Gunde Ninda Gudi Gantalu August 19th: నడిరోడ్డుపై బాలు రచ్చ.. రగిలిపోయిన పూలగంప
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 18వ తేదీ 490వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మనోజ్ కారు కొనుకుందామని కారు కన్సల్జెన్సీకి వెళ్తాడు. అక్కడ ఒక కారును సెలెక్ట్ చేస్తాడు. ఇక తన భార్య రోహిణి వచ్చాక డబ్బులు కట్టేస్తానని, వెంటనే వస్తానని చెప్పి బయటికి వెళ్లిపోతాడు. అదే సమయంలో బాలు పొలిటీషియన్, ఆయన ఫ్రెండ్ కు కారు ఇప్పించేందుకు అదే కారు కన్సల్జెన్సీకి వస్తాడు. బాలుకు ఆ ఓనర్ బాగా పరిచయం ఉండటంతో అక్కడికి తీసుకెళ్తాడు. ఇక మనోజ్ సెలెక్ట్ చేసిన కారునే వాళ్లకు ఇప్పిస్తాడు. మనోజ్ కొనలేడని, ఈఎంఐలకు ఇబ్బంది అవుతుందని బాలు చెప్పడంతో ఆ ఓనర్ కారును పొలిటీషియన్ ఫ్రెండ్ కు అమ్మేస్తాడు. మరోవైపు వారితో కలిసి బాలు బారులో కూర్చొంటాడు. అక్కడే ఉన్న గుణ బాలును తాగుబోతుగా మార్చేయాలని ఫేక్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతాడు. దాంతో బాలు కారులోకి ఎక్కిన వారందరూ దిగి వెళ్లిపోతారు. తనకు బుక్ చేసుకున్న రైడ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అవుతాయి. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఆగస్టు 19వ తేదీ 491 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?
మీనా తన తమ్ముడు శివ అను ప్రతిరోజు ఏం చేస్తున్నాడని ఇంట్లో అమ్మ చెల్లిని ప్రశ్నిస్తోంది. అసలు వీడు కాలేజీకి వెళ్లకుండా ఆ తాగుబోతు రౌడీషీటర్ గుణ గాడితో ఎందుకు తిరుగుతున్నాడని మండిపడుతుంది. ఇంతకీ వీడికి ఈ కొత్త బట్టలు, ఖరీదైన మొబైల్ ఫోన్ ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నిస్తుంది. దాంతో పార్వతీ స్పందిస్తూ ఆ గుణ గాడితో తిరగడం మొదలైనప్పటి నుంచే శివ దగ్గర ఇవన్నీ కనిపిస్తున్నాయని తల్లి పార్వతి చెబుతుంది. దాంతో మీనా శివ పై మండిపడుతుంది. అమ్మకి ఆరోగ్యం బాగా లేకపోయినా కూడా పూలు అమ్మి మరీ మన కుటుంబం కోసం రోజంతా కష్టపడుతుందని చెబుతోంది. కానీ నువ్వు మాత్రం తాగుబోతు గుణ గాడితో తిరుగుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావని ఫైర్ అవుతుంది. దాంతో శివ స్పందిస్తూ నేను ఉద్యోగం చేస్తున్నానని చెబుతాడు. ఆ డబ్బుతోనే ఇవన్నీ కొనుక్కున్నానని, అసలు అమ్మను కూడా పూలు అమ్మడం మానేయమని చెప్పానని సమాధానం ఇస్తాడు.

కానీ మీనా మాత్రం అమ్మ ఆ పూలు అమ్మే నిన్ను ఇంతవాడిని చేసిందని గుర్తు చేస్తుంది. ఇకపై తాగుబోతు గుణతో కనిపిస్తే మాత్రం అస్సలు ఊరుకోనని మీనా తన తమ్ముడు శివ ను హెచ్చరిస్తుంది. కానీ శివ మాత్రం నా స్నేహితుడు గుణ తాగుబోతు కాదని వాదిస్తాడు. అసలు తాగుబోతు నీ భర్త అని అంటాడు. బాలు గురించి తప్పుగా మాట్లాడడంతో తమ్ముడిపై మీనా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కానీ శివ మాత్రం అసలు తగ్గడు. ఇక అప్పటికే గుణ దురుద్దేశంతో బాలు తాగుబోతు అని తెలియజేసే ఒక ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయిస్తాడు. ఆ వీడియోను శివ తన అక్క మీనా కు చూపిస్తాడు. భర్త బాలు రెస్టారెంట్ లో ఏం చేస్తున్నాడో చూడమని అంటాడు. ఇక బాలు వీడియోను చూసిన తర్వాత మీనా చాలా బాధపడుతుంది. ఆయన బార్లో కూర్చునీ మందు తాగడం ఏంటని ఆశ్చర్య పోతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది.
