Gunde Ninda Gudi Gantalu August 22nd: కన్నీళ్లు పెట్టుకున్న బాలు.. తట్టులేక ఇంటి నుంచి బయల్దేరిన మీనా

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 20వ తేదీ 492వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మీనాను మామ సత్యం పిలిచి ఒక ఆర్డర్ వచ్చిందని, తన స్నేహితుడి ఇంట్లో ఫంక్షన్ ఉండటంతో 4 పూలదండలు, పూలు కావాలని ఇక్కడికి వచ్చాడని చెబుతాడు. దాంతో మీనా సరే మామయ్య త్వరగా కట్టిస్తానని చెబుతుంది. మరోవైపు తను పూల కోసం వెళ్లిన సమయంలో ఒక అక్క కలుస్తుంది. బాలుకు తాగు మాన్పించేందుకు నాటు వైద్యం ఉందని మీనాకు చెబుతుంది. ఒక పౌడర్ ఇస్తానని అది బాలుకు తాగించమని చెబుతుంది. ఇక మీనా ఆ పౌడర్ ను తీసుకొని వెళ్లి బాలుకు తాగించేందుకు జ్యూస్ తీసి అందులో కలుపుతుంది. కానీ ఆ జ్యూస్ ను బాలు కంటే ముందే ప్రభావతి తాగుతుంది. దాంతో విపరీతమైన మోషన్స్ తో నీరసంగా మారిపోతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 22వ తేదీ 494 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

జ్యూస్ లో పసరు కలిపానని, ఆ విషయం చెప్పేలోపే అత్తయ్య ఆరెంజ్ జ్యూస్ తాగేశారని మీనా చెబుతుంది. కనీసం తాగుతుంటేనైనా ఆపాల్సింది కదా అని ప్రభావతి ప్రశ్నిస్తుంది. నేను ఆ జ్యూస్ బాలు కోసం చేశాను. ఇలా బయటికి వెళ్లి వచ్చే లోపు మీరు తాగుతారని నేను ఊహించలేదు. అసలు మీరెందుకు ఆ జ్యూస్ తాగారు. ఎవరికోసమో చేసి ఉంటారని అనుకోవచ్చు కదా అని వదిన కామాక్షి ప్రశ్నిస్తుంది. దాంతో ప్రభావతి తాజా పండ్ల రసం చూసి గుటగుట తాగేశానని బదులిస్తుంది. అందుకే గండిపేట చెరువు గండి కొట్టేసింది అని అంటుంది. మరోవైపు మీనా జ్యూస్ లో పసరు మందు ఎందుకు కలపాలని అనుకున్నావని కామాక్షి ప్రశ్నిస్తుంది. అది బాలు కోసం కలిపానని చెబుతుంది. అసలు బాలు చేసిన పనికి అందరూ తాగుబోతు అని అంటున్నారు. అది చూసి నేను తట్టుకోలేక పోయాను. బయట తెలిసిన ఒక అక్క తాగుడు మాన్పించేలా ఇలా పసరు మందు ఇచ్చిందని చెబుతుంది. దాంతో అందరూ షాక్ అవుతారు.

Gunde Ninda Gudi Gantalu serial episode 494 August 22nd

మరి జ్యూస్ పసరు మందు కలిపాలని నీకు తెలిసి కూడా ఎందుకు అప్పుడే చెప్పకుండా బయటికి వెళ్లిపోయావని మీనాను అడుగుతారు. ఆ జ్యూస్ తాగి నాకేమైనా అయితే బాధ్యులు ఎవరే అని ప్రభావతి అడుగుతుంది. నాకు పసరు మందు పెట్టి చంపేద్దామని అనుకున్నావా? అని ప్రశ్నిస్తుంది. అలా ఏం లేదు అత్తయ్య. మీకు ఏం కాకూడదనే త్వరగా బయటికి వెళ్లానని మీనా బదులిస్తుంది. అసలు నేను వెళ్లింది విరుగుడు మందు తేవడానికే అని చెబుతుంది. ఇప్పుడు మళ్లీ తీసుకొచ్చిన జ్యూస్ లో విరుగుడు మందు కలిపి ఇచ్చాను. ఇది తాగితే నయం అవుతుందని చెప్పి ఆ జ్యూస్ తాగిస్తుంది. ఇక మీనా బాలును తాగుడు మాన్పించడం కోసం ప్రయత్నాన్ని మామ సత్యం అభినందిస్తాడు. భార్యగా నీ బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తున్నావని చెబుతాడు. ఇందులో మీనాను ఎవ్వరు నిందించడానికి లేదని సత్యం అంటాడు. మరోవైపు మనోజ్ మాత్రం నువ్వు బాలును మార్చాలని ప్రయత్నించడం విఫలయత్నం అని అంటాడు. పట్ట పగలే మందు తాగి కారు నడిపించే వాడికి ఈ పసరు మందులు పెద్దగా ఏమీ చేయవని, వాడు ఆ మందును కూడా మందులో కలుపుకొని తాగేస్తాడని హేళన చేస్తాడు.

