Gunde Ninda Gudi Gantalu August 25th: రచ్చ రచ్చ చేసిన మీనా.. బాలును రక్షించుకునేందుకు సాహసం

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 22వ తేదీ 494వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మీనా బాలు విషయంలో ఆలోచిస్తూ ఉంటుంది. బార్ లో తాగాడనే నమ్ముతుంది. అసలు బాలు ఎందుకు రెస్టారెంట్ కు వెళ్లి, మందు పోసుకుంటూ వీడియోలో కనిపించాడని మేడపై కూర్చొని ఆలోచిస్తుంది. ఈ సమయంలో మీనాకు మౌనికా ఫోన్ నుంచి వస్తుంది. అన్నయ్య తాగాడంటే నమ్ముతున్నావా? వదినా అని మౌనికా అడుతుంది. వీడియో ఉంది కదా అని మీనా బదులిస్తుంది. మనం సగం వీడియోనే చూశాం. పూర్తి వీడియోలో చూస్తే అసలు ఏం జరిగిందనేది తెలుస్తుంది వదిన అంటూ తెలుపుతుంది. ఇక నాకు ఎందుకో ఎవరో కావాలని కుట్ర పూరితంగా ఇలా చేశారని అనిపిస్తోందని మౌనికా అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈ విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాలని అంటుంది.

ఇదే సమయంలో బాలు మీనా దగ్గరకు వస్తాడు. నేను అస్సలు తాగలేదని చెబుతాడు. నాకు నువ్వు ఎంతో కష్టపడి కారు కొనిచ్చావు. అది నాకు దేవాలయం లాంటిది. నాకు పనే దైవం. నేను అసలు డ్యూటీలో ఉన్నప్పుడు తాగను. నన్ను నువ్వు కూడా అనుమానించడం బాలేదు మీనా అని అంటాడు. ఇక మీనా కూడా బాలు చెప్పే మాటలను నమ్ముతుంది. దీంతో వెంటనే తన భర్త బాలుపై పడ్డ నిందను తొలగించాలని అనుకుంటుంది. అందుకు అసలు బాలు తాగాడా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటుంది. దాంతో బాలు తాగినట్టుగా వీడియోలో ఉన్న బార్ దగ్గరకు మీనా వెళ్తుంది. అక్కడ ఇంకా ఓపెన్ చేయకపోవడంతో వెయిట్ చేస్తూ ఉంటుది. ఇదే సమయంలో కొందరు ఒక మహిళా ఉదయమే బార్ ముందు వేచి ఉందని చెబుతూ వీడియో తీస్తుంటారు. వారికి మీనా గట్టిగా బుద్ధి చెబుతుంది. చెంపలు వాయించి మీలాంటి వారి వల్లే నా భర్త సమస్యల్లో ఇరుక్కున్నాడని అంటుంది. నేను ఇక్కడికి బార్ ఓనర్ ను కలిసేందుకు వచ్చానని చెబుతుంది. అదే సమయంలో బార్ ఓనర్ వస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 25వ తేదీ 495 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 495 August 25th

బార్ ఓనర్ దగ్గరకు వెళ్లి మీనా సాయం కోరుతుంది. ఏం కావాలమ్మా ఎందుకు ఇంకా ఇక్కడికి వచ్చారు అని మీనా ను అడుగుతాడు. ఒక నిజం తెలుసుకోవాలని వచ్చానని బదులిస్తుంది. నా భర్త గురించి తెలుసుకోవాలని అంటుంది. దాంతో బార్ ఓనర్ కంగారు పడుతాడు. ఈ బార్ లో తాగొద్దని చెప్పడానికి వచ్చావా? లేదా ఈ బార్ లో తాగి ఇంకా ఇంటికి రాలేదా? అని యజమాని అడుగుతాడు. ఇక మీనా అస్సలు మా ఆయన తాగరని మీనా చెబుతుంది. కానీ ఎవరో కావాలని నా భర్తను తాగుబోతుగా ముద్రించే ప్రయత్నం చేస్తున్నారని, ఆయన ఇదే బార్ లో తాగుతున్నట్టుగా వీడియోను తీసి ప్రచారం చేశారని చెబుతుంది. అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నాకు మీ సీసీ టీవీ ఫుటేజీ కావాలని అడుగుతుంది. నా భర్త తాగాడా లేదా అన్నదానికంటే అసలు ఈ వీడియో తీయాల్సిన అవసరం ఎవరికి ఉందనేది తెలుసుకోవాలని చెబుతుంది. దాంతో బార్ ఓనర్ మీనాకు సీసీ టీవీ ఫుటేజీలను చూపిస్తూ ఉంటాడు.