ఇక మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాలు వీడియోను మనోజ్ రోహిణి చూసి ఇంట్లో నానా రచ్చ చేస్తారు. ఆ వీడియోను లాప్టాప్ లో ప్లే చేసి అందరికీ చూపిస్తారు. పట్టపగలే బాలు డ్రైవింగ్ కి వెళ్తున్నానని చెప్పి రెస్టారెంట్లో తాపీగా కూర్చుని తాగుతున్నాడు అని, తాగడమే కాకుండా జనాలతో గొడవ పెట్టుకోవడం, అడ్డదిడ్డంగా కారు డ్రైవింగ్ చేయడంపై ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని అంటాడు. ఇన్నాళ్లు బాలును మంచివాడిగా వెనకేసుకొచ్చారు, ఇప్పుడు ఏమంటారని సత్యాన్ని ప్రభావతి ప్రశ్నిస్తుంది. బాలు ఇంటికి తిరిగి వచ్చినంక ఈ విషయంపై కడిగిపారేయాలని ప్రభావతి, మనోజ్, రోహిణి అంటారు. కానీ రవి శృతి మాత్రం బాలు ఒక్కడే తాగడం లేదు కదా ఆయన ఎవరితో వెళ్లి ఉంటారో పూర్తిగా తెలియదు కదా అని అంటారు. మరి మనోజ్ విషయంలో కూడా బాలు ఇలాగే రచ్చ చేసినప్పుడు మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదని అంటారు. దాంతో రవి శృతి కూడా మౌనంగా ఉండిపోతారు. ఇక ఇదే సమయంలో బాలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని అందరూ ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. దానితో ప్రభావతి ఎవరి ఫోను లిఫ్ట్ చేయక అని చెబుతుంది.
ప్రభావతికి వదిన కామాక్షి ఫోన్ చేస్తుంది. బాలు ఇలా చేశాడు ఏంటి అని ప్రశ్నిస్తుంది. కానీ ప్రభావతి మాత్రం బాలుని సమర్థించాల్సింది పోయి, ఇలాంటి కొడుకు నాకు కడుపులో చెడగొట్టాడని మండిపడుతుంది. మా పరువు మొత్తం తీస్తున్నాడని ఫైర్ అవుతుంది. ఇక దాంతో సత్యానికి కూడా బాలుపై కోపం పెరుగుతుంది. మరోవైపు మీనా కూడా ఇంటికి తిరిగి వస్తుంది. ఇంటికి రాగానే ప్రభావతి మీనాపై నిప్పులు కక్కుతుంది. నీ భర్త బాలుకు ముందు నుంచే కంట్రోల్లో పెడుతూ వస్తుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని మీనాను నిందిస్తుంది. ఆయన అస్సలు తాగి ఉండరని మీనా బాలుకు సపోర్ట్ చేస్తుంది. కానీ వాళ్లందరూ మాత్రం అస్సలు నమ్మరు. బాలు కచ్చితంగా తాగి ఉంటాడని రోహిణి మండిపడుతుంది. బాలు పై కఠినంగా చర్యలు తీసుకోవాలని అంటుంది. ఇక మరోవైపు మౌనిక భర్త సంజు బాలు వీడియోని చూసిన తర్వాత ఏకంగా పోలీస్ కమిషనర్ కే ఫోన్ చేసి బాలు కారుని, డ్రైవింగ్ లైసెన్స్ ని సీజ్ చేయమని చెబుతాడు. దాంతో పోలీసులు బాలు కారుని, డ్రైవింగ్ లైసెన్స్ ని లాగేసుకుంటారు. అసలు నేను తాగలేదు అని ఎంత చెప్పినా కూడా వినిపించుకోరు. ఇక తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











