Gunde Ninda Gudi Gantalu August 20th: రోహిణి కడుపు మంట.. బాలుపై చేయి చేసుకున్న తండ్రి సత్యం..
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 19వ తేదీ 491వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలుపై పగ సాధించాలని అనుకున్న ఫైనాన్షియర్ గుణకు మంచి అవకాశం దొరుకుతుంది. పొలిటీషియన్ ఫ్రెండ్ కు కారు ఇప్పించేందుకు వెళ్లిన సమయంలో వాళ్లు బాలును కూడా బారులోకి రమ్మని అంటారు. కానీ బాలు లేదు అన్న నేను తాగడం లేదు. మీరు వెళ్లండి అన్న అని అంటాడు. కానీ కాసేపటికి బాలుకు మరో రైడ్ కోసం ఫోన్ వస్తుంది. దీంతో బాలు రెస్టారెంట్ లోనికి వెళ్లి వాళ్లతో వెళ్తున్నానని చెప్పాలని అనుకుంటాడు. ఇదే సమయంలో వాళ్లతో కలిసి కాసేపు కూర్చోవాల్సి వస్తుంది. ఖాళీగా కూర్చొకుండా బాలు వాళ్లకు మందు కలిపి ఇస్తాడు. మరోవైపు చికెన్ కూడా తింటూ కనిపిస్తాడు. అయితే అదే బారులో బాలును చూసిన ఫైనాన్షియర్ గుణ అంతా వీడియో తీస్తాడు.
అయితే బాలును తాగుబోతుంగా మార్చేలా అర్థం వచ్చే వీడియోను రెడీ చేసి సోషల్ మీడియాలో వదులుతాడు. ఆ వీడియో కాస్తా త్వరగానే ట్రెండింగ్ లోకి వస్తుంది. దాంతో బాలుపై ఇంటా బయట అభిప్రాయం మారిపోతుంది. రైడ్ బుక్ చేసుకున్న వాళ్లు కూడా క్యాన్సిల్ చేసుకుంటారు. మరోవైపు మౌనికా భర్త సంజూ కూడా ఆ వీడియో చూసి ఏకంగా కమిషనర్ కు కాల్ చేసి ఆ కారును సీజ్ చేయండి అని చెబుతాడు. దాంతో బాలు కారును పోలీసులు తీసుకొని వెళ్తారు. ఇక బాలు వీడియో మనోజ్ రోహిణికి కూడా తెలియడంతో ఇంట్లో వాళ్లకు ల్యాప్ టాప్ లో చూపిస్తారు. మరోవైపు మీనా తన పుట్టింటి దగ్గర ఉన్న సమయంలో శివ వీడియోను చూపిస్తాడు. ఇక మీనా తన మెట్టింటికి తిరిగి వచ్చిన సమయంలో ఇంట్లో వాళ్లందరూ బాలు చేసిన ఘన కార్యంపై చర్చ పెడుతారు. ఈ సందర్భంగా తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఆగస్టు 20వ తేదీ 492 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

బాలు పచ్చి తాగుబోతు అని అందరికీ ప్రచారం చేయాలని అనుకుంటాడు గుణ. అనుకున్నట్టుగా బాలును అందరూ ద్వేషిస్తూ ఉంటారు. ముఖ్యంగా బాలు, మీనాల మధ్య చిచ్చు పెట్టాలని అనుకున్న గుణ ప్లాన్ ఫలిస్తుంది. తమ్ముడు మీనాకు బాలు బార్ లో మందు పోస్తున్న వీడియోను చూపించడంతో షాక్ అవుతుంది. ఇక మీనా ఇంటికి తిరిగి వస్తుంది. అప్పటికే బాలుపై ప్రభావతి, సత్యం, రోహిణి, మనోజ్ నిప్పులు చెరుగుతారు. బాలు వల్ల కుటుంబం పరువు మొత్తం పోతోందని ప్రభావతి రగిలిపోతుంది. ఇక మీనా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నీ భర్త చేసిన ఘన కార్యం చూశావా? అని ప్రశ్నిస్తుంది. అంతా నీ వల్లనే జరిగిందని మండి పడుతుంది. దాంతో మీనా అస్సలు ఏది జరిగినా మీరు నా మీద పడిపోతారు. ఇందులో నేను చేసిన తప్పేమీ ఉందని మీనా తిరిగి ప్రశ్నిస్తుంది. దాంతో ప్రభావతి నువ్వు ముందు నుంచే బాలును కంట్రోల్ పెట్టి ఉంటే, ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని మీనాపై రగిలిపోతుంది.
