Gunde Ninda Gudi Gantalu August 23rd: బాలు చేతికి చిక్కిన గుణ అనుచరుడు.. పట్టు వదలని మీనా
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 22వ తేదీ 494వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శివ స్నేహితుడు, ఫైనాన్షియర్ గుణ బాలు, మీనాలను విడదీయాలని కుట్ర పన్నుతాడు. మీనా గుణను తాగుబోతు అని అవమానించడంతో బాలును తాగుబోతుగా ప్రచారం చేయాలని అనుకుంటాడు. ఇదే సమయంలో బాలు గుణ తాగుతున్న బార్ అండ్ రెస్టారెంట్ కు వస్తాడు. కానీ బాలు అక్కడ తాకపోయినా గుణ కొన్ని వీడియోలు తీసి బాలు నిజంగానే తాగి ఉన్నాడనేలా సృష్టించి ఒక వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తాడు. కొద్ది సమయంలో ఆ వీడియో వైరల్ అవడంతో బాలు పరువు పోతుంది. దాంతో కస్టమర్స్ అందరూ బాలు కారులో ప్రయాణించేందుకు ఇష్టపడరు. ఇక మౌనికా భర్త సంజూకూ ఈ వీడియో కనిపించడంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేసి కారు, లైసెన్స్ తీసుకోండి అని చెబుతాడు. పోలీసులు అలాగే చేస్తారు.

ఇక ఇంట్లో వాళ్లకు మనోజ్, రోహిణి బాలు బాగోతం చెబుతారు. వీడియోను అందరికీ చూపిస్తాడు. మీనా కూడా ఆ వీడియో చూసి షాక్ అవుతుంది. ఇక బాలు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అసలు బారులో నేను తాగలేదని, కస్టమర్ తో కలిసి బార్ లోకి వెళ్లాల్సి వచ్చిందని అక్కడ నేను అస్సలు తాగలేదని చెబుతాడు. కానీ బాలు ఇంట్లో వాళ్లందరికీ చెబుతున్నా ఎవ్వరూ పట్టించుకోరు. ఎవ్వరూ ఆ విషయాన్ని పట్టించుకోకపోవడంతో బాలు బాధపడుతాడు. బాలు తాగడం వల్లనే, తాగి గొడవ చేయడం వల్లనే ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారని అందరూ నమ్ముతారు. చివరిగా బాలుపై ఎంతో నమ్మకం పెట్టుకున్న భార్య మీనా, కన్న తండ్రి సత్యం కూడా బాలు తాగి తప్పు చేశాడనే నమ్ముతారు. ఇక బాలు శత విధాలుగా తన తప్పేమీ లేదని చెప్పే ప్రయత్నం చేస్తాడు. అయినా ఎవ్వరూ నమ్మబోరు. కానీ బాలు ఏ తప్పు చేసి ఉండడని చెల్లి మౌనికా నమ్ముతుంది. తన అన్న బాలుపై ఎవరో కుట్ర చేసి ఉంటారని సందేహిస్తుంది. ఈ విషయం వెంటనే తెలుసుకోవాలని మౌనికా నిర్ణయించుకుంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 23వ తేదీ 495 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?
మౌనికా మీనాకు ఫోన్ చేసి బాలు అన్న గురించి మాట్లాడుతుంది. ఆ వీడియోలో ఉన్న విషయం నిజమే అని నమ్ముతున్నావా? వదినా అని మౌనికా మీనాను ప్రశ్నిస్తుంది. అందుకు మీనా కూడా అవును నమ్మాల్సి వస్తుంది కదా అని బదులిస్తుంది. అసలు ఆ వీడియోలో సగం వీడియోనే ఉంది. ఈ వీడియో క్లిప్స్ లకు ముందు, ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలుసుకోకుండా అన్నయ్య బాలును నిందించడం ఏమాత్రం సరికాదని అంటుంది. ఇక దాంతో వెంటనే మీనా బాలు వెళ్లిన బార్ అండ్ రెస్టారెంట్ కు వెళ్తుంది. ఉదయమే మీనా బార్ అండ్ రెస్టారెంట్ ముందు కనిపించడంతో కొందరు వీడియో తీయడానికి ప్రయత్నిస్తారు. ఉదయమే మహిళ బార్ ముందు వేచి ఉందంటూ వీడియో తీస్తుంటారు. దీంతో మీనాకు కోపం వచ్చి వారి చెంప చెల్లుమనిస్తుంది. మీ లాంటి వారి వల్లనే నా భర్తపై తాగుబోతు అనే ముద్ర పడింది. ఇంకోసారి ఇలాంటి విషయాల్లో తప్పేదో ఒప్పేదో తెలుసుకునే ప్రయత్నం చేయాలని మీనా బుద్ధి చెబుతుంది.
