లిపో అని అంటాడు. ఇక మెడపట్టి గెంటేయబోయి తానే మద్యం మత్తులో కింద పడిపోతాడు. మౌనికా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ విషయం మళ్లీ బాలు అన్నయ్యకు తెలియక ముందే సంజూను మార్చేసుకోవాలని అనుకుంటుంది. ఇక మరోవైపు మీనా వదినాను ఎన్నాళ్లు ఆపలేను. ఇంకోసారి ఇలాంటి ఘటన మీనా కంట పడితే వెంటనే బాలు అన్నయ్యకు చెబుతుందని, అన్నయ్య ఈయన్ని చంపేస్తాడని బాధపడుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం తెలియక ముందే ఆయన్ని పూర్తిగా మార్చేసేయాలని నిర్ణయించుకుంటుంది.

మరోవైపు రోహిణికి 45 లక్షలు వచ్చాయన్న సంగతిని తన స్నేహితురాలు విద్యతో చెబుతుంది. ప్రస్తుతం అన్నీ సమస్యలు తీరిపోయేలా ఉన్నాయని రోహిణి అంటుంది. కానీ దినేష్ వచ్చి రోహిణి మరో సమస్యలా మారిపోతాడు. 1లక్ష రూపాయలు ఇస్తేనే సరే అని, లేదంటే నీ గుట్టు మొత్తం మీ అత్తగారింట్లో చెబుతానని హెచ్చరించి వెళ్లిపోతాడు. ఇక రోహిణి ఇంటికి వెళ్లి బాలును లక్ష రూపాయలు అడుగుతుంది. మనోజ్ కూడా ఇస్తాడు. అలాగే డబ్బులు తనను అడగకుండా ఎవ్వరికీ ఇవ్వకని చెబుతుంది. ఇంకోవైపు మీనాకు తన తల్లి పార్వతీ దగ్గరకు వెళ్తుంది. అదే సమయంలో శివ రౌడీ షీటర్ గుణతో కలిసి కనిపిస్తాడు. ఈ తాగుబోతుతో తిరగద్దని చెబితే వినవా అంటూ మీనా తమ్ముడు శివపై మండి పడుతుంది. నేను తాగుబోతును కాదు మీ ఆయనే తాగుబోతు. తాగి మీ తమ్ముడు చేయిని కూడా విరగ్గొట్టాడని అంటాడు. దాంతో మీనా గట్టిగా మాట్లాడుతుంది. మరోవైపు బాలుకు గండం ఉందని జాతకాలు చెప్పే ఆయన చెబుతాడు. నువ్వోక సమస్యలో చిక్కుకోబోతున్నావని అంటాడు. ఆ వెంటనే బాలుకు రాజకీయ నాయకుడి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. బాలు ఆయన దగ్గరికి వెళ్తాడు. ఇక ప్రోమోలో బాలు తాగకపోయినా.. బార్ లో రాజకీయ నాయకులతో కూర్చోవడంతో తాగుబోతుగా వీడియో తీస్తాడు గుణ. ఆ వీడియోను బాలు సన్నిహితులకు పంపిస్తాడు. సోషల్ మీడియాలోనూ పెట్టి వైరల్ అయ్యేలా చూస్తాడు. ఇలా ఆ విషయం మీనాకు తెలుస్తుంది. ఇక నెక్ట్స్ ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X