ప్రతి దానికి మీరు నన్ను అంటారు. నేను నిన్నగాక మొన్న ఈ ఇంటికి కోడలుగా వచ్చాను. అంతకు ముందు బాలు ఎప్పుడు తాగి ఇంటికి రాలేదా? అని ప్రశ్నిస్తుంది. అసలు మీరు మీ కొడుకును పద్ధతిగా పెంచి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఇలాంటి ఘటనకు అసలు కారణం మీరే అంటూ అత్త ప్రభావతిపై మీనా నిప్పులు చెరుగుతుంది. మరోవైపు శృతి వాళ్ల అమ్మ కూడా ఫోన్ చేసి బాలు చేసిన పనికి మా పరువు పోతోందని అంటుంది. అలాంటి ఇంట్లో మా కూతురు ఉంటుందని తెలిసి మా ఆయన పరువు పోతోందని మండి పడుతుంది. మీనా దొంగ అయితే బాలు తాగుబోతు కాకుంటే ఏమౌతాడని అవమానిస్తుంది. వెంటనే శృతి ఫోన్ లాక్కుని మీనా గురించి ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నావ్ అమ్మ అని ప్రశ్నిస్తుంది. బాలు చేసిన తప్పుకు మీనాను ఎందుకు నిందించాలని అంటుంది. ఇక్కడ అసలే ఒక కథ నడుస్తుందంటే నువ్వు మరో కథను ప్రారంభించావని మండి పడుతుంది. కానీ మనోజ్ రోహిణి మాత్రం మీనాను, బాలును నిందిస్తూనే ఉంటారు. నీ భర్త తప్పు చేసినా కూడా ఇంకా ఎలా సమర్థిస్తున్నావ్ మీనా అని రోహిణి ప్రశ్నిస్తుంది. ఇక శృతి జోక్యం చేసుకొని నువ్వు మనోజ్ కు ఎప్పుడూ సపోర్ట్ చేయలేదా అని అంటుంది. దాంతో రోహిణి సైలెంట్ అవుతుంది.
ఇదే సమయంలో బాలు ఇంటికి తిరిగి వస్తాడు. ఇంట్లో జరుగుతున్న రచ్చ అంత బాలుకు తెలియదు. మరోవైపు కారు పోయిందని తెలిస్తే మీనా ఎంత బాధపడుతుందోనని కంగారు పడుకుంటూ ఇంట్లోకి వస్తాడు. బాలు వచ్చిరాగానే ప్రభావతి ఫైర్ అవుతుంది. అసలు ఏం జరిగిందో తెలుసా అని ప్రశ్నిస్తుంది. అసలు నేనేం తప్పు చేయలేదని బాలు అంటాడు. కానీ ఎవ్వరు నమ్మబోరు. ఎవరో ఇది కావాలని చేశారు నాన్న అని బాలు చెబుతాడు. పోలీసులు ఎందుకు నా కారును కూడా తీసుకొని వెళ్లిపోయారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని అంటాడు బాలు. ఇక మనోజ్ స్పందిస్తూ తాగుబోతు వాడి కారును పోలీసులు లాక్కెళ్లిపోకపోతే ఏం చేస్తారని అంటాడు. దాంతో బాలు ఫైర్ అవుతాడు. ఇదే సమయంలో సత్యం బాలుపై చేత్తుతాడు. నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదని సత్యం మండి పడుతాడు. ఎప్పుడూ లేనిది తన తండ్రి కూడా ఫైర్ అవ్వడంతో బాలు చాలా బాధపడుతాడు. తాను తాగలేదని మీనాకు, సత్యానికి ఎంత చెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోరు. ఇక చివరిగా మౌనికా మాత్రం ఫోన్ చేసి నేను నిన్ను నమ్ముతున్నాను అన్నయ్య అని అంటుంది. దాంతో బాలుకు కాస్తా ధైర్యం వస్తుంది. ఇక మీనా కూడా బాలు చెప్పేది మనస్సులో నమ్ముతుంది. దీని వెనకాల కారణం ఎవరని తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది.


Click it and Unblock the Notifications