ఆ తర్వాత బార్ ఓనర్ రావడంతో ఆయన వెంటనే వెళ్లి తన భర్తకు జరిగిన అన్యాయం గురించి చెబుతుంది. సీసీ టీవీ ఫుటేజీ చూపించాలని కోరుతుంది. దాంతో ఆ బార్ ఓనర్ సరేనని చూపిస్తాడు. ఫుటేజీ ప్రకారం బాలు తాగలేదని మీనా నిర్దార్థించుకుంటుంది. ఇక ఆ ఫుటేజీని ఒక కాపీగా తీసుకుంటుంది. వెంటనే వెళ్లి పోలీసులకు కంప్లైంట్ చేస్తుంది. తన భర్త పై ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటుంది. సోషల్ మీడియాలో తాగుబోతు అంటూ వీడియోలను వ్యాప్తి చేస్తున్నారని, వెంటనే వారిని అడ్డుకోవాలని కోరుతుంది. దాంతో ఆ వీడియో ఎడిట్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వాడిని దొరకబడుతారు. అసలు ఇలా ఎందుకు చేశావురా అని ప్రశ్నిస్తారు. దాంతో వాడు నాకు ఏమీ తెలియదు. ఒక అతను నాకు డబ్బులు ఇచ్చి ఇలా చేయమని చెప్పాడని బదులిస్తాడు. కానీ పేరు మాత్రం చెప్పలేదని అంటాడు. దీంతో అసలు సూత్రధారి ఎవరనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మరోవైపు సీసీ ఫుటేజీని తీసుకెళ్లి మీనా ఇంట్లో వాళ్లందరికీ చూపిస్తుంది. బాలు తాగలేదని, తన భర్త నిజాయితీగానే ఉన్నాడని చెబుతుంది. కానీ అందరూ ఆయన్ని అపార్థం చేసుకున్నారని అంటుంది. ఎవరో కావాలని తన భర్త బాలుపై బురదజల్లే ప్రయత్నం చేశారని, అది తెలుసుకోకుండా అందరూ ఆయన్ని నిందించారని, తాగుబోతు అని అవమానించారని మీనా చెబుతుంది.
ఇక ఆ వీడియో చూసిన తర్వాత తండ్రి సత్యం కుటుంబ సభ్యులందరి పైనా మండి పడుతాడు. నా కొడుకు బాలు అస్సలు తప్పు చేసి ఉండాడన మరోసారి రుజువు అయ్యింది. అనవసరంగా మీరే వాడిని తప్పు పట్టారు. ఆ వీడియో తీయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఏంటనే విషయాలను పట్టించుకోకుండా బాలుపై రెచ్చిపోవడం సరికాదని అంటాడు. ఇక సత్యం కూడా బాలును నానా మాటలు అన్నందుకు బాధపడుతాడు. బాలుకు వెంటనే క్షమాపణలు చెప్పాలని అనుకుంటాడు. ఇక తన భర్త బాలు పరువు కాపాడే ప్రయత్నం చేసినందుకు మీనాను అభినందిస్తాడు. భర్త కష్టాల్లో ఉన్న భార్య విధులను గుర్తు చేశావని మెచ్చుకుంటాడు. ఇక బాలుకు మీనా ఆ వీడియో చూపించి క్షమాపణలు కోరుతుంది. మీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా తప్పుపట్టానని అంటుంది. మొత్తానికి మీనాకు నిజం తెలిసి పోవడం, వీడియో ఎడిట్ చేసిన వాడు దొరకడంతో మళ్లీ ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెడుతారు. పూర్తి వీడియోను అప్ లోడ్ చేస్తారు. ఎవరో ఉద్దేశపూర్వకంగా చేశారని జనాలకు వివరిస్తారు. ఈ క్రమంలో తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