ఇక మీనా బాలు తాగాడనే నమ్ముతుంది. మేడపై కూర్చొని అసలు బాలు ఎందుకు రెస్టారెంట్ కు మందు పోసుకుంటూ కనిపించాడని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదే సమయంలో మౌనికా మీనాకు ఫోన్ చేస్తుంది. అన్నయ్య తాగాడంటే నువ్వు నమ్ముతున్నావా? వదినా అని అడుతుంది. ఆ వీడియో అలా ఉంది కదా, ఏం చేయాలని అంటుంది. అసలు మనం చూసింది సగం వీడియోనే పూర్తి వీడియోలో ఏముందో మనకు తెలియదు కదా వదినా అని మౌనికా అంటుంది. ముందు అసలు ఈ వీడియో తీసింది ఎవరు అనేది మనం తెలుసుకోవాలని మౌనికా మీనాతో అంటుంది. అప్పుడు పూర్తి వివరాలు తెలుస్తాయని చెబుతుంది. వెంటనే బాలు మీనా దగ్గరకు వచ్చి ఎమోషనల్ అవుతాడు. అసలు నేను డ్యూటీ సమయంలో మందు తాగను మీనా. డ్యూటీ నాకు దైవం లాంటింది, నువ్వు ఎంతో కష్టపడి కొనిచ్చిన కారు నాకు దేవాలయం అలాంటిది నేను ఎందుకు తాగి బండి నడుపుతాను చెప్పు అని బాలు ప్రశ్నిస్తాడు. ఎవరు నమ్మినా నమ్మకపోయిన నువ్వు మాత్రం నన్ను నమ్మాలని అంటాడు.

మీనా సరేనని అంటుంది. తన భర్త బాలు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదని మనస్సులో అనుకుంటుంది. ఇక ఆ బార్ వద్దకు వెళ్లి సీసీ టీవీ కెమెరాలో పూర్తిగా ఏం రికార్డ్ అయ్యిందో అది తీసుకుని రావాలని అనుకుంటుంది. ఇక బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేయకముందే అక్కడికి వెళ్లి వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్కడికి ఇద్దరు మీనాను చూసి పొద్దుపొద్దునే ఒక మహిళా బార్ ముందు వెయిట్ చేస్తున్నదంటూ వీడియో తీయడం ప్రారంభిస్తారు. దాంతో మీనాకు కోపం వచ్చి వారి చెంప చెల్లుమనిపిస్తుంది. నేను ఇక్కడికి వచ్చిన పనివేరు మీలాంటి వారి వల్ల మా ఆయనపై నింద పడిందని మండి పడుతుంది. ఇక బార్ ఓనర్ వచ్చిన వెంటనే వెళ్లి సీసీ టీవీ ఫుటేజీని అడుగుతుంది. తన భర్తపై పడ్డ నిందను తొలగించాలని బతిమలాడుతుంది. దాంతో ఆయన సీసీ టీవీ రికార్డ్ చూపిస్తాడు. మరోవైపు బాలు తన కారు తీసుకొచ్చుకునేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. అక్కడ పోలీసులు బాలును అవమానిస్తారు. నానా పనులు చెప్పి బాలును ఆడుకుంటారు. అయినా బాలు సహనంతో ఉంటాడు. ఇక ఈలోగా సీఐ వస్తాడు. బాలు తన కారు ఇప్పించమని అడుగుతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది. ఇక ప్రోమోలో మాత్రం అసలు వీడియోను క్రియేట్ చేసిన వాడు దొరికిపోతాడు. వాడు గుణనే ఇలా చేయమని చెప్పాడని చెబుతాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X