అందులో బాలు లోపలికి వచ్చి కూర్చొని ఉంటాడు. ఇక పక్కన వాళ్లు ఎంత ఒత్తిడి చేసినా బాలు మాత్రం తాగనని చెబుతాడు. కేవలం ఫుడ్ తింటున్న దృశ్యం, పొలిటీషియన్స్ కు మందు పోస్తున్న దృశ్యం మాత్రమే కనిపిస్తోంది. ఆ సీసీ టీవీ ఫుటేజీతో బాలు మందు తాగలేదని మీనాకు స్పష్టం అవుతుంది. అంతే కాకుండా వీడియో తీసిన వ్యక్తి కూడా కనిపిస్తాడు. వాడే గుణ చేయడం వల్లే ఇలా జరిగిందని అంటుంది. దీంతో బాలుపై మీనాకు ఉన్న అనుమానం పోతుంది. ఒక వెంటనే మీనా ఆ సీసీ టీవీ ఫుటేజీని రవి ఫోన్ కు పంపించమని అడుగుతుంది. ఇక అసలు వీడియో మొత్తం రవి ఫోన్ కి వెళ్లడంతో మీనా రవికి ఫోన్ చేస్తుంది. వెంటనే రవిని తన అన్నయ్య ఉంటున్న కార్ షెడ్ దగ్గరకు వెళ్లమని చెబుతుంది. అసలు మీ అన్నయ్య తాగలేదని, నీకు అసలు వీడియో పంపించాను చూడమని అంటుంది. దాంతో రవి ఆ వీడియో చూసి షాక్ అవుతాడు. ఈ విషయాన్ని వెంటనే మీ అన్నయ్యకు చెప్పాలని, నువ్వు కార్ షెడ్ దగ్గరకు వెళ్లు, నేను కూడా వస్తున్నానని చెబుతుంది. రవి వెంటనే బాలు దగ్గరకు కారు స్టాండ్ దగ్గరకు వెళ్తాడు.

అక్కడ రవిని చూసిన బాలు షాక్ అవుతాడు. నువ్వు ఈ సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చావురా అని అడుగుతాడు. వదిన పంపించింది అన్నయ్య అని రవి అంటాడు. అప్పటికే బాలు మీనాను ఎంత బతిమిలాడినా తను తాగలేదని నమ్మకపోవడంతో అప్సెట్ అవుతాడు. మీనాపై కోపంగా ఉంటాడు. అదే విషయాన్ని తమ్ముడు రవితో చెబుతాడు. ఇంట్లో అవమానించింది కాకుండా ఇక కారు స్టాండ్ లోనూ అవమానించాలని అనుకుంటుందా అని రవితో బాలు అంటాడు. అలా ఏం కాదు అన్నయ్య నీతో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడటానికి వస్తుందని చెబుతుంది. ఇదే సమయంలో మీనా కార్ షెడ్ దగ్గరకు వస్తుంది. బాలును చూడగానే వెళ్లి గట్టిగా కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. గుక్క పెట్టి ఏడుస్తుంది. దీంతో బాలు ఏమైందని, ఎవరైనా ఏమైనా అన్నారా? అని ప్రశ్నిస్తాడు. అందుకు లేదు అని బదులిస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది. ఇక ప్రోమోలో వీడియోలో చూసిన వ్యక్తిని పట్టుకోవాలని మీనా ప్లాన్ చేస్తుంది. రవికి అతన్ని ఎలాగైనా పట్టుకోవాలని మీనా చెబుతుంది. దాంతో రవి అతన్ని పట్టుకోమని తనకు తెలిసిన కొందరిని పంపిస్తాడు. ఇక అతన్ని నేరుగా బాలు దగ్గరికి తీసుకొచ్చేలా ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఏం జరిగిందనేది తరువాత ